చింతించడం లేదు.. ఇది కొత్త కాదు.. తిరుగుబాటుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో అజిత్ పవార్ తిరుగుబాటుపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఇది కొత్త కాదని, 1980లో పార్టీ పెట్టిన సమయంలో 58 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే చివరకు 6 మంది మిగిలారని.. అయినా కూడా తాను పార్టీని బలపరిచానని అన్నారు. పార్టీ మారిన వారంత తర్వాత ఓడిపోయారని గుర్తు చేశారు. మళ్లీ పార్టీని బలోపేతం చేస్తానని, తిరుగుబాటు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని శరద్ పవార్ అన్నారు.
ఆ సమయంలో నేను ఎంతగానో భయ పడ్డాను..
తేజస్వి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో ఎంతో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన హాట్ అందాలతో పాటు అల్లరితో కుర్రకారులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ కేరింత, ఐస్ క్రీమ్ మరియు జత కలిసే సినిమాల్లో నటించి తన అందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న ఈ భామ వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ రచ్చ చేస్తుంది.సినిమాలతో కంటే బిగ్ బాస్ షో వల్ల ఆమె మరింతగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఈ భామ కమిట్‌మెంట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తేజస్వి కొన్ని సంచలన విషయాలను కూడా పంచుకుంది. ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి మాట్లాడుతూ. ఒక సారి ఈవెంట్‌కు వెళ్లినప్పుడు సుమారు 30 మంది ఫుల్‌గా తాగొచ్చి రాత్రి నాపై అటాక్ చేశారు. ఆ రోజు నేను ఏదో విధంగా తప్పించుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. ఇక ఆ తర్వాత భయంతో రాత్రంతా ఏడ్చాను. ఆ సంఘటనను జీవితాంతం అస్సలు మర్చిపోలేను అంటూ తనకు జరిగిన ఆ చేదు అనుభవం గురించి తెలిపింది..
సందీప్ మాధవ్ హీరోగా భారీ యాక్షన్ థ్రిల్లర్…
సందీప్ మాధవ్ హీరోగా కేథరిన్ త్రెసా హీరోయిన్‌గా ‘ఓదెల రైల్వేస్టేషన్’ దర్శకుడు భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేశారు. అశోక్ తేజ దర్శకుడుగా మారి తెరకెక్కించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఎంతటి ఘన విజయం సాధించిందితో తెలిసిందే! ఆహా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించిన ఈ దర్శకుడు అశోక్ తేజ ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. కేథరిన్ త్రెసా హీరోయిన్‌గా, ‘జార్జిరెడ్డి’, ‘వంగవీటి’ చిత్రాలతో గుర్తింపు పొందిన సందీప్ మాధవ్ హీరోగా ఒక యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కించనున్నారు.
ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే మూడు రోజుల వాతావరణ వివరాలు క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు.
వాళ్లు తప్పుదోవ పట్టించి, వాడుకున్నారు.. పాయల్ సంచలన వ్యాఖ్యలు
నటి పాయల్ రాజ్‌పుత్ RX 100 అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా మొదటి సినిమా హిట్ అయినంతగా హిట్లు అందుకోలేక పోయింది. వెంకటేష్, రవితేజ లాంటి హీరోలతో నటించినా హీరోయిన్ గా మాత్రం ఆమెకు మాత్రం పెద్దగా మైలేజ్ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ పంజాబీ హీరోయిన్ తన ఐదేళ్ల కెరీర్‌లో సినీ పరిశ్రమలో తనకున్న అనుభవాల గురించి చెబుతూ ఇండస్ట్రీ జనాల పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఆమె కీలక పాత్రలో నటించిన మాయాపేటిక సినిమా రిలీజ్ అయిన క్రమంలో ఆమె ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇక ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో తనను కొందరు తప్పుదోవ పట్టించారని అన్నారు. ‘‘ఆర్‌ఎక్స్ 100 సక్సెస్ తర్వాత నేను హైదరాబాద్‌లో ఒంటరిగా ఉన్నాను, అలా ఉండడాన్ని అయితే కొంత మంది సద్వినియోగం చేసుకున్నారు.
ఫ్రాన్స్ అల్లర్లు అదుపులోకి రావాలంటే “యోగి”నే కరెక్ట్.. జర్మనీ ప్రొఫెసర్ ట్వీట్..
ఫ్రాన్స్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఆ దేశ రాజధాని పారిస్ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరాయి. 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపడంపై అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా పారిస్ నగరంలో పలు ఆస్తుల్ని ధ్వంసం చేయడంతో పాటు లూటీలకు పాల్పడుతున్నారు. పారిస్ నగర మేయర్ ఇంటిపై కూడా దాడికి తెగబడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇందుకు కారణం ఆ ట్వీట్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ముడిపడి ఉండటమే.
కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి.. కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ
ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్.. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షన్‌తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా… పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో విజయవంతం అయింది. భట్టి పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా ఇవాళ ఖమ్మం వేదికగా భారీ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన చేతుల మీదుగా కండువా కప్పి ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు ఆయన అనుచరులు పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో తిరిగి పట్టు సాధించి అధికారంలోకి రావాలని హస్తం పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిందే..
భారత్ జోడో యాత్రకు కొనసాగింపే ఈ పీపుల్స్ మార్చ్ యాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పాదయాత్రలో అందరి కష్టాలను తెలుసుకున్నామని ఆయన తెలిపారు. పీపుల్స్ మార్చ్‌ను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించామని భట్టి పేర్కొన్నారు. దేశమంతా ఐక్యంగా ఉండాలని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారన్నారు. పీపుల్స్ మార్చ్ భట్టి యాత్ర కాదు.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన యాత్ర అని ఆయన చెప్పుకొచ్చారు. అధికార మదంతో విర్రవీగుతున్న వారికి వ్యతిరేకంగా చేసిన ప్రజలు చేసిన యాత్ర అంటూ భట్టి విక్రమార్క చెప్పారు.
ఒడిశా రైలు ప్రమాదానికి కారణం ఇదేనా..? రైల్వే రిపోర్ట్..
ఒడిశాలో బాలాసోర్ సమీపంలో బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగి ఘోర రైలు ప్రమాదాన్ని దేశ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు గూడ్స్ ను ఢీకొట్టడం, పక్క ట్రాక్ లో వస్తున్న మరో రైలు కోరమాండల్ రైలు బోగీలను మళ్లీ ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 293 మంది మరణించగా, 1,000 మందికి పైగా గాయపడ్డారు. మూడు దశాబ్ధాల్లో అతిపెద్ద రైల్వే ప్రమాదంగా మిగిలింది. ఈ ప్రమాదంపై ఇప్పటికే సీబీఐ విచారణ ప్రారంభించింది.
మెయిన్ ట్రాక్ లో వెళ్తున్న కోరమాండర్ రైలు, లూప్ లైన్ లోకి వెళ్లి గూడ్స్ రైలును ఎలా ఢీకొట్టిందనేది ఇప్పటికీ అనుమానాస్పదంగా ఉంది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు కారణమా..? విద్రోహ చర్యనా..? లేక మానవ తప్పిదమా..? అనే అంశాలపై విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) సిగ్నలింగ్ విభాగంలోని ఉద్యోగులు తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తన రిపోర్టులో ఆరోపించింది. ‘ప్రమాదానికి మానవ తప్పిదం’ కారణమని హైలెట్ చేసింది.
రూ.2000 నోట్ల ఉపసంహరణపై రేపు ఢిల్లీ హైకోర్టు తీర్పు..!
రూ. 2,000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలన్న ఆర్‌బీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మే 30న దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై పిటిషనర్, ఆర్బీఐ తరుపున న్యాయవాదుల వాదనలను న్యాయమూర్తి సతీస్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ లతో కూడిన ధర్మాసనం వింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది.
రూ. 2000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకునే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేదని, ఈ విషయంలో కేంద్రం మాత్రమే నిర్ణయం తీసుకోగలదని పిటిషనర్ రజనీష్ భాస్కర్ గుప్తా తన పిల్ లో పేర్కొన్నాడు. ఏదైనా డినామినేషన్ నోట్లను జారీ చేయకుండా నిలిపివేసే స్వతంత్ర అధికారం ఆర్బీఐకి లేదని, 1934 ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 24 (2) ప్రకారం కేంద్రానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అయితే ఆర్బీఐ మాత్రం కరెన్సీ నిర్వహణ, ఆర్థిక విధానానికి సంబంధించిన అంశం అని తెలిపింది.
ఈ డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది..
డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని.. ఈ డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న విజయోత్సవ సభ ఖమ్మంలోనే ఉంటుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. 1200 మంది ఆత్మబలిదానాలను చూసి సోనియా చలించిపోయారని.. బలిదానాలు చూడలేకే తెలంగాణ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాలని రేవంత్ అన్నారు. భట్టి మార్చ్ యాత్రలో దృష్టి కొచ్చిన అంశాలు మేనిఫెస్టో గా ఉంటాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. తాజాగా ఆదివారం సాయంత్రం వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో చల్లని గాలులతో నగర వాసులు ఉపశమనం పొందారు. అయితే.. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా.. వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రోడ్లపైకి వచ్చిన వర్షపు నీటిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. అయితే.. వర్షం కారణంగా కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
