NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

వచ్చే పదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల మేర వడ్డీ లేని రుణాలిస్తాం

హనుమకొండలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరంగల్ ఒక్క పట్టణానికి 6 వేల కోట్ల పనులను మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఇది అని, వరంగల్ పట్టణాన్ని మహా నగరాన్ని చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్నామన్నారు. మహిళ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే ఆలోచనలో అన్ని ఆ నాటి ఇందిరమ్మ ప్రభుత్వం లో తెచ్చినవే.. అలాంటి సంక్షేమ పథకాలను టి ఆర్ ఎస్ ప్రభుత్వం తీసేసిందని ఆయన మండిపడ్డారు. మహిళ సంఘాలకు రుణాలు ఇవ్వడమే కాదు వాటి తో వ్యాపారం చేసిన మహిళ సంఘాలను బలోపేతం చేసే ఆలోచనలు చేస్తోందని, మహిళ సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పెట్టి ఆ విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం కొని వారికి లాభాలు వచ్చే లా ఆలోచనలు చేసిన ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన అన్నారు. ఇది మహిళ ప్రభుత్వం.. మేము ఇచ్చింది చూసుకోండి అని ఆయన అన్నారు. మేము ఇచ్చింది చూస్తే కొందరికి కళ్ళు తిరుగుతున్నాయన్నారు.

రోడ్డుపై నమాజ్ చేస్తే, హనుమాన్ చాలీసా.. రాజా సింగ్ సంచలనం..

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ట్వీట్ చేశారు. రోడ్లపై నమాజ్ చేయడాని ప్రజల్ని అనుమతించొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ని కోరారు. రోడ్లపై నమాజ్ చేయడానికి ప్రజల్ని అనుమతిస్తే, అది హనుమాన్ చాలీసా చదివేంచేలా ప్రోత్సహిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మన వీధుల్లో ప్రజల దైనందిత జీవితానికి అంతరాయం కలిగించే, మతపరమైన ఆచార స్థలాలుగా మార్చడానికి మేము అనుమతించమని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పరిశీలన పూర్తి

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు నిబంధనలు ప్రకారం ఉన్నాయని రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదించారు. ఈనెల 21 వరకు ఉపసంహరణకు గడువు ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్‌ 9న ఫలితాలు విడుదల కానున్నాయి. ఆరు జిల్లాల పరిధిలో 16036 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎన్నికలు జరగ్గా ఈ సారే అతి తక్కువ నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. ఈ స్థానానికి 2021లో ఎన్నికలు జరగగా.. పీడీఎఫ్ అభ్యర్థి షేక్‌ సాబ్జీ ఎన్నికయ్యారు రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో ఉప ఎన్నికలు వచ్చాయి.

అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తే.. జైల్లో పెట్టిస్తాం..

హన్మకొండ ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఉక్కు మహిళ అని కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని ఉక్కు సంకల్పంతో ఉన్నామని, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను సీఎం అయ్యానని ఆయన అన్నారు. గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని, ఇద్దరు ఆడబిడ్డలకు మేము మంత్రి వర్గంలో చోటు కల్పించామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అదానీ, అంబానీలను తలదన్నేలా మహిళలను వ్యాపారవేత్తలను చేస్తామని, కాళోజీ కళాక్షేత్రం పదేళ్లైనా పూర్తి చేయని దద్దమ్మలు ఈ రోజు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణను ప్రపంచం గుర్తిస్తే గత పాలకులు గుర్తించలేదని, కాకతీయుల గొలుసుకట్టు చెరువులు ప్రపంచానికి ఆదర్శమన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఓరుగల్లు సంస్కృతి ఎంతో గొప్పదని, చారిత్రాత్మక నగరంగా వరంగల్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. వరంగల్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేవరకు నేను నిద్రపోను.. అధికారులను నిద్ర పోనివ్వనని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ తాగుబోతుల సంఘం అధ్యక్షుడు అని, రాష్ట్రాన్ని తాగుబోతులుగా మార్చి అధికారంలో కూర్చోవాలని అనుకున్నాడన్నారు. తెలంగాణ ప్రజలు ఏదో కోల్పోయారు అని మాట్లాడుతున్నారని, మా ప్రజలు ఏమి కోల్పోలేదు. మీరు ఫామ్ హౌస్ లో కూర్చోండి, రోజుకో సీసా పంపిస్తామన్నారు సీఎం రేవంత్‌.

క్రికెటర్స్ ఉన్న హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో పెద్ద తతంగమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటగాళ్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ పెను ప్రమాదం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), వారి ప్రభుత్వ సన్నాహాలను బహిర్గతం చేసింది. ఇటువంటి పరిస్థితిలో, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌లో జరిగే అవకాశాలు మరింతగా దిగజారాయి.

ఉచిత బస్సు పథకంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి

ఉచిత బస్సు పథకం తెలంగాణ మహిళలకు మరింత ఉపయోగకరంగా మారిందని మంత్రి సీతక్క చెప్పారు. మంగళవారం హనుమకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆమె ప్రసంగిస్తూ, ఈ పథకంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయనే ఆరోపణ చేశారు. మహిళల ప్రయాణానికి ఆర్టీసీ అద్దె బస్సులను కూడా వినియోగిస్తున్నామని, ఈ చర్య మహిళల ప్రయోజనాలకే సేవా నిమిత్తం అని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలపై ఆర్థిక భారం పడకుండా ఉచిత బస్సు పథకం తీసుకొచ్చామని, అలాగే గ్యాస్ సిలిండర్లపై రాయితీ ఇవ్వడం ద్వారా ఆర్థిక భారం తగ్గించామన్న ఆమె, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నామని తెలిపారు.

రైతులకు గుడ్‌న్యూస్.. ధాన్యం విక్రయించిన 24గంటల్లో నగదు జమ

ఇప్పటి వరకూ రాష్ట్రంలో 418.75 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలులో ఇప్పటి వరకూ 391.50 కోట్లు రైతుల‌ ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు 24 గంటల్లోపు 281.30 కోట్లు రైతుల ఖాతాలో జమ అయినట్లు తెలిపారు. ధాన్యం విక్రయించిన 24గంటల్లో నగదు జమ అవుతోంది. ధాన్యం అమ్మిన రైతు ఖాతాల్లో 24 నుంచీ 48 గంటల్లో నగదు జమ చేసే విధానం కూటమి ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.

వికలాంగ క్రీడాకారిణికి ధైర్యం నింపిన ఎంపీ పురంధేశ్వరి

ఏపీ బీజేపీ‌ రాష్ట్ర కార్యాలయంలో వికలాంగ క్రీడాకారిణికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి ధైర్యం నింపారు. పారా బ్యాడ్మింటన్‌లో వీల్ చైర్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో పడాల రూపాదేవి బంగారు పతకాలు సాధించారు. వారధి కార్యక్రమంలో ఎంపీ పురంధేశ్వరిని రూపాదేవి కలిశారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేందుకు సహకరించాలని క్రీడాకారిణి రూపాదేవి విజ్ఞప్తి చేశారు.

వరంగల్ అభివృద్ధి కోసం అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాం

వరంగల్‌ను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే రాబోయే తరాలకు ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్మకొండలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, వరంగల్ అభివృద్ధి కోసం అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించామని వివరించారు. వరంగల్ చుట్టూ 3 విడతల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ జిల్లాకు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5,213 కోట్లు విడుదల చేసిందని ఆయన తెలిపారు. మామునూరు ఎయిర్ పోర్టు, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ ప్రాజెక్టును అత్యంత త్వరలో పూర్తి చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఇందుకోసం భూసేకరణ నిమిత్తం రూ. 205 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

ఎస్ఐపీబీలో రూ.85,083 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం

ఏపీ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు తొలి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్‌, పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, నారాయణ, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, కందుల దుర్గేశ్, గొట్టిపాటి రవికుమార్,సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్, పలుపురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.