Maoists: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ప్రారంభించిన ‘ఆపరేషన్ కగార్’తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోనున్న మరోసారి పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు.
Maoist Sujathakka: గద్వాల ప్రాంతానికి చెందిన మావోయిస్టు సుజాతక్క 43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు పలికారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట శనివారం లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమబెంగాల్‌లో 2011 జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య ఆమె. సుజాతక్కపై రూ.కోటి రివార్డు ఉంది. ఆమె 106…