NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

హైడ్రా అంటే ఒక భరోసా.. హైడ్రాను భూచి, రాక్షసిగా చూపించొద్దు..

ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమని వెల్లడించారు. ఆర్టికల్ 21 ప్రకారం.. పరిశుభ్రమైన వాతావరణం రైట్ టూ లైఫ్ ఉద్దేశమన్నారు. హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎసెట్ ప్రొటెస్ట్ ఉద్దేశ్యం.. వాటి పరిరక్షణ మా బాధ్యత అని పేర్కొన్నారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులేనన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు. అమీన్‌పూర్‌లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. అమీన్‌పూర్‌లో ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ కట్టారని రంగనాథ్ తెలిపారు. భవనంలో ఆస్పత్రి లేకపోయినా ఆస్పత్రి ఉన్నట్లు ప్రచారం చేశారన్నారు. కొందరు బలవంతులు అక్రమ కట్టడాల వెనుక ఉన్నారన్నారు. అనధికార ఆస్తులను కూల్చివేశామన్న ఆయన.. ఇప్పటి వరకు 21, 22 ప్రాంతాల్లో కూల్చివేతలు చేశామన్నారు. కొంతమంది దుండిగల్, అమీన్‌పూర్ ప్రాంతంలో నకిలీ పర్మిషన్లు ఇచ్చారు. అలా పర్మిషన్లు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేశామని.. పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశామన్నారు. ఎక్కడ హాస్పిటల్‌ను హైడ్రా కూల్చలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇండ్లు కట్టించింది నేనే…

డబుల్ బెడ్ రూం ఇళ్లకోసం ప్రభుత్వ స్థలం లేకపోతే పాలకుర్తి నియోజకవర్గంలో రెండెకరాలు నాస్వంత ఖర్చులతో భూమి కొనుగోలు చేసి కట్టించానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్లు లేని గ్రామాలు చాలా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇండ్లు కట్టించింది నేనే అని ఆయన వ్యాఖ్యానించారు. పేదలకు ఇండ్ల పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన కూడా కాంగ్రెస్ వాళ్లు పేదలను ఇండ్లలో నుండి అన్యాయంగా బయటికి పంపిస్తున్నారని, వారికి అధికారికంగా ఇల్లు ఇవ్వడం జరిగింది,కాలీ చేయించడం పద్దతి కాదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ప్రజా ప్రతినిథులను,అధికారులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళను కాళీ చేయించకండని, పార్టీలకు అతీతంగా ఇల్లు కట్టించామని, అందులో ఉన్నవాల్లందరూ పేదవారన్నారు ఎర్రబెల్లి దయాకర్‌ రావు. కలెక్టర్ ను కూడా రిక్వెస్ట్ చేశానని, పాలకుర్తి నియోజక వర్గంలో అన్ని అభివృద్ధి పనులు ఆగిపోయాయి,వాటిని పూర్తి చేయండన్నారు ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ఉన్నవాటిని ధ్వంసం చేయకండన్నారు ఎర్రబెల్లి.

చంద్రబాబు శ్రీవారి లడ్డూపై పెద్ద నింద వేశారు..

గత వారం రోజులుగా తిరుపతి లడ్డూపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి బట్టబయలు చేశారన్నారు. వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారన్నారు. ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూజలు చేశారన్నారు. జూన్ 12 నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి సప్లై చేసిందన్నారు. జులై నెలలో వచ్చిన ట్యాంకులు వెనక్కి పంపించేశామని ఈవో శ్యామల రావు చెబుతున్నారన్నారు. ఎన్డీడీబీకి పంపించిన శ్యాంపుల్స్ రిపోర్ట్ జులై 23న వచ్చిందన్నారు. వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఈవోనే స్వయంగా చెప్పారని.. జంతువుల కొవ్వు కలిసిందని తెలిసినప్పుడు సెప్టెంబర్ 2 వరకూ చంద్రబాబు ఎందుకు ఆగారన్నారు.

హైడ్రా, మూసీ విషయంలో ప్రజలకు నష్టం చేయాలని ప్రభుత్వానికి లేదు

హైడ్రా కు సంబంధించి హై కోర్టు, సుప్రీంకోర్టు ఉందని, కస్టోడీయన్‌గా ప్రభుత్వం కూడా ఆస్తులకు రక్షణ గా ఉండి కాపాడుతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వ్యక్తుల ఆస్తులను కూల్చడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనంఏమి లేదని, ఎవరికైనా అలాంటి నష్టం జరిగితే కింది స్థాయి నుండి ప్రిన్సుపల్ సెక్రెటరీ వరకు ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దాంట్లో ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వం తరుపున కాంగ్రెస్ పార్టీ చెప్తుందని, మూసి ఐడేంటి పై జరుగుతుందని ఆయన తెలిపారు. అప్పుడే కూల్చి వేస్తున్నారని కొంత మంది రాజకీయ పక్షాల నాయకులు అంటున్నారని దయాకర్‌ అన్నారు.

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల కౌంటర్

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు లడ్డూపై దుర్మార్గపు వ్యాఖ్యలు చంద్రబాబు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లడ్డూ కల్తీ జరిగిందని బలంగా ప్రచారం జరిపించారని అన్నారు. ఆ రోజే వైవీ సుబ్బారెడ్డి కోర్టును కూడా ఆశ్రయించారన్నారు. చంద్రబాబు చేసిన అపచార వ్యాఖ్యలు మామూలుగా ప్రజల్లోంచి వెళ్లవన్నారు. ఆ పాపం చంద్రబాబుదే అనే నిజం ప్రజలకు తెలియాలన్నారు.అయోధ్య రామాలయం వారు కూడా ఇక్కడి విధానం నచ్చి ఇక్కడి నుంచి తీసుకోవడానికి ముందుకు వచ్చారన్నారు. కల్తీ లేకుండా ప్రసాదాలు, భోజనాలు అందించిన చరిత్ర టీటీడీదని.. ఇప్పుడు ఆ నమ్మకాన్ని చంద్రబాబు పోగొట్టే ప్రయత్నం చేశాడన్నారు.

మోడీ, యోగి ‘అఖండ భారత్’ కలని నేరవేర్చగలరు..

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, ప్రధాని నరేంద్రమోడీ దేశంలో, సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ (ఏఐఎంజే) జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ మౌలానా షహబుద్దీన్ బరేల్వీ అన్నారు. మోడీ, యోగిలు అఖండ భారత కలని సాకారం చేయగల గొప్ప వ్యక్తులని ప్రశంసలు కురిపించారు. దీని కోసం వారు చర్యలు తీసుకోవడం ప్రారంభించారని శనివారం అన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటన తర్వాత మౌలానా ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పాకిస్తాన్ నుంచి విడిపోతుందని, త్వరలోనే భారత్‌లో భాగమవుతుందని సీఎం యోగి చెప్పారు. యోగి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సింధ్ లేకుండా భారత్ సంపూర్ణం కాదని అన్నారు. యోగి చెబుతున్నట్లు సింధ్ లేకుండా భారతదేశం సంపూర్ణం కాదని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత పీఓకే కాశ్మీర్‌లో భాగం అవుతుందని వ్యాఖ్యలు చేశారని మౌలానా షహబుద్దీన్ రజ్వీ అన్నారు. భారత్ ‘‘అఖండ భారత్‌’’లా ఉండాలి, పాకిస్తాన్ మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా భారత్‌లో భాగం కావాలి అని అన్నారు.

మహిళ పేరుమీదే ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు

కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌కు (ఎఫ్‌డీసీ) సంబంధించి రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై ఈ నెల 25వ తేదీ నుంచి 27 వ తేదీ వ‌ర‌కు రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల్లో ప‌ర్య‌టించిన అధికారులు చేసిన అధ్య‌య‌నంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. కార్డుల రూపకల్పలో ఆయా రాష్ట్రాలు సేక‌రించిన వివ‌రాలు, కార్డుల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలు, లోపాల‌ను అధికారులు వివ‌రించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ రూపకల్పనపై అధికారుల‌కు ప‌లు ఆదేశాలు, సూచ‌న‌లు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఉన్న రేష‌న్, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ‌, ఐటీ, వ్య‌వ‌సాయ‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల్లోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధార‌ణ చేయాల‌ని సూచించారు. ఇత‌ర రాష్ట్రాల కార్డుల రూప‌క‌ల్ప‌న‌, జారీలో ఉన్న మేలైన అంశాల‌ను స్వీక‌రించాల‌ని, లోపాల‌ను ప‌రిహారించాల‌న్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అన‌వ‌స‌ర స‌మాచారం సేక‌రించాల్సిన ప‌ని లేద‌న్నారు.

హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో భారీ చోరీ

నంద్యాల జిల్లాలో హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో భారీ చోరీ జరిగింది. రూ.3 కోట్ల విలువైన మూడున్నర కేజీల బంగారం, రూ 50 వేల నగదు అపహరణకు గురైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బళ్లారి , హోస్పేట్ ప్రాంతాల్లో బంగారు ఆభరణాలను అమ్మడానికి పల్నాడు జిల్లా సత్తెనపల్లె వ్యాపారులు రంగారావు , సతీష్ కుమార్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో నరసరావుపేటకు రంగారావు , సతీష్ కుమార్ బయలుదేరారు. మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు, రూ 50 వేల నగదును బ్యాగ్‌లో పెట్టుకున్నారు. ఏసీ కోచ్‌లో వారిద్దరు నిద్రపోయారు. తెల్లవారుజామున 4 గంటలకు బ్యాగ్ ఉన్నట్లు నంద్యాలలో చూసుకున్నారు. రైలు దొనకొండ చేరేసరికి బంగారం, నగదు ఉన్న బ్యాగ్ మాయమైంది. నంద్యాల-గిద్దలూరు మధ్య బ్యాగ్‌ను ఆగంతకులు అపహరించారు. ఫోన్ ద్వారా నంద్యాల రైల్వే పీఎస్‌కు రంగారావు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ యాజమాన్యం భేటీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం అయ్యారు. ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. అదే విధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వ తీరు కారణంగా లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కి పోయింది. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ లులు గ్రూప్ ఆసక్తి చూపించింది.

హైడ్రా బాధితులకు భరోసా.. భద్రత కల్పించాలి..

హైడ్రా విషయంలో పేదలకు భరోసా, భద్రత ఇస్తే సమస్య ఉండదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైడ్రా పేదల విషయంలో పునరావాసం కల్పించాలని, కూల్చివేతలు తప్పు అనడం లేదన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌. అందరి పట్ల హైడ్రా సమానంగా వ్యవహరించాలని, అధికారులు తొందర పడొద్దన్నారు. వచ్చేది మా ప్రభుత్వమని, ఏ ప్రభుత్వం భవనాలకు అనుమతి ఇచ్చిన తప్పే అని ఆయన అన్నారు. మాపై కోపం పేదలపై చూపొద్దని, పేదలకు భరోసా కల్పించాలన్నారు. ప్రజలు వ్యతిరేకం అయితే అనుకున్న ఆశయం లక్షలు ఎలా నెరవేరతాయని, అర్బన్ లో ఉండే చెరువుల్లో ఉండేది డ్రెయిన్ వాటర్ అని, నిజంగా చెరువుకు హాని కలిగితే కూల్చివేతలపై నిర్ణయాలు తీసుకోవాలన్నారు. చెరువులు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో కూడా ఆలోచించాలన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌. మహబూబ్ నగర్ నగరంలో ఉన్న చెరువులు పంటకు తాగునీటికి వాడటం లేదని, అక్రమ నిర్మాణాలకు అన్ని ప్రభుత్వాలది బాధ్యత అని ఆయన అన్నారు. అధికారులు తొందర పడొద్దని, పరిహారం అదింకగా ఇచ్చయినా పేదలకు ఇల్లు కోల్పోతున్న వారికి సాయం చేయండన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌.