Music Directors Flops : వరుస ఫ్లాపుల్లో అగ్ర సంగీత దర్శకులు.. క్యాచీ ట్యూన్స్ కరువయ్యాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ల పరిస్థితి మిశ్రమంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో థియేటర్లను హోరెత్తించిన దేవీశ్రీ ప్రసాద్, తమన్, అనిరుధ్, కీరవాణి వంటి వారు ఇప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. అభిమానులు ఆశించే ‘క్యాచీ ట్యూన్స్’ ఇవ్వడంలో వీరు వెనుకబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో వస్తున్న చిత్రాలకు ఆశించిన స్థాయిలో మ్యూజికల్ హిట్స్ అందడం లేదు.
తమన్ : ప్రస్తుతం ఎస్.ఎస్. తమన్ కెరీర్ ఎత్తుపల్లాల మధ్య సాగుతోంది. పవన్ కల్యాణ్ ‘OG’ సినిమాకు తమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ లో మార్క్ మిస్ అయింది. అలాగే బాలకృష్ణ-తమన్ కాంబినేషన్ అంటేనే సూపర్‌హిట్ అనే ముద్ర ఉంది. అయితే ‘అఖండ 2’ విషయంలో ఈ సక్సెస్‌ఫుల్ కాంబోకు బ్రేకులు పడ్డాయనే మాట వచ్చింది. మరోవైపు ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రంలోని పాటలు క్యాచీగా లేవంటూ సోషల్ మీడియాలో తమన్‌పై భారీగా ట్రోలింగ్ జరిగింది.
Also Read
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
- Railway Engineer: విజయవాడలో సీబీఐ మెరుపు దాడి.. రైల్వే ఇంజినీర్ అరెస్ట్..
Also Read : KVN Productions : కెవిఎన్ ప్రొడక్షన్ సినిమాలపై సెన్సార్ పగబట్టిందా.. మొన్న జననాయగన్.. నేడు కేడీ ద డెవిల్
దేవీశ్రీ ప్రసాద్ : పుష్ప 2′, ‘తండేల్’ వంటి చిత్రాల తర్వాత దేవీశ్రీ ప్రసాద్‌కు సరైన మ్యూజికల్ హిట్ దక్కలేదు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి ఆడియో మైనస్ పాయింట్‌గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవి శ్రీ వర్క్ చేసిన సినిమాలకు మరొక బాక్గ్రౌండ్ స్కోర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
అనిరుధ్ : ఇక సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ విషయానికొస్తే.. ‘విక్రమ్’, ‘జైలర్’, ‘లియో’ వంటి చిత్రాలతో తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశారు. కానీ ‘దేవర’ తర్వాత ఆయనకు సరైన హిట్ పడలేదు. ‘కూలీ’, ‘కింగ్‌డమ్’, ‘మదరాసి’ వంటి చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. అయినప్పటికీ అనిరుధ్ క్రేజ్ తగ్గలేదు; ‘జైలర్ 2’, కమల్-రజనీ మల్టీస్టారర్, అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి.
కీరవాణి : ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కూడా ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ పీరియాడికల్ డ్రామా ‘హరిహర వీరమల్లు’కు ఆయన ఆశించిన స్థాయిలో క్యాచీ ట్యూన్స్ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మరియు భారీ చిత్రం ‘వారణాసి’కి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలతోనైనా ఆయన తన పాత వైభవాన్ని చాటుకుంటారో లేదో చూడాలి. RRR ఆ రేంజ్ ఆల్బమ్ కీరవాణి నుండి రాలేదు.
మొత్తానికి అగ్ర సంగీత దర్శకులు కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పైనే కాకుండా, ప్రేక్షకులు పాడుకునేలా ఉండే పాటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
తాజావార్తలు
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
-
Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
-
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
-
Fake Idols : నకిలీ విగ్రహాలతో మాయాజాలం.. ఆరుగురు ముఠా అరెస్ట్.!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?