NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

16,347 పోస్టులతో మెగా డీఎస్సీ.. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అంటే..?
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సచివాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టిసారించారు.. అందులో భాగంగా వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు.. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తూ రెండో ఫైల్‌పై సతకం.. పెన్షన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో ఫైల్‌పై సంతకం.. అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం 4వ సంతకం, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు మెగా డీఎస్సీ కీలకంగా మారింది.. ఒకే సారి 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సిద్ధం అవుతోంది ఏపీ సర్కార్‌.. ఇక, సీఎం చంద్రబాబు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేయగా.. ఆ మెగా డీఎస్సీ ద్వారా ఏ కేటగిరిలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్న విషయాన్ని వెల్లడించింది ప్రభుత్వం.. 16,347 పోస్టుల మెగా డీఎస్సీ ద్వారా.. ఎస్జీటీలు పోస్టులు 6,371.. పీఈటీ పోటస్లు 132, స్కూల్‌ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు 7,725, టీజీటీ పోస్టులు 1,781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపాల్స్ పోస్టులు 52 భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది..

ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో చంద్రబాబు భేటీ.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు… ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టిసారిస్తూ.. మొదటి రోజే ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.. ఆ తర్వాత.. సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కొద్దిసేపు సమావేశం అయ్యారు.. ఈ భేటీలో సీఎం చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.. గడచిన ఐదేళ్లలో కొందరు అఖిల భారత సర్వీసు అధికారుల వైఖరి తనను బాధించిందన్నారు ఏపీ సీఎం… ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్న ఆయన.. 95 నుంచి వివిధ దఫాలు సీఎంగా ఉన్నా.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు.. అయితే, గడచిన ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని సూచించారు.. మరోసారి శాఖల వారీగా ఐఏఎస్ , ఐపీఎస్ లతో సమావేశం అవుతానని ఈ సందర్భంగా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

అలర్ట్ అయిన వైసీపీ..! రంగంలోకి వైవీ సుబ్బారెడ్డి..
గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GVMC) కార్పొరేటర్లతో వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.. మేయర్ పీఠంపై కూటమి కన్నేయడంతో అలర్ట్ అయిన వైసీపీ.. వైవీని రంగంలోకి దింపింది.. కార్పొరేటర్లలో కొంత మంది టీడీపీ, జనసేనకు టచ్ లో వున్నారని విస్తృత ప్రచారం నేపథ్యంలో.. వైవీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.. ఎటువంటి అపోహలకు, ప్రలోభాలకు ఆస్కారం ఇవ్వవద్దని కార్పొరేటర్లకు సూచించారు సుబ్బారెడ్డి.. ఈ సమావేశంలో మాజీమంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు. ఇక, మీడియాతో వైవీ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేషన్ లు, స్థానిక సంస్థలలో ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది.. అలాంటి ప్రలోభాలకు లొంగకుండా అందరం కలిసి సమిష్టి సమీక్షలు నిర్వహిస్తున్నాం అన్నారు. దాడులకు కూడా భయపడ వద్దని, పార్టీ ఆదుకుంటుందని శ్రేణులకు భరోసా ఇస్తున్నాం.. కార్యకర్తలకు అన్నీ విధాలుగా పార్టీ అందుబాటులో ఉంటుంది, ఆదుకుంటుంది అన్నారు. ఎన్డీఏకు కూడా పూర్తి స్థాయి మెజారిటీ లేని పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు కీలకం కానున్నాయన్న ఆయన.. పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ కి 15 మంది ఎంపీలు ఉన్నారు.. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం అని ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి.

గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్.. అప్పటి నుంచే పెంచిన పెన్షన్‌ అమలు..
పెన్షన్‌దారులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ రోజు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. తొలిరోజు ఐదు ఫైన్లపై సంతకాలు చేశారు.. ఇక, ఆ తర్వాత సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు.. గత ప్రభుత్వాన్ని ఎండగడుతూనే.. తన ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను వెల్లడించారు.. ఈ సందర్భంగా పెన్షన్‌ దారులకు శుభవార్త చెప్పారు.. గడచిన ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ అమలు చేస్తామన్న ఆయన.. జులై ఒకటో తేదీన వృద్ధులకు గత 3 నెలల పెంచిన పెన్షన్‌తో కలిపి మొత్తంగా రూ. 7 వేలు ఇస్తాం అన్నారు.. భద్రత, భరోసా ఇచ్చేలా ఐదు ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు.. చెప్పిన విధంగా హామీలను నిలబెట్టుకుంటూ సీఎం నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసలు కురిపించారు. గత ఐదేళ్లల్లో జగన్ యువతను గంజాయికి బానిసల్లా చేశారని ఆరోపించిన మంత్రి నిమ్మల… యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేసే ఫైల్‌పై రెండో సంతకం చేశారు. మూడో సంతకం పెన్షన్ల మొత్తాన్ని పెంచే ఫైల్ పై పెట్టారు. నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల ఫైలుపై పెట్టారు. స్కిల్ సెన్సస్ ఫైలు మీద ఐదో సంతకం చేశారని వెల్లడించారు. అయితే, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీకి గతంలో వైఎస్‌ జగన్‌ తెర లేపారు. భూములను దోచుకోవడానికి ల్యాండ్ టైటలింగ్ యాక్టును తెచ్చారు.. అందుకే రద్దు చేశామన్నారు. డాక్యుమెంట్ల మీద.. సర్వే రాళ్ల పైనా జగన్ ఫొటోనే.? అని ప్రశ్నించారు. ప్రైవేటు ఆస్తులను సైతం తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గత ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు.. ఇచ్చిన హామీ మేరకు ఆ యాక్టును రద్దు చేస్తూ ఫైలుపై సీఎం సంతకం చేశారని తెలిపారు. ఇక, గడచిన ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ అమలు చేస్తాం.. జులై ఒకటో తేదీన వృద్ధులకు గత మూడు నెలల పెంచిన పెన్షనుతో కలిపి మొత్తంగా రూ. 7 వేలు ఇస్తాం అని వివరించారు..

జనసైనికులు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి.. 20 తర్వాత నేనే కలుస్తా..
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కీలక భూమిక పోషించి.. కూటమి విజయంలో ప్రత్యేక పాత్ర పోషించి.. తిరుగులేని విజయాన్ని అందుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆ తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. దీంతో ఆయనపై అభినందనలు, శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.. అయితే, ఈ నేపథ్యంలో.. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులకు కీలక విజ్ఞప్తి చేశారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.. త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తాను అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.. ‘ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నలుచెరుల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి.. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీరంగంలో ఉన్నవారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందలు అందిస్తారు.. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారు.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదులు తెలిపిన ఆయన.. రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు.. త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కేంద్ర కార్యాలయం ద్వారా తెలియచేస్తాము.. అభినందలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు పవన్‌ కల్యాణ్‌..

మెగా డీఎస్సీ ద్వారా 10,000 టీచర్‌ పోస్టులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీలో విలీనమైన ఐదు టీఎస్ గ్రామాల భవితవ్యంపై వైఖరి చెప్పాలని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కోరింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సాంకేతికతను అందిపుచ్చుకుని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఎన్‌ఎస్‌ కెనాల్‌ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఉపముఖ్యమంత్రి పాల్గొని విద్యార్థులకు యూనిఫారాలు పంపిణీ చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 10వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. 2000 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ పాఠశాలల పునఃప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. విద్యార్థినుల యూనిఫాంలను మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేయగా, మహిళలకు కటింగ్, బటన్, బటన్‌హోల్ మిషన్లను ఆపరేట్ చేయడంలో శిక్షణ ఇచ్చారు.

పబ్‌జీ వ్యసనం.. మరో ప్రాణం బలి..
మహారాష్ట్రలో మరో పబ్‌జీ సంబంధిత మరణం సంభవించింది. నాగ్‌పూర్‌లోని డ్యామ్ ఓపెన్ పంప్ ఛాంబర్‌ లో పడి 16 ఏళ్ల బాలుడు మరణించాడు. మృతుడిని పుల్కిత్ షహదాద్‌పురిగా గుర్తించారు. జూన్ 11, మంగళవారం సాయంత్రం 4 గంటలకు అంబజారి డ్యామ్ ఓపెన్ పంప్ ఛాంబర్‌లో పడి అతను మరణించాడని పోలీసులు తెలిపారు. పుల్కిత్ తన పుట్టినరోజును తన కుటుంబంతో జరుపుకున్న తర్వాత ఈ విషాద సంఘటన జరిగింది. అందిన సమాచారం మేరకు., షహదాద్‌పురి తన కుటుంబంతో కలిసి కేక్ కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకున్నాడు. ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. వారు జరుపట్క చుట్టూ 15-20 నిమిషాలు నడిచారని, ఆపై వారు పోహా తినేందుకు శంకర్ నగర్ చౌరస్తాకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని పుల్కిత్ స్నేహితుడు పోలీసులకు తెలిపాడు. అయితే పోహా స్టాల్ మూసి ఉండడంతో అంబజారి సరస్సును సందర్శించారు.

మరి కొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ అఫ్ గోదావరి “..ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కించారు.విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది.ఈ సినిమాను సితార ఎంటెర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాత నాగ వంశీ,సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి ఓపెంనింగ్స్ దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.2 కోట్లు వసూలు చేసి దుమ్ము రేపింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లంకల రత్న పాత్రలో తన మాస్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన 15 రోజుల్లలోనే ఓటిటిలోకి వస్తుండటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.ఈ మూవీని జూన్ 14 న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.రేపు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటిటిలోకి స్ట్రీమింగ్ కానుంది.మరి కొన్ని గంటల్లో అనగా ఈ అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటిటి లోకి అడుగుపెట్టబోతుంది.ఈ సినిమాకోసం ఓటిటి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

ప్రపంచ నేతల్ని “నమస్తే”తో పలకరించిన ఇటలీ పీఎం జార్జియా మెలోని.. మీమ్స్‌తో నెటిజన్ల రచ్చ..
ఇటలీ వేదికగా జీ-7 సదస్సు జరగబోతోంది. జూన్ 13-14 తేదీల్లో అపులియాలో ఈ సమ్మిట్ జరగబోతోంది. జీ-7లో గ్రూప్‌లోని అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యూకే దేశాధినేతలు ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వయంగా ఆహ్వానించారు. పీఎం మోడీ కూడా ఈరోజు ఇటలీ బయలుదేరారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ తన తొలి విదేశీ పర్యటనకు ఇటలీని ఎంచుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రపంచ దేశాధినేతల్ని, ప్రపంచస్థాయి సంస్థల అధిపతుల్ని స్వయంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. అయితే, ప్రస్తుతం ఆమె ఆహ్వానించిన పద్ధతి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ సంప్రదాయమైన ‘‘నమస్తే’’తో వివిధ దేశాధినేతల్ని ఆహ్వానిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. గతంలో ప్రధాని నరేంద్రమోడీ, జార్జియా మెలోనికి సంబంధించిన మీమ్స్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి జార్జియా మెలోనీ నమస్తే పలకరింపుతో వైరల్ అయ్యారు. దీనిపై నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు. వివిధ రకాల మీమ్స్‌తో స్పందిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు మెలోని నెటిజన్లు జార్జియా మెలోనీ నమస్తేతో పలకరిస్తున్న వీడియోలను పాయింట్ చేశారు.

ఇకపై ఫోన్‌ నంబర్‌కూ ఛార్జీ.. ట్రాయ్‌ కొత్త సిఫార్సు..?
ఫోన్ వాడే కోట్లాది మంది భారతీయులపై మరో అదనపు భారం పడబోతోంది. ఇందుకు సంబంధించి కేంద్రం రంగాన్ని సిద్ధం చేస్తోంది. కొద్దీ రోజుల క్రితం సిమ్ కార్డు పొందేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉండేది. ఆపై టెలికాం కంపెనీల మధ్య పోటీ వల్ల ప్రతి కంపెనీ ఉచితంగా సిమ్ కార్డులు జారీ చేసాయి. ఇంకేముంది మన దేశంలో చాలా మంది ఉచితం అంటే చాలు.. అమాంతం ఎగబడి పోతారు. ఇదే ఆలచనలో చాలా మంది ఇష్టానుసారం సిమ్ కార్డులు తీసుకుని, కంపెనీలు అందించిన ప్రయోజనాలు వాడుకున్నాక పక్కన పడేసేవారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లకు.. ప్రతి ఒక్కరికి ఫోన్ నంబర్ల జారీపై గరిష్ఠ పరిమితి విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ దెబ్బతో ఈ తరహా దుర్వినియోగం బాగా తగ్గిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కొత్త సిఫార్సులను సిద్ధం చేసింది. అందులో ఫోన్ నంబర్లకు, ల్యాండ్ లైన్ నంబర్లకూ ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది ట్రాయ్. ఇందుకు గాను ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. ఇదేకాని నిజమైతే., ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం చేస్తే మొబైల్ ఆపరేటర్ల నుంచి తొలుత ఈ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఆపై కంపెనీలు వినియోగదారుల నుంచి రికవరీ చేసుకునే అవకాశం కనపడుతుంది. ఫోన్ నంబర్లు సహజ వనరుల మాదిరిగానే కూడా చాలా విలువైనవిగా అని ట్రాయ్ భావిస్తోంది. ఈ చేతనే కాస్త ఛార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.

వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్స్ అదుర్స్..
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్ ఫోన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే లుక్ తో వస్తున్నాయి.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు.. ఆ ఫోన్ పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.. వివో వై58 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను జులైలో మార్కెట్ లోకి విడుదల చేసేందుకు చూస్తున్నారు.. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఫీచర్స్, ధర ఎంతో వివరంగా తెలుసుకుందాం.. ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ 1024 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను అందిస్తున్నారు.. 8 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అంతేకాదు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు.. కెమెరా విషయానికొస్తే.. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ సెన్సర్‌ కెమెరా, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన షూటర్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.. అలాగే 44 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నారు.. ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా అందించారు.. త్వరలోనే ఈ మొబైల్స్ లాంచ్ కానున్నాయని సమాచారం..

నితిన్ ‘రాబిన్ హుడ్ ‘మూవీ క్రేజీ అప్డేట్ వచ్చేస్తుంది..ఫ్యాన్స్ రెడీనా..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. ఈ మధ్య వచ్చిన సినిమాలు అన్ని పెద్దగా ఆకట్టుకోలేపోయాయి.. ప్రస్తుతం నితిన్ కథల విషయంలో జాగ్రత్తలు తీసుకొని కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు.. తాజాగా నితిన్ నటిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్ ‘.. . ‘భీష్మ’ లాంటి హిట్ సినిమా తర్వాత వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమాలో నితిన్ ఒక దొంగ పాత్రలో నటిస్తున్నాడు.. బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర దొంగతనాలు చేసి పేదలకు పంచిపెట్టే కాన్సెప్ట్ అని అంతా భావిస్తున్నారు.. నితిన్ లుక్ కూడా సరికొత్తగా ఉంది.. తాజాగా సినిమా నుంచి రేపు ఉదయం 11:07 గంటలకి బాస్ లేడీ కి సంబంధించిన అప్డేట్ రానుంది. ఈ మూవీలో హీరోయిన్ రోల్పై నేడు క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఆ టైంకు పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఆ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. అయితే ఈ సినిమా హీరోయిన్ ఎవరనే విషయంను సీక్రెట్ గా ఉంచారు. మరోవైపు రాశి ఖన్నా, సంయుక్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎవరన్నది రేపు తెలియనున్నది..