Maoist Party: మావోయిస్టు పార్టీ తుది అంకానికి చేరుకుంది.. అగ్రనేతలతో పాటు దాదాపు మావోస్టులు నేడు లొంగిపోనున్నారు. మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ ఈ రోజు మీడియా ముందుకు రానున్నారు… మధ్యాహ్నం మూడు గంటలకి పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జి… దేవుజితో పాటు కేంద్ర కమిటీ సభ్యులు మల్ల రాజిరెడ్డి నూనె గంగన్నలు కూడా లొంగిపోనున్నారు. ముగ్గురు అగ్ర నేతలతో పాటు భారీగా కార్యకర్తలు సైతం జనజీవన స్రవంతిలో కలిసిపోనున్నారు.
READ MORE: Harish Shankar : ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ పార్టీపై పొలిటికల్ సెటైర్స్.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
ఇదిలా ఉండగా. నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాతో పాటు చాలా మందిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్ అలియాస్ తిప్పిరి తిరుపతి సరెండర్ అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ ఎస్‌ఐబీ ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్, రాజిరెడ్డి టార్గెట్గా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈ క్రమంలోనే వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
READ MORE: India Qualification Scenario: భారీ దెబ్బేసిన వెస్టిండీస్.. ఇక సూపర్-8 నుంచే ఇంటికి భారత్?
ఇక దేవ్ జీ.. అలియాస్ తిప్పిరి తిరుపతి జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ నగర్‌లోని కోరుట్ల పట్టణానికి చెందినవారు. అతని తండ్రి పేరు వెంకట్ నర్సయ్య, మాల కులానికి చెందినవాడు. 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా ఉన్నత స్థానానికి ఎదిగి దక్షిణ భారత జోన్ ఆపరేటర్‌గా పనిచేశారు. తిరుపతి పేరు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది, పార్టీ లోపల అతన్ని సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్న అని పిలుస్తారు. అతను పార్టీ భూగర్భ సైనిక ప్రచురణ అయిన అవామి జంగ్‌ను సవరించారు. తిరుపతి, సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో సీనియర్ సభ్యుడిగా కొనసాగారు. దంతెవాడలో ఏప్రిల్ 2010లో జరిగిన మావోయిస్టు దాడిలో 74 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ల హత్యకు తిరుపతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. నంబల కేశవరావు మరణం తరువాత , తిరుపతి సెప్టెంబర్ 2025లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
