చంద్రబాబు చరిత్ర అంతా మహిళలను అడ్డుపెట్టుకుని చేసిందే
టీడీపీ మహిళాధ్యక్షురాలు అనితకు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదు అని వైసీపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. ఇంతకు అనిత అన్నం తింటుందా? గడ్డి తింటుందా?.. ఆమె పచ్చకామెర్లతో బాధ పడుతోంది.. అందుకే ఎన్సీఆర్బీ రిపోర్టుని కూడా పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు అని పోతుల సునీత విమర్శించారు. వైసీపీలో హోంమంత్రి, మండలి వైస్ ఛైర్మన్ లాంటి ముఖ్యమైన పదవుల్లో సైతం మహిళలే ఉన్నారు.. చంద్రబాబు చరిత్ర అంతా మహిళలను అడ్డుపెట్టుకుని చేసిందేనని పోతుల సునీత అన్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీ పార్టీని లాక్కునే దగ్గర్నుండి అనేక విషయాల్లో మహిళలను ఆయన అడ్డుపెట్టుకుని చేశారని విమర్శించారు.
కాలేజీ వాష్‌రూంలో నగ్న దృశ్యాల చిత్రీకరణ.. స్పందించిన జాతీయ మహిళా కమిషన్
కర్ణాటక ఉడిపిలోని ఓ ప్రైవేటు పారామెడికల్ కాలేజీ వాష్‌రూమ్‌లో ఒక విద్యార్థిని వీడియోలను మరో ముగ్గురు ముస్లిం విద్యార్థినులు నగ్నంగా చిత్రీకరించారనే ఆరోపణలపై కర్ణాటకలో బీజేపి భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ముగ్గురు ముస్లిం విద్యార్థినులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందంటూ బీజేపీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ స్పందించి.. ప్రైవేట్ పారామెడికల్ కాలేజ్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే వాదనలను ఖండించారు. ఈ వివాదంలో ఎలాంటి వాస్తవం లేదని ఆమె అన్నారు.
ఇళ్ళలో ఒక్క వస్తువు కూడా పనికి వచ్చేలా లేవు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షా అతలాకుతలం చేశాయి. వరంగల్ జిల్లాలో వరద నీరు పోటెత్తడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా.. కొన్ని చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకొని కొన్ని గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే.. ఇవాళ హనుమకొండ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పది ఫీట్లకు పైగా వరద వచ్చిందని, ఇళ్ళలో ఒక్క వస్తువు కూడా పనికి వచ్చేలా లేవని ఆయన అన్నారు. బియ్యం, పప్పు, ఉప్పు అన్ని తడిచి ముద్ద అయిపోయాయన్నారు ఈటల రాజేందర్. గతంలో వరదల సమయంలో కేటీఆర్ తో కలిసి వచ్చి పర్యటించానని, గతంలో కొన్ని ఆక్రమణలను మా ముందే అప్పుడు కూల్చి వేశారన్నారు.
ఉడిపి కాలేజీ కేసులో సిద్ధరామయ్యపై ట్వీట్.. బీజేపీ కార్యకర్తపై కేసు
ఉడిపి కాలేజీ కేసుకు సంబంధించి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై ట్వీట్ చేసినందుకు గానూ బీజేపీ కార్యకర్తపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయబడింది. ఉడిపిలోని ఓ ప్రైవేటు పారామెడికల్ కాలేజీ వాష్‌రూమ్‌లో ఒక విద్యార్థిని వీడియోలను మరో ముగ్గురు ముస్లిం విద్యార్థినులు నగ్నంగా చిత్రీకరించారనే ఆరోపణలపై కర్ణాటకలో బీజేపి భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ కార్యకర్త శకుంతర కర్ణాటక కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ చేసిన ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. అధికార పార్టీ ఈ సంఘటనను పిల్లల ఆట అని లేబుల్ చేసిందని ఆరోపించారు. తన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే తానేం చేసేవాడిని అంటూ సిద్ధరామయ్యపై ఆ కార్యకర్త వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉడిపిలో జరిగిన పిల్లల ఆట కేసును బీజేపీ రాజకీయం చేస్తోందని కర్ణాటక కాంగ్రెస్ గతంలో పేర్కొంది. హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో హనమంత్రయ్ అనే వ్యక్తి శకుంతలపై ఫిర్యాదు చేయగా, ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
నగరం మాములు వర్షాలకు సైతం ముంపుకు గురవుతోంది..
తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే.. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంత రావు మాట్లాడుతూ.. నగరం మాములు వర్షాలకు సైతం ముంపుకు గురవుతోందిన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతున్న హైదరాబాద్ లో భారీ వర్షాలు వస్తే అనేక కాలనీలు ముంపు అవుతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ లో వరదల వల్ల జరిగే ముంపును ప్రభుత్వం నివారించాలని, ఇప్పుడు ముంపునకు గురైన బాధితులకు కుటుంబానికి 15 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కమిషనర్ కాంగ్రెస్ నాయకులను అవమానించారని, రాహుల్ గాంధీ బీసీ లను ఎలాంటి అవమానకర మాటలు అనలేదన్నారు. ఆయన మోడీలపై మాట్లాడితే బీసీల గురించి మాట్లాడినట్టు బీజేపీ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రాబోయే రోజుల్లో మోడీ ఔట్ అవుతారు.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రియుడిని పెళ్లాడేందుకు చైనా నుంచి పాకిస్థాన్‌కు.. సరిహద్దు దాటిన మరో ప్రియురాలు
ఇటీవల ప్రేమకోసం ప్రేమికులు దేశ సరిహద్దులను దాటి.. తమ ప్రేమను గెలిపించుకోవడానికి రిస్క్ చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతను అధిగమించి దేశ సరిహద్దులను కూడా దాటిపోతున్నారు. ఇటీవల ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల వివాహిత అంజు పాకిస్థాన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు వెళ్లి ఇస్లాంలో చేరి ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకుంది. అప్పటికి పెళ్లి అయిన అంజుకు భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరో ఘటనలో 30 ఏళ్ల సీమా హైదర్ అనే పాకిస్థాన్ మహిళ పబ్జీలో పరిచయమైన ప్రియుడి కోసం భారత్‌కు వచ్చింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలున్న సీమా.. వారిని తీసుకుని 22 ఏళ్ల సచిన్ కోసం భారత్‌లో అడుగుపెట్టింది. ఈ విచిత్ర ప్రేమ కథలను మరిచిపోకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది. చైనాకు చెందిన ఓ యువతి స్నాప్‌చాట్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లింది. 3 నెలల వీసా తీసుకుని మరి సదరు యువతి పాక్‌లో అడుగుపెట్టింది.
ఆగస్ట్ 15 తర్వాతే ముంబయిలో ప్రతిపక్ష కూటమి మూడో సమావేశం!
ప్రతిపక్ష కూటమి ‘ఇండియా'(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) తన మూడో సమావేశాన్ని ఆగస్టు 15 తర్వాత లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో నిర్వహిస్తుందని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే శుక్రవారం ప్రకటించారు. 26 పార్టీలతో కూడిన ప్రతిపక్ష కూటమి గతంలో జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో సమావేశమైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశం అనంతరం కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే మాట్లాడుతూ.. సెప్టెంబర్ మొదటి వారంలో సమావేశాన్ని షెడ్యూల్ చేయాలని కాంగ్రెస్ సూచించిందని చెప్పారు. అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదని ఆయన తెలిపారు.
కోహ్లీ లాగే.. జోరూట్ స్టన్నింగ్ క్యాచ్
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోగా.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయకుండ ఇంగ్లండ్ చూస్తుంది. అందుకోసం ఇంగ్లండ్ జట్టు.. ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. మరోవైపు యాషెస్ సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్ ను కేవలం డ్రా చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతుంది. అటు ఇంగ్లండ్ వికెట్ల కోసం పోరాడుతుంది. రెండో రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో గంటన్నర పాటు వికెట్ కూడా పడలేదు. మార్నస్ లబుషెన్‌ను ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే చాలా సేపటి తర్వాత ఇంగ్లండ్ జట్టుకు ఓ అవకాశం వచ్చింది. మార్క్ వుడ్ వేసిన బంతిని లాబుషేన్ డిఫెండ్ చేశాడు. అది బ్యాట్ ఎడ్జ్ కు తగలడంతో స్లిప్ లో ఉన్న వ్యక్తి క్యాచ్‌ను అందుకున్నాడు. వికెట్ కీపర్ ఆ క్యాచ్ ను మిస్ చేయగా.. స్లిప్ లో ఉన్న జో రూట్ అప్రమత్తంగా ఉండటంతో తన ఎడమ చేతితో బంతిని పట్టుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ జట్టుకు ఒక పెద్ద రిలీఫ్ దొరికినట్లైంది. 82 బంతులు ఆడి 9 పరుగులు చేసిన లబుషేన్.. పెవిలియన్ బాట పట్టాడు.
ప్రజల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి… మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చేతులెత్తేశారు
వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని, చాలామంది కొట్టుకుపోయారని, రోడ్లు కొట్టుకుపోయాయని, హైవేలు, వంతెనల పైనుంచి నీరు ప్రవహిస్తోందన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ. శుక్రవారం నాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రి డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. భూపాలపల్లి, ములుగు, వరంగల్, జనగామ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని, ప్రజల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. 5 లక్షల ఎకరాల పంట నీట మునిగిందని, దాదాపు 40 వేల కుటుంబాలు కట్టు బట్టలతో ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు డీకే అరుణ. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం సమీక్ష కూడా నిర్వహించకపోవడం దారుణమని, భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు డీకే అరుణ. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చేతులెత్తేశారని, గత రెండేళ్లుగా వర్షాలకు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొన్నారని.. అయినా సర్కార్ గుణపాఠం నేర్చుకోలేదన్నారు.
ఏడో స్థానంలో రోహిత్ బ్యాటింగ్.. ఎప్పుడు వచ్చాడంటే..?
రోహిత్ శర్మను ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగడం మీరెప్పుడైనా చూశారా..? ఎక్కువగా ఓపెనర్ గా దిగే హిట్ మ్యాన్.. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఒకటి నిన్న(జూలై 27)న జరిగింది. ఏ ఫార్మాట్ గానీ ఓపెనర్ గానే బ్యాటింగ్ దిగి.. విధ్వంసం సృష్టించగల హిట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అందరినీ షాక్ అయ్యేలా చేశాడు.
రోహిత్ శర్మ ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగపోవడానికి కారణముంది. అదెంటంటే.. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగారు. ఇక ఆ తర్వాత స్థానంలో రావాల్సిన కోహ్లి కూడా బ్యాటింగ్‌కు రాలేదు. అయితే త్వరలో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలాబలాలు తెలుసుకునేందుకు వన్డే స్పెషలిస్ట్‌కు అవకాశం ఇవ్వాలని ఇలా ప్లాన్ చేసినట్లు రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం తెలిపాడు.
కేసీఆర్ అసెంబ్లీకి అర్థం లేకుండా చేశారు
విపత్తు నిర్వహణ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 988 కోట్లు సిద్దంగా ఉన్నాయని, ఇందులో 75 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయొచ్చని, ఈ నిధుల నుండే మరణించిన వారికి నాలుగు లక్ష రూపాయల నష్ట పరిహారమన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 193 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం యూసీ సర్టిఫికెట్ ఇవ్వక పోవడంతో ఆ నిధులు ఆగిపోయాయన్నారు. ఎల్లుండి వరంగల్ కి వెళ్తున్నానని, బీజేపీ కార్యాలయాల్లో భోజన వసతి, ఉండేందుకు సౌకర్యం కల్పించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఈ ప్రభుత్వం అసెంబ్లీ నడిపిస్తే కదా ఫ్లోర్ లీడర్ ఆ ఇంకో లీడర్ ఆ నిర్ణయించేదని ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీ కి అర్థం లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. రేపు ఢిల్లీకి వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. 10 ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్ లు ఫీల్డ్ లో ఉన్నాయని, 2 ఆర్మీ హెలికాప్టర్ లు అందుబాటు లో ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. నేను బాట సింగారం వెళ్తా నంటే నన్ను మా వాళ్ళను అరెస్ట్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఈ రోజు గ్రేటర్ మునిసిపల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆందోళన కి పూర్తిగా సహకరించింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఎవరు ఎవరితో కలిశారని, బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటి అని అంటున్న మేధావులు చెప్పాలన్నారు. మేము ఏమో కోర్ట్ కి వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలని.. కాంగ్రెస్ నేతలకు అవసరం లేకుండానే ఆందోళనలు చేపడుతున్నారన్నారు.
