విశాఖలో ఎకరంతో తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు.. హైదరాబాద్ దాటితే ఏముంది..?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేతల మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది.. తాజాగా ఇప్పుడు భూముల రేట్లు కూడా ఇరు రాష్ట్రాల మధ్య విమర్శలు, కౌంటర్లకు దారి తీస్తోంది.. అయితే, ఈ భూముల విషయాన్ని ముందు ప్రస్తావించింది మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ‘ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే.. తెలంగాణలో నాలుగెకరాలు కొనేవాళ్లు.. కానీ, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు, వందెకరాలు కూడా కొనే పరిస్థితి వచ్చింది’ అని తెలిపారు చంద్రబాబు.. అయితే, పటాన్‌చెరులో ప్రస్తుతం ఉన్న భూమి ధరను ప్రస్తావిస్తూ.. చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తు చేశారు సీఎం కేసీఆర్.. పటాన్‌చెరులో ఇప్పుడు రూ.30కోట్లు పలుకుతోంది.. చంద్రబాబు అన్నట్లుగా ఆంధ్రాకు వెళ్లి వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చు. ఇంకా, నేను కలలుగన్న బంగారు తెలంగాణ సాకరమై తీరుతుంది అని వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్.. గతంలో ఏపీలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనవచ్చునని చంద్రబాబు చెప్పేవారని, ఇప్పుడు భూముల ధరల విషయంలో ఏపీ, తెలంగాణలో పరిస్థితి తారుమారైందన్న కేసీఆర్.. తెలంగాణలో గత కొన్నేళ్లలో భూముల ధరలు భారీగా పెరిగాయని, ఏపీలో తగ్గాయన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పారని, మంచి ప్రభుత్వం, అభివృద్ధితో భూముల ధరలు పెరుగుతాయన్నారు. అయితే, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు.. భూముల ధరలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడారో తెలియదన్న ఆయన.. మా విశాఖలో కూడా ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు అని చెప్పుకొచ్చారు.. తెలంగాణలో హైదరాబాద్ కాకుండా బయటకు వెళ్తే భూములకు ధర ఎక్కడుంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన మాటలు మాట్లాడితే కేసీఆర్ మాటలని కూడా ప్రజలు నమ్మరని సూచించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలా..? ఓ వైపు పొత్తు కోసం ప్రయత్నిస్తూనే..!
తెలుగుదేశం పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి.. వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలెందుకు అచ్చెన్నాయుడు..? అంటూ నిలదీశారు.. ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా తెలుగుదేశం పార్టీ తీరు ఉందని ఎద్దేవా చేసిన ఆయన.. చాలా ఎన్నికల్లో పోటీ చేయలేక పారిపోయారు.. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వైఫల్యాలపై నిలదీయలేకపోయారు.. ఇప్పుడు కేంద్రం, బీజేపీ చర్యలు తీసుకోవాలని ప్రకటనలు ఎందుకు ? అంటూ మండిపడ్డారు.. రాష్ట్రాల శాంతి భద్రతల్లో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం 2018-19 సమయంలోనే రాష్ట్రపతి పాలన వచ్చేది కాదా ? అని ప్రశ్నించిన ఆయన.. ఓ వైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ.. మరో వైపు పార్టీని దెబ్బతీసే ప్రకటనలు ఎందుకు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూటర్నులతో ఏ మాత్రం విశ్వాసం లేని రాజకీయాలు చేసే పార్టీ టీడీపీ అని మండిపడ్డారు విష్ణువర్దన్‌రెడ్డి.. చేతనైతే వైసీపీపై పోరాడాలని ప్రతీదానికి బీజేపీ ప్రస్తావన మానుకోవాలని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సూచించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును విమర్శించే నైతిక హక్కు అచ్చెన్నకు లేదన్నారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి.
ఏపీలో పారిశ్రామిక విప్లవం.. చంద్రబాబు నుంచే పవన్‌కు ప్రాణహాని..!
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవం రాబోతుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో చేసిన ఎంఓయూలను గ్రౌండ్ చేశాం.. రికార్డు సమయంలో గోద్రెజ్ సంస్థను ఏర్పాటు చేశాం అన్నారు.. ప్రభుత్వం వేగంగా సహకరిస్తోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని గుర్తుచేసుకున్న ఆయన.. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుంది.. ఏపీకి గతంలో ఎన్నడూ రాని పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం పరిశ్రమలు వెళ్లి పోతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.. మేం ఏ పరిశ్రమని ఇబ్బంది పెట్టామో చెప్పాలి అని డిమాండ్ చేసిన ఆయన.. చంద్రబాబు హెరిటేజ్ ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టమా..? చంద్రబాబు చూపించాలన్నారు. ఇక, పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు పేరు సార్ధకం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు గుడివాడ.. ఒకే రోజు రెండు పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అందుకే సీఎం జగన్ ఆయనకి దత్తపుత్రుడు అని పేరు పెట్టారన్న ఆయన.. హైదరాబాద్ పారిపోయింది చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లే కదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. సింపతీ కోసం పవన్ కల్యాణ్ ప్రాణహాని ఉందని ఆరోపణ చేస్తున్నాడని మండిపడ్డారు మంత్రి.. అయితే, చంద్రబాబు వల్లే పవన్ కి ప్రాణహాని ఉండొచ్చు అంటూ సంచలన ఆరోపణల చే శారు.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని చంపేద్దమనుకున్న వ్యక్తి చంద్రబాబు.. కానీ, చంద్రబాబు బిస్కెట్ల కోసం కాపులను తాకట్టు పెట్టాలని పవన్ కల్యాణ్ చూస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
100వ రోజుకు చేరిన భట్టి విక్రమార్క పాదయాత్ర
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వందో రోజుకు చేరువైంది.. విక్రమార్క పాదయాత్ర 100వ రోజు శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి నుంచి ఉదయం 7:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుండగా.. కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. ఉప్పల్ పహాడ్ గ్రామంలో లంచ్ బ్రేక్ ఏర్పాటు చేయనున్నారు.. రాత్రికి కొప్పోలు గ్రామంలో బస చేయనున్నారు భట్టి విక్రమార్క.. అనారోగ్య సమస్యకారణంగా తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన భట్టి విక్రమార్క.. రేపటినుండి తిరిగి పీపుల్స్ మార్చ్‌ని ప్రారంభించనున్నారు.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పాదయాత్ర చేయవచ్చని డాక్టర్లు సూచించడంతో.. డాక్టర్ల సూచన మేరకు రేపటినుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు..
పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రిలో మృతి.. పోలీసుల వేధింపులే కారణమా..?
నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆకాష్ అనే యువకుడు తిరుపతిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆకాశ్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ.. మిత్రులు.. కుటుంబ సభ్యులు సైదాపురం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని బైఠాయించారు. ఒక కేసు విచారణ నిమిత్తం ఆకాష్ మీ పలుమార్లు స్టేషన్.కు పిలిచి ఎస్.ఐ. నాగబాబుతో పాటు కొందరు కానిస్టేబుళ్లు వేధింపులకు గురి చేశారని బంధువులు ఆరోపించారు. పోలీసులపై చర్య తీసుకునే వరకూ ఆందోళన విరమించబోమని కుటుంబ సభ్యులు.. స్థానిక ప్రజలు స్పష్టం చేశారు.. దీంతో ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకుని బంధువులతో చర్చలు జరిపారు. సైదాపురంలో పరిస్థితిని జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర్ రెడ్డికి తెలియజేయడంతో ఆయన స్పందించారు. పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మ హత్యాయత్నానికి పాల్పడటంలో సిబ్బంది నిర్లక్ష్యం ఉందని గుర్తించారు. కస్టోడియల్ డెత్ గానే భావించి ఎస్‌ఐ నాగబాబు.. కానిస్టేబుల్ వీరభద్రంలను సస్పెండ్ చేశారు. ఘటనపై కావలి డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. ఈ విషయాన్ని డీఎస్పీ తెలియజేసినా వారు శాంతించలేదు. ఎస్.ఐ.ని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేయడంతో సైదాపురం.. రాపూరు రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు నచ్చ చెబుతున్నా ఆందోళన కారులు అంగీకరించలేదు. ఆకాష్ మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని పట్టుపట్టారు.. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కోటారెడ్డి హామీ ఇచ్చారు. ఆందోళనకారులతో డీఎస్పీ చర్చలు జరుపుతున్నారు.
దమ్ముంటే చర్చకు రావాలని.. సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్
కొంతకాలం నుంచి మౌనం పాటిస్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాజాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తమ పాలనలో పోలీసుల చేత ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేయిస్తూ.. వారు మాత్రం దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. హుజురాబాద్‌లో ప్రజా ప్రతినిధులు, ప్రెస్ మిత్రులపై కూడా దౌర్జన్యం చేస్తున్నారన్నారు. తమవారిని కాపాడుకునే క్రమంలో.. ప్రజలు మీపై దాడికి దిగే సమయం కూడా వస్తుందని హెచ్చరించారు. దశాబ్ది వేడుకల కారణంగా విద్యార్థి చనిపోయాడు కాబట్టి.. అతని కుటుంబాన్ని మీరే ఆదుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే చర్చించేందుకు స్వయంగా హుజూరాబాద్ రావాలని, సైకోలను పంపించడం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకం ద్వారా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ రూ.10 లక్షలు పూర్తిగా రాలేదని, వెంటనే పూర్తిగా దళిత బందు ఇవ్వాలని కోరారు. బీసీ బందు కేవలం ఎలక్షన్ల కోసమేనన్న ఆయన.. బీజీలకు ఇచ్చినట్లు అన్ని కులాల వారికి కూడా రూ.1 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయం ప్రభుత్వ కార్యాలయమని, అదేం నీ జాగీరు కాదని విరుచుకుపడ్డారు. ప్రగతి భవన్ కూడా ప్రజల సొమ్ముతో కట్టిందేనన్నారు. నిరుద్యోగ యువకులు, మహిళలు, రైతులు, మేధావుల కళ్లల్లో ఈ ప్రభుత్వం కట్టి కొట్టిందని.. అందరూ ఓసారి ఆలోచించాలని సూచించారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే రోజు తప్పకుండా వస్తుందన్నారు. ఉద్యమ కారులపై రాళ్లు రువ్వి దౌర్జన్యం చేసిన వ్యక్తే.. ఇప్పుడు పదవిలో ఉన్నాడని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.
పట్టపగలే బీహార్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
బీహార్‌లోని దర్భంగాలో పట్టపగలు కాల్పులు జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఇక్కడ నలుగురు వ్యక్తులను నేరస్థులు కాల్చిచంపారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చారు. బహెదీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమేథిలో ఈ ఘటన జరిగింది. హత్య వెనుక పరస్పర ఆధిపత్య పోరు ఉందనే చర్చ జరుగుతోంది. నిమేథి చౌక్ సమీపంలో మెరుపుదాడి చేసిన నేరస్థులు సఫారీపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని చెబుతున్నారు. బుల్లెట్ తగిలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా సఫారీ వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఒకరిని అనిల్ సింగ్ గా గుర్తించాడు. ఆయన కార్పొరేషన్ కార్మికుడు. ఈయనది ఓఝౌల్ గ్రామం. అతనిపై గతంలో కూడా చాలాసార్లు దాడి జరిగింది. ఆ సమయంలో తృటిలో తప్పించుకున్నాడు. అయితే గురువారం నేరస్థుల బుల్లెట్లకు బలి అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాల్పులకు గురైన అనిల్ సింగ్ నేర నేపథ్యం ఉన్నవాడు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. అనిల్ సింగ్ హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతున్నారు. పట్టపగలు జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
ఆర్టెమిస్ ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు.. 2024లో సంయుక్తంగా మిషన్
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై కీలక ఒప్పందం కుదిరింది. ఆర్టెమిస్ ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు చేశాయని వైట్‌హౌస్ గురువారం ప్రకటించింది. దీంతో 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంయుక్త మిషన్‌ను ప్రయోగించేందుకు ఇస్రో, నాసా అంగీకరించాయి. జో బిడెన్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా ఓవల్ ఆఫీస్‌లో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల మధ్య సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ అధికారి మాట్లాడారు.. మానవాళి ప్రయోజనం కోసం అంతరిక్ష పరిశోధన నిమిత్తం ఆర్టెమిస్ ఒప్పందంపై భారతదేశం, అమెరికా సంతకాలు చేయబోతున్నాయని చెప్పారు. ఆర్టెమిస్ ఒప్పందాన్ని 2020లో నాసా ప్రతిపాదించింది. ఆర్టెమిస్ ఒప్పందం పౌర అంతరిక్ష అన్వేషణలో ఒకే ఆలోచన కలిగిన దేశాలను ఒకచోట చేర్చింది. ఆర్టెమిస్ ఒప్పందం 1967 ఔటర్ స్పేస్ ట్రీటీపై ఆధారపడింది. ఆర్టెమిస్ ట్రీటీ అనేది 21వ శతాబ్దంలో పౌర అంతరిక్ష పరిశోధనలకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే నాన్-బైండింగ్ సూత్రాల ‘సెట్’. 2025 నాటికి మరోసారి చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.
హాట్ పోజులతో పిచ్చెక్కిస్తున్న ముదురు భామ..
బాలివుడ్ సీనియర్ బ్యూటీ మలైక అరోరా గురించి ఎంత చెప్పినా తక్కువే..ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది… రోజూ రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. ఈ వయస్సులో క్లివేజ్ షో లతో హీటేక్కిస్తుంది..49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.. సినిమాల్లో ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ఆసక్తి కనబరుస్తుంది.. ఈ అమ్మడు గ్లామర్ ఫిట్నెస్ పరంగా ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న శ్రద్దే.. ఎప్పుడూ సమయం దొరికినా కూడా యోగా, జిమ్ లో కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ ను పెంచుతుంది..తెలుగులో కూడా ఈ అమ్మడు ఐటమ్ సాంగ్ చేసింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే… ఆ పాట ఇప్పటికి జనాల్లో వినిపిస్తూనే ఉంది..
డిస్నీ+ హాట్‌స్టార్ పరువు తీశారంటే.. ‘పంది’తో గొడవ పడలేనంటున్న డైరెక్టర్!
ఒకప్పుడు తెలుగు దర్శకులు అలాగే నిర్మాతలు కేవలం సినిమాల వరకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ఓటీటీలు విరివిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ కూడా ప్రొడ్యూస్ చేసేందుకు, డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి క్రమంలో తెలుగులో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న మహి వీ రాఘవ ఇటీవల సైతాన్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు అందరికీ షాక్ ఇచ్చాడు. వాస్తవానికి పాఠశాల అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన ఆయన తర్వాత ఆనందోబ్రహ్మ అనే సినిమాతో హిట్టు అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కించిన యాత్ర సినిమా సూపర్ హిట్ కావడంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ల లీగ్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఈ మధ్యన ఆయన హాట్ స్టార్ కోసం సేవ్ ది టైగర్స్ అనే ఒక వెబ్ సిరీస్ రూపొందించారు. దానికి ఆయన షో రన్నరుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో సొంత నిర్మాణంలో సైతాన్ అనే ఒక వెబ్ సిరీస్ చేశాడు. తెలుగు సహా కన్నడ యాక్టర్స్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించడమే కాదు రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తిగా బూతులతో నిండిపోయిన ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయారు అందరూ. ఎందుకంటే హాట్స్టార్ లో ఇప్పటివరకు వచ్చిన వెబ్ సిరీస్ అన్ని చాలా సెన్సిబుల్గా ఉండేవి. ఈ క్రమంలో హాట్ స్టార్ పరువు తీశారు అంటూ ఒక పోర్టల్ సదరు డైరెక్టర్ మీద ఒక ఆర్టికల్ ప్రచురించింది. దానికి ఆయన ఘాటుగా స్పందించారు. ఈ విషయం మీద నేను చెప్పాలనుకున్నది చెబుదామనుకున్నాను కానీ ఒక విషయం గుర్తొచ్చి ఆగిపోయానని అన్నారు. ఆ విషయం ఏమిటంటే బురదలో పొర్లాడే పందితో మనం గొడవ పడకూడదు ఎందుకంటే ఆ బురద మనకి కూడా అంటుంది , ఆ బురద పందికి ఇష్టమే కానీ మనకు కాదు కదా అంటూ ఆయన ఘాటుగా స్పందించాడు.
మేనేజర్ మోసం.. స్పందించిన రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక ను తన మేనేజర్ మోసం చేశాడంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. దాదాపు రూ.80 లక్షల వరకు రష్మికకు తెలియకుండా కాజేశాడంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో రష్మిక.. మేనేజర్ పై ఫైర్ అయ్యిందని, అతడిని వెంటనే ఉద్యోగంలోనుంచి తీసేసిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా డబ్బులు అడిగితే తాను ఇచ్చేదాన్ని అని, ఇలా నమ్మక ద్రోహం చేయడం తనకు నచ్చదని క్లాస్ తీసుకుందని కూడా ఆ వార్తల సారాంశం. ఇప్పటివరకు ఈ వార్తలపై రష్మిక కానీ, మేనేజర్ కానీ స్పందించింది లేదు. అయితే తాజాగా ఈ వార్తలపై రష్మిక స్పందించింది. మేనేజర్ మోసం చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఆమెతో పాటు మేనేజర్ సైతం వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని చెప్పుకొచ్చారు. “మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మేము స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా మేనేజర్ మోసం చేశాడు.. అందుకే విడిపోతున్నామన్న పుకార్లలో నిజం లేదు. మేము పూర్తిగా ప్రొఫెషనల్స్.. పనికి కట్టుబడి ఉంటాం. ఎవరికి వారు విడిగా ఎదగాలనుకుంటున్నాం” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది. అయితే ఇందులో కూడా నిజం ఎంత అనేది మాత్రం ఎవరికి తెలియదు. నిజంగా మేనేజర్ మోసం చేయకపోతే ఇంత సడెన్ గా మేనేజర్ ను మార్చాల్సిన అవసరం ఏమొస్తుంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం రష్మిక.. పుష్ప 2, యానిమల్ సినిమాల్లో నటిస్తోంది.
కార్తీ బుగ్గకు తన బుగ్గను ఆనించి మరీ ఫోటో దిగిన ఈ సుందరాంగిని గుర్తుపట్టారా..?
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే పొన్నియిన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ ఇప్పుడు జపాన్ తో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇక తాజాగా కార్తీ తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది. కార్తీ పక్కన ఒక సుందరాంగి నిలబడి .. అతని బుగ్గను ఆనించి మరీ ఫోటోకు పోజ్ ఇచ్చింది. దీంతో ఎవరా.. అందగత్తె అని అభిమానూలు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే కొంచెం ఆ సుందరాంగిని తీక్షణంగా చూస్తే అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసిపోతుంది. ఆమె సారీ .. సారీ అతను ఎవరో కాదు కమెడియన్ సంతానం. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సంతానం .. ఇప్పుడు హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఒక సినిమా కోసం సంతానం అమ్మాయి గెటప్ లో రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. ఇక కార్తీ ఈ ఫోటోను షేర్ చేస్తూ కరీనా చోప్రా అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారాయి. వ్వావ్.. కరీనా చోప్రా అద్భుతంగా ఉంది. మీ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వండి అని కొందరు. కోలీవుడ్ లో కొత్త హీరోయిన్ వచ్చింది అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సంతానం కిక్ డీడీ రిటర్న్ సినిమాల్లో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో సంతానం ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
