Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే నాయకులను నమ్మకండి

నాయకులు మధ్య ఉన్న అంతర్గత విభేదాలను విడిచిపెట్టండని, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే నాయకులను నమ్మకండని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, గ్యారంటీలు ఉత్తుత్తి హామీలే అని ఆయన అన్నారు. గతంలో తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారు ఇప్పుడు హామీలతో మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నమ్మకండని, గత తొమ్మిదేళ్లకు ముందు ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించిన నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. అప్పుల పాలైన రైతులను ఆదుకున్న ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని, రెండు విడతలలో 35 వేల కోట్లు రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలు కులం, మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ ఏడాది చివరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటన సంతరించుకుంది. ఈ సందర్భంగా గ్వాలియర్ చేరుకున్న ప్రధాని.. రాష్ట్రానికి సంబంధించి రూ.19,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి వ్యతిరేకులకు దేశం ఆరు దశాబ్దాలు సమయం ఇచ్చింది. అప్పుడు ఏం అభివృద్ధి చేశారని మండిపడ్డారు. అభివృద్ధిని పక్కన పెట్టి, పేదవాళ్ళ భావోద్వేగాలతో ఆడుకునేవారని విమర్శించారు. అప్పుడు కులం పేరుతో సమాజాన్ని చీల్చేవారని.. నేడు కూడా అదే పాపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు అవినీతిలో కూరుకుపోయారని.. నేడు కూడా తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం బీహార్ ప్రభుత్వం కులంపై సర్వే నివేదికను విడుదల చేసిన తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

వందేభారత్ రైలుని పట్టాలు తప్పించే కుట్ర.. ట్రాకుపై రాళ్లు, ఇనుపకడ్డీలు…

భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సెమీ హైస్పీడ్ రైళ్లు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను తీసుకువచ్చింది. ఇప్పటికే 60 పైగా వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య తిరుగుతున్నాయి. రానున్న కాలంలో వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా ట్రాక్ ఎక్కనున్నాయి. ఇదిలా ఉంటే కొందరు మాత్రం ఈ రైళ్లు టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. రైళ్లపై రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా నమోదయ్యాయి.

హోంవర్క్‌ చేయలేదని విద్యార్థిని కొట్టిన టీచర్‌.. చికిత్స పొందుతూ మృతి !

హైదరాబాద్‌లోని రామంతపూర్‌ వివేకనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలోని రామంతపూర్ వివేక్ నగర్‌లో కృష్ణవేణి టాలెంట్ స్కూలులో యూకేజీ చదువుతున్న విద్యార్థి హేమంత్ మృతి చెందాడు. శనివారం రోజున స్కూల్ హోమ్ వర్క్ చేయలేదని తలపై పలకతో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడని హేమంత్ తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాలుడు ఇవాళ ప్రాణాలు కోల్పోయినట్లు వారు చెప్పారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, బంధువులు స్కూల్‌ ముందు విద్యార్థి మృతదేహంతో ధర్నా చేపట్టారు. అనంతరం మృతదేహన్ని అంత్యక్రియలు కోసం వనపర్తికి తరలించారు. గతం వారం రోజుల నుంచి హేమంత్ జ్వరంతో ఇబ్బంది పడ్డాడని ఉప్పల్ పోలీసులు తెలిపారు. అయితే హేమంత్ జ్వరంతో మృతి చెందాడనే కోణంలో ఉప్పల్ పోలీసులు విచారిస్తున్నారు.

అమూల్ బేబీ కేటీఆర్ నీకు రాజకీయ పరిజ్ఞానం ఉందా..?

నిన్న పెద్దపల్లి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటనలో భాగంగా కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమూల్ బేబీ కేటీఆర్ నీకు రాజకీయ పరిజ్ఞానం ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ అని, కేటీఆర్.. నువ్వు పెద్దపల్లికి వస్తే భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను,కార్యకర్తలను అరెస్ట్ చేపించావన్నారు విజయరమణ రావు. నీ బీఆర్ఎస్ పార్టీలోకి నేను వస్తా అనే సొల్లు కబుర్లు చెప్పి నా మీద తప్పుడు ఆరోపణలు మోపుతావా కేటీఆర్.. దమ్ముంటే నిరూపించూ అని, తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం… రాసిపెట్టుకో కేటీఆర్ అని విజయరమణ రావు వ్యాఖ్యానించారు.

బీహార్‌లో కులగణన సర్వే నివేదిక విడుదల.. ఓబీసీ, ఈబీసీలు 63%

బీహార్‌లో కులగణన సర్వే నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు (OBCs), అత్యంత వెనుకబడిన తరగతులు (Extremely Backward Classes- EBCs) కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్లు నివేదికలో తేలింది. ఈ నివేదికను రాష్ట్ర డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ వివేక్‌ సింగ్‌ సోమవారం విడుదల చేశారు. తాజా నివేదిక ప్రకారం బీహార్‌ లో జనాభా దాదాపు 13.07 కోట్లు ఉన్నారు. అందులో అత్యంత వెనుబడిన తరగతుల (EBCs) వారు 36 శాతంగా ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల (OBCs) వారి వాటా 27.13 శాతంగా ఉన్నట్లు రిపోర్డులో తేలింది. ఇక.. కులాలవారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని రిపోర్టు తెలిపింది. రాష్ట్ర జనాభాలో వీరి వాటా 14.27 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. షెడ్యూల్డ్‌ కులాల (SCs) జనాభా 19.7 శాతం ఉండగా.. షెడ్యూల్డ్‌ తెగల (STs) జనాభా 1.7 శాతంగా నమోదైంది. జనరల్‌ కేటగిరీకి చెందినవారి జనాభా 15.5 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

చదివింది ఇంజనీరింగ్.. చేస్తున్నది టెర్రరిజం.. ఐసిస్ కుట్రలో సంచలన విషయాలు..

ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. మోస్ట్ వాంటెండ్ అనుమానిత ఐసిస్ ఉగ్రవాది షానవాజ్‌ని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం తెలిపింది. తెల్లవారుజామున జైత్‌పూర్ లో షానవాజ్‌ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిని మహ్మద్ రిజ్వాన్ అష్రాఫ్, మహ్మద్ అర్షద్ వార్సిగా గుర్తించారు. అష్రాఫ్ ని లక్నోలో అరెస్ట్ చేయగా.. అర్షద్ ని మొరాదాబాద్ లో పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ హ్యండర్ల నుంచి పంపిన ఉగ్రవాద సాహిత్యం, బాంబు తయారీ వివరాలు ఇతర నేరారోపణ పత్రాలను షానవాజ్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే పట్టుబడిన ఉగ్రవాది షానవాజ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షానవాజ్ అతని సన్నిహితులు ముగ్గురు కలిసి పశ్చిమ కనుమలు, కర్ణాటకలోని హుబ్బలి, ధార్వాడ్, గుజరాత్ లోని అహ్మదాబాద్ ప్రాంతాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి రెక్కీ నిర్వహించినట్లు తేలింది.

కేసీఆర్ చొరవతో నల్లగొండ రూపురేఖలు మారిపోయాయి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్ చొరవతో నల్లగొండ రూపురేఖలు మారిపోయాయన్నారు. 13వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసామని, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం మరింత వెనుకబడేదన్నారు. కాంగ్రెస్ నేతలు మంత్రిగా ఉంది చేయలేని పనులు ఎమ్మెల్యే గా ఉందడీ భూపాల్ రెడ్డి చేసాడని ఆయన అన్నారు. 24గంటల కరెంట్ పై అనుమానం ఉంటే కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చిన చోట, ఇష్టం వచ్చినప్పుడు కరెంట్ తీగలు పట్టుకోవచ్చని ఆయన అన్నారు. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ అడ్డుకున్న ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అని, ఫ్లోరోసిస్ పారద్రోలిన మొనగాడు కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు.’

దేశంలో కులగణన చాలా ముఖ్యం..

దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రం కులాల వారీగా సర్వే చేసింది. కుల గణన ఫలితాలను ఈ రోజు వెల్లడించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం చేసిన ఈ పనిని కాంగ్రెస్ స్వాగతించింది. సామాజిక న్యాయం చేయడానికి, సామాజిక సాధికారత కోసం జాతీయ స్థాయిలో ఇలాంటి కసరత్తు చేయాలని కేంద్రాన్ని కోరింది.

దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. బీహార్ లో 84 శాతం మంది ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నట్లు తేల్చింది. వారి జనాభా ప్రకారం వారి వాటా ఉంటుందని కులగణన రుజువు చేసిందని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని 90 మంది కార్యదర్శుల్లో కేవలం మగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారని, భారత బడ్జెట్ లో కేవలం 5 శాతం మాత్రమే కేటాయించబడుతోందని, కాబట్టి దేశంలో కుల గణన చాలా ముఖ్యమని హిందీలో ట్వీట్ చేశారు.

ఒక్క కులం వల్ల అధికారం రాదు.. పవన్‌ కీలక వ్యాఖ్యలు

కులాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధించలేమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వెల్లడించారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మచిలీపట్నానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం ,పెడన, కైకలూరు కలిపితే అద్బుతమైన ప్రాంతం అవుతుందన్నారు. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య ఆకలితో చనిపోయారంటే కడుపు తరుక్కుపోయిందన్నారు.

ఒక్క కులం వల్ల అధికారం రాదన్నారు జనసేన అధినేత పవన్‌. నేను కాపు కులంలో పుట్టానని, అలా అని కేవలం కాపు ఓట్ బ్యాంక్ తీసుకుంటే ఎక్కడ ఎదుగుతామన్న పవన్‌.. అలా ఆలోచిస్తే కులనాయకుల్లా మిగిలిపోతామన్నారు. ఒక కులానికి అంటగట్టి నన్ను ఎందుకు కులనాయకుడ్ని చేస్తారని ప్రశ్నించారు.రాజమండ్రిలో మాట్లాడుతూ కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమన్నాను.. ఏపీలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టే అలా అన్నానని పవన్‌ తెలిపారు.

మేఘాలయలో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు

ఈశాన్య రాష్ట్రాలను భూకంపం కుదిపేసింది. మేఘాలయ రాష్ట్రంలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. సాయంత్రం 6.15 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రెసుబెల్‌పరా జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ గారో హిల్స్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.

ఈ భూకంపం ధాటికి అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలో ప్రకంపనలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో కూడా పలు చోట్ల భూమి కంపించింది. ప్రస్తుతం ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు అందుబాటులోకి రాలేదు. ఈశాన్య ప్రాంతాల్లో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్

మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధం చేయగా.. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఉదయం నుంచి బండారను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. చివరకు సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు మంత్రిని దూషించిన కేసులో గుంటూరుకు తరలించినట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బండారు సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఆయన ఇంటికి తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోపలకు పంపేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.

శ్రీదేవిది సహజ మరణం కాదు.. ఎట్టకేలకు నోరు విప్పిన బోనీ..

అందాల అతిలోక సుందరి శ్రీదేవి మరణం.. ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆమె మరణించి దాదాపు ఐదేళ్లు కావొస్తున్నా కూడా ఆమె కుటుంబంతో పాటు ఆమె అభిమానుల దృష్టిలో జీవించే ఉంది. అందం అంటే శ్రీదేవి.. ఆర్జీవీ చెప్పినట్లుగా.. పులా రెక్కలు.. కొన్ని తేనె చుక్కలు రంగరించి.. బ్రహ్మ కిందకు పంపినట్లు ఉండే అతిలోక సుందరి ఆమె. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన శ్రీదేవి.. చనిపోయే చివరి నిమిషం వరకు కూడా నటనలోనే ఉండాలని కోరుకుంది. బంధువుల పెళ్ళికి దుబాయ్ కు వెళ్లిన ఆమె బాత్ టబ్ లో కాలుజారిమృతిచెందింది. ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు.. మరెన్నో విమర్శలు.. అయినా శ్రీదేవి భర్త బోనీ కపూర్ తొణకలేదు .. బెణకలేదు. ఆమె అంటే అతనికి అంత ప్రాణం. భార్య పిల్లలు ఉండగానే.. శ్రీదేవిపై మనసు పడ్డ బోనీ.. అందరిని ఒప్పించి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి శ్రీదేవిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. భార్యాభర్తలమధ్య ఎలాంటి గొడవలు ఉంటాయో.. వీరి మధ్య కూడా అలాంటివే ఉండేవని తెలుస్తోంది. ఇక శ్రీదేవి మరణం తరువాత మొదటి సస్పెక్ట్ బోనీ కపూర్. ఎన్నో ప్రశ్నలు.. ఎన్నో అవమానాలు.. మరెన్నో అనుమానాలా మధ్య బోనీ పోలీసుల ముందు కూర్చున్నాడు. శ్రీదేవి మరణించిన తరువాత ఏరోజు ఆమె మరణం గురించి బోనీ మాట్లాడలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భార్య మృతికి కారణం ఇదేనని తేల్చి చెప్పాడు.

 

Exit mobile version