Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

పూణేలో ‘‘జికా వైరస్’’ కలకలం.. 9కి చేరిన కేసుల సంఖ్య..

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా పూణే నగరంలో ఈ కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ముగ్గురు గర్భిణిలకు ఈ వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 09కి చేరుకుంది. ఈ విషయాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధికారు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పూణే మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆరు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ఏడెస్ దోమ కాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇదే దోమ కారణంగా డెంగ్యూ, చికెన్ గున్యా ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. 1947లో తొలిసారిగా ఉగాండాలో జికా వైరస్‌ని గుర్తించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో జికా వైరస్ పిండం ఎదుగుదల, మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది.

రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై ట్వీట్స్ వార్..

కాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంతో పాటు పలు ఇతర అంశాలపైనా ఇద్దరు సీఎంలు దృష్టి సారిస్తారు. ఇద్దరూ సీఎంలు అయ్యాక తొలిసారి భేటీ కానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఈ భేటీపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. అంతే కాదు పారదర్శకతకోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేయాలన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని బొత్స సత్యనారాయణ ట్విట్టర్ లో కోరారు.

దారుణం.. బాలుడిని కొట్టి చంపిన సవతి తండ్రి

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అమాయక బాలుడిని ఓ మృగాడు పొట్టన పెట్టుకున్నాడు. తాగిన మైకంలో ఏమీ ఏర్పడక కడతేర్చారు. బాలుడిని దారుణంగా నేలకేసి కొట్టి చంపాడు సవతి తండ్రి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు రూరల్ దిగువ మాసపల్లికు చెందిన శిరీష అనే వివాహితకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే.. గత కొన్నేళ్లుగా ఆమె తన భర్తతో విభేదాలతో దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో.. ప్రదీప్ అనే వ్యక్తితో శిరీష సహజీవనం సాగిస్తుంది. అయితే.. ఇంటికి తాగొచ్చిన ప్రదీప్ ఆ మైకంలో శిరీష ఏడాదిన్నర కొడుకు దినేష్ ను నేలకేసి కొట్టి చంపాడు. కాగా.. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ హర్షణీయం..

ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ హర్షణీయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి ఆస్తులు, అప్పులు పంపకాలకు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు నేరుగా భేటీ కావడం వలన అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. రాష్ట్ర విభజన ఆస్తులు, అప్పులు పంపకాలకు సంబంధించి కేంద్రం ఇంతకుముందే కమిటీ వేసిందని.. కమిటీలు చర్చించే కంటే ముఖ్యమంత్రులు భేటీ కావడం పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని పురందేశ్వరి తెలిపారు.

కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి

కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పాంచ్ న్యాయ పేరుతో చెప్పింది ఎంటి… ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని, 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారు… వారితో రాజీనామా చేయిస్తే ఆ 26 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందన్నారు బండి సంజయ్‌. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ అన్నారు. రెండు రాష్ట్రాలకు మంచి జరగాలని, కొందరు గోతి కాడి నక్కల్ల ఎదురు చూస్తున్నారు .. వారికి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని. .. ఇద్దరు సీఎం లకు విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. దూకుడు ఆగదు. పదునైన రాజకీయ విమర్శలు యధావిధిగా చేస్తామన్నారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టారు.. కానీ అమలు చేయడం లేదన్నారు. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో డెవలప్మెంట్ ప్రొసీడింగ్స్ ఇప్పిస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మేము అలా చేస్తే పరిస్థితి ఎంటి ? అని ఆయన ప్రశ్నించారు.

త్రిపురలో ఎయిడ్స్‌తో 47 మంది విద్యార్థుల మృతి.. కారణమిదే!

త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంచలన రిపోర్ట్ బయటపెట్టింది. హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌తో 47 మంది విద్యార్థులు మరణించారని.. మరో 828 మంది విద్యార్థుల్లో పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది. 220 పాఠశాలలు, 24 కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి ఇంజెక్షన్ డ్రగ్స్ తీసుకునే విద్యార్థులను గుర్తించినట్లుగా త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్‌ఎసీఎస్) సీనియర్ అధికారి భట్టాచార్జీ తెలిపారు. ఇక ప్రతి రోజూ ఐదు నుంచి ఏడు కొత్త కేసులు నమోదవుతున్నాయని అధికారి పేర్కొన్నారు. త్రిపుర జర్నలిస్ట్ యూనియన్, వెబ్ మీడియా ఫోరమ్, TSACS సంయుక్తంగా నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌లో అధికారి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ గణాంకాలను వెల్లడించారు. ఇప్పటి వరకు 220 పాఠశాలలు, 24 కళాశాలలు, యూనివర్సిటీల్లో విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలుగా ఉన్నట్లు గుర్తించామని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 164 ఆరోగ్య కేంద్రాల నుంచి డేటాను సేకరించినట్లు తెలిపారు

జులై 10న ఏడు రాష్ట్రాల్లో పదమూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జులై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. మరి కొందరి ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాలు ఇలా ఉన్నాయి.. బీహార్‌- 1, పశ్చిమ బెంగాల్‌- 4, తమిళనాడు- 1, మధ్యప్రదేశ్‌- 1, ఉత్తరాఖండ్‌- 2, పంజాబ్‌- 1, హిమాచల్‌- 3 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జూన్ 14న విడుదలైంది. నామినేషన్‌కు చివరి తేదీ జూన్ 21తో ముగిసింది. జూన్ 24న పరిశీలన కూడా జరిగింది. జూన్ 26న నామినేషన్ల ఉప సంహరణ పూర్తయింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో జులై 10న ఓటింగ్ జరగనుంది. వాటి ఫలితాలు ఈనెల13న వెల్లడిస్తారు.

నిన్న పుట్టిన రోజు.. నేడు గుండెపోటుతో బాలుడు మృతి

రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న పదహారేళ్ల విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మరణించిన విద్యార్థి యతేంద్ర ఉపాధ్యాయగా గుర్తించారు. అయితే.. నిన్ననే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా, ఈరోజు గుండెపోటుతో మరణించాడు. బండికుయ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో తరగతి గది లోపలికి వస్తుండగా ఒక్కసారిగా పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. అందులో విద్యార్థి వరండాలో పడిపోతున్నట్లు కనిపించింది. ఆ తరువాత.. సమీపంలో కూర్చున్న పాఠశాల ఉద్యోగి అతని వైపు పరిగెత్తుకొచ్చాడు.. విద్యార్థిని లేపడానికి ప్రయత్నించాడు. ఎటువంటి కదలిక లేకపోవడంతో పాఠశాల నిర్వాహకులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు.

ముగిసిన సీఎంల భేటీ.. విభజన సమస్యలపై కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎం భేటీ ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశం 7.45 నిమిషాలకు ముగిసింది. సమావేశం 1.45 నిమిషాల పాటు సాగింది. అయితే.. ముందుగా ఒకరినొకరు ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా శాలువాలతో సత్కరించుకున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు’కాళోజీ-నాగొడవ’ పుస్తకాన్ని బహుకరించారు రేవంత్‌ రెడ్డి.

 

Exit mobile version