NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల స్కాంకు తెరలేపారు

మేము అధికారంలోకీ రాగానే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహబుబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రేమ్ రంగారెడ్డి గార్డెన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 0 బిల్లులతో ప్రతి పేదవాడి కరెంట్ బిల్లుల లేకుండా చేస్తున్నామన్నారు. భధ్రాచలం రాములవారి సన్నిధి నుండే ప్రతి పేదవాడికి 5లక్షలతో డబుల్ బెడ్ ఇల్లు కేటాయించే కార్యక్రమాన్ని చేపడుతామని ఆయన పేర్కొన్నారు. మేము నిరుద్యోగులకు మంచి చేయాలని చూస్తే ఈరోజు బీఆర్ఎస్ దానిని రాజకీయం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ సెంట్రల్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి మంచి విజన్ తో ముందుకు వెళుతున్నారని, పదేళ్ల కాలంలో కేసీఆర్ నిరుద్యోగులన గురించి ఎప్పడూ మాట్లాడలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు మంచి చేయాలని చూస్తుంటే దానిని కేసీఆర్‌ తప్పు దారి పట్టిస్తున్నాడన్నారు.

కడలూరులో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం

తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనమయ్యారు. సుగంద్ కుమార్‌తో పాటు తల్లి, కుమారుడు మృతి చెందారు. కడలూరు జిల్లా కరమణి కుప్పంలోని ఓ ఇంట్లో 10 ఏళ్ల బాలుడితో సహా ముగ్గురి మృతదేహాలను సోమవారం ఉదయం వెలికితీశామని పోలీసులు వెల్లడించారు. మృతులు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం అందుకున్న నెల్లికుప్పం పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసుల బృందం సంఘటనా స్థలానికి వెళ్లగా, మూడు వేర్వేరు గదుల్లో కాలిపోయిన మూడు మృతదేహాలు కనిపించాయని చెప్పారు.

ట్రంప్‌పై దాడి ఘటన.. 3 తుపాకుల నుంచి 9 రౌండ్లు కాల్పులు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై దాడి ఘటనలో కీలక విషయం బట్టబయలైంది. ఘటనా స్థలంలో ఒక్కరు కాదు ముగ్గురు షూటర్లు ఉన్నారు. ట్రంప్‌పై మూడు తుపాకులతో దాడి చేశారు. కాల్పులకు సంబంధించిన ఆడియో ఫోరెన్సిక్ నివేదికలో ట్రంప్ మూడు తుపాకుల నుంచి కాల్పులు జరిపారని పేర్కొంది. ఒక తుపాకీ నుంచి మూడు బుల్లెట్లు, మరో తుపాకీ నుంచి ఐదు బుల్లెట్లు వెలువడ్డాయి. మూడో తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్ ట్రంప్ కుడి చెవి పైభాగంలోకి దూసుకెళ్లింది.

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన దాడిపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ మేరకు మిస్సోరీ సెనేటర్ పార్లమెంటరీ కమిటీకి లేఖ రాశారు. దాడిపై విచారణను ప్రజల ముందుంచాలని సూచించారు. ఈ సందర్భంలో.. ట్రంప్‌పై కాల్పులు జరపడానికి ముందు పోలీసులు దాడి చేసిన వ్యక్తి వద్దకు వెళ్లినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. దుండగుడు పోలీసులపైకి తుపాకీ గురిపెట్టాడు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ ఘటనపై పోలీసులు సీక్రెట్‌ సర్వీస్‌కు సమాచారం అందించారు. సీక్రెట్ సర్వీస్ చర్య తీసుకునే సమయానికి.. దాడి చేసిన థామస్ మాథ్యూస్ ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. అంతకుముందు.. ర్యాలీలో థామస్ మెటల్ డిటెక్టర్‌ను దాటినప్పుడు, భద్రతా సిబ్బందికి అతనిపై అనుమానం వచ్చింది.

రుణమాఫీకి ఇన్ని కండిషన్స్ ఎందుకు..?

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. రుణమాఫీ మార్గదర్శకాల పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎటువంటి కండిషన్ లేకుండా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, మరి ఈరోజు ఇన్ని కండిషన్స్ ఎందుకు.? అని ఆయన అన్నారు. రీ షెడ్యూల్ అయిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని అంటున్నారని, చాలా బ్యాంకులు లోన్ రికవరీ అయ్యి మళ్ళీ కొత్తగా లోన్ ఇచ్చినట్టు బ్యాంకర్లు రైతు పుస్తకాల్లో రాసుకుంటారన్నారు. వాటి కి వర్తించదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకర్లు చేసిన తప్పిదాలకు రైతు బలి అవుతారని, ఎందుకీ కండిషన్ ? అని ఆయన ప్రశ్నించారు.

విద్యార్థి స్కూల్ బ్యాగ్‌లో విషపూరిత పాము.. వీడియో వైరల్

సాధారణంగా వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ పాములు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. తాజాగా స్కూల్‌ బ్యాగ్‌లో నుంచి బయటపడ్డ ఓ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్‌లోని సబర్‌కాంతలో వెలుగు చూసింది. ఓ విద్యార్థి స్కూల్‌ బ్యాగ్‌లో నుంచి పాము బయటపడింది. స్కూల్ బ్యాగ్ నుంచి పెద్ద పాము బయటకు వచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంది.

ఓ విద్యార్థి తన నోట్‌బుక్‌ల కోసం బ్యాగ్‌ తీస్తుండగా.. అతనికి పాము కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన ఆ విద్యార్థి తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పాడు. వారు బ్యాగ్‌ను బయటకు తీసుకెళ్లి ఒక కర్రను ఉపయోగించి.. బ్యాగ్‌లోని వస్తువులను జాగ్రత్తగా బయట పడేయగా.. బుసలు కొడుతూ నల్లతాచు బయటకు వచ్చింది. ఒక్కసారిగా పాము కనిపించడంతో అక్కడి వారు భయాందోళనకు గురయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను ఒక కుటుంబ సభ్యుడు వారి ఫోన్‌లో రికార్డ్ చేశారు. బ్యాగ్‌ నుంచి బయటపడిన పాము అక్కడి నుంచి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

పంచాయతీరాజ్ శాఖపై ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో… రిజర్వేషన్లపై ఒక అవగాహన కోసం సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రెజర్వేషన్ల పెంపుపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. పంచాయ‌తీల ఎన్నిక‌ల‌కు సంబంధించి బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపై స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్ల అమ‌లు, రాబోయే ఎన్నిక‌ల్లో వాటి పెంపున‌కు సంబంధించిన అంశాల‌ను వెల్ల‌డించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. గ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల అనుస‌రించిన విధానం, రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న తీరును అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. ఇప్ప‌టికే కుల గ‌ణ‌నకు ఆమోదం తెలిపినందున‌, దాని ఆధారంగా పంచాయ‌తీ ఎన్నికల‌కు వెళితే ఎలా ఉంటుంద‌ని, అందుకు ఎంత స‌మ‌యం తీసుకుంటార‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ప్ర‌శ్నించారు.

జనసేనలో చేరికపై బాలినేని క్లారిటీ..!

వైసీపీ సీనియర్‌ నేత బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి జనసేనలోకి వెళ్తారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను జనసేనలోకి వెళ్తున్నానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని బాలినేని స్పష్టం చేశారు. అదంతా ఒట్టి ఊహాగానాలేనని తేల్చేశారు. అలాగే తాను ఒంగోలులో లేనంటూ ప్రచారం జరుగుతోందన్న బాలినేని.. తాను ఎక్కడికి వెళ్లలేదని, ఒంగోలులోనే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడితే ప్రజల తరుఫున పోరాటం చేస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిపైనా ఆయన కామెంట్స్ చేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తారనే వార్తలపైన బాలినేని స్పందించారు. ప్రకాశం జిల్లా వైసీపీలో నాయకులకు కొదువ లేదన్న బాలినేని.. జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వాలనుకుంటే స్థానిక నేతలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఒక మాట

ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట అని ఆయన విమర్శించారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందని, డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతున్నదన్నారు. ఆహార భద్రత కార్డు, పిఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని, ఎన్నికలప్పుడు మభ్య పెట్టారన్నారు హరీష్‌ రావు. అధికారం చేజిక్కినాంక ఆంక్షలు పెట్టారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా..

తమకు తెలియకుండా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) అమలు చేస్తూ గెజిట్ విడుదల చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జీపీఎస్ విధానంపై గత ప్రభుత్వ నిర్ణయాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే రీతిలో గెజిట్ విడుదలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజిట్ ఎలా వచ్చింది అనే అంశంపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెంటనే జీపీఎస్ జీవోను.. గెజిట్‌ను తాత్కాలికంగా నిలిపేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. జీపీఎస్‌ గెజిట్‌ జారీపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడెందుకు విడుదల చేశారో విచారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

బీఆర్‌ఎస్‌కు డబుల్‌ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మహిపాల్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్‌

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి మరో షాక్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యే జి. మహిపాల్ రెడ్డి సోమవారం అధికార కాంగ్రెస్‌లో చేరారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మంత్రులు దామోదర రాజనరసింహ, పి.శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌కు మారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమైన కాంగ్రెస్‌ మాజీ నేత గాలి అనిల్‌కుమార్‌ కూడా తిరిగి పార్టీలోకి వచ్చారు.

2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10వ BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. నాలుగు రోజుల్లో కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన మూడో ఎమ్మెల్యే.