NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

వైద్యుడిని భయపెట్టి రూ.2 కోట్లను దోచుకున్న సైబర్ నేరగాళ్లు

సైబర్‌ నేరగాళ్ల వలలో ఎక్కువగా చదువుకున్నవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారే పడుతున్నారు. కష్టపడి కొందరు, వడ్డీలకు డబ్బులిచ్చి మరికొందరు..రోజంతా ఆఫీసులో కూర్చొని.. ఇలా అందరూ ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పక్కనోళ్ల సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నవారే ఎక్కువ.. ఇళ్ల మీద పడి డబ్బులు, నగలు దోచుకెళ్లడం ఓల్డ స్టైల్ అయిపోయింది. దర్జాగా సిస్టమ్​ ముందు కూర్చుని లూటీ చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు సైబరాసురులు. తాజాగా రాయచోటిలో ఓ ప్రైవేట్ డాక్టర్ సైబర్ నేరగాళ్లు ఉచ్చులో ఇరుక్కున్నాడు.

గత కొంత కాలంగా డాక్టర్‌ను ఆన్‌లైన్‌ ద్వారా బెదిరించి రూ.2 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. రాయచోటి పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన ఓ ప్రైవేట్ చిన్నపిల్లల డాక్టర్‌కు ఫోన్ ద్వారా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు బెదిరించారు. “నీకు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయి.. నీ హాస్పిటల్‌లో డ్రగ్స్ వాడుతున్నావ్.. నిన్ను, నీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయబోతున్నాం… మా దగ్గర అరెస్టు వారెంట్ ఉంది” అంటూ పోలీస్ యూనిఫాంలో వీడియో కాల్ చేసి డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు బెదిరించారు. కేసు నుంచి నిన్ను తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

మంత్రి వ్యాఖ్యల వల్ల మా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోయింది

నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. నాగార్జున పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. అంతకు ముందు నాగార్జున మేనకోడలు సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్ట్.. మొదటి సాక్షిగా సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్ట్, పిటిషన్ దారుడిగా నాగార్జున స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నది. ఆ తరువాత స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం నాగార్జున సంతకం కూడా తీసుకుంది స్పెషల్ కోర్ట్. అక్టోబర్ 10న రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ రికార్డు చేస్తామని తెలిపిన కోర్టు, నాగార్జున పిటిషన్ పై విచారణ 10వ తేదీకి వాయిదా వేసింది. ఇక సుప్రియ స్టేట్మెంట్ లోని అంశాలు పరిశీలిస్తే మంత్రి చేసిన వాఖ్యలు వల్ల నాకు చాలా మంది నుండి ఫోన్ కాల్స్ వచ్చాయని ఆమె పేర్కొంది. మంత్రి చేసిన వ్యాఖ్యలను జడ్జి ముందు చదివి వినిపించిన సుప్రియ,మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల మా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోయిందని పేర్కొంది. వైజాగ్ నుండి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత వెళ్లి నాగార్జునను కలిశానని ఆమె పెక్రోన్నారు. మంత్రి వ్యాఖ్యలపై కుటుంబమంతా కలిసి చర్చించామని, మంత్రి చేసిన వ్యాఖ్యలను సినిమా పరిశ్రమ మొత్తం ఖండించిందని ఆమె అన్నారు. రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమ టార్గెట్ గా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆమె అభిప్రాయపడ్డారు.

సద్దుల బతుకమ్మ వేడుకలపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

ఈనెల 10న ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై దాదాపు పదివేల మంది మహిళలచే ఈనెల 10 వతేదీన సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేశారు. 10వ తేదీన నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల పై నేడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగాగల అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు.

కొండా సురేఖ పై నాగార్జున పిటిషన్ నిలబడదు!

మంత్రి కొండా సురేఖ మీద నాగార్జున పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు నాంపల్లి కోర్టు ముందు హాజరైన నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ తమ స్టేట్మెంట్స్ కోర్టులో నమోదు చేశారు. ఈ క్రమంలో నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ మొదటి సాక్షిగా సుప్రియ వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారని అన్నారు. ఈ నెల 10 వ తేది నా మరో సాక్షి వాంగ్మూలం రికార్డ్ చేస్తారని, ఈ నెల 10 తేదీన కొండా సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అన్నారు. కొండా సురేఖ మీద క్రిమినల్ పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని నాగార్జున వాంగ్మూలం ఇచ్చారని, మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వీడియోలను కోర్ట్ కు సమర్పించామని అన్నారు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా పరువుకు భంగం కలిగించాయి కాబట్టే క్రిమినల్ పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్ ను దాఖలు చేశామని అన్నారు.

పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు.. పవన్‌పై రోజా ట్వీట్

పిఠాపురంలో మైనర్‌ బాలికకు మద్యం తాగించి బలాత్కారం చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. దీనిపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళలకు భద్రత లేదా అంటూ ప్రశ్నింస్తోంది. ఇదే విషయమై వైసీపీ అధికార ప్రతినిధి రోజా కూడా పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉపముఖ్యమంత్రి ఇలాకాలోనే మైనర్ బాలికపై దారుణం జరిగితే చర్యలేవంటూ ప్రశ్నించారు. ఈ మేరకు మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా పవన్‌కు ట్వీట్ చేశారు.

ఈనెల 11న ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తాం

ఇందిరమ్మ ప్రభుత్వం చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. 11వ తేదిన ఇంటిగ్రేడెడ్ పాఠశాలలకు శంఖుస్థాపన చేయనున్నామన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉంటుందని, ఎక్స్ట్రా కల్చరల్ ఆక్టివిటీస్, స్కూల్ లోనే థియేటర్ ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నార భట్టి విక్రమార్క. తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం కానున్నాయని, గత ప్రభుత్వం నెల వారీగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. ఉద్యోగ వ్యవస్థ దెబ్బ తిన్నదని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని ఆయన వెల్లడించారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలపై కూడా పెండింగ్ లేకుండా చూస్తామన్నారు. గతంలో నాసిరకం భోజనం పెట్టారని, స్కూల్స్ డైట్ బిల్స్ అన్నింటినీ రిలీజ్ చేశామని ఆయన తెలిపారు. ప్రతి నెల ఇక నుంచి రిలీజ్ చేస్తామన్నారు. గురుకులాలు ఎప్పుడు వచ్చాయా అందరికీ తెలుసు అని, ఇంకా మంచిగా వుంటే అభ్యంతరమా.. సలహాలునివ్వండన్నారు.

జమ్మూకాశ్మీర్‌ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి ముందుకెళ్తాం

జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, గతంలో కంటే ఎక్కువ సీట్లు మరియు ఓట్లు పొందామన్నారు. జమ్మూ ప్రజలు మాతో ఉన్నారని మరోసారి నిరూపితమైందని, కాంగ్రెస్ ముక్త జమ్మూకాశ్మీర్ సాధనలో మేం విజయం సాధించామని కిషన్‌ రెడ్డి అన్నారు. కేంద్ర పార్టీ నాయకత్వ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో అన్ని స్థాయిల్లో కష్టపడి పనిచేశారన్నారు కిషన్‌ రెడ్డి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గతంలో ఎప్పుడు కూడా సంపాదించనన్ని ఎక్కువ సీట్లలో బీజేపీ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించిందని, ఇకపై జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి మరింత కష్టపడి పనిచేస్తామన్నారు.

సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి.. హర్యానాలో బీజేపీ విజయంపై మోడీ

ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పని నిరూపిస్తూ హర్యానా అసెంబ్లీలో బీజేపీ మెజారిటీతో గెలుపొందింది. దీంతో భారతీయ జనతా పార్టీలో పండగ వాతావరణం నెలకొంది. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ క్రమంలో.. హర్యానా ప్రజలకు, కార్మికులకు ప్రధాని అభినందనలు తెలిపారు. మోడీ హర్యానాకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘భారతీయ జనతా పార్టీకి మరోసారి స్పష్టమైన మెజారిటీని అందించినందుకు హర్యానా ప్రజలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇది అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల విజయం. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఏ రాయిని వదిలిపెట్టబోమని నేను వారికి హామీ ఇస్తున్నాను’.అని తెలిపారు.

చెరువుల‌ను గుర్తించేందుకు హైడ్రా భారీ క‌స‌ర‌త్తు

గొలుసుక‌ట్టు చెరువుల‌కు ప్రసిద్ధి చెందిన న‌గ‌రంలో అస్సలు ఎన్ని చెరువులుండేవి.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్కతేల్చేందుకు స‌ర్వే ఆఫ్ ఇండియాతో క‌లిసి హైడ్రా ప‌ని చేస్తోంది. హ‌బ్సిగూడలో ఉన్న స‌ర్వే ఆఫ్ ఇండియా కార్యాల‌యానికి మంగ‌ళ‌వారం త‌న అధికారుల బృందంతో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ వెళ్లారు. స‌ర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ ప‌రీడా, సూప‌రింటెండెంట్ ఆఫ్ స‌ర్వే డేబ‌బ్రత పాలిట్‌తో పాటు ఇత‌ర అధికారుల‌తో హైడ్రా ఉన్నతాధికారుల‌ స‌మావేశమయ్యారు. ఈ సందర్భంగా స‌ర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన పాత మ్యాప్‌లను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ప‌రిశీలించారు. 1971 – 72 స‌ర్వే ప్రకారం న‌గ‌రంలో ఎన్ని చెరువులున్నాయి.. ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి.. ప్రస్తుతం వాటి ప‌రిస్థతి ఏంటి. నాలాలు ఎలా.. ఎంత విస్తీర్ణంలో ఉండేవి.. ఇప్పుడు ఎంత మేర క‌బ్జా అయ్యాయని మ్యాప్‌లను ప‌రిశీలించారు ఏవీ రంగనాథ్‌. ద‌శాబ్దాల క్రితం నాటి మ్యాప్‌ల‌తో పాటు.. నేటి ప‌రిస్థితిని స‌రిపోల్చుతూ చెరువులు, నాలాల వివ‌రాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్రద‌ర్శన ద్వారా స‌ర్వే ఆఫ్ ఇండియా అధికారులు వివ‌రించారు.