NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

రాజ్‌భవన్‌కు వైసీపీ నేతల బృందం.. పోలింగ్‌ తర్వాత హింసపై ఫిర్యాదు..
విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల బృందం.. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.. వైసీపీ నేతలు, మంత్రులు.. ఈ బృందంలో మంత్రి బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ , కావటి మనోహర్ నాయుడు తదితరులున్నారు.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లు, దాడులు వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ ను కోరారు వైసీపీ నేతలు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది.. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాం.. అబర్వర్ దీపక్ మిశ్రా పక్ష పతంగా వ్యవహరిస్తున్నారు.. టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు.. అబర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని గవర్నర్‌ను కోరినట్టు వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. ఆ అధికారులపై చర్యలు తప్పవు..!
వచ్చే నెల 4వ తేదీ తర్వాత మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. పక్షపాత ధోరణితో వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి పేర్ని నాని.. మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతల బృందం.. ఏపీలో పోలింగ్‌ తర్వాత జరిగిన హింసపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.. బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, గవర్నర్‌తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. ఉద్దేశ పూర్వకంగా దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ-టీడీపీ తెచ్చింది. అతని వల్లే ఈ విధ్వంసం అని ఆరోపించారు. ఇక, హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో సీఎం వైఎస్‌ జగన్ ఇప్పటికే మాట్లాడారు. సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు కోరారని తెలిపారు.. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారు. జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదని మండిపడ్డారు..

రెండోసారి సీఎంగా వైఎస్‌ జగన్‌.. జూన్‌ 9న విశాఖలో ప్రమాణస్వీకారం..
జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మళ్లీ వైఎస్‌ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం రావాలి అనే విధంగా పోలింగ్ జరిగింది.. ఇచ్చిన మాట తప్పకుండా జగన్ ఐదేళ్లు పని చేశారు.. ఎన్నికల్లో జగన్ కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు.. మంచి జరిగితే ఓటు వేయాలని జగన్ కోరారు అని గుర్తుచేశారు. విద్య, వైద్యం, పరిపాలనలో సంస్కరణలు కొనసాగిస్తామని జగన్ చెప్పారు.. ఇవన్నీ చూసి ఓటు వేయాలని జగన్ కోరటం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు. అయితే, టీడీపీ సహనం కోల్పోయి దాడులు చేస్తోందని మండిపడ్డారు.. తాను ఈ పని చేశానని చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు.. ఎన్టీఆర్ హయాంలో, వైఎస్ హయాంలో వచ్చినటువంటి పాజిటీవ్ వైబ్రేషన్లు ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి. వైనాట్ 175 లక్ష్యానికి దగ్గర్లోనే సీట్లు గెలవబోతున్నాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, మేం సంయమనం పాటిస్తున్నాం. మా నేత ఓ పిలుపిస్తే అంతా నిమిషంలో మారిపోతుందని హెచ్చరించారు బొత్స.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదు అని హితవుపలికిన ఆయన.. మేమే ప్రభుత్వాన్ని నడపాలి.. మేమే శాంతి భధ్రతలను కాపాడాలి.. మేం అధికారంలోకి రాగానే అందరూ తోక ముడుస్తారని వ్యాఖ్యానించారు. సమ న్యాయం పాటిస్తూ పరిపాలన చేశాం. మేం సామాజిక న్యాయం పాటిస్తూ సీట్ల కేటాయింపు చేశాం. టీడీపీ అభ్యర్థుల జాబితా చూడండి.. సామాజిక న్యాయం ఎక్కడా కన్పించదన్నారు. సామాజిక సమీకరణాల పేరుతో రాజకీయం చేసిన నేతలే ఉన్నారు. కానీ, జగన్ తొలిసారిగా సామాజిక న్యాయం చేసి చూపించారని స్పష్టం చేశారు.

ఏపీలో హింసాత్మక ఘటనలు.. చర్యలకు దిగిన సీఈసీ
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ ముగిసిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) రియాక్షన్‌ మొదలయింది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీలు ఇచ్చిన రిపోర్ట్‌ను ఆధారంగా చేసుకొని చర్యలు చేపట్టింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెన్షన్‌ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అటు.. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది కిందిస్థాయి పోలీస్ అధికారులపై కూడా వేటు వేసింది. వీరందరిపై శాఖాపరమైన విచారణకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ప్రతి కేసులో తీసుకున్న చర్యల వివరాలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ కోరింది. సరికొత్త FIR రూపొందించాలని ఆదేశించింది. సీఈసీని కలిసి వివరణ ఇస్తూ.. సీఎస్, డీజీపీలు ఇచ్చిన 6 ప్రతిపాదనలను సీఈసీ ఆమోదించింది.

16 మందిని బలిగొన్న ముంబై ఘటన తర్వాత పూణేలో కుప్పకూలిన భారీ హోర్డింగ్..
ఇటీవల ముంబైలో బిల్‌బోర్డు కుప్పకూలిన ఘటనలో 16 మంది మరణించారు. ఈ ఘటన మరవకముందే పూణేలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. బలమైన గాలుల కారణంగా పూణే సమీపంలోని పింప్రి-చించ్‌వాడ్‌లో హోర్డింగ్ కూలిపోయింది. హోర్డింగ్ కింద ఆగి ఉన్న టెంపో, కారు, కొన్ని ద్విచక్ర వాహనాలపై విరిగి పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సంఘటన గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో నగరంలోని మోషి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులు, ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ అగ్నిమాపక అధికారి మనోజ్ లోంకర్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగలేని చెప్పారు. గతేడాది ఏప్రిల్‌లో పింప్రి చించ్‌వాడ్‌లోని సర్వీస్‌ రోడ్డుపై హోర్డింగ్‌ కూలి ఐదుగురు మృతి చెందారు. బలమైన ఈదురుగాలులు, వర్షం వస్తుండటంతో తలదాచుకుందామని వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ముంబైలో భారీ హోర్డింగ్ కూలి 16 మంది మరణించారు. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుమ్ము తుఫాను కారణంగా సోమవారం 250 టన్నుల హోర్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో నాలుగు రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి చికిత్స ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.

డెంగ్యూ దాడి ప్రాణాంతకం.. ఈ పద్దతులతో మిమ్మల్ని మీరు రక్షించుకోండి..
ప్రపంచ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 16న జరుపుకుంటారు. ఈ రోజును జరుపుకోవడం ప్రధాన లక్ష్యం ఈ వ్యాధిని నివారించడంతో పాటు దాని గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడం. డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. డెంగ్యూ అనేది దోమ కాటు వల్ల వచ్చే తీవ్రమైన వ్యాధి. డెంగ్యూకు సకాలంలో చికిత్స అందించినట్లయితే రోగి త్వరగా కోలుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన రూపాన్ని తీసుకుంటుంది. ప్రాణాంతకం కూడా కావచ్చు. అందువల్ల దాని నుంచి మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం. డెంగ్యూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకుందాం. ఆడ అనాఫిలిస్ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది. అందువల్ల, దోమలు వృద్ధి చెందకుండా, అవి కుట్టకుండా నిరోధించడం మాత్రమే దీనిని నివారించడానికి ఏకైక మార్గం. దీని కోసం కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.

స్టాక్ మార్కెట్ బ్రోకర్ల కంటే ప్రభుత్వం ఎక్కువ సంపాదిస్తోంది.. నిర్మలా సీతారామన్ వద్ద వాపోయిన స్టాక్ బ్రోకర్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ముంబైలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) నిర్వహించిన ‘వికాసిత్ భారత్ 2047-విజన్ ఫర్ ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ఆర్థిక మార్కెట్లకు గణనీయమైన సహకారం అందించినందుకు బిఎస్ఇలో ప్రశంసిస్తూ సీతారామన్ తన ముఖ్య ప్రసంగంలో.. ప్రపంచ అనిశ్చితుల మధ్య అంచనాలను అధిగమించి, వారి అద్భుతమైన పనితీరును గుర్తించారు. ముంబైకి చెందిన స్టాక్ బ్రోకర్లతో సహా చాలా మంది హాజరైన ఈ కార్యక్రమంలో ఆమె ప్రేక్షకుల నుండి ప్రశ్నలను కూడా తీసుకుంది. సెషన్ మధ్య, స్టాక్ మార్కెట్ బ్రోకర్లలో ఒకరు ఎఫ్ఎం నిర్మలా సీతారామన్కు అడిగిన ప్రశ్న ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. స్టాక్ బ్రోకర్ బ్రోకర్లపై ప్రభుత్వం విధించిన పన్నుల సంఖ్యపై ఆర్థిక మంత్రిని అడిగారు. భారత ప్రభుత్వం స్టాక్ బ్రోకర్లపై విధించిన అధిక పన్నులపై ఆయన అడిగిన ప్రశ్న ఈ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులతో బాగా ప్రతిధ్వనించింది. బ్రోకర్ ఆర్థిక మంత్రిని అడిగిన ప్రశ్నలో., “మేము రిటైల్ పెట్టుబడిదారుల కోసం వ్యాపారం చేస్తున్నప్పుడు, మేము వస్తువులు, సేవల పన్ను (జిఎస్టి), సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (సిజిఎస్టి), సెక్యూరిటీస్ లావాదేవీ పన్ను (ఎస్టిటి), ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఐజిఎస్టి) స్టాంప్ డ్యూటీ, లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టిసిజి) పన్నుతో సహా అనేక పన్నులను కడుతున్నాము. కాబట్టి, నేడు భారత ప్రభుత్వం బ్రోకర్ కంటే ఎక్కువ సంపాదిస్తోంది “అని అన్నారు. “నేను ప్రతిదీ పెట్టుబడి పెడుతున్నాను, చాలా రిస్క్ తీసుకుంటున్నాను. భారత ప్రభుత్వం నా లాభాలన్నింటినీ తీసుకుంటోంది. నేను నా ఫైనాన్స్, రిస్క్, సిబ్బంది ఇలా ప్రతిదానితో పనిచేసే భాగస్వామిని అని ఆయన అన్నారు.

క్రికెట్ ఆడండి అంటే.. కుస్తీ పట్టిన ముంబై ఆటగాళ్లు..
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు మరో గేమ్ మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ మే 17న లక్నో సూపర్‌జైంట్స్ తో ఆడనుంది. ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఈసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించకుండానే తన ప్రయాణాన్ని ముగించుకుంది. ఇక చివరి గేమ్ కేవలం లాంఛనప్రాయమైనది. దీంతో ఈ గేమ్‌పై ముంబై ఇండియన్స్ అభిమానులు బాగా నిరాశ చెందారు. సోషల్‌ మీడియాలలో వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, ముంబై ఇండియన్స్ జట్టు తన అధికారిక ఖాతా ద్వారా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ మధ్య కుస్తీ పోటీ ఉంటుంది. కాగా, ఇతర ముంబై ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ జంటగా కనిపించారు. ఈ రెజ్లింగ్ వీడియోను ముంబై ఇండియన్స్ తమ అభిమానుల కోసం తమ సోషల్ మీడియా ఖాతాలో అప్‌లోడ్ చేశారు.

హీరో దెయ్యాన్ని ప్రేమిస్తే? ఆసక్తికరంగా లవ్ మీ ట్రైలర్
యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించిన ఈ సినిమాకి ‘ఇఫ్ యు డేర్’ అనేది టాగ్ లైన్. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గురువారం నాడు ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ పరిశీలిస్తే హీరోకి ఒక అలవాటు ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక పని చేయకూడదు అని చెబితే, ఆ పని చేసేవరకూ అతనికి నిద్ర పట్టదు. ఇలాంటి హీరోకి ఒక దెయ్యం గురించి తెలియడంతో అటు వైపు వెళ్లొద్దని అతని సన్నిహితులు చెబుతున్నా వినకుండా ఆ దెయ్యం దగ్గరికి వెళ్లి తీరాలని నిర్ణయించుకుంటాడు. హీరో దెయ్యంతో రొమాన్స్ చేయాలనే ఒక ఆలోచనలో ఉంటాడు. ఈ విషయంలో ఎవరు ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా ముందుకు వెళతాడు. ఈ క్రమంలో ఏం జరుగుతుంది? అనేది కథ. నిజానికి ఇది కాస్త చిత్రంగా అనిపించినా, కొత్తగా అయితే ఈ పాయింట్ టచ్ చేశారనిపిస్తోంది. ఇక ఈ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అరుణ్, నాగ ఈ చిత్రానికి బలం. ఇంత వరకు నేను దర్శకుల్ని పరిచయం చేశా, మొదటి సారి నాగను నిర్మాతగా పరిచయం చేస్తున్నా ట్రైలర్ చూస్తే టీం పడ్డ కష్టం తెలుస్తుంది. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ కానుంది. ఆడియెన్స్‌కు నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. మే 25న ఈ సినిమా ప్రేక్షకులను నచ్చి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సినిమా టీం అందరికీ థాంక్స్. యంగ్ టీం అంతా కలిసి కొత్త కథతో కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు వస్తున్నారు’ అని అన్నారు.

చంపుకోండి.. .పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ కి లయ షాక్!
ఒకప్పుడు హీరోయిన్గా అనేక సినిమాలు చేసి తర్వాత వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. లయ చాలా కాలం తర్వాత ఆమె తిరిగి ఇండియా రావడం కాక వరుసగా యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉండడంతో ఆమె టాలీవుడ్ రి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తుందని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే నితిన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ఆమె నితిన్ అక్క పాత్రలో నటిస్తోంది. అలా ఆమె టాటా బిర్లా మధ్యలో లైలా సినిమా తర్వాత తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఆమె ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాంకి అతిథిగా హాజరైంది. త్వరలో ప్రసారం కాబోతున్న ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో ద్వారా అనేక విషయాలను అలీ రాబట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా లయ అమెరికా వెళ్లి అక్కడ ఇబ్బందులు పడుతోందని రోడ్డు మీద అడుక్కునే స్థితిలో ఉందంటూ వచ్చిన రూమర్స్ గురించి అలీ ప్రశ్నిస్తే ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఏమీ లేకుండా ఎందుకు ఇలాంటి వార్తలు పుట్టిస్తారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు అడుక్కోవడం కంటే దారుణమైన విషయాలు కూడా చేసినట్లు ప్రచారం చేశారని, అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది. ఇక అలీతో నటించిన సినిమాల గురించి కూడా ఆమె ప్రస్తావించింది. అప్పటి సినిమా గుర్తులను పంచుకుంది, ఇక తన సినిమా కెరియర్ లో కొన్ని తప్పులు కూడా చేశానని ఆమె కామెంట్ చేసింది.