కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఓట్లు అడగాలి….
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా వేములవాడ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశలంఓ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజి రెడ్డి మాట్లాడుతూ.. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 12 లక్షల 75 వేల పన్ను మినహాయింపు ఇచ్చింది..చాలా మందికి వేసులు బాటు లభించింది…60 ఏళ్ల నుండి కానిది మోడీ కి దక్కింది..ఒక్క ఉద్యోగికి లక్ష రూపాయలు లాభం ఉందన్నారు.
మే లో కడపలో టీడీపీ మహానాడు జరుగుతుంది.
హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబర్ లో కూడా టీడీపీ సభ్యత్వాలు జరగనున్నాయన్నారు. మే లో కడపలో టీడీపీ మహానాడు జరుగుతుందని ఆయన తెలిపారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వాలు పూర్తి కావడం సంతోషకరమని ఆయన తెలిపారు. ఢిల్లీలోను లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో చర్చలు సాగిస్తూ రాష్ట్ర వృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మార్గదర్శి సంస్థకు సంబంధించి మిథున్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కాదని, మార్గదర్శిపై ఆయన పార్లమెంట్ లోపల, బయట తప్పు ప్రచారం చేశారన్నారు. 1995లో నా తొలి వేతనం 50వేలతో చిట్టి కట్టానని, 1996 లో చిట్టి పాడి వ్యవసాయ భూమి కొనుగోలు చేసామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికి మార్గదర్శి చిట్స్ కొనసాగిస్తున్నామని, 2006 లో ఇలాగే మార్గదర్శి పై అధికార బలంతో తప్పుడు ప్రచారం చేశారన్నారు.
బడ్జెట్ కూర్పుపై ప్రభుత్వం కసరత్తు.. సీఎం సమీక్ష
రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్.. 2024-25 సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో 5 నెలల కాలానికి గాను నవంబర్‌లో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కాగా.. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 28న సభ ముందుకు బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏపీ బడ్జెట్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.
మాకు రాజకీయాలు అంట కట్టొద్దు.. ఆ అకౌంట్లు మావి కాదు!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బుల్లి రాజు అలియాస్ రేవంత్ భీమాల.. చేసిన మొదటి సినిమాతోనే పవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అయితే రేవంత్ పేరు మీద సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ అకౌంట్ లు క్రియేట్ చేశారని రేవంత్ తండ్రి ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. మా అబ్బాయి చి. రేవంత్ నటించిన పాత్రను ఇటీవల విడుదల అయ్యి ఘన విజయం సాధించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ద్వారా ఆదరించి, ఆశీస్సులు అందచేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
మరోసారి కులగణన సర్వే.. ఎప్పుడంటే..?
రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే సహేతుకంగా, స్పష్టంగా చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే పై అసెంబ్లీలో లెక్కలతో సహా సీఎం సభ దృష్టికి తెచ్చారని, అసెంబ్లీలో చర్చ సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సలహాలు సూచనలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే సహేతుకంగా, స్పష్టంగా చేశామని ఆయన పేర్కొన్నారు. 3.1శాతం మంది మాత్రమే ఇంటి యజమానులు సర్వేలో పాల్గొనలేదన్నారు. కొద్దిమంది ఇంటికి తాళాలు వేసి వెళ్లారని ఆయన తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా సర్వేకు రాలేదని, సర్వేలో పాల్గొని వారి కోసం మరోసారి కుటుంబ సర్వేకు ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. టోల్ ఫ్రీ ద్వారా కూడా సమాచారాన్ని ఇస్తే ఎన్యుమరేటర్లు వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారని భట్టి విక్రమార్క తెలిపారు. మండల కేంద్రాల్లో రాష్ట్ర జనాభా లెక్కల్లోకి రావాలని అందర్ని కోరుతున్నామన్నారు.
1800 కాల్స్..సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశా!
తాను ఒక నటుడిగా సినిమా ఫంక్షన్ వేదిక పై మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేశాయని నటుడు 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ అన్నారు. 11 అనే నెంబర్ ని చూస్తే చాలు వైసీపీ వాళ్లు గడగడ వణికి పోతున్నారు. నేను ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడలేదన్న ఆయన అక్కడికి వచ్చిన ప్రేక్షకులను నవ్వించడానికే అలా మాట్లాడానని అన్నారు. కానీ అది వైసీపీకి అన్వయిస్తూ ప్రచారం చేసుకున్నారని అన్నారు. గత రెండు రోజులుగా తనను సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని, నా ఫోన్ నెంబర్ వైసీపీ సోషల్ మీడియా గ్రూప్ లో పెట్టి సుమారు 1800 కాల్స్ చేయించారని అన్నారు.
42 శాతం ఇస్తే బీసీలకు న్యాయం జరగదు
పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం కాదు, చట్ట ప్రకారం పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బిసి యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన 14 బిసి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ…. పంచాయతీరాజ్ ఎన్నికలలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం కోటా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పార్టీ పరంగా 42 శాతం ఇస్తే బీసీలకు న్యాయం జరగదని అన్నారు. ఇతర పార్టీల వారు కూడా అంగీకరిస్తే అప్పుడు న్యాయం జరుగుతుందన్నారు. లేకపోతే అగ్రకులాలకు ఇస్తే డబ్బుతో పోటీ పడలేరని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 శాతంకు పెంచుతూ బిల్లు పెట్టి చట్టం చేయాలన్నారు. అప్పుడు అన్ని పార్టీలు కూడా బిసిలకు ఇస్తాయని, తద్వారా తప్పని సరిగ్గా బీసీలు గెలుస్తారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 18న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు.
లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు..
వ్యాపారం చేయాలన్నా.. వ్యవసాయం చేయాలన్నా, పిల్లల స్కూల్ ఫీజుల కోసమని ఇంట్లో డబ్బులు లేకపోయినా.. బంధువులను కానీ, తెలిసిన వాళ్లను కానీ సంప్రదించి డబ్బులు తయారు చేసుకుంటాం. డబ్బులు సరైన సమయానికి కట్టకపోతే ఒక కాగితం పెట్టుకుంటారు. చెల్లించాల్సిన సమయానికి డబ్బులు కట్టి రుణం తీర్చుకుంటారు. ఒకవేళ బ్యాంకులు లోన్ తీసుకుని కట్టకుంటే ఎక్కువ ఫైన్ పడుతుంది.
కుంభమేళా తొక్కిసలాట మృతుల సంఖ్యను యోగీ సర్కార్ చెప్పడం లేదు..
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియాతో బుధవారం మాట్లాడారు. ‘‘మహా కుంభమేళాలో చాలా మంది మరణించారు. కానీ సరైన సంఖ్యని చెప్పడం లేదు. వారు కుంభమేళాకి హైప్ పెంచారు. అందుకు తగ్గట్లుగా సౌకర్యాలు చేయలేదు. పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు. కానీ వేదికల వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదు’’ అని ఆరోపించారు.
గత నెలలో అమృత స్నానం సమయంలో భారీ ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంట్లో 30 మంది భక్తులు మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ దీనిపై విచారణకు జ్యుడిషియల్ కమిటీని నియమించింది. మరోవైపు రాష్ట్ర పోలీసులు కుట్ర కోణం ఏదైనా ఉందా..? అని విచారణ జరుపుతున్నారు.
రాహుల్ గాంధీకి ఒక న్యాయం, అమిత్ షా, మోహన్ భగవత్‌లకు మరో న్యాయమా?
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వి.హెచ్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార దుర్వినియోగంతో పాటు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయిస్తూ, అధికార పార్టీకి చెందిన నేతలపై చేసిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీహెచ్ మాట్లాడుతూ, 2022 డిసెంబర్ 16న రాహుల్ గాంధీపై దేశ రక్షణకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యల కేసు నమోదు చేసి, మార్చి 24న లక్నో కోర్టుకు హాజరుకావాలని సమన్లు పంపారని గుర్తుచేశారు. అదే సమయంలో, తాను స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని అవమానించారని, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ స్వతంత్ర్యాన్ని అవమానించారని ఫిర్యాదు చేసినా, వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.