NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఆన్‌లైన్‌లో భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల సేవలు నిలిపివేత

భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్ లైన్‌లో అనుమ‌తులు జారీ చేసే పోర్టల్‌లో మార్పులు చేస్తోంది ప్రభుత్వం. ఈ మార్పుల్లో భాగంగా ప‌లు రోజుల పాటు ఆన్‌లైన్ అనుమ‌తుల సేవ‌లు నిలిపివేస్తున్నట్లు ప‌ట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. స‌ర్వర్ మైగ్రేష‌న్, డేటా మైగ్రేష‌న్‌లో భాగంగా వ‌చ్చే నెల నాలుగో తేదీ వ‌ర‌కూ సేవ‌లు అందుబాటులో ఉండ‌వ‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం భ‌వ‌నాల నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమ‌తుల‌ను డీపీఎంఎస్(DPMS)వెబ్ సైట్ ద్వారా జారీ చేస్తున్నారు.

నవంబర్ రెండవ వారంలో సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శన

ఇసుకపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయంగా మార్చుకుందని విమర్శించారు. వారం పది రోజుల్లో ఓపెన్ రీచ్‌లను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఏ రోజు ఏం పని చేయాలనే దానిమీద ఒక రూట్ మ్యాప్ తీసుకోమని అధికారులను ఆదేశించామన్నారు. వారం రోజుల్లోనే మళ్లీ రివ్యూ నిర్వహిస్తామన్నారు. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. 228లో రూపాయలకే టన్ను ఇసుక ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తక్కువ ధరకే ఇసుక అందుబాటులోకి వచ్చిందన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు.

ప్రజా పాలన అంటే.. ఇదేనా రేవంత్ రెడ్డి..?

కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ కారణమని ఆరోపించారు మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ తెలంగాణ భవన్ లో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ ఫెయిల్ అవ్వటం వలనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయని, రక్షకభటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరమన్నారు. పోలీసులు రోడ్డు ఎక్కటం చరిత్రలోనే మెదటసారి అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజా పాలన అంటే.. ఇదేనా రేవంత్ రెడ్డి? అని ఆమె ప్రశ్నించారు. హోంమంత్రి లేకపోవటం వల‌న.. కానిస్టేబుల్స్ బాధ ఎవరకి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి అని, యూనిఫాం వేసుకుని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చిందని ఆమె మండిపడ్డారు.

గడిచిన ఐదేళ్లలో విద్యుత్ కొనుగోళ్లలో పారదర్శకత లేదు..

విద్యుత్ రంగంలో గత ప్రభుత్వంలో చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్లలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడుతోందని అన్నారు. ప్రజల సొమ్మును అప్పనంగా తన అస్మదీయులకు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గానూ గతంలో చేసిన పీపీఏలను జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రద్దు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తికి మారుపేరు అయిన ఏపీ జెన్కోని నిర్వీర్యం చేసి.. ప్రజావసరాల కోసం అనే పేరుతో యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లు చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో చేసిన విద్యుత్ కొనుగోళ్లలో జగన్ సర్కార్ ఎక్కడా పారదర్శకత ప్రదర్శించలేదని మంత్రి గొట్టిపాటి అన్నారు.

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.  ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపుపై చర్చ జరిగింది. ములుగులో గిరిజన యూనివర్సిటీకి ఎకరా 250 రూపాయల చొప్పున భూమిని మంత్రివర్గం కేటాయించినట్లు సమాచారం.ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ములుగులోని సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కేబినెట్ తీర్మానించింది. మెట్రో రైల్ మార్గాల విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1.నాగోల్ టు ఎల్బీ నగర్, 2.ఎల్బీ నగర్ టు హయత్ నగర్. 3.ఎల్బీ నగర్ టు శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరించనుంది.

కాళేశ్వరం కమిషన్‌ విచారణలో హరీష్‌రావు పేరు..

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. శనివారం, సీఈ సుధాకర్ రెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల టెండర్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా, సుధాకర్ రెడ్డి తనిఖీలు లేకుండా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి సబ్ స్టాన్షియల్ పత్రం ఇచ్చినట్లు అంగీకరించారు. డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్‌కు డబ్బులు కేటాయించినట్లు వివరించారు. మేడిగడ్డ డిజైన్ ఖరారు చేసే సమయంలో ఎల్ అండ్ టీని సంప్రదించినట్లు చెప్పారు. మాజీ మంత్రి హరీష్‌ రావు పేరు ఈ విచారణలో మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి ఎవరు అని ప్రశ్నించగా, హరీశ్ రావు అని సుధాకర్ సమాధానం ఇచ్చారు.

ఇంటి వ‌ద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవ‌లు..!

త‌మ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్త‌రిస్తోంద‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్ లో వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఆదివారం (ఈ నెల 27) నుంచి హైద‌రాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్ లో ఎక్క‌డికైనా హోం డెలివ‌రీ చేయవ‌చ్చ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ హోం డెలివ‌రీ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని వినియోగ‌దారుల‌ను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కోరారు.

కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక ప్రకటన

కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కీలక ప్రకటన చేశారు. భ‌వ‌న నిర్మాణ వ్యర్థాలు తొల‌గించ‌ని వారిపై చ‌ర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. న‌గ‌రంలో చెరువుల‌ను, కాలువ‌ల‌ను, ఫుట్‌పాత్‌ల‌ను, ప్ర‌భుత్వ స్థలాల‌ను కాపాడుతూ.. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మెరుగైన జీవ‌నాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన హైడ్రాకు నేటితో వంద‌రోజులు పూర్తి చేసుకుందని ఆయన తెలిపారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యం మేర‌కు ముందుకు సాగుతూ.. చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం ఇచ్చేందుకు హైడ్రా చేస్తున్న ప్ర‌య‌త్నంలో మీడియా అందిస్తున్న స‌హ‌కారానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ఏవీ రంగనాథ్‌. కొన్ని మీడియా సంస్థ‌లు, మ‌రికొంత‌ మంది సోష‌ల్‌ మీడియా ప‌నిక‌ట్ట‌కుని హైడ్రాపై త‌ప్పుడు ప్ర‌చారం చేసి.. ప్ర‌భుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్ర‌య‌త్నంచేస్తోందని ఆయన అన్నారు. ఈ నేప‌థ్యంలో హైడ్రా చ‌ర్య‌ల‌పై క్లారిటీ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ అనుమ‌తులున్న భ‌వ‌నాల‌ను హైడ్రా కూల్చ‌దని, స‌ర్వే నంబ‌ర్లు మార్చేసి.. త‌ప్ప‌డు స‌మాచారంతో అనుమ‌తులు పొంది.. భూములు, చెరువుల‌ను ఆక్ర‌మించి చేప‌ట్టిన‌ నిర్మాణాలపై హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

రైతుల భూమి వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్.. కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..

కర్ణాటకలో వక్ఫ్ బోర్డు తీరు వివాదాస్పదంగా మారింది. విజయపుర జిల్లాలోని రైతుల భూమి తమదే అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడంతో బీజేపీ, అధికార కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హోన్వాడ గ్రామంలోని రైతులకు మాట్లాడుతూ.. తమ పూర్వీకులు భూమిలో 1500 ఎకరాలను వక్ఫ్ బోర్డుకు రీ అసైన్డ్ చేస్తున్నట్లు అక్టోబర్ 04న తహసీల్దార్ నుంచి లేఖ అందినట్లు తెలిపారు. హొన్వాడ గ్రామంలోని రైతుల భూములను వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా 15 రోజుల్లోగా నమోదు చేయాలని కర్ణాటక వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఆదేశించినట్లు బీజేపీ ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రైతులకు చెందిన భూమిని తీసుకోబోమని తేల్చి చెప్పింది.

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య శుక్రవారం హోన్వాడ గ్రామంలోని రైతులను కలుసుకున్నారు. ఈ భూమి వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి ముందు ఎలాంటి ఆధారాలు లేదా వివరాలు ఇవ్వకుండా రైతులకు నోటీసులు అందించారని అన్నారు. ఇటీవల నెలల్లో విజయపుర జిల్లాకు చెందిన రైతుల భూమిని వక్ఫ్ భూమిగా ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని తేజస్వీ అన్నారు. వక్ఫ్ బోర్డు సంస్కరణలపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రం వక్ఫ్ చట్టాన్ని తీసుకువస్తుందని భావించిన జమీర్ అహ్మద్ ఖాన్, 15 రోజుల్లో భూమిని వక్ఫ్ ప్రాపర్టీగా నమోదు చేయాలని డిప్యూటీ కమీషనర్, రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు ఆయన ఆరోపించారు.