Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

కొందరు పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు..

కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని చిన్ని ఫోన్ ను ట్యాప్ చేస్తున్నట్టు బోండా ఉమ ఆధారాలు బయట పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై బోండా ఉమా అభియోగం మోపారు. సీతారామంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. గతంలో తాము ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని మంత్రులు పెద్దిరెడ్డి, గుడివాడ అమర్నాధ్ వెల్లడి చేశారన్నారు. గత తెలంగాణ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినప్పుడే ఏపీ సీఎం జగన్ అదే తరహా సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని తెలిపారు. మేమిచ్చిన కంప్లైంటుపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు పార్టీ అభ్యర్థులతో ఓ వర్క్ షాప్ నిర్వహించాం.. ఆ సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చారని తెలిపారు.

వీర నారీమణులను సన్మానించిన కేంద్రమంత్రి

ఓ వైపు తుపాకీతో బెదిరిస్తున్నా.. ప్రాణాలు తెగించి తల్లీకూతుళ్లు దొంగలతో వీరోచితంగా పోరాడి వారికి ముచ్చెమటలు పట్టించిన సంగతి గుర్తుంది కదా?. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగానే.. వారి పోరాటాన్ని నెటిజన్లు, ప్రజలు పెద్ద ఎత్తున జేజేలు కొట్టారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేసింది. ఇందుకు హైదరాబాద్ వేదికైంది. బీజేపీ కార్యాలయంలో తల్లీకూతుళ్లకు పూలబొకే ఇచ్చి.. శాలువాలతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రాన్ని వారికి అందజేశారు. దీంతో వారిద్దరు సంతోషం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు త్యాగాల పార్టీ

కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు త్యాగాల పార్టీ అని అన్నారు మంత్రి సీతక్క. ప్రజల కోసమే పనిచేసే పార్టీ కాంగ్రెస్ అని ఆమె అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే అని ఆమె వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు వ్యక్తుల పార్టీలు స్వార్థపూరిత పార్టీలు అని ఆయన అన్నారు. ఓట్ల చీలిక కోసం కొత్త నాటకాలు ఆడుతున్నారన్నారు మంత్రి సీతక్క. ఇప్పుడు ఓ నాయకుడు కండువా కప్పుకొని గత ప్రభుత్వ కాలం స్వర్ణ యుగం అంటున్నాడని, మరి అప్పుడు ఎందుకు పార్టీ కి అధ్యక్షుడిగా ఉన్నావు అంటూ ఆర్ ఎస్ ప్రవీణ్ ను మంత్రి సీతక్క ప్రశ్నించారు. అక్షింతలు ఇచ్చి అధికారం లోకి రావాలని చూస్తున్నారని, దేశం కోసం, దేశమే కుటుంబం గా భావించి జనం కోసం పనిచేసే కుటుంబ సోనియా గాంధీ కుటుంబమన్నారు. రాహుల్ ను ప్రధాని చేయటం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పార్టీ లోకి వచ్చే వారిని వద్దనవద్దన్నారు. జనం లో మంచి పేరు ఉంటే జనం తో ఉన్న వారిని పార్టీలోకి తీసుకురండన్నారు.

మరో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు..

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారయ్యారు. ఇక్కడి నుంచి జనసేన నేత చిర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. ఈ మేరకు నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. మూడు పార్టీలను కలుపుకుని పని చేస్తానని, పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా.. ఇక్కడి నుంచి టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించారు.

రాష్ట్రపతి, గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఆరిఫ్ తీరును కేరళ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ మేరకు వారి ప్రవర్తనపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏడు బిల్లులను ఎలాంటి కారణం లేకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచారని, అనంతరం రాష్ట్రపతి కూడా అదే విధంగా వ్యవహరించారని.. దీంతో శాసనసభ ప్రయోజనం మరియు పనితీరు అసమర్థంగా మారిందని కేరళ ప్రభుత్వం పేర్కొంది. దీంతో కేరళ సర్కార్ అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపై సంతకాలు చేయకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

సామ్.. మళ్లీ మొదలుపెట్టేసావా.. ఇక వాళ్లేందుకు ఆగుతారు

స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక ఈ రెస్ట్ మోడ్ ను వెకేషన్ మోడ్ గా మార్చుకొని ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. వెండితెరపై కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. నిత్యం ఆమె చేసే పనులు, చూసిన ప్రదేశాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ మధ్యనే రెస్ట్ మోడ్ నుంచి వర్క్ మోడ్ కు వచ్చేసింది. విడాకుల తరువాత నుంచి ఈ చిన్నది ట్రోల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఆమె ఏది చేసినా ట్రోల్ చేసేవాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు.

ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

సార్వత్రిక ఎన్నికల వేళ ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 డిసెంబ‌ర్‌లో కేంద్రం ఉల్లి ఎగుమతులను 2024 మార్చి 31 వరకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం తదుపరి నోటీసు వచ్చే వరకు కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎగుమతి ఆంక్షలు అమలులోకి వచ్చినప్పటి నుంచి స్థానిక ధరలు సగానికి పైగా తగ్గాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మీద వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పంట చేతికి వచ్చినా ఎగుమతులు నిషేదించడం సమంజసం కాదని వెల్లడించారు.

కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్.. పిటిషన్ తిరస్కరణ

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. అరెస్ట్, ఈడీ కస్టడీపై ఆదివారం లోపు అత్యవసర విచారణ జరపాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయస్థానం తిరస్కరించింది. హోలీ పండుగ కారణంగా సోమ, మంగళవారాల్లో కోర్టుకు సెలవు ఉన్నందున మార్చి 27వ తేదీ బుధవారమే కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో మరోసారి కేజ్రీవాల్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.

కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు తాజాగా నిరాకరించింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది. మార్చి 28 వరకు ఈడీ కస్టడీ విధించటం చట్టవిరుద్ధమని కేజ్రీవాల్‌ న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మార్చి 24 ఆదివారంలోపు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషన్‌లో కోరారు. అత్యవసర విచారణ కోసం కేజ్రివాల్ తరపు అడ్వకేట్ ప్రయత్నం చేశారు. కానీ ఢిల్లీ హైకోర్టు అత్యవసరణ విచారణకు అనుమతించకపోవటంతో ఆప్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

గంజాయిపై చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..

ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు, పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయని పేర్కొ్న్నారు. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖలోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాల గురించి పొరుగు రాష్ట్ర పోలీసులు చెపుతుంటే ఈ సీఎంకు సిగ్గు అనిపించడం లేదా? అని దుయ్యబట్టారు.

అధికారి దురుసు ప్రవర్తన.. కోర్టుకు కేజ్రీవాల్ ఫిర్యాదు

ఢిల్లీ పోలీస్ అధికారి తీరుపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని కేజ్రీవాల్ ఆరోపించారు. గతంలో మనీశ్‌ సిసోడియాను కూడా బలవంతంగా లాక్కెళ్లింది కూడా ఆయనేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అప్లికేషన్‌లో ఈ విషయాన్ని కేజ్రీవాల్ తెలిపారు. తన భద్రతా వలయంలోని సిబ్బంది నుంచి ఆయన్ను తొలగించాలని కోరారు. అయితే ఈడీ సిబ్బంది మాత్రం తనతో మర్యాదగానే ప్రవర్తించారని కేజ్రీవాల్ వెల్లడించారు.

కేసీఆర్‌ బ్లాక్ డే గా ప్రకటించడం గురువిందగింజను గుర్తు చేస్తుంది

కేసీఆర్ బ్లాక్ డే గా ప్రకటించడం గురువింద గింజను గుర్తు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయించారని, ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీ కవిత పేరుతో డొంక బయట పడిందన్నారు. కవిత ను దృష్టిలో పెట్టుకొని లిక్కర్ అవినీతి పై విచారణ జరగలేదని, ఢిల్లీ అధికారుల పిర్యాదు మేరకు దర్యాప్తు జరుగిందన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ మార్పులో కేసీఆఆర్ కుటుంబం హస్తం ఉన్నట్టు తేలిందని, కేసీఆర్ కూతురు కవిత నేతృత్వం లో పాలసీ తయారీకి సహకరించారన్నారు. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి ప్రతిగా ఆప్ కి డబ్బులు ఇచ్చారని ఈడి పేర్కొందని, బీజేపీ కి, కేంద్ర ప్రభుత్వం కి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేజ్రీవాల్ చేసిన అవినీతి, ప్రజా దోపిడీని విడిచి పెట్టాలా… కెసిఆర్ సమాధానం చెప్పాలని కిషన్‌ రెడ్డి అన్నారు.

 

Exit mobile version