Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 31 01 2025

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :January 31, 2025 , 9:19 pm
By Gogikar Sai Krishna
  • రాష్ట్రపతిని సోనియా గౌరవించారు.. మీడియా మాత్రం వక్రీకరించింది
  • అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో...
  • విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటింది
  • "రాష్ట్రపతిపై వ్యాఖ్యలు".. సోనియా, రాహుల్ గాంధీలపై ప్రధాని మోడీ ఫైర్..
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐదు రోజుల్లో ఓటింగ్‌.. ఆప్‌కి భారీ ఎదురు దెబ్బ..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్‌కు ఐదు రోజుల ముందు ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎమ్మెల్యేల టిక్కెట్లను పార్టీ రద్దు చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో నరేష్ యాదవ్ (మెహ్రౌలీ), రోహిత్ కుమార్ (త్రిలోక్‌పురి), రాజేష్ రిషి (జనక్‌పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్), భావనా ​​గౌడ్ (పాలెం). బీఎస్ జూన్ (బిజ్వాసన్) ఉన్నారు.

బడ్జెట్‌కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్‌లో జోరు.. కారణం ఇదే..

బడ్జెట్‌కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్‌లో జోరు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 740.76 పాయింట్ల వద్ద ప్రారంభమై 77,500.57 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 258.90 పాయింట్లు పెరిగి 23,508.40కి చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌లో పెరుగుదల కనిపించింది. 30 సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీలలో లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి), నెస్లే నాలుగు శాతానికి పైగా లాభాన్ని నమోదు చేశాయి. ఎల్ అండ్ టీలో 4.31 శాతం, నెస్లేలో 4.25 శాతం వృద్ధి నమోదైంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటాన్, టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతీ షేర్లు కూడా అత్యధికంగా లాభపడ్డాయి. ఐటీసీ హోటల్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.

“రాష్ట్రపతిపై వ్యాఖ్యలు”.. సోనియా, రాహుల్ గాంధీలపై ప్రధాని మోడీ ఫైర్..

బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ ప్రసంగంపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పెదవివిరిచాయి. అయితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ద్వారకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ, సోనియా గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన వర్గం నుంచి వచ్చిన రాష్ట్రపతిని అవమానించారని మండిపడ్డారు.

పేదోడికి ఇల్లు ఉండాలన్నదే తన కల.. ఢిల్లీ ఎన్నికల్లో మోడీ వ్యాఖ్య

ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్నదే తన కల అని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వారకా ప్రాంతంలో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనకు సొంతిల్లు లేదని.. పేదోడికి మాత్రం ఇల్లు ఉండాలన్నది తన కల అని చెప్పారు. ఢిల్లీలో పేదల కోసం కేంద్రం నిర్మించిన ఇళ్లను ఆప్ కేటాయించడం లేదని… కోట్ల రూపాయలతో శీష్‌మహల్‌ను నిర్మించుకున్నవారికి పేదల బాధ అర్థంకాదని ధ్వజమెత్తారు. పేదల సొంతింటి కల నెరవేరాలంటే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి దేశ రాజధాని ఆప్‌కు ఏటీఎంలా మారిందని విమర్శించారు.

విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటింది

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని యూనివర్శిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, బీఆర్ఎస్ హయాంలో యూనివర్శిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూనివర్శిటీల ప్రక్షాళన చేపట్టి, వీసీలను నియమించామని ఆయన గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొగిలిగిద్దలో నూతనంగా నిర్మించనున్న పాఠశాల భవనానికి సీఎం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యపై ఖర్చు చేయడం తప్ప, భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడం అవసరమని చెప్పారు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని నిత్యం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

రాష్ట్రపతిని సోనియా గౌరవించారు.. మీడియా మాత్రం వక్రీకరించింది

పార్లమెంట‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై సోనియాగాంధీ స్పందించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సోనియా క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా రాష్ట్రపతి భవన్ కూడా సోనియా వ్యా్ఖ్యలను ఖండించింది. సోనియా వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. వివాదం ముదురుతున్న వేళ వయనాడ్ ఎంపీ, సోనియా కుమార్తె ప్రియాంక స్పందించారు. తన తల్లికి రాష్ట్రపతి అంటే అపారమైన గౌరవం ఉందని.. తన తల్లి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని తప్పుపట్టారు. క్షమాపణ చెప్పాల్సింది తన తల్లి కాదు.. దేశాన్ని నాశనం చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని అన్నారు. తన తల్లికి ఇప్పుడు 78 ఏళ్లు.. అలాగే రాష్ట్రపతి కూడా పెద్ద వయసు వారు. వారిద్దరూ గౌరవనీయమైన వ్యక్తులు అని ప్రియాంక పేర్కొన్నారు.

సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలి?

సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలన్నాదని మాజీ మంత్రి రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించ లేదన్నారు. ఫీజులు చెల్లించ లేక విద్యార్థుల పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క రూపాయి చెల్లించలేదని ఆరోపించారు. 3,900 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలని ప్రశ్నించారు.

కేసీఆర్‌ ఫాం హౌస్‌ కలలు మానుకోవాలి..

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫాం హౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్‌ అభ్యర్థుల కోసం ఇటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ప్రజలు ఫాం హౌస్‌ పాలన… గడీల పాలన కోరుకోవడం లేదన్నారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్‌ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారని, ఆయన వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడుతున్నారన్నారు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

ఫామ్‌హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా?

కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామని, ఫామ్ హౌస్ లోనే ఉండి మాట్లాడతారా..లేదా అసెంబ్లీకి వస్తారా? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రశ్నించారు. 13 నెలల పాటు ఫామ్ హౌజ్ కే పరిమితమై ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఇప్పుడేదో అంటే సరిపోదు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో తిరగాలి. ప్రజా సమస్యలు ప్రస్తావించాలి. వ‌ర్షాలు వ‌చ్చినా.. వ‌ర‌ద‌లు వ‌చ్చినా క‌నీసం ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శించ‌లేదు. ఫామ్ హౌస్ దాట‌లేదని, అధికారంలో ఉన్ననాడు స‌చివాల‌యానికి రాలేదు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఏడాది నుంచి అసెంబ్లీకి రాలేదు. ప్ర‌జ‌ల్లోకి రాలేదు.. కేసీఆర్ జీవితమంతా ఫామ్ హౌసే అని ఆయన వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు అత్యాశ‌కు పోయి కాంగ్రెస్ కు ఓటేశారని కేసీఆర్ వ్యాఖ్య‌లు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించేలా ఉన్నాయి. ప్రజా తీర్పును అగౌరవ పరుస్తున్నారని, ప్ర‌జ‌ల‌న్నా.. ప్ర‌జాతీర్పు అన్నా కేసీఆర్ కు ఏనాడూ గౌర‌వం లేదన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో…

వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో బీసీలకు తగ్గిన 10శాతం రిజర్వేషన్ కోటా పునరుద్ధరణ కు చట్టపరమైన అంశాలు పరిశీలిస్తున్నాం. జూన్ లోగా మరో 3హామీలు అమల్లోకి తెస్తున్నాం. తల్లికి వందనం నిధులు విడుదల చేసి విద్యా సంవత్సరం ప్రారంభిస్తాం. రైతులకు అన్నదాత సుఖీభవ, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 20వేలు ఇస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీపై పొలిట్ బ్యూరో లో చర్చించాం. ప్రతీ హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్ణయించాం.” అని మంత్రి తెలిపారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agrigold
  • kcr
  • RK Roja
  • telugu news
  • Top Headlines 9pm

తాజావార్తలు

  • Athidhi Re-release: మహేష్ బాబు ‘అతిథి’ రీ-రిలీజ్.. మణిశర్మ సరికొత్త మ్యాజిక్!

  • Allu Aravind: మృణాల్‌ నువ్వు ఇక్కడే పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వు..

  • SPIRIT : ‘స్పిరిట్’ తెలుగు స్టేట్స్ రైట్స్ మైత్రి మూవీస్ & పీపుల్ మీడియా చేతికి

  • Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..

  • Hardik Pandya: ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.. ముంబై ఓటములపై హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions