NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అమెరికాకు రాహుల్ గాంధీ.. డల్లాస్, వాషింగ్టన్‌ డీసీల్లో పర్యటన..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 8-10 తేదీల మధ్య ఆయన యూఎస్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లలోని టెక్సాస్ యూనివర్సిటీ సహా పలువురుని కలవనున్నారు. జూన్ నెలలో లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా రాహుల్ గాంధీ అమెరికా వెళ్లబోతున్నారు. ఆయన పర్యటన వివరాలను ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా పంచుకున్నారు. ‘‘రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా మారినప్పటి నుంచి 32 దేశాల్లో ఉనికిలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా తనకు అక్కడి ప్రవాస భారతీయులు, దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపావేత్తలు, నాయకులు, అంతర్జాతీయ అభ్యర్థలను వచ్చాయి, మీడియాతో పాటు చాలా మంది ఆయనతో ఇంటరాక్షన్ కావాలానుకుంటున్నారు’’ అని పిట్రోడో ఒక వీడియోలో ప్రకటించాడు. రాహుల్ యూఎస్ పర్యటనకు వస్తున్నారు. సెప్టెంబర్ 8న డల్లాస్, సెప్టెంబర్ 9, 10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో ఉంటారని, టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థులతో ఇంటరాక్షన్ ఉంటుందని, భారతీయ ప్రవాసులతో సమావేశం జరగుతుందని వెల్లడించారు.

10 రాష్ట్రాలకు ‘అస్నా’ తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలు కూడా

అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 13-15 కిమీ వేగంతో పశ్చిమ దిశగా అస్నా దూసుకొస్తున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా క్రమంగా కదులుతోందని పేర్కొన్నారు. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి అది కాస్తా తుఫాన్‌గా మారింది. 24 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ 10 రాష్ట్రాలకు ఉంది. అందులో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. మరోవైపు.. ఆంధ్రా తీరప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయని.. ఈ అర్ధరాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాలను దాటుతుందని భావిస్తున్నారు.

భారీ వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ కీలక ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేడు జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, తెలంగాణా తో పాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలోను భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఏ విధమైన ఆకస్మిక విపత్తు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయం తోపాటు జీహెచ్ఎంసీ, రాష్ట్ర సచివాలయంలోనూ కంట్రోల్ రూమ్ లను తెరవాలని తెలిపారు. లోతట్టు, వరద ప్రాంతాల నుండి ప్రజలు వెళ్లకుండా తగు నిఘా పెట్టాలని అన్నారు. ముఖ్యంగా ఉదృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని చెప్పారు.

కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం

విజయవాడలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ వర్షాలతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగి నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు విడిచినట్లు తెలిసింది. సహాయక చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ మేరకు మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట స్థానికులను సురక్షిత ప్రదేశాలకు తరలించే కసరత్తు చేయాలని అధికారులన ఆదేశించారు.

బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం

రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దేశ విదేశాల్లోని బుద్దిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీ లో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్​ సాగర్​లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్​లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్ ను పంపించింది. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్​ బుద్ధ మ్యూజియం ను ఈ ప్రణాళిక లో పొందుపరచనుంది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని టూరిజం, స్పిర్చువల్ డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతారు. నాగార్జున సాగర్ డ్యామ్​ అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. నాగార్జున సాగర్​ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్ లో విహారించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందిస్తారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లేన్ రోడ్ నిర్మిస్తారు. ఈ రహదారి కి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం ఆదేశించారు.

అప్పా చెరువులో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న హైడ్రా

గగన్ పహాడ్ గ్రామంలోని అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన పదమూడు షెడ్లను హైడ్రా విభాగం శనివారం ఉదయం కూల్చివేస్తున్నారు . శంషాబాద్ పరిధిలో లో 35 ఎకరాల విస్తీర్ణంలో వున్న గగన్ పహాడ్ చెరువులో అక్రమం నిర్మాణాలు జరుగుతున్నట్లుగా హైడ్రాకు పలు ఫిర్యాదులు రావడంతో దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిన హైడ్రా అధికారులు అప్పా చెరువులో మూడు ఎకరాల పరిధిలో అక్రమంగా పదమూడు షెడ్లను నిర్మించినట్లుగా నివేదిక ఇవ్వడంతో హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం స్థానిక పోలీసులు, రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్ విభాగాల ఆధ్వర్యంలో అప్పా చెరువులో అక్రమంగా నిర్మించిన పదమూడు షెడ్ల నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ తొలగింపులతో లతో ఆక్రమణకు గురైన మూడు ఎకరాల చెరువును భూమిని హైడ్రా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకొనున్నారు .

పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం..

పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం వచ్చింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో రుబీనా ఫ్రాన్సిస్ అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో భారత్‌కు చెందిన రుబీనా ఫ్రాన్సిస్ 211.1 స్కోరుతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పిస్టల్ ఈవెంట్‌లో పతకం సాధించిన తొలి భారత పారా షూటర్ అథ్లెట్‌గా రుబీనా రికార్డు సృష్టించింది. పారిస్ పారాలింపిక్ క్రీడల్లో భారత్‌కు ఐదో పతకాన్ని అందించింది. రుబీనా క్వాలిఫికేషన్‌లో ఏడో స్థానంలో నిలువగా.. ఫైనల్‌లో బలమైన ప్రదర్శన చేసింది.

గతంలో కేటీఆర్ హై సెక్యూరిటీ ఏరియా అని చెప్పి డ్రోన్ ఎగరవేశాడు

హైడ్రా వల్ల పేదలకు ఎటువంటి నష్టం కలగకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఏ పార్టీ వ్యక్తుల నిర్మాణాలైనా కూల్చివేస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. గతంలో కేటీఆర్ హై సెక్యూరిటీ ఏరియా అని చెప్పి డ్రోన్ ఎగరవేశాడని, విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని విజ్ఞప్తుల మేరకు మల్లారెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి ఆసవుద్దీన్ విద్యాలయలకు హైడ్రా నోటీసులు పంపిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు పంపిందని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమంగా నాలాలపై నిర్మాణాలు చేపట్టారని ఆయన అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలు అందిస్తున్న ప్రభుత్వమన్నారు. రుణమాఫీ కానీ రైతులకు త్వరలో ఇంటిట సర్వే చేసి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చడానికి కౌన్సిల్ లో తీర్మానం చేయాలని షబ్బీర్ అలీ సూచించారు. కార్పొరేషన్ ద్వారా కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా వస్తాయని, త్వరలో కామారెడ్డి నియోజకవర్గం, పట్టణానికి త్రాగునీరు,సాగునీరు తీర్చడానికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ప్రత్యేక నిధుల ద్వారా సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు షబ్బీఆర్‌ అలీ.

అధికారులు అప్రమత్తంగా ఉండండి.. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్‌ను వదిలి వెళ్లొద్దు

రాష్ట్రంలో భారీ నుండీ అతి భారీవర్షాలు కురుస్తున్నందున నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖాధికారులను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి యన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత ప్రభుత్వ వాతావరణ శాఖా రెడ్ ఏలెర్ట్ ప్రకటించిన నేపద్యంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఈ సమయంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమతి లేకుండా ఇంజినీర్లు హెడ్ క్వార్టర్ ను విడిచి పోవద్దని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని ఆయన సూచించారు.

కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయానికి భారీ వరద

తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు 12 అడుగులు, మరో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 3,26,481 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. 3,80,499 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా నిండి నిండుకుండలా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 215.8070 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం గేట్లన్నీ ఎత్తివేయడంతో ఆ అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలి వెళ్తున్నారు.

గాజాపై ఇజ్రాయిల్ దాడులు.. 48 మంది మృతి..

గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని తీవ్రతరం చేసింది. శనివారం గాజా స్ట్రిప్‌పై జరిగిన దాడుల్లో 48 మంది మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. పోలియో వ్యాక్సిన్ ప్రచారాన్ని ప్రారంభించే ముందు గాజాలోని మధ్య, దక్షిణ ప్రాంతాల్లో ఈ ఘర్షణలు జరిగాయి. ఐక్యరాజ్యసమితి దాదాపుగా 6,40,000 మంది పిల్లలకు పోలియో టీకాలు వేయడం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరిగే పోరాటంలో రోజూవారీ ఎనిమిది గంటల విరామంపై ఆధారపడి ఉంది. శనివారం, గాజా స్ట్రిప్‌లోని ఎనిమిది చారిత్రాత్మక శరణార్థుల శిబిరాల్లో ఒకటైన నుసీరత్‌లోని వైద్యులు ప్రచారం ప్రారంభానికి 2,000 మందికి పైగా వైద్య , కమ్యూనిటీ వర్కర్లు సిద్ధమవుతుండగా, ఇజ్రాయెల్ దాడుల్లో తొమ్మిది మంది సభ్యులతో సహా కనీసం 19 మంది మరణించారని వైద్యులు తెలిపారు. గాజాలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన వరుస దాడుల్లో మరో 30 మందికి పైగా మరణించారు. సెంట్రల్, దక్షిణ గాజా స్ట్రిప్‌లో తమ కార్యకలాపాలను కొనసాగించినట్లు ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమ రఫాలోని టెల్ అల్ సుల్తాన్‌లో తమ సైనికులు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు తెలిపింది.