వైసీపీ వీడే ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాదయాత్ర అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడం.. ప్రజాప్రతినిధులపై విమర్శలు చేయడం కాదన్నారు. రాజకీయాల్లో లోకేష్ పిల్లోడు.. టీడీపీకి సరైన అభ్యర్థులు కూడా లేరన్నారు. అభ్యర్థలు లేక వైసీపీలో ఉండే స్క్రాప్ ను టీడీపీలోకి తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. మూడు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వడం కుదరని లోకేష్ చెప్పాడని.. సోమిరెడ్డి నా దగ్గర ఫీల్ అయ్యాడు.. వరుస ఓటములతో నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి రికార్డ్ సృష్టించాడు అంటూ విమర్శలు గుప్పించారు. అయితే, నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. వైసీపీ రూరల్ నుంచే బరిలో దిగుతానంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక, మాజీ మంత్రి సోమిరెడ్డికి టికెట్ ఇస్తే మరోసారి ఓడిపోతాడంటూ జోస్యం చెప్పారు ఎంపీ ఆదాల.. నేను పార్టీ మారతాను అని టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్న ఆయన.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జీవిత కాలం పోరాటాలు చేసుకోవాల్సిందే.. నాలుగేళ్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి అభివృద్ది చెయ్యడంలో ఫెయిల్ అయ్యాడని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ ను నేను కోరిన తర్వాతే రూరల్ కి నిధులు మంజూరు అయ్యాయని చెప్పుకొచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.
సీఎం గ్రాఫ్ పడిపోయింది.. పులివెందులలో జగన్‌కు ఓటమి ఖాయం..
సీఎం వైఎస్ జగన్‌కు పులివెందులలో ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ముస్లిం, వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతలు కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు.. కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్‌కు ఎవరూ ఓటు వేయరన్నారు.. జగన్‌కు పులివెందులలో ఓటమి ఖాయమన్న ఆయన.. నాలుగేళ్ల నరకాన్ని అనుభవిస్తున్నాం.. రాచమల్లు ప్రొద్దుటూరు బకాసురుడు అంటూ విమర్శించారు. ఎమ్మెల్యే చేసిన తప్పులను ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్తను చంపేశాడు. మట్కా నిర్వహణ.. గుట్కాల అమ్మకం.. తోపుడు బళ్ల దగ్గర కూడా మామూళ్లు వసూలు చేయడం ఎమ్మెల్యే రాచమల్లుకు అలవాటు.. ఒకప్పుడు మామూలు కౌన్సిలర్‌గా కూడా గెలవలేని వ్యక్తి.. ఇప్పుడు ప్రొద్దుటూరును మింగేసే స్థాయిలో బలిసిపోయాడంటూ ఫైర్ అయ్యారు. ఇక, సీఎం వైఎస్ జగన్ గ్రాఫ్ పడిపోయింది.. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ ఇంటికి పోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు.. ఈ ప్రభుత్వం దొంగలకు అండగా ఉంటోంది. నిన్నా మొన్నా ఢిల్లీకి వెళ్లాడు.. ఏ సాధించాడు..? అని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలంటే వాళ్లే లీకులిస్తారు.. వాళ్లే ఖండిస్తారు.. కానీ, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధమని ప్రకటించారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే.. జగన్ అంత త్వరగా ఇంటికి పోతాడన్న ఆయన.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్ల అధికారులు.. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితికి వచ్చారన్నారు.. మరోవైపు.. ఎన్టీఆర్ జన్మదినం రోజు టీడీపీ మహానాడు పెట్టాం.. రేపు వైసీపీ ఆవిర్భావ దినం.. కానీ, ఆవిర్భావ సభలు కేవలం రెండే సార్లు పెట్టారని విమర్శించారు. ఓసారి తల్లిని తప్పించడానికి ఆవిర్భావ సభ పెట్టారు.. మరోసారి శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకోవాలని పెట్టారని దుయ్యబట్టారు చంద్రబాబు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇస్రోలో ఖాళీలు.. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో శుభవార్త చెప్పింది. సంస్థకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తాజాగా ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..ఈ నోటిఫికేషన్ లో సైంటిస్ట్/ఇంజనీర్-SD, సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ vssc.gov.inలో అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు జులై 21 సాయంత్రం వరకు అప్లై చేసుకొనే అవకాశం ఉంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఇకపోతే సైంటిస్ట్/ఇంజనీర్-SD పోస్టులకు అట్మాస్ఫెరిక్ సైన్స్ లేదా స్పేస్ సైన్స్ లేదా ప్లానెటరీ సైన్స్ ఎక్స్‌పర్టైజ్ సబ్జెక్టులతో M.E/M.Tech లేదా సైన్స్‌లో M.S/M.Sc, బిఇ/బి.టెక్, B.Sc క్వాలిఫికేషన్ అవసరం. వ్యాలీడ్ అప్లికేషన్‌లను సబ్మిట్ చేసిన వారిని రాత పరీక్షకు పిలుస్తారు. రాత పరీక్షను అహ్మదాబాద్, చెన్నై, ఎర్నాకులం, హైదరాబాద్ , తిరువనంతపురంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు షరతులకు లోబడి మల్టిపుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మల్టిపుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒకే రాత పరీక్ష కేంద్రాన్ని సెలక్ట్ చేసుకోవాలి… రాత పరీక్షలో గ్రేడ్ సాధించిన వారిని ఇంటర్వ్యూ కు పిలిస్తారు..
టీ-9 టికెట్ తెచ్చిన ఆర్టీసీ.. ఇప్పటి నుంచి ఆ బస్సులో కూడా వర్తింపు
గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘టీ-9 టికెట్’ సమయాల్లో TSRTC మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా ఈ టికెట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని తెలిపింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది. అయితే.. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. టీ-9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబీనేషన్ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ జర్నీ చేసే వెసులుబాటు కల్పించింది. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.20 కాంబీ టికెట్ వర్తిస్తుందని ప్రకటించింది. టీ-9 టికెట్ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్ ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది.
కడియం శ్రీహరి ఎన్‌కౌంటర్ల సృష్టికర్త.. పార్టీ నుండి సస్పెండ్ చేయాలి
ఎమ్మెల్యే టీ.రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య అధిపత్యపోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నాయకుల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజయ్య మరోసారి కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదని, ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అని, ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కుండబద్దలు కొట్టారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో రాజయ్య మాట్లాడుతూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని వెంటనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఎంపీలు గానీ, ఎమ్మెల్సీలు గానీ.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన తర్వాతే నియోజకవర్గంలోకి రావాలని.. కానీ కడియం శ్రీహరి మాత్రం 2014 నుండి ఇప్పటివరకు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని రాజయ్య మండిపడ్డారు. 2014 -18 ఎన్నికల సమయంలో తాను తన ఆస్తులు మొత్తం అమ్ముకున్నానన్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే కాకముందు అతని ఆస్తులు ఎంతో, ఇప్పుడు ఎంతో చూడాలని అన్నారు. తెలంగాణలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్‌కౌంటర్లు జరిగాయని ఆరోపించారు. 14 ఏళ్లు మంత్రిగా ఉండి కూడా, ఏనాడు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని కడియం శ్రీహరి పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు.. కడియం శ్రీహరితో పాటు ఆయన అనుచరులు సైతం ఏనాడూ హాజరు కారని చెప్పారు.
గుడ్‌న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. 30 సెకన్లలోనే పర్సనల్ లోన్..
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఆన్‌లైన్ రిటైలర్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.. తన ప్లాట్‌ఫారమ్‌లో యాక్సిస్ బ్యాంక్ సౌజన్యంతో వ్యక్తిగత రుణ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లోని కస్టమర్లు మూడేళ్ల వరకు యాక్సిస్ బ్యాంక్ నుండి రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను పొందగలరని ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో దాదాపు 45 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. స్టేట్‌మెంట్ ప్రకారం, ఈ భాగస్వామ్యం కింద కస్టమర్‌లు 30 సెకన్లలోపు రుణ ఆమోదం పొందుతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వ్యక్తిగత రుణాలు మరియు క్రెడిట్ కార్డ్‌ల వంటి అధిక-రిస్క్ రుణాలలో అధిక వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదికల మధ్య ఈ ప్రకటన వచ్చింది.
జాక్ పాట్ అంటే ఆమెదే.. నిమిషాల వ్యవధిలో రూ.500 కోట్ల సంపాదన..
స్టాక్ మార్కెట్లు ఎప్పుడు ఎవరిని ధనవంతులను చేస్తాయో.. ఎప్పుడు ఎవరి చేతికి చిప్ప ఇస్తాయో కూడా చెప్పడం కష్టం.. ఓ కంపెనీకి ఉన్న బ్రాండ్‌ను బట్టి షేర్ విలువ పెరగడం.. పడిపోవడం జరుగుతూనే ఉంటుంది.. కొన్నిసార్లు ఆ కంపెనీలు చేసే చిన్న పొరపాట్లు కూడా షేర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి.. ఇదంతా ఎందుకు గానీ.. ఓ మహిళ జాక్ పాట్ కొట్టేసింది.. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా రూ.500 కోట్లు సంపాదించుకుంది.. ఆమె ఎవరో కాదు.. భారత స్టాక్ మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారు, దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా భార్య.. ప్రధానంగా బంగారు ఆభరణాలను విక్రయించే టైటాన్ గత ఏడాది కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20 శాతం ఆదాయాన్ని పెంచుకుంది.. ఇలా శుక్రవారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ షేర్ల విలువ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి ఎగబాకి సరికొత్త రికార్డును సృష్టించాయి.. టైటాన్ షేర్లు రాత్రిపూట 3 శాతం పెరిగాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంలో టైటాన్ షేరు 3.39 శాతం ఎగసింది. దీంతో కంపెనీ షేరు గరిష్టంగా రూ.3, 211.10కి చేరింది. ఇక, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ టైమ్ హై రూ.9,357 కోట్లకు ఎగబాకింది. రూ.275,720 కోట్ల నుంచి రూ.2,85,077 కోట్లకు ఎగసింది. టైటాన్ షేర్ల విలువ విజృంభించడంతో దివంగత జున్‌జున్‌వాలా భార్య రేఖా జున్‌జున్‌వాలా రూ. 500 కోట్లు సంపాదించుకున్నట్టు అయ్యింది.. టైటాన్‌లో రేఖకు 5.29 శాతం వాటా ఉంది. ఈ సందర్భంలో టైటాన్ కంపెనీ షేర్లు పెరగడంతో రేఖ వద్ద ఉన్న షేర్ల విలువ రూ.500 కోట్ల కొత్త స్థాయికి చేరుకుంది.
బంగ్లాదేశ్ ప్రధాని జోక్యంతో రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న తమీమ్ ఇక్బాల్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ నిన్న (గురువారం) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ కు గురి చేశాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు అతడు పేర్కొన్నాడు. కాగా అతను రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ ఇవాళ బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిందంటూ తమీమ్ ఇక్బాల్ మీడియాకు వెల్లడించాడు. మీడియాతో తమీమ్ మాట్లాడుతూ.. ముఖ్యమైన వన్డే వరల్డ్‌కప్ ముందు ఇలాంటి నిర్ణయం వద్దని.. వరల్డ్‌కప్ వరకైనా క్రికెట్ ఆడితే బాగుంటుందని ప్రధాని తనను కోరినట్లు అతడు వెల్లడించాడు. రిటైర్మెంట్ విషయంలో ఎవరు చెప్పినా వినకపోయేవాడినని.. అయితే ప్రధాని షేక్ హసీనా మాటల విషయంలో మాత్రం తాను అభ్యంతరం చెప్పలేకపోయానని.. అందుకే రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నాను అని తెలిపాడు. స్వయంగా బంగ్లా ప్రధాని తనకు నెలన్నర రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని.. మానసికంగా కుదుటపడాలని కోరారు. అందుకే నెలన్నర పాటు ఆటకు దూరమవుతున్నట్లు పేర్కొన్నాడు. మానసికంగా సిద్దమయ్యాకా మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాను అని తమీమ్ తెలిపాడు.
పామును కొరికి చంపుతున్న కుక్కలు.. చూస్తే షాకవుతారు..!
కుక్కలు మానవులకు మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుక్కలు విశ్వాసంగా మనుషులు చెప్పినట్లు వింటాయి. మరికొందరేమో కుక్కలంటే ఇష్టపడి పెంచుకుంటారు. కానీ కొన్నిసార్లు కుక్కలు మనుషులకు శత్రువులుగా కూడా మారతాయి. కుక్కలు మనుషులను కరిచి గాయపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో జీవన్మరణ మధ్య ఊగిసలాడడం వంటి సంఘటనలు మనం ఎన్నో చూసి ఉంటాం.. విని ఉంటాం కూడా. అయితే ప్రస్తుతం కుక్కలకు సంబంధించి ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో కుక్కలు ఏ మనిషిని చంపడం లేదు. కానీ పామును ఘోరాతి ఘోరంగా కరిచి చంపేస్తున్నాయి. ఈ వీడియోలో.. ఒక కుక్క తన నోటితో నుండి పొదల్లో ఉన్న పామును తీసుకువచ్చి తన తోటి కుక్కల మధ్యలో వదిలివేయడాన్ని మీరు చూడవచ్చు. ఈ సమయంలో పాము మొదట కుక్కల నుండి ప్రాణాలను రక్షించుకోడానికి భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరువాత కుక్కల నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది జరగదు. కుక్కలు పామును బాగా ఇబ్బంది పెడతాయి. కొన్ని కుక్కలు పాము తోకను పట్టుకుని కొరుకుతుంటాయి. అంతేకాకుండా మరికొన్ని కుక్కలు పాము నోటిని పట్టుకుని కొరుకుతుంటాయి. ఇంతలో ఒక కుక్క తన క్రూరమైన రూపాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా పామును క్రూరాతి క్రూరంగా కొరుకుతుంటాయి.
అబ్బాయిలను గుండెల మీద కొట్టాలంటే.. అమ్మాయిల కంటే గట్టిగా ఎవ్వడు కొట్టలేడు
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై SKN ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఓ రెండు హృదయాలు ఇలా అనే సాంగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేడు ఈ సినిమా నిర్మాత SKN పుట్టినరోజు సందర్భంగా బేబీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కాలంలో ప్రేమ ఎలా ఉంది.. ? యువత ప్రేమలో ఎలా ఉంటున్నారు.. ? అనేది సాయి రాజేష్ చూపించాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకొంటుందని ట్రైలర్ ను బట్టి చెప్పొచ్చు. ఒక ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అన్న లైన్ తో ట్రైలర్ ను మొదలుపెట్టాడు. ఆనంద్ మొదటి ప్రేమను మర్చిపోలేక పిచ్చివాడిగా మారినట్లు చూపించారు. ఆనంద్, వైష్ణవి .. స్కూల్ లో ప్రేమించుకుంటారు. వైష్ణవి స్కూల్ లో ఏమి తెలియని అమాయకమైన అమ్మాయిగా ఉంటుంది. ఇక వీరిద్దరూ పదో తరగతి వరకు కలిసి చదువుకుంటారు. ఇక పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో డ్రైవర్ గా మారతాడు. వైష్ణవి పై చదువులు చదువుకోవడానికి సిటీకి వస్తుంది. అక్కడ కాలేజ్ లో ఆమెకు విరాజ్ పరిచయమవుతారు. కొన్నిరోజులకే వైష్ణవికి సిటీ లైఫ్ అలవాటు అవుతుంది. దీంతో ఆనంద్ కు వైష్ణవికి మధ్య గొడవలు మొదలవుతాయి. ఇంకోపక్క వైష్ణవిని విరాజ్ ప్రేమిస్తున్నట్లు చెప్తాడు. ఈ ఇద్దరి మధ్య వైష్ణవి ఎలా నలిగిపోయింది..? చివరికి వారి ఇద్దరిలో ఎవరికి సొంతమయ్యింది.. ? మొదటి ప్రేమను మర్చిపోలేక ఆనంద్ పిచ్చివాడిగా అయ్యాడా ..? లేక వైష్ణవి మోసం చేసిందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ట్రైలర్ మొత్తంలో చాలా డైలాగ్స్ యువతను ఆకట్టుకొనేలా ఉన్నాయి. ” ఒక్కసారి బడి దాటాకా .. మన ఫిగర్స్ మనవి కావురా.. కాలేజ్ జాయిన్ అయ్యారా .. అంతే సర్వ నాశనం “, ” అందరు అమ్మాయిలు వేరు.. నేను వేరు”, అబ్బాయిలను గుండెల మీద కొట్టాలంటే.. అమ్మాయిల కంటే గట్టిగా ఎవ్వరు కొట్టలేరు అన్న డైలాగ్ అయితే ట్రైలర్ కే హైలైట్ గా మారింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
రవితేజ-గోపీచంద్ కాంబోలో మైత్రీ మరో సినిమా.. 9న అధికారిక ప్రకటన
సాధారణంగా కొన్ని కాంబినేషన్ల సినిమాలు బాగా వర్కౌట్ అవ్వడమే కాదు అవే మరోసారి రిపీట్ అవుతున్నాయి అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. సినిమా ఎలా ఉండబోతుంది అనే లెక్క మొదలు పెడితే బాక్సాఫీస్ రికార్డులు ఎంతవరకు వస్తాయి? ఈసారి నటీనటులను మారుస్తారా? కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తారా? అని ఇన్ని రకాలుగా అయితే లెక్కలేసుకుంటూ ఉంటారు. ఇక అలా మంచి క్రేజీ కాంబోల్లో ఒకటి రవితేజ-గోపీచంద్ మలినేనిది. ఎందుకంటే ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపాయి. డాన్ శీను, బలుపు మంచి సక్సెస్‌ను అందుకోగా చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజాకు క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా అందించాడు గోపీచంద్ మలినేని. రవితేజ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన క్రాక్ మాస్ మహారాజా మార్కెట్ అమాంతం పెంచేయడమే కాదు ఆయనకు వరుస సినిమా అవకాశాలు కూడా వచ్చేలా చేసింది. ఇక క్రాక్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ మీదున్న రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో నాలుగో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త తెలుగు సినీ లవర్స్‌లో జోష్ నింపుతోంది. రవితేజ కోసం గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ స్కిప్ట్ సిద్దం చేసి వినిపించగా కథ విన్న మాస్ మహారాజా సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండగా ఈ మేరకు జూలై 9న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.