NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఏపీలో కొత్త ఇసుక పాలసీపై సీఎం సంకేతాలు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు, అధికారులతో సచివాలయంలో వరుసగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీపై ఏపీ సీఎం సంకేతాలు ఇచ్చారు. టీడీపీ హయాంలోని ఇసుక పాలసీకి.. జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి తేడాను అధికారులు వివరించారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబుకు తెలిపారు. అయితే, గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుందని అధికారులు వెల్లడించారు.

జీతం తీసుకోనన్న పవన్.. దణ్ణం పెట్టిన డైరెక్టర్!!

ఇటీవల 2024 మే నెలలో జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టి ప్రభుత్వంలో భాగమయ్యారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను గత ప్రభుత్వంలో పెద్దల లాగా జీతం తీసుకోకుండా పనిచేయని ఎందుకంటే జీతం తీసుకుంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి జీతం తీసుకుంటానని ఆయన కామెంట్ చేశాడు. అయితే తాజాగా పంచాయతీరాజ్ శాఖ రివ్యూ చేస్తున్న సమయంలో ఒక్కొక్క విభాగంలో ఎన్ని వందల కోట్లు లోటు బడ్జెట్ ఉందో తెలిసిన తర్వాత తాను జీతం తీసుకోకపోవడమే కరెక్ట్ అని ఆయన ప్రకటించారు. ఈ మేరకు జీతం కూడా తీసుకోను అంటూ ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు నటుడిగా పలు సినిమాలు చేసిన సముద్రఖని పవన్ కళ్యాణ్ కు దండం పెడుతూ ట్వీట్ చేశారు. తమిళ మీడియా కవర్ చేసిన ఒక న్యూస్ పిక్ షేర్ చేసి అన్నా అంటూ దండం పెడుతున్న సింబల్ ను షేర్ చేశారు.

గత ప్రభుత్వ పాలన పోలవరానికి శాపంగా మారింది..

గత ప్రభుత్వ పాలన పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమను వట్టిసీమగా జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.. ఇప్పుడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాకు బంగారు సీమగా మారింది.. తెలుగుదేశం పార్టీ (టిడిపి) పాలనాలో సుమారు 300 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా ఇచ్చి 30 లక్షల ఎకరాల్లో సాగుకు ఇబ్బందు లేకుండా చూసాం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో పట్టిసీమ ఎత్తిపోతల రైతులకు సాగునీరు అందే పరిస్థితులు ఏర్పడ్డాయి.. జగన్ రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు.. పులిచింతల లాంటి ప్రాజెక్టులో సైతం ఒక టీఎంసీ నీటిని కూడా నిలుపలేకపోయారు.. అద్వానంగా జగన్ పాలన కొనసాగింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ప్రకారం ఒక నీటి చుక్క కూడా వృధా కాకుండా పట్టిసీమ ద్వారా నీటిని రేపటి నుంచి తరలిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

దేశాన్ని జూన్ 4న తగలబెట్టాలనుకున్నారు.. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి..

కాంగ్రెస్ టార్గెట్‌గా ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో విమర్శలు చేశారు. ఓటముల్లో కాంగ్రెస్ షోలే రికార్డులను కూడా దాటేసిందని అన్నారు. ఈ ఎన్నికల్లో్ కాంగ్రెస్‌తో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలకు కూడా ఓ పాఠం నేర్పిందని చెప్పారు. ఎన్డీయేను ఓడించామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని, వారు ఓటమిపై అంతర్మథనం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మిత్ర పక్షాల సాయంతో కొన్ని సీట్లను గెలుచుకుందాని అన్నారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదని చెప్పారు. కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ కేవలం 26 శాతమే అన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ జూనియర్ పార్ట్‌నర్‌గా మారిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రతీ ఎన్నికల్లో మిత్రపక్షాల ఓట్లను తినే పరాన్నజీవి అని అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. 11 మంది మావోల హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 11 మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనను ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. అభుజ్మద్‌లోని కోహ్కమేటా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. వివిధ భద్రతా దళాలకు చెందిన సిబ్బంది నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉన్నప్పుడు కాల్పులు చోటుచేసుకున్నాయని అధికారి తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వివిధ జిల్లాలకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులతో కూడిన ఈ ఆపరేషన్ సోమవారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

నీట్ ఇష్యూ, పేపర్‌ లీకులపై లోక్‌సభలో స్పందించిన ప్రధాని మోడీ..

నీట్ సమస్య, పేపర్ లీకులపై ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో స్పందించారు. దేశంలో ఇలాంటి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం సీరియస్‌‌గా ఉందని ప్రతీ విద్యార్థికి, దేశంలో ప్రతీ యువకుడికి చెబుతున్నానని భరోసా ఇచ్చారు. యువత భవిష్యత్తుతో ఆటలాడే వారిని వదిలిపెట్టబోమని, నీట్‌కి సంబంధించి దేశవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయని అన్నారు. మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన నీట్-యూజీ పేపర్ లీక్‌పై తీవ్ర విచారం వ్యక్తం చేశానని, పేపర్ లీక్‌కు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

నేటితో పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌కు ఏడాది

ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చేసిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌కు నేటితో ఏడాది పూర్తి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల‌తో నాడు సీఎల్పీ నేత‌గా భ‌ట్టి విక్ర‌మార్క త‌న పాద‌యాత్ర‌ను మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం పిప్పిరి నుంచి ప్రారంభ‌మైన పాదయాత్ర జులై 2న ఖ‌మ్మం న‌గ‌రంలో ముగిసింది. నాడు నిరాశలో నిండిన కాంగ్రెస్ పార్టీ కేడ‌ర్ లో భ‌ట్టి విక్ర‌మార్క చేప‌ట్టిన పాద‌యాత్ర స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది.

భ‌ట్టి విక్ర‌మార్క చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర మొత్తంగా 109 రోజులు పాటు కొన‌సాగింది. సుమారు 700కు పైగా గ్రామాల మీదుగా భ‌ట్టి విక్ర‌మార్క 1364 కిలోమీట‌ర్లు న‌డిచారు. పాద‌యాత్ర మొత్తంగా 17 జిల్లాల్లో 36 నియోజ‌క‌ర్గాల మీదుగా కొన‌సాగింది. ఈ పాద‌యాత్ర‌లో 100కు కార్న‌ర్ మీటింగ్స్, మంచిర్యాల‌, జ‌డ్చెర్ల‌, ఖ‌మ్మంల‌లో భారీ బ‌హిరంగ స‌భ‌లు జ‌రిగాయి. మంచిర్యాల స‌భ‌కు ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, ఖ‌మ్మం బ‌హిరంగ స‌భ‌కు ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ముఖ్యతిధులుగా హాజ‌ర‌య్యారు.

వినూత్నంగా ఆలోచించండి.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐఏఎస్ అధికారులందరూ విధిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా పాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పని చేసి ప్రజలకు సుపరిపాలనను అందించి తీరాలని చెప్పారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు. తమ శాఖల పని తీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన చేసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్ షిప్ ఐడియాను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ.. ఎందుకో తెలుసా..?

రాష్ట్ర విభజన అంశాలపై చర్చించుకుందామంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యుత్తరం రాశారు. చంద్రబాబు చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తు్న్నట్లు ఆయన ఈరోజు లేటర్ రాశారు. ఈ నెల 6వ తేదీన చర్చించుకుందామన్న ఏపీ సీఎం ప్రతిపాదనకు రేవంత్ సానుకూలంగా స్పందించారు. దీని ద్వారా చర్చలకు ఆంధ్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నానని… పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను తొందరలోనే పరిష్కరించుకుందామని తెలంగాణ సీఎం పేర్కొన్నారు.