NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

త్వరలోనే చంద్రబాబు అరెస్ట్.. సింగపూర్‌లో చిప్పకూడు పెడతారు..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు మంత్రి ఆర్కే రోజా.. త్వరలోనే చంద్రబాబును సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు. అమరావతిలో చంద్రబాబు అనేక కుంభ కోణాలు చేశారని ఆరోపించిన ఆమె.. సింగపూర్‌లో చంద్రబాబు పార్ట్‌నర్‌ ఈశ్వరన్ అవినీతిలో దొరికారు.. ఆయన్ని మంత్రి వర్గం నుంచి తొలగించి విచారణ చేస్తున్నారని తెలిపారు.. స్విస్ ఛాలెంజ్ పేరుతో అమరావతి భూములతో చీకటి ఒప్పందాలు సింగ్‌పూర్‌లో చేసుకున్నారని పేర్కొన్న ఆమె.. త్వరలోనే చంద్రబాబుని సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేసి చిప్పకూడు పెడ్తారంటూ వ్యాఖ్యానించారు.. అందుకే, ఆ భయంతోనే చంద్రబాబు ఇంటి నుంచి బయటకు రాకుండా వణికిపోతున్నారని చెప్పుకొచ్చారు మంత్రి ఆర్కే రోజా..

చంద్రబాబు, పవన్‌.. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు..
టీటీడీ నిర్ణయాలపై, తిరుమల దేవస్థానంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి.. మతపరమైన విషయాల్లో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోరాదు.రాజకీయాలకే పరిమితమవ్వాలని సూచించారు. టీటీడీ చేస్తున్న పలు కార్యక్రమాలపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం తగదన్న ఆయన.. హిందువుల మనోభావాలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. న్యాయశాస్త్రంలో నాకున్న అనుభవం, పరిజ్ఞానంతో సహాయం చేయాలని టీటీడీ అభ్యర్ధించింది.. ఒక్క పైసా తీసుకోకుండా టీటీడీకి తాను సహాయం చేస్తున్నానని తెలిపారు. ఇక, అబద్దాలను ప్రచురిస్తున్న ఆ పత్రికపై పరువునష్టం పిటిషన్‌ వేయనున్నట్టు తెలిపారు సుబ్రమణ్యస్వామి.. నేను వ్యక్తిగత హోదాలో న్యాయపోరాటం చేస్తున్నానన్న ఆయన…”శ్రీ వాణి” ట్రస్ట్ కింద వసూలు చేస్తున్న నిధులను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దోచుకుంటున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని కొట్టిపారేశారు. త్వరలో “శ్రీవాణి ట్రస్ట్” టికెట్ ద్వారా దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాని వెల్లడించారు. “శ్రీవాణి ట్రస్ట్” దర్శనం రసీదు సరైనదే అని ప్రతిఒక్కరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను.. అందుకే శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్‌ ద్వారా దర్శనాని వెళ్తానని పేర్కొన్నారు.. ఇక, టీటీడీ, శ్రీవాణి ట్రస్ట్‌ను అప్రతిష్టపాలు చేసే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను గట్టిగా ఖండిస్తున్నానని తెలిపారు కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి.

ఇప్పుడు జగ్గు భాయ్‌.. తర్వాత జగ్గు.. మీరు ఎంత నోరు జారితే అంత..!
సీఎం వైఎస్‌ జగన్‌ .. నన్ను పవన్ అంటారు, ప్యాకేజీ స్టార్ అంటారు.. దత్త పుత్రుడు అంటారు.. నేను భరించా.. కానీ, ఆయన్ని జగ్గు భాయ్‌ అంటుంటే వైసీపీ నేతలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. జగన్ గారు నుంచి జాగ్గు భాయ్‌కి వచ్చా.. తర్వాత జగ్గు అంటా.. ఆ తర్వాత ఏం అంటానో నాకే తెలియదు.. మీరు నోరు ఎంత జారితే నేను అంత జారుతానని ప్రకటించారు.. 2వ విడత వారాహి విజయయాత్ర ముగింపు సందర్భంగా తణుకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా బలంగా నిలబడిన తణుకు ఇంఛార్జి విడివాడ రామచంద్ర రావుకి క్షమాపణలు చెబుతూ సభ మొదలు పెట్టారు పవన్‌.. వైసీపీ పరిపాలనపై, జగన్ పై క్రిటికల్ ఏనాలసిస్ చేద్దాం.. తణుకు నుంచి అనేకమంది కవులు , వక్తలు వచ్చారు.. జగన్ కు తణుకు నుంచి ఒక్కటే చెప్పదలుచుకున్నాం.. జగన్ కొంపలు అంటిస్తారు.. జసనేన గుండెలు మండిస్తుందన్నారు. జగన్ ను జగ్గుభాయ్ అని ఎందుకు అంటున్నానో ఆయన చేసిన దోపిడీ చూస్తే అర్థం అవుతుందన్నారు పవన్‌ కల్యాణ్‌.. గళ్ల లుంగీ, బుగ్గన చుక్క జగ్గు భాయ్ కి పెట్టాలని ఎద్దేవా చేశారు. ఎది అడిగినా మీకోసం ఖర్చు చేస్తున్నాం అంటారు.. పథకాలు ఇచ్చిన వాటికి లెక్కలు చెప్తున్నారు.. దారి మళ్లించి వాటి లెక్కలు చెప్పడం లేదని విమర్శించారు. ఇక, జగన్ కొత్త పథకాలు ఏమీ చేయడం లేదు.. వృద్ధాప్య పింఛన్లుతో సహా పాత పథకాల పేర్లు మార్చారు అంతే అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న ఆయన.. జగన్ డిజిటల్ దొంగలా మారారు.. ప్రొవిడెంట్ ఫండ్ అంటే తెలుసా జగన్..? అని ప్రశ్నించారు.. జగ్గుభాయ్ అంటుంటే..వైసిపి నాయకులు బాధ పడుతున్నారు.. జగ్గుభాయ్ అంటుంటే వైసీపీ నేతలకు వళ్లంతా కారం రాసుకున్నట్టు ఉందన్న ఆయన.. మీరు అందరినీ బూతులు తిడతారు.. రైతులు గిట్టు బాటు ధర లేదంటే మంత్రి ఏర్రిపప్ప అనేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్‌ కల్యాణ్‌.

పెళ్లిళ్లు చేసుకోవడంలో పవన్ విప్లవకారుడు.. అది ప్రజలపై రుద్దుతున్నారు..
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తన దైన శైలిలో సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. సీఎం జగన్‌ను విమర్శించిన పవన్‌ కల్యాణ్‌.. అతను ఎప్పుడూ విప్లవకారుడితో గొడవ పెట్టుకోలేదు.. పవన్ కల్యాణ్ అనే వాడు విప్లవకారుడు.. ఓ విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో సీఎం జగన్‌కు చూపిస్తాను అంటూ కామెంట్స్‌ చేసిన విషయం విదితమే.. అయితే, ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి అమర్నాథ్‌.. పవన్ పై ఫైర్ అయ్యారు.. సంస్కారం లేని పవన్ నమస్కారం, సీఎం జగన్ కు అవసరం లేదన్నారు.. ఇక, పెళ్లిళ్లు చేసుకోవడంలో పవన్ విప్లవకారుడు.. పవన్ పెళ్లిళ్ల విప్లవాన్ని ప్రజలపై రుద్దుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు, అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నేతలు పార్టీలోకి వస్తారు.. అటువంటి వారు ఒకరు ఇద్దరు పార్టీ వీడిన మాకు నష్టం లేదంటూ.. విశాఖపట్నంలో తాజా రాజకీయాలపై బదులిచ్చారు మంత్రి.. ఇక, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ధైర్యం ఉంటే వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పాలంటూ సవాల్‌ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

ఎర్ర చందనం ద్వారా మరింత ప్రయోజనం.. ఎక్కడ పట్టుబడినా ఏపీకే..!
ఎర్ర చందనంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని మానస సరోవర్ హోటల్ లో ఎర్ర చందనంపై అన్ని రాష్ట్రాలు అటవీ శాఖ పీసీసీఎఫ్‌లతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఎర్ర చందనం పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, మార్గదర్శకాలుపై చర్చించారు.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ స్పెషల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చంద్ర ప్రకాష్ గోయల్‌తోనూ సమావేశం అయ్యారు.. ఎర్ర చందనం సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎర్ర చందనం శేషాచలం అడవుల్లో మాత్రమే ఉందన్నారు.. ఇక, దేశంలో ఎక్కడ ఎర్ర చందనం పట్టుబడిన ఒకే ప్రాంతం ఏపీకి తీసుకు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక నోడల్ ఏజెన్సీ కిందకు తీసుకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని.. దీని కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పట్టుబడిన ఎర్రచందనంలో.. రాష్ట్రాలకు, కస్టమ్స్, డీఆర్ఐ లకు వాటా ఉంటుందని తెలిపారు.. ఎర్ర చందనం ద్వారా రాష్ట్రానికి ఆర్థికంగా మరింత ప్రయోజనం చేకూరుతుందని.. ఆదాయం లభిస్తుందని వెల్లడించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

పంతాన్ని నెగ్గించుకున్న అజిత్ పవార్.. కీలక శాఖ పట్టేశాడు
బీజేపీ-శివసేన కూటమితో ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక, అజిత్ పవార్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు.. తాను కోరుకున్న ఆర్థిక శాఖను ఆయన దక్కించుకున్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు నేడు కొత్త శాఖలు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో అజిత్ వర్గానికి మంచి ప్రాధాన్యత ఉన్న శాఖలే వచ్చాయి. అయితే తనకు ఆర్థిక శాఖ కావాలని అజిత్ పవార్ పట్టుబట్టారు. ఇది డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర ఉంది. అయితే తనకు అదే శాఖ కావాలని అజిత్ పవార్ పట్టుబట్టి మరి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. క్యాబినెట్‌లో కీలకమైన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖను అజిత్‌కు కేటాయించారు. వెంటనే ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. కాగా, తాజాగా శాఖల కేటాయింపుల్లో, ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్‌కు పౌర సరఫరాల శాఖ, అనిల్ పటేల్‌కు రిలీఫ్ అండ్ రిహాబిలేషన్, డిజాస్టర్ మేనేజిమెంట్ శాఖ, అదితి సునీల్ టట్కరేకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ కేటాయించగా, ధనంజయ్ ముడేకు వ్యవసాయం, దిలీప్ వాల్సే పాటిల్‌కు రెవెన్యూ, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ కేటాయించారు.

ఏంది అక్కో.. ఏకంగా అగ్నిపర్వతం మీదనే పిజ్జా వండుకొని తింటున్నావ్..
విహారయాత్రలు చేసేందుకు చాలా మంది ఇష్టపడతారు. చిత్ర విచిత్రమైన ప్రదేశాలు సందర్శించి వస్తుంటారు. అందమైన ప్రకృతితో పాటు దట్టమైన అటవిలోకి వెళ్తుంటారు. ఎత్తైన కొండలు ఎక్కుతుంటారు. అయితే, తాజాగా అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ అనే మహిళకు అగ్ని పర్వతం మీద పిజ్జా వండుకుని తినాలనిపించింది. దీంతో ఆమె తన కోరికను తీర్చుకునేందుకు వెళ్లింది. ఆమె వెళ్లడమే కాదు సరదాగా పిజ్జా కూడా అక్కడే తయారు చేసుకుని తినింది. అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ అనే పర్యాటకురాలు గ్వాటెమాలలో యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై ఓ పిజ్జాను వండుకుని తింటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె స్వయంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది. యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై పిజ్జా వండుకుని తినడానికి గ్వాటెమాలకు వెళ్తున్నాను.. అంటే అక్కడ ఉన్నా.. ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడటానికి కూడా అని పేర్కొంది. 2021లో బద్దలైన ఇక్కడి అగ్ని పర్వతం యాక్టివ్‍గానే ఉంది. ఈ నేషనల్ పార్క్‌ లోనికి వెళ్లాలంటే తప్పనిసరిగా ఓ గైడ్ ఉండాల్సిందే. మేము పిజ్జా తయారు చేయడం కోసం ముందుగానే బుక్ చేసుకున్నాము.. అక్కడ బాగా చలిగా ఉంటుంది.. చల్లని గాలులు వీస్తాయనే క్యాప్షన్‌తో అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్టును షేర్ చేసుకుంది. వీడియోలో ఒక వ్యక్తి కూరగాయలతో వంట చేశాడని పిజ్జాను ట్రేలో ఉంచి అక్కడి నేలపై పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత దానిని తీసి ఆమెకు అందించాడు. ఇక అలెగ్జాండ్రా దానిని తింటున్నట్లు మనం ఈ వీడియోలో కనిపిస్తుంది. కాగా.. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

అరంగేట్రం టెస్టులో 150 పరుగుల మార్క్ దాటిన యశస్వి జైస్వాల్..
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తిగా ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు ఆట స్టార్ట్ కాగానే ఓవర్ నైట్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 150 పరుగుల మార్క్ ను దాటేశాడు. ఈ క్రమంలోనే అతడు డెబ్యూ టెస్టులో 150 మార్క్ ను అందుకున్న ఐదో అతి చిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. యశస్వి 21 సంవత్సరాల 196 రోజుల వయసులో టెస్ట్‌ అరంగేట్రంలో 150 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కుడిగా పాక్‌ మాజీ క్రికెటర్‌ జావిద్‌ మియాందాద్‌ ఉన్నారు. మియాందాద్‌.. 19 ఏళ్ల 119 రోజుల వయసులో తన తొలి టెస్ట్‌ మ్యాచ్ లో 150 పరుగులు చేశాడు. అతని తర్వాత ఆసీస్‌ ఆర్కీ జాక్సన్‌ (19 ఏళ్ల 149 రోజులు), ఆసీస్‌ డౌగ్‌ వాల్టర్స్‌ (19 ఏళ్ల 354 రోజులు), జార్జ్‌ హెడ్లీ (20 ఏళ్ల 226 రోజులు) ఉన్నారు. వీరి తర్వాత అత్యంత పిన్న వయసులో 150 పరుగుల మార్కు అందుకున్న ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు.

రాత్రి పూట భోజనాన్ని ఎందుకు త్వరగా తినాలో తెలుసా?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే టైం కు తినాలి, టైం కు పండాలని నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.. అప్పుడే శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు అందుతాయి.. మనిషి ఆరోగ్యంగా ఉంటారు.. టైం కు తినకపోతే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. అయితే రాత్రి సమయంలో ముఖ్యంగా ఆహారాన్ని త్వరగా తీసుకోమని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు.. అదే చాలా లేటుగా భోజనం తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం అవ్వదు. దానివల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.. లేటుగా భోజనం చెయ్యడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. త్వరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాలరీలు త్వరగా కరుగుతాయి. దాంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది మరియు గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. భోజనం త్వరగా తినేయడం వల్ల శరీరంలో మెటబాలిజం మెరుగ్గా ఉంటుంది..బరువు కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇలా త్వరగా భోజనం చేయడం వల్ల రాత్రి నుండి ఉదయం వరకు ఏమి తినరు అంటే దానివల్ల శరీరంలో ఇన్సులిన్ బ్యాలెన్స్ గా ఉంటుంది.. షుగర్ వంటి దీర్ఘ కాలిక రోగాలు రాకుండా ఉంటాయి.. ఇకపోతే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు రాత్రి 7 గంటలు లోపు ఆహారాన్ని తీసుకుంటే మేలు. రాత్రి సమయంలో త్వరగా ఆహారం తీసుకుంటే ఉదయం లేవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు దాంతో ఉదయం త్వరగా లేవగలుగుతారు. రాత్రి సమయంలో భోజనాన్ని త్వరగా తినడం వల్ల ఆహారం జీర్ణం అవ్వడానికి సమయం ఎక్కువగా ఉంటుంది.. ఉదయం లేవగానే పొట్ట ఎంతో సులభంగా క్లియర్ అవుతుంది. పైగా రాత్రి సమయంలో ఆహారాన్ని హెవీ గా తీసుకోకూడదు. ముఖ్యంగా నూనె పదార్థాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మేలు అని గమనించాలి. అందుకే చాలా శాతం మంది రాత్రి భోజనంలో భాగంగా తక్కువ క్యాలరీలు ఉండేటువంటి పదార్థాలను తీసుకుంటారు.. నైట్ జంక్ ఫుడ్స్ ను నాన్ వెజ్ ను వీలైనంతవరకు అవైడ్ చెయ్యడం బెస్ట్..

రాజకీయాలోకి ఎంట్రీ.. పవన్ మామ ఏది చెప్తే అది చేస్తా
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. బైక్ యాక్సిడెంట్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దాదాపు ఏడాది తరువాత తేజ్ నుంచి వచ్చిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని తేజ్ రీ ఎంట్రీ మరింత జోష్ ను నింపింది. ఇక ప్రస్తుతం తేజ్.. పవన్ కళ్యాణ్ తో పాటు బ్రో సినిమాలో నటిస్తున్నాడు. సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే తేజ్.. గత కొన్నిరోజులుగా ఆలయాలనుసందర్శిస్తున్నాడు. ఇటీవలే తిరుపతిలో సందడి చేసిన తేజ్.. తాజాగా ప్రఖ్యాత కడప అమీన్ పీర్ దర్గా ను హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. ఇక ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ.. “కడపకు వస్తే పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ..ఆ ప్రమాదం నుంచి బయటపడడం నాకు పునర్జన్మ. దేవుడు మళ్లీ నాకు పునర్జన్మను అందివ్వడంతో ఆలయాలను తిరుగుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక సినిమాల గురించి చెప్పాలంటే.. పవన్ మామయ్యతో కలిసి నటించడం మరువలేని అనుభూతి. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. పవన్ మామయ్య జనసేన పార్టీలోకి వస్తారా అని నన్ను అడుగుతున్నారు. రాజకీయాలపై అవగాహన ఉంటే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య చెప్పారు.. నేను సినీ రంగంలోనే ఉంటా.. మామయ్య అదే చెప్పారు.. మామయ్య పవన్ కల్యాణ్‌ అంటే నాకు ప్రాణం” అంటూ తేజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో మామఅల్లుళ్లు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

నా భర్త నన్ను మోసం చేశాడు.. అర్ధరాత్రి ఆ పని చేస్తూ
ఇండస్ట్రీలో సన్నిలియోన్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగులో కూడా అమ్మడు ఐటెం సాంగ్స్ తో అలరించింది. కరెంట్ తీగ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సన్నీ ఆ తర్వాత గరుడవేగ, మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో కనిపించింది. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ఉన్నా కూడా ఇప్పుడు బాలీవుడ్ లో చక్కని ప్రతిభ కనబరుస్తూ మంచినటి గా పేరు తెచ్చుకుంటుంది. ప్రస్తుతం సన్నీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇకపోతే సన్నీ ప్రస్తుతం తన భర్త డేనియల్ వెబర్ దుబాయిలో వెకేషన్ లో ఉంది.తాజాగా సన్నీ తన భర్త మోసం చేశాడంటూ సడన్ షాక్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. నా భర్త నన్ను మోసం చేశాడు అంటూ రాసుకు వచ్చింది. అయితే సడన్ గా ఆ క్యాప్షన్ చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ఇక అంతగా తన భర్త ఏం చేశాడు అంటూ వీడియో క్లిక్ చేసి చూసి ఆశ్చర్యపోయారు. అందులో డేనియల్ అర్ధరాత్రి ఫ్రిజ్ దగ్గర ఐస్ క్రీమ్ తింటూ కనిపించాడు. తన భర్త తనకు తెలియకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడంటూ సన్నీ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన భర్త చాటుగా ఐస్ క్రీమ్ తినడాన్ని ఒక వీడియోగా తీసి ఇన్స్టా లో పోస్ట్ చేసింది. దీనికి “నా భర్త నన్ను మోసం చేస్తున్నప్పుడు” అంటూ రాసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అవును నిజంగానే డేనియల్ నిన్ను మోసం చేస్తున్నాడు తనకి పనిష్మెంట్ ఇవ్వు అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు సూపర్ కపుల్ అంటూ పొగిడేస్తున్నారు.