KVN Productions : కెవిఎన్ ప్రొడక్షన్ సినిమాలపై సెన్సార్ పగబట్టిందా.. మొన్న జననాయగన్.. నేడు కేడీ ద డెవిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ నుండి మూవీ ప్రొడక్షన్లోకి అడుగుపెట్టి.. సౌత్ స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తోన్నామని సంబరపడిపోయింది కన్నడ ప్రొడక్షన్ సంస్థ కెవిఎన్. కానీ ఆ సినిమాలు రిలీజ్ డేట్ దగ్గరకొచ్చే సరికి సంస్థకు వరుస తలనొప్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా సెన్సార్ ఇష్యూస్ ప్రొడక్షన్ హౌస్ అధినేతలకు నిద్రలేకుండా చేస్తున్నాయి . మొన్న జననాయగన్.. ఇప్పుడు కేడీ కూడా ఇదే బాటలో నడుస్తోంది.
దళపతి విజయ్ లాస్ట్ మూవీగా చెప్పుకుంటోన్న జన నాయగన్‌పై భారీగా ఖర్చు పెట్టింది కెవిన్ ప్రొడక్షన్ హౌస్. సుమారు 400 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సి ఉండగా… లాస్ట్ మినిట్‌లో సెన్సార్ ఇష్యూ వల్ల పోస్ట్ పోనైంది. సుప్రీంకోర్టులో కూడా తేలలేదు. ప్రజెంట్ సెన్సార్ రివైజింగ్ కమిటీ పరిశీలిస్తోంది. అంతలో మూవీ లీకై.. తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇక కేడీపై హోప్స్ పెట్టుకుంటే ఈ మూవీ కూడా సెన్సార్ ఇష్యూస్‌కి గురౌతోంది. ధ్రువ్ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి కీ రోల్స్ చేసిన కేడీ ద డెవిల్ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ లాకయ్యింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. కెవిఎన్ మరో ఫిల్మ్ టాక్సిక్ వాయిదా పడటంతో సడెన్లీ రేసులోకి వచ్చింది. ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువైంది. చివరకు పాటను యూట్యూబ్ నుండి తొలగించింది మూవీ టీం.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ఇక రిలీజ్ టైం దగ్గర పడుతోన్న టైంలో సెన్సార్ బోర్డ్ నుండి సమస్యలెదుర్కొంటోంది కేడీ మూవీ. ఇందులో వయలెన్స్ ఎక్కువ ఉందని ప్రాంతీయ బోర్డ్ A సర్టిఫికేట్ జారీ చేయడంతో పాటు స్పెషల్ సాంగ్‌లోని కొన్ని పదాలను మార్చాలని సజెస్ట్ చేసింది. కానీ సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మాత్రం.. మూవీ టీంని కన్సిడర్ చేయకుండా రివైజింగ్ కమిటీకి పంపింది. దీనిపై ప్రేమ్ కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ సినిమాపై పొలిటికల్ ఎటాక్ జరుగుమూవీదని కామెంట్ చేశారు. అలాగే కన్నడిగులు సైతం కెవిఎన్ సినిమాలను సెంట్రల్ బోర్డ్ టార్గెట్ చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ ఇష్యూ మధ్య కేడీ కూడా అనుకున్న టైంకి వస్తుందా రాదా అనే డౌట్ కలుగుతోంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?