సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ 3’ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.సల్మాన్ ఖాన్ గత కొంతకాలంగా వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన రాధే, అంతిమ్, కిసీ కా బాయ్ మరియు కిసీ కా జాన్.. వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడ్డాయి. గత ఏడాది సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన ‘పఠాన్’ మాత్రం భారీ సక్సెస్ అందుకుంది.వరుస ప్లాప్స్ తర్వాత ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘టైగర్ 3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సల్మాన్ ఖాన్. టైగర్ మూవీ సిరీస్ లో భాగంగా వచ్చిన మూడో సినిమా ఇది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.
రెడ్లు అంటే త్యాగానికి దానానికి వీరత్వానికి మారు పేరు..
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటానని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. జగన్ నకిలీ రెడ్డి కాబట్టే ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నాడని మండిపడ్డారు. కర్నూలు జిల్లాకు చెందిన జి.పుల్లారెడ్డి రామజన్మ భూమి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. రెడ్లు అంటే త్యాగానికి దానానికి వీరత్వానికి మారు పేరని బైరెడ్డి పేర్కొన్నారు. రెడ్డి తోక పెట్టుకొని కొందరు నకిలీ రెడ్లుగా చలామణి అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మోడీ శ్రీకారం.. జనవరి 13 నుంచి ప్రారంభం..
లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. దీంతో బీజేపీ ఎన్నికల మోడ్‌లోకి వెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని నరేంద్రమోడీ శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 13 నుంచి బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీహార్ లోని బెట్టియా నగరంలోని రామన్ మైదాన్‌లో ఆయన బహిరంగ సభకు హాజరుకాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలోనే ప్రధాని బీహార్ లోని రోడ్లు, వంతెనలతో సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు.
ఏపీలో ఎన్నికల సందడి.. రేపటి నుంచి రాష్ట్రంలో సీఈసీ పర్యటన
ఏపీలో రేపటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఈ క్రమంలో.. రేపు ఎన్నికల అధికారుల బృందం విజయవాడ చేరుకోనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఈ నెల 9వ తేదీన వివిధ రాజకీయ పార్టీలతో భేటీ కానున్నారు.
వైసీపీని వీడటంపై క్రికెటర్ అంబటి వివరణ
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక ప్రకటన చేశాడు. త్వరలో దుబాయ్ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఆడనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండకూడదన్న నిబంధన ఉందని వివరణ ఇచ్చాడు. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ఐఎల్ టీ20లో ముంబై ఎమిరేట్స్ కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపాడు. గతంలోనూ ఐసీఎల్ లోనూ ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు.
ఆంబోతులంటూ మాపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదు..
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు బ్రోకర్ రాజకీయాలు చేసి ఎదిగారని విమర్శించారు. రా..కదలి రా.. అంటే రావడం లేదు. ఆంబోతులంటూ తమపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని మంత్రి అంబటి అన్నారు. చంద్రబాబు స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నాడు.. తాను అలాగే మాట్లాడగలనని తెలిపారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమని పేర్కొన్నారు.
బీసీని దేశ ప్రధానిని చేయడం బీజేపీతోనే సాధ్యపడింది..
విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా.. బీసీ కమిషన్ కు ఎందుకు చట్టబద్ధత కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నిస్తోందని తెలిపారు. నా బీసీ కులాలు అనే నైతికత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నామన్నారు. బీసీల సంక్షేమానికి అంకితమైన వారిని గుర్తించాలని పురంధేశ్వరీ కోరారు.
బంగ్లాదేశ్‌లో ముగిసిన పోలింగ్, కౌంటింగ్ ప్రారంభం.. షేక్ హసీనా విజయం లాంఛనమే..
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రతిపక్షాల ఎన్నికల బహిష్కరణ నడుము 40 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. ప్రధాన మంత్రి షేక్ హసీనా వరసగా నాలుగోసారి అధికారంలోకి రావడం దాదాపుగా ఖాయమైంది. ప్రధాన ప్రతిపక్షమై బీఎన్పీ దాని మిత్రపక్షాలు పోలీటో పాల్గొనలేదు. ఆదివారం జరిగిన ఓటింగ్‌లో ఓటేసేందుకు చాలా తక్కువ మంది వచ్చారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం మోదీ ఆలోచిస్తుంటారు..
విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జనాభాలో 70శాతం బీసీలు ఉన్నారని తెలిపారు. ఇక్కడ చైతన్యం కొరవడిందని గుర్తించి బీసీలను కదిలించి న్యాయం చేసేందుకు బీజేపీ ముందుకు వచ్చిందని అన్నారు. ఏపీలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను బానిసలుగా, నోరు లేని జీవులుగా మార్చేశారని మండిపడ్డారు. 50శాతం బీసీ జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం కోసం కదలిరావాలి అని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హక్కుల సాధనకు ఎన్నికలను ఆయుధంగా మలుచుకోవాలని ఆయన తెలిపారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలి
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారిని మన రాష్ట్రం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని కోరినమని, సోనియా గాంధీ పోటీ చేసే పార్లమెంటు స్థానం నుంచి తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీలు పోటీ చేయవద్దన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలని, బీఆర్ఎస్ పార్టీకి కాలేశ్వరం ఏటీఎం లాగా మారిందని ప్రధానమంత్రి మోడీ హోం మంత్రి అమిత్ షా లు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కాలేశ్వరం నిర్మాణంలో దోపిడీ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం ప్రకారమే మోడీ, అమిత్ షా లు మాట్లాడి ఉండవచ్చని, కేంద్రంలో ఉన్న బిజెపి దగ్గర కాలేశ్వరం దోపిడి గురించి పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ కుమ్మక్కయ్యారు కాబట్టే కాలేశ్వరంపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని, రాష్ట్ర బీజేపీ నాయకులు బాధ్యత లేనట్టుగా నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షల నగదు జమ, నోట్ల రద్దు సమయంలో బయటికి తీస్తానన్న నల్లధనం గురించి బిజెపి నాయకులు సమాధానం చెప్పాలన్నారు.
