NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

సైలెంట్ గా షూటింగ్ మొదలెట్టిన మహేశ్ బాబు

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన లేటెస్ట్ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలను కూడా సైలెంట్ గా పూర్తి చేసారు. తన ఆనవాయితీగా భిన్నంగా రాజమౌళి సినిమాను గుట్టు చప్పుడు కాకుండా స్టార్ట్ చేసాడు. ఈ సినిమా ఎప్పుదెప్పుడు స్టార్ట్ అవుతుందా అని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఏంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు మహేశ్ బాబు.

తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్‌

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా భక్తులు.. టోకెన్ల కోసం తరలి రావడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. తాజాగా ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను. మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలి.

నేటి నుంచి రెండ్రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌లో యూపీ సీఎం పర్యటన..

మహా కుంభమేళా ప్రారంభానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో నేడు (జనవరి 9) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల పాటు ప్రయాగ్ రాజ్ లో పర్యటించబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ఆరైల్‌లోని డీపీఎస్‌ గ్రౌండ్‌లోని హెలిప్యాడ్‌లో దిగనున్నారు. అనంతరం అక్కడి నుంచి చక్ర మాధవ్ ర్యాంప్ నుంచి పాంటూన్ బ్రిడ్జి వరకు రోడ్డు మార్గంలో సంగం లోయర్ మార్గ్ సెక్టార్ 20 వరకు కారులో వెళ్తారు. అక్కడ మొత్తం 13 అఖారాల క్యాంపుల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత డిజిటల్ కుంభ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించేందుకు కిలా మార్గ్ మీదుగా త్రివేణి పాంటూన్ బ్రిడ్జ్ మీదుగా సెక్టార్ 3కి వెళ్తాడు. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన రాజ్యాంగ గ్యాలరీని ప్రారంభిస్తారు.

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

తిరుపతిలో జరిగిన తొక్కిసలా­టలో భక్తులు మృతి చెందిన వార్త తెలిసి ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేశారు. తొక్కిసలాట ఘటన నన్ను బాధించిందన్నారు. మరణించిన వారి కుటుంబాల అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియ­జేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. గాయప­డిన వారు త్వరగా కోలుకో­వాలని ఆయన కోరారు. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో బుధవారం నాడు అర్ధరాత్రి పోస్ట్‌ చేశారు.

తిరుపతిలో భక్తుల మృతి కలచివేసింది

తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని తెచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సీపట్నానికి చెందిన బి.నాయుడు బాబు (51), విశాఖపట్నం జిల్లాకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక (49) ఉన్నారు. అదేవిధంగా, ఈ ఘటనలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని రుయా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

అందుకే తొక్కసలాట జరిగింది.. టీటీడీ మాజీ ఛైర్మన్ తీవ్ర వ్యాఖ్యలు..

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“ఇది అత్యంత విచారకరం”.. తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం జగన్ రియాక్షన్..

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా రుయా ఆస్పత్రి నుంచి 8 మందిని స్విమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం స్విమ్స్‌ ఆస్పత్రిలో 16 మంది భక్తులకు చికిత్స అందిస్తున్నారు. 32 మంది భక్తులు డిశ్చార్జ్‌ అయ్యారు. ఇదిలా ఉండగా… ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.

నేడు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్‌

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఏసీబీ ముందు విచారణకు హాజరవుతున్నారు. ఉదయం 9:30కి నంది నగర్ నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఫార్ములా-ఈ కారు రేసుతో సంబంధం ఉన్న నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేటీఆర్‌ను ఏసీబీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణకు పిలుస్తూ నోటీసులు జారీచేసింది.

బాలయ్యలో నాకు అది కనిపించలేదు : శ్రద్ధా శ్రీనాథ్

అనతి కాలంలోనే మంచి మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్ . ప్రస్తుతం ఈ అమ్మడు నందమూరి బాలకృష్ణ తో ‘డాకు మహారాజ్’ మూవీలో కథానాయకగా నటిస్తోంది. తెలుగు అభిమానులంతా భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరును చేస్తున్నారు చిత్ర బృందం.

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. కారణం ఇదే

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ చిత్రం విడుదల కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 

Show comments