26/11 Attack: పాక్ జైల్లో 26/11 దాడి నిందితుడైన హఫీజ్ సయీద్ సన్నిహితుడి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26/11 Attack: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు అబ్దుల్ సలామ్ భుట్టావీ పాకిస్థాన్ జైలులో మరణించాడు. అబ్దుల్ సలామ్ భుట్టావీ 2008 ముంబై ఉగ్రవాద దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను సిద్ధం చేయడంలో సహాయం చేశాడు. టెర్రిరిస్టుల ఫండింగ్ కోసం ప్రయత్నించిన కేసులో పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2012లో అబ్దుల్ సలామ్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. చాలా సంవత్సరాల తరువాత భుట్టావీని ఉగ్రవాద నిధుల ఆరోపణలపై పాకిస్తాన్ అరెస్టు చేసింది. సుమారు మూడేళ్ల క్రితం లష్కర్ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ బావ అబ్దుల్ రెహ్మాన్ మక్కీతో పాటు ఉగ్రవాద నిధుల కేసులో దోషిగా నిర్ధారణ జరిగింది. భుట్టవీకి ఆగస్టు 2020లో పదహారున్నరేళ్ల శిక్ష విధించబడింది.
Read Also:Odisha: భార్యపై అనుమానం.. పసిబిడ్డకు పురుగుమందుతో ఇంజెక్షన్..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
- Abhishek Banerjee: "నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు".. చిక్కుల్లో మమత మేనల్లుడు
లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను 2002 , 2008లో పాక్ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎల్ఇటి తాత్కాలిక అధిపతిగా పనిచేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని షేక్‌పురా జైలులో అబ్దుల్ సలామ్ గుండెపోటుతో మరణించినట్లు సోమవారం అర్థరాత్రి ప్రకటించారు. 78 ఏళ్ల తీవ్రవాది భుత్తావి అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను కూడా ఓ సంస్థ విడుదల చేసింది. భుత్తావీ అంత్యక్రియలు మంగళవారం ఉదయం లాహోర్ సమీపంలోని మురిడ్కేలోని ఉగ్రవాద సంస్థ మర్కజ సెంటర్లో జరిగాయి.
Read Also:Vizag Job Scam: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా
భారత ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉగ్రవాది భుట్టావి మరణాన్ని ధృవీకరించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో లేదని చెప్పారు. నవంబర్ 2008లో, 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోని అనేక ప్రదేశాలలో తీవ్రవాద దాడులకు పాల్పడ్డారు. ఇందులో అమెరికా, ఇజ్రాయెల్ వంటి అనేక దేశాల పౌరులతో సహా మొత్తం 166 మంది మరణించారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. తరువాత పాకిస్తాన్ కూడా దాడులకు పాల్పడినందుకు ఆపరేషన్ కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీతో సహా లష్కరే తోయిబాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసింది. అయితే ఈ కేసులో పురోగతి లేదు.
తాజావార్తలు
-
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
-
Lashkar-e-Taiba: భారత్‌ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
-
Ducati Collezione 100: డుకాటి ‘Collezione 100’ స్పెషల్ ఎడిషన్ బైక్స్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
-
Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..