Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

దంచి కొట్టిన కోహ్లీ-క్రునాల్.. ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం

సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఢిల్లీకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకున్నారు. భువనేశ్వర్ కుమార్ (3/33), జోష్ హాజిల్‌వుడ్ (2/36) గట్టి బౌలింగ్‌ను ఎదుర్కొని ఢిల్లీ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు 18.3 ఓవర్లలో 165/4 పరుగులు చేసి, విరాట్ కోహ్లీ (51), కృనాల్ పాండ్య (73*) అర్ధ సెంచరీలతో 6 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. దీంతో, సొంతగడ్డపై జరిగిన ఓటమికి RCB ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకుంది. బెంగళూరు జట్టుకు ఇది వరుసగా మూడో విజయం. రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా లేడి సూపర్ స్టార్..?

మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ల్లో మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. చిరు కెరీర్ లో157వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే మంచి హైప్ ఉంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ద్వారా ఈ ఏడాది అనిల్ ఊహించని విధంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారనే టాక్ తో మరింత క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా హీరోయిన్ పాత్ర కోసం ఆ స్టార్ నటిని సంప్రదించారని వార్త వైరల్ అవుతుంది.

కునో నేషనల్ పార్క్ లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత నిర్వా

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ లో చిరుత నిర్వా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో పార్కులో చిరుతలు, పిల్లల సంఖ్య 29కి పెరిగింది. ఈ నెల ప్రారంభంలో రక్షిత అటవీ ప్రాంతం నుంచి రెండు చిరుతలను గాంధీ సాగర్ అభయారణ్యానికి తరలించారు. సీఎం మోహన్ యాదవ్ ఆదివారం రాత్రి X లో పోస్ట్ చేస్తూ.. ” కునోలోకి కొత్త అతిథులకు స్వాగతం.. కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సంఖ్య నిరంతరం పెరుగుతుండటం చాలా ఆనందంగా ఉంది.

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ లో చిరుత నిర్వా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో పార్కులో చిరుతలు, పిల్లల సంఖ్య 29కి పెరిగింది. ఈ నెల ప్రారంభంలో రక్షిత అటవీ ప్రాంతం నుంచి రెండు చిరుతలను గాంధీ సాగర్ అభయారణ్యానికి తరలించారు. సీఎం మోహన్ యాదవ్ ఆదివారం రాత్రి X లో పోస్ట్ చేస్తూ.. ” కునోలోకి కొత్త అతిథులకు స్వాగతం.. కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సంఖ్య నిరంతరం పెరుగుతుండటం చాలా ఆనందంగా ఉంది.

ఎల్‌ఓసీ దగ్గర మళ్లీ పాక్ సైన్యం కవ్వింపు.. కాల్పులను తిప్పికొట్టిన ఆర్మీ

పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వరుసగా నాలుగో రోజు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం అప్రమత్తమై.. సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం అందలేదు. ఏప్రిల్ 27-28 అర్ధరాత్రి సమయంలో కుప్వారా, పూంచ్ జిల్లాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ ఆర్మీ పోస్టులు కాల్పులు జరిపాయని భారత్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అంతే వేగంగా.. సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టినట్లు పేర్కొంది.

అల్లు అర్జున్ – అట్లీ.. సైలెంట్ గా.. గుట్టు చప్పుడు కాకుండా

అల్లు అర్జున్ గత చిత్రం పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసింది. పుష్ప 2. దీంతో ఈ సారి చేయబోయే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసాడు అల్లు అర్జున్. ఆ నేపథ్యంలోనే  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాను అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్  బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్  ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. యూనిట్ కు చెందిన అతి కొద్దీ మంది ముఖ్యుల సమక్షంలో అల్లు అర్జున్ , అట్లీ సినిమాకు సంభందించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబాయిలో చాలా సింపుల్ గా జరిగాయట. కాగా ఈ సినిమా షూట్ మొత్తం ముంబాయిలోను అలాగే విదేశాల్లో ఉంటుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అట్లీ ఫారిన్  లొకేషన్స్ కూడా లాక్ చేసాడని టాక్. అలాగే సినిమాకు స్పైడర్ మ్యాన్, అవతార్, వాళ్వరిన్, టెర్మినేటర్ వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ వర్క్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్, సమంత ఇలా రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఎవరిని ఇంకా అధికారకంగా ఫిక్స్ చేయలేదు. బన్నీ కెరీర్ లో 22, అట్లీ కెరీర్ లో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

టెన్త్ ఫలితాలపై కీలక అప్డేట్‌

తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు ఒక శుభవార్త. వారి ఫలితాలకు సంబంధించిన విధానంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు కేవలం గ్రేడ్లు , సీజీపీఏ (CGPA – Cumulative Grade Point Average) రూపంలో మాత్రమే ఫలితాలను పొందుతున్న విద్యార్థులకు ఇకపై ఒక్కో సబ్జెక్టులో వారు సాధించిన మార్కులు, వాటికి కేటాయించిన గ్రేడ్లు కూడా మెమోలో స్పష్టంగా తెలియజేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆ ప్రతిపాదనను ఆమోదిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం విద్యార్థులకు వారి , విద్యాపరమైన సామర్థ్యాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఏయే సబ్జెక్టులలో వారు మెరుగ్గా రాణించారో, ఏ సబ్జెక్టులపై మరింత దృష్టి పెట్టాలో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’. యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కంగువా వంటి బిగెస్ట్ డిజాస్టర్ తర్వాత వస్తున్నసినిమా కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయిన  ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. అందుకు ఉదాహరణ రెట్రో అడ్వాన్స్ బుకింగ్స్. కేవలం 9 గంటల్లో 83.47K టికెట్స్ బుకింగ్స్ తో అదరగొట్టింది రెట్రో. ఒక్క బెంగుళూరులోనే 2300 పైగా టికెట్స్ బుకింగ్స్ తో సూపర్బ్ స్టార్ట్ అందుకుంది. ఇక తమిళనాడులో రూ. 2.8 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టి దూసుకెళ్తోంది. అలాగే ఈ  సినిమా బుక్ మై షోలో ఏకంగా 200K కి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వింటేజ్ సూర్యను చూసేందుకు జనం ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం అవుతుంది. కాగా సినిమాలో పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జ్యోతిక, సూర్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

దాని కారణంగా అందరు నాకు దూరంగా ఉండేవారు..

ఇటీవ‌ల టాలీవుడ్ లో భాగా వినిపిస్తున్న హీరోయిన్‌ పేర్లల్లో మీనాక్షి చౌదరి ఒకరు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘హిట్ 2’ మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకున్న మీనాక్షి రీసెంట్ గా ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ చిత్రంతో బారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నఈ అమ్మడు కెరీర్ గ్రాఫ్..  ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి‌తో కలిసి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటిస్తున్న మీనాక్షి.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది.

యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. ట్రయల్ రన్‌లో ఉండగా ఘటన
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్లాంట్‌లోని మొదటి యూనిట్‌లో ఈ ప్రమాదం జరిగింది. బాయిలర్ నుండి ఆయిల్ కారుతుండగా, దాని కింద వెల్డింగ్ పనులు జరుగుతుండటంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో యూనిట్ ట్రయల్ రన్ కోసం సిద్ధమవుతోంది. అదృష్టవశాత్తు, ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ట్రయల్ రన్‌లో ఉండగానే ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి జులై 15 వరకు కొత్త రూల్..!

కలియుగ ప్రత్యక్షదైశం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. మే 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి.. వేసవి సెలవులు కావడంతో.. తిరుమలకు భక్తులు పోటెత్తుతుంటారు.. ఇక, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. మే 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ.. ఈ సమయంలో స్వయంగా విచ్చేసే వీఐపీలకు మాత్రమే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.. మే 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటలకు ప్రారంభించబోతోంది టీటీడీ.. అయితే, సిఫార్సు లేఖలు తీసుకుని శ్రీవారి దర్శానికి ఏర్పాట్లు చేసుకుంటున్న భక్తులు.. ఈ విషయాన్ని గమనించాలి..

Exit mobile version