NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

లింగమనేని రమేష్ పిటిషన్‌.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
లింగమనేని రమేష్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. తమ వాదనలు వినిపించటానికి అవకాశం లేదని తీర్పు ఇచ్చిన కింది కోర్టు తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు లింగమనేని రమేష్ న్యాయవాది.. అయితే, స్టే ఇవ్వటానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది.. అంతే కాదు.. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.. కాగా, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరకట్టపై నివసిస్తున్న లింగమనేని రమేష్ ఇంటి జప్తుకు ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో గత నెలలో సీఐడీ పిటిషన్ వేసింది.. ఇక, విచారణలో లింగమనేని రమేష్‌ కి వాదనలు వినిపించే అవకాశం లేదని కింది కోర్టు తీర్పు వెలువరించింది.. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు లింగమనేని రమేష్‌.. ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలపై ప్రభావం
ఎండల నుంచి ఉపశమనం లభిస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. మంగళవారం నాటికి నైరుతి రుతుపవనాలు రాయలసీమ, దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, నెల్లూరు జిల్లా కావలి వరకు విస్తరించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బీఆర్‌ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.. రేపు పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా.. విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ముద్రగడకు హరిరామ జోగయ్య కౌంటర్‌ లేఖ.. ఇప్పటి వరకు పెద్దమనిషివి అనుకున్నా..!
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను మరింత హీటెకిస్తోంది.. ముద్రగడ లేఖపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రశంసలు కురిపిస్తూ.. పవన్‌ను టార్గెట్‌ చేస్తుంటే.. జనసేన ముద్రగడపై విమర్శలు గుప్పిస్తోంది.. ఇక, సీనియర్‌ నేత హరి రామ జోగయ్య లేఖ ద్వారా ముద్రగడకు కౌంట్‌ ఇచ్చారు.. వారాహి యాత్ర ద్వారా దూసుకుపోతున్న పవన్ కల్యాణ్‌ని అనుసరించాలని కాపు సంక్షేమ సేన ఆశిస్తుందన్న ఆయన.. చిన్న మంత్రి పదవులు ఆశించి.. రెడ్డి కులాధిపతికి కాపులను తాకట్టు పెట్టాలని చూస్తున్న నాయకులను చూసి మోసపోకండి అని పిలుపునిచ్చారు.ఇక, ముద్రగడ పద్మనాభం ఇప్పటివరకు పెద్దమనిషి అనుకున్నాను.. పవన్ కల్యాణ్‌ పై ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో నా నమ్మకానికి తూట్లు పొడిచిందని పేర్కొంటూ సుదీర్ఘమైన లేఖను రాశారు. తెర వెనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికి.. జనసేనకు ఓట్లు పడకుండా చేసింది ముద్రగడ కాదా..? అంటూ లేఖలో దుయ్యబట్టారు. లక్షలాదిమంది కాపులు లక్ష్యానికి చేరువవుతున్న నేపథ్యంలో.. దానిని చెడగొట్టేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం వెనుక సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హస్తం లేదా? అని ముద్రగడను నిలదీశారు హరి రామజోగయ్య.

వ్యక్తుల్లో మంచి, చెడు చూడాలి.. మతం కాదు..
రాజకీయ స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తిని కాదు.. జనసేన ప్రభుత్వంలో ముస్లింల జీవన ప్రమాణస్థాయిని పెంచుతామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ముస్లింల హక్కులకు భంగం వాటిల్లకుండా జనసేన చూసుకుంటుంది అని కాకినాడలో జరిగిన ముస్లిం ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేశారు.. భారతదేశంలో ముస్లింలు ఏనాటికీ మైనారిటీలు కారని, ఈ దేశం మనందరిదీ అని తెలిపారు.. ముస్లింల భద్రత, గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా జనసేన పార్టీ చూసుకుంటుందని చెప్పారు. దేశవిభజన సమయంలో జరిగిన మతఘర్షణల వల్ల 10 లక్షలమంది మరణించారు. కొంతమంది హిందువులు పాకిస్థాన్‌లో ఉండిపోతే మరికొంతమంది భారత్‌లో ఉండిపోయారు. ముస్లింలు కూడా మా సోదరులు అనుకోబట్టే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు. అజారుద్దీన్ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యారని గుర్తుచేశారు.. వ్యక్తుల్లో మంచి, చెడు మాట్లాడుకోవాలి.. తప్ప మతం గురించి కాదని వ్యాఖ్యానించారు పవన్‌ కల్యాణ్.

రాజకీయ కక్షలతోనే ఐటీ దాడులు
ఈడీ, ఐటీ దాడులు అనంతరం నాగర్ కర్నూల్‌కి మొదటిసారి ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాజిపేట మండలం మరికల్ దగ్గర కార్ల ర్యాలీగా ఎమ్మెల్యే కి స్వాగతం పలికారు బీఆర్ఎస్ శ్రేణులు. జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ ఎదుట ఎమ్మెల్యేకి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా నేను వ్యాపారంలో ఉన్నానని, మూడుసార్లు ఈ దాడులు జరిగినా.. మూడు సార్లు క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. రాజకీయ కక్షల తోనే ఈ దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్థానికంగా పలుకుబడి లేదని, నాయకత్వ లోపం వుందన్నారు. ప్రజల్లో బలంగా మంచి పేరు ఉన్న వ్యక్తులను బీజేపీ టార్గెట్ చేస్తుందని, భయపెట్టి వారినీ పార్టీలోకి తీసుకోవాలని ఉద్దేశంతో ఈ దాడులు చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొంతమంది కావాలనే నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
కరీంనగర్ జిల్లా గ్రంధాలయంలో రీడింగ్ హాల్‌ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జి ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాకర్ షో.. డిజిటల్ స్క్రీన్స్ తో ప్రారంభ కార్యక్రమాలు ఉంటాయని, రెండ్రోజుల పాటు ఈ కార్యక్రమాలు సాగుతాయన్నారు. నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సుందరికరణ పనులు కేటీఆర్ ప్రారంభిస్తారని, ఆగస్టు 15 తరువాత మానేరు రివర్ ఫ్రంట్ అందుబాటులోకి వస్తుందన్నారు. గత ఐదేళ్లలో నగరం రూపురేఖలు మార్చేసాము… గొప్పగా అభివృద్ధి చేశాం.. చెప్పిన పనులు పూర్తిచేసామని, నగరంలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి.. ప్రజల శాంతితో ఉన్నారన్నారు. దేశానికి రెండో రాజధాని అంశం ఎన్నికలు రాగానే తెరపైకి వస్తాయన్న మంత్రి గంగుల.. మాది ఢిల్లీ పార్టీ కాదు తెలంగాణ పార్టీ అని వ్యాఖ్యానించారు.

ట్రక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. లారీలో తప్పనిసరిగా అది ఉండాల్సిందే
ఎండాకాలం, చలికాలం, వానల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ డ్రైవింగ్ చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు పెద్ద ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక చర్య తీసుకుంది. దీని కారణంగా వారు ఆనందంగా డ్రైవ్ చేయగలుగుతారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ 2025 నుండి అన్ని ట్రక్కు క్యాబిన్‌లను తప్పనిసరిగా ఎయిర్ కండిషన్ (AC) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనివల్ల డ్రైవర్లు సులువుగా డ్రైవింగ్ చేయడంతోపాటు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. కంపెనీలు ట్రక్కుల ధరలను పెంచాయని కొంతకాలంగా ప్రజలకు ఫిర్యాదులు వస్తున్నాయని, అయినప్పటికీ క్యాబిన్‌లో ఏసీ సౌకర్యం కల్పించడం లేదని నితిన్ గడ్కరీ అన్నారు. ట్రక్ డ్రైవర్ క్యాబిన్‌లో ఏసీ ట్రక్ క్యాబిన్‌లను తప్పనిసరి చేసే ఫైల్‌పై తాను ఈ రోజు సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు. వేసవి, చలి, వాన సమయాల్లో ట్రక్కు డ్రైవర్లు పగలు, రాత్రుళ్లు డ్రైవింగ్ చేస్తారు.. అయితే వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ట్రక్కు పరిశ్రమను అప్‌గ్రేడ్ చేయడానికి 18 నెలల గడువు ఇచ్చారు.

పెళ్లి కాసేపట్లో అనగా ప్రియుడితో సోదరి జంప్.. కోపంతో పిండం పెట్టిన సోదరుడు
బీహార్‌లోని పూర్నియాలో పెళ్లికి ఒకరోజు ముందు ఓ అమ్మాయి తన ప్రేమికుడితో కలిసి పారిపోయింది. కాగా ఆమె పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పసుపుతో గోరింట ఆచారం కూడా పూర్తయింది. మరుసటి రోజు పెళ్లి ఊరేగింపు రావాల్సి ఉంది. దీనికి ముందే ఆమె తన ప్రేమికుడితో పారిపోయి, పెళ్లి చేసుకుని, తన కుటుంబ సభ్యులకు ఫోటో వీడియోలను పంపింది. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన బాలిక సోదరుడు తన సోదరిని బతికుండగానే అంత్యక్రియలు నిర్వహించి పిండ ప్రదానం చేశాడు. కోపంతో ఉన్న సోదరుడు తన సోదరి దిష్టిబొమ్మను తయారు చేసి పాడెపై అలంకరించాడు. అతను తన సోదరి చిత్రాలను కూడా దానిపై ఉంచాడు. అనంతరం రాముని నామస్మరణ చేస్తూ శ్మశాన వాటికకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో పాటు తన సోదరి పేరుతో పిండప్రదానం చేశాడు. పూర్ణియలోని టికపట్టిలో నివసించే ఇంటర్ విద్యార్థిని స్వీటీ వివాహం ఆమె కుటుంబ సభ్యులు నిశ్చయించినట్లు చెబుతున్నారు. వివాహానికి ముందు, పసుపు గోరింట వేడుక ఉంది. మరుసటి రోజు పెళ్లి ఊరేగింపు రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. ఇంతలో బాలిక ఇంటి నుంచి పారిపోయింది. వాస్తవానికి స్వీటీకి మండలం టిక్కపట్టికి చెందిన అరుణ్ కుమారుడు సుధాంశు కుమార్‌తో ప్రేమ వ్యవహారం ఉంది. పెళ్లికి ఒకరోజు ముందు తన ప్రేమికుడితో కలిసి పారిపోయి, ప్రేమికుడితో పెళ్లి చేసుకుని ఆ ఫొటోను కుటుంబ సభ్యులకు పంపింది. అదే సమయంలో.. స్వీటీ తన ప్రేమికుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తన భర్తపై తన సోదరుడు పెట్టిన కిడ్నాప్ కేసు అబద్ధమని చెప్పింది. తన ఇష్టానుసారం ప్రేమికుడితో వెళ్లానని, ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని.. వారిద్దరూ పెళ్లికి పెద్దలయ్యారని బాలిక పోలీసులకు తెలిపింది.

వైట్ డ్రెస్సులో తమన్నా కిల్లింగ్ పోజులు..
మిల్క్ బ్యూటీ తమన్నా వైట్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్ లో మెరుస్తున్న స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కిర్రాక్ పోజుల తో తన ఫ్యాషన్ సెన్స్ చూపిస్తూనే హాట్ పోజులతో మత్తెక్కిస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. ఇప్పుడు అడపాదడపా సినిమాల తో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది.. తమన్నా ఇటు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూనే అటు బాలీవుడ్ లోనూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు తమన్నా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరించింది. తన అభిమానులను ఫిదా చేసింది. ఇకపై అలాంటి సినిమాలే వస్తాయని భావించే లోపు పెద్ద షాక్ ఇచ్చింది.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.. ఈ అమ్మడు జీ కర్దా’ అనే సిరీస్ లో తమన్నా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సిరీస్ లో ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో మైండ్ బ్లాక్ చేసింది.. గత కొద్ది రోజులుగా ఈ సిరీస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

న్యూ లుక్ లో అదరగొడుతున్న తారక్..
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉన్నాడు.. మరోవైపు బ్రాండ్‌ ఎండార్స్ మెంట్స్‌తో కూడా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ దేవర సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా యాక్షన్‌ డ్రామాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తారక్‌ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బ్రాండ్‌ ఎండార్స్ మెంట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయాడు.. ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్ తారక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారాడు. పాపులర్ జ్యువెల్లర్‌ కంపెనీ మలబార్‌ గోల్డ్‌ అండ్ డైమండ్స్‌ కు జూనియర్‌ ఎన్టీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్టు ప్రకటించారు.. తారక్ స్టైలిష్ లుక్‌లో ఉన్న స్టిల్‌ను షేర్ చేసింది కంపెనీ. తారక్‌ కుర్తా పైజామాలో మెస్మరైజింగ్ గెటప్‌లో కనిపిస్తూ.. అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ న్యూ లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తారక్‌ ఇటీవలే McDonald బ్రాండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.. ఆ యాడ్ వీడియో కూడా నెట్టింట ట్రెండ్ అవుతుంది..

థమన్ ఉన్నాడు కానీ పూజా ఔట్.. అసలు కారణం అదేనట?
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉంది. ఆసక్తికరంగా ఈ సినిమా నుంచి అసలు ఎందుకు పుట్టుకొచ్చిందో ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు కానీ థమన్ తప్పుకుంటున్నాడని ఆయన స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ కు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయంటూ ఒక పుకారు తెరమీదకు వచ్చింది. ఇంకేముంది థమన్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తప్పిస్తున్నారని వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దెబ్బకి అది నిజం కాదని స్వయంగా నిర్మాత క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అలా సద్దుమణిగిందో లేదో ఇప్పుడు మరో వార్త తెర మీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే ఈ సినిమా తప్పు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ అవుతుందని సెకండ్ హీరోయిన్ గా మరో హీరోయిన్ ని రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి పూజా హెగ్డే బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలకు ఈ సినిమాలకు డేట్స్ కుదరడం లేదు, గుంటూరు కారం సినిమా షూటింగ్ రెండుసార్లు వాయిదా పడేందుకు పూజా హెగ్డే కారణమైందని, ఎంత ప్రయత్నించినా ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేక ఆమెను తప్పించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.