NTV Telugu Site icon

Liquor Shops in AP: మద్యం షాపుల లాటరీకి వేళాయే.. దుకాణాలకు భారీగా దరఖాస్తులు

Ap Liquor Policy

Ap Liquor Policy

Liquor Shops in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా.. వీటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ విజయవాడ జిల్లాల్లో అత్యధికంగా 113 దుకాణాలకు 5824 దరఖాస్తులు వచ్చాయి.

Read Also: Andhra Pradesh: అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లే!

రేపు జిల్లాల వారీగా లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపునకు ప్రక్రియను ఎక్సైజ్ శాఖ చేపట్టింది. లాటరీ అనంతరం ఈ నెల 15న ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాల అప్పగించనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దేశంలో తయారైన విదేశీ మద్యం బాటిళ్లు ఎమ్మార్పీ ధరను చిల్లర లేకుండా సర్దుబాటు చేసేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు విధించనుంది. క్వార్టర్ బాటిల్ ధర రూ.99కే విక్రయించేలా సవరణ చేసింది.

Show comments