NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఏపీకి ముందు ముందు మంచి కాలం ఉంది

ఆంధ్రప్రదేశ్‌కు ముందు ముందు మంచి కాలం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబు .. కేంద్రానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల హామీ కాదని.. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కుపై కేంద్రం గుడ్‌న్యూ్స్ చెప్పింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యాక్టరీకి కేంద్రం కొత్త జీవం పోసింది. పరిశ్రమ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11, 440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు స్పష్టం చేశారు.

రష్యా తరుపున యుద్ధం చేసి 12 మంది భారతీయులు మృతి..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కనీసం 12 మంది భారతీయులు మరణించినట్లు ఈ రోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన భారతీయులు అంతా రష్యా తరుపున పోరాడిన వారేనని వెల్లడించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ రోజు వరకు రష్యన్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య 126గా నమోదైందని, ఈ కేసుల్లో 96 మంది ఇండియాకు తిరిగి వచ్చారని చెప్పారు. 18 మంది భారత పౌరులు ప్రస్తుతం రష్యన్ సైన్యంలో ఉన్నారని, వారిలో 16 మంది వ్యక్తుల ఆచూకీ తెలియలేదు. రష్యన్ సైన్యంలో పోరాడుతూ.. 12 మంది భారతీయులు మరణించారని జైస్వాల్ చెప్పారు.

లొట్టపీసు కేసు అయితే.. సుప్రీంకోర్టు నీ పిటిషన్ ఎందుకు తిరస్కరించింది…

జనగామ జిల్లా యశ్వంతపూర్ శివారులోని శ్రీ సత్య సాయి కన్వెన్షన్ హాల్‌లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 10 సంవత్సరాల అధికార కాలంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఆస్తులు సంపాదించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఓర్వలేక పోతుందన్నారు కడియం శ్రీహరి. కల్వకుంట్ల కుటుంబంలో ఒకరు లిక్కర్ కేసులో తీహార్ జైలుకు వెళ్లారని, రేపో మాపో కేటీఆర్ కూడా జైలుకే అని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం రూ.10 వేట కోట్లకు పైగా ప్యాకేజీ ప్రకటించినట్లుగా వెల్లడించారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఉక్కు రంగానికి ప్రాధాన్యత కల్పించినట్లు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్యాక్టరీ.. ఏపీ ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో కొనసాగుతున్న రేషన్ కార్డుల వెరిఫికేషన్..

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరింత దృష్టిలో పెట్టుకుని, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నేతృత్వంలో 150 డివిజన్లలో దరఖాస్తుదారుల అర్హతల పరిశీలన ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ కొనసాగుతోంది. కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి ఇంటికి వెళ్లి ఆదాయం, ఆస్తులు వివరాలు వెరిఫై చేస్తున్నారు అధికారులు. GHMC, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారుల సమన్వయంతో ఫీల్డ్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. రెండు లక్షల లోపు ఆదాయం ఉండి, బిలో పావర్టీ లైన్‌కు దిగువన ఉన్న వారు రేషన్ కార్డు అర్హులు అంటున్నారు అధికారులు. సొంత ఇండ్లు, ఆస్తులు ఉండి కూడా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి అప్లికేషన్ డిస్ క్వాలిఫై చేస్తున్నామని అధికారులు అంటున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కోసం 83 వేల మంది అప్లై చేసుకున్నట్లు, ఈ నెల 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

‘‘మోడీ అనుమతితోనే మేనిఫెస్టో ప్రకటించారా..?’’ బీజేపీపై కేజ్రీవాల్ సెటైర్లు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం రోజు బీజేపీ తన మేనిఫెస్టోని ప్రకటించింది. అయితే, ఈ మేనిఫెస్టోపై ఆప్ విరుచుకుపడుతోంది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీజేపీ తన పథకాలను వెల్లడించింది. సిలిండర్లపై సబ్సిడీతలతో పాటు మహిళలకు, తల్లులకు, సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది.

అయితే, బీజేపీ మేనిఫెస్టోపై ఆప్ విమర్శలు గుప్పి్స్తోంది. తమ ప్రభుత్వం పథకాలను కొనసాగిస్తే, మీకు ఎందుకు ప్రజలు ఓటేయాలని ప్రశ్నించింది. పలు సందర్భాల్లో ఉచితాలు హానికరమని బీజేపీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఆప్ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాలు ఉచితాలకు, అభివృద్ధికి మధ్య తేడా తెలుసుకోవాని బీజేపీ ఎదురుదాడి చేసింది.

గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్‌.. ఆన్సర్ కీ విడుదలపై తాజా అప్‌డేట్

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన TGPSC గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. టీజీపీఎస్సీ ఇటీవల (జనవరి 8న) గ్రూప్-3 పరీక్ష ఆన్సర్ కీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల కోసం టీజీపీఎస్సీ సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేసింది.

ఈ పరీక్షల ద్వారా 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. రెండు రోజులపాటు నాలుగు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించబడగా, రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 5.57 లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారికి తగిన సౌకర్యాలను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఎందరో త్యాగధనుల ఫలితమే వైజాగ్ స్టీల్ ప్లాంట్

ఎందరో త్యాగధనుల ఫలితమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకు పవన్‌కల్యాణ్.. ప్రధాని మోడీ.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం రూ.11, 440 కోట్లు కేంద్రం కేటాయించడంతో వేల కుటుంబాల ఆశలు చిగురించేలా చేసిందన్నారు. ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఇది ఆర్థిక స్వావలంబన మాత్రమే కాదని.. 1966 నాటి త్యాగాలకు ఇచ్చిన గుర్తింపు అని పేర్కొ్న్నారు. 1966లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలను అర్పించిన అమృతరావుతో సహా లెక్కలేనన్ని మంది ఇతరుల త్యాగం మన హృదయాలలో శాశ్వతంగా మండుతోందని తెలిపారు. వారి రక్తం మరియు కన్నీళ్లు నేడు ఒక ఫ్యాక్టరీగా మాత్రమే కాకుండా.. తెలుగు ప్రజల గర్వం మరియు గుర్తింపుగా నిలిచిన దానికి పునాది వేశాయని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

నీటి వాటాల పాపం బీఆర్ఎస్‌దే

కృష్ణా జలాలను పదేండ్లుగా పట్టించుకోని బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు. కృష్ణా జలాల నదీ వివాదానికి సంబంధించి తెలంగాణలో ఉన్న పరివాహక ప్రాంతం, ఆయకట్టు ఆధారంగా వాటాలు పెరగాలని కాంగ్రెస్‌ పార్టీ తొలినుంచి పోరాటం చేస్తూ వస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నదీ జలాల వాటాలు దక్కించుకోవడంలో తొలి పదేండ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఘోరంగా విఫలమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది నెలలకే 2015 జూన్లో అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో వాటాల వినియోగానికి సంబంధించి ఒప్పందం చేసుకుందన్నారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు వాడుకునేలా ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఈ చీకటి ఒప్పందంతోనే తెలంగాణ తీరని అన్యాయం జరిగింది. ఈ తాత్కాలిక కేటాయింపులపై ప్రతి ఏడాది సంతకాలు చేసింది బీఆర్ఎస్ లీడర్లు కాదా..? అని ఆయన ప్రశ్నించారు.

ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు

ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు లేదని మంత్రి రామానాయుడు అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి జగన్ కూడా కారణం అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే నివృత్తి చేస్తామని తెలిపారు. వృధాగా పోయే నీటిని బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు ఆంధ్రా, తెలంగాణ జలాల పంపిణీపై రివ్యూ చేసి. రీ ఆర్డర్ అధికారం తెచ్చింది.. అంగీకరించింది 2023లో జగన్ హయాంలోనే జరిగింది అన్నారు.