చిరంజీవి, పవన్‌పై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. మెగాస్టార్ అప్పుడే చెప్పాడు..
మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. వాలంటీర్లపై పవన్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇస్తూ మీడియాతో మాట్లాడిన ఆయన.. మెగా బ్రదర్స్ ప్రస్తావన తీసుకొచ్చారు.. చిరంజీవికి.. పవన్ కల్యాణ్‌కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్న ఆయన.. నేను రాజకీయాలకు పనికి రాను.. తమ్ముడు పనికొస్తారని గతంలోనే చిరంజీవి అన్నారని గుర్తుచేశారు.. అంటే.. చంద్రబాబు చెప్పినట్టు తాను చేయలేనని.. పవన్ కల్యాణ్ చేయగలడనే విషయం తెలుసు కాబట్టే పవన్ రాజకీయాలకు పని కొస్తాడని చిరంజీవి అన్నారంటూ చెప్పుకొచ్చారు పేర్నినాని.. ఇక, మేం చేసిన అప్పులతో పోర్టులు, మెడికల్ కాలేజీలు, పంచాయతీ భవనాలు కడుతున్నాం. చంద్రబాబు హయాంలో తెచ్చిన అప్పులను పసుపు కుంకమకు తరలించారని ఆరోపించారు పేర్ని నాని.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పైసాకు పక్కా లెక్క ఉందన్న ఆయన.. చంద్రబాబు-పవన్ కల్యాణ్.. కాపుల్ని బీసీల్లో చేరుస్తామని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు.. కాపు ఓట్ల కోసమే 2019 ఎన్నికల్లో పవన్.. చంద్రబాబు విడిపోయినట్టు నటించారని.. పవన్ చేసే మోసాన్ని కాపులు గమనించి గత ఎన్నికల్లో జగన్‌కు ఓటేశారన్నారు.. ఇప్పటికైనా వలంటీర్లకు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మొక్కండి.. సార్ అని పిలవండి మాకేం అభ్యంతరం లేదు. ఇక, సీఎం జగన్ ను ఏక వచనంతో మాట్లాడితే.. మేమూ అదే విధంగా మాట్లాడతాం అని వార్నింగ్ ఇచ్చారు.. పవన్ ఒక్కరికే నోరు.. నాలిక లేదు.. వైసీపీ జెండా మోసే కార్యకర్తలకు నోరు, నాలిక ఉందని గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి పేర్నినాని.
అప్రమత్తంగా ఉండండి.. భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం..
నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరం ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.. దీని ప్రభావంతో.. రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.. వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పుశువులు, గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదని.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక, రాబోయే మూడు రోజుల వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయన్న వివరాల్లోకి వెళ్తే.. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది విపత్తుల నిర్వహణ సంస్థ.
పవన్‌కు ఇదే మా వార్నింగ్.. మేం చాటలు, చెXX. ఎత్తితే నీ గతేంటి..?
పవన్ కల్యాణ్‌కు ఇదే మా హెచ్చరిక.. మేం చాటలు.. చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత.. ఈ రోజు డీజీపీని కలిసింది వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం.. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ డీజీపీకి ఫిర్యాదు చేశారు.. పవన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. వాలంటరీ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు హేయమైనవి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం వాలంటరీ వ్యవస్థను మెచ్చుకున్నారు.. కరోనా సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు దేశానికే ఆదర్శంగా తెలిపిన ఆమె.. చంద్రబాబు, లోకేష్ లకు రాజకీయాలు చేసే దమ్ములేక పవన్ ను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్.. టీడీపీ కోసమే రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు పోతుల సునీత.. చంద్రబాబు, లోకేష్ ల జేబు సంస్థగా పవన్ పని చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.. చంద్రబాబు, లోకేష్, పవన్.. ఏపీకి టూరిస్టులు మాత్రమే.. కరోనా సమయంలో మీరంతా ఏమైపోయారు..? అంటూ నిలదీశారు. పవన్ కల్యాణ్‌కు మహిళలంటే గౌరవం లేదు.. వాలంటీర్లను చాలా చిన్న చూపు చూస్తున్నాడు.. తన వ్యక్తిగత జీవితంలో మహిళలను మోసం చేసిన మోసగాడు పవన్.. అందుకే వాలంటీర్ల పట్ల పవన్ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాలంటీర్ వ్యవస్థపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు ఆ ఉద్దేశం లేదు.. కానీ..!
వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో మంటలు రేపాయి.. అయితే, మరోసారి వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.. అతిచిన్న జీతం తీసుకునే వాలంటీర్ వ్యవస్థ పొట్టగొట్టాలని నాకులేదన్న ఆయన.. ఐదువేల జీతం ఇచ్చి వారిని అక్కడే కట్టిపడేస్తున్నారు.. వారిలో ఎంతోమంది బలవంతులున్నారు.. వారిలో సైంటిస్టులు, వ్యాపారస్తులు ఇలా ఎంతో టాలెంట్ ఉన్నవాళ్లున్నారన్నారు.. డిగ్రీ చదువుకుని ఐదువేలు ఇస్తూ ఊడిగంచేపిస్తున్నారు.. జాతీయ ఉపాధి పథకం కింద వచ్చే డబ్బులు కూడా వారికి రావడంలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం ఎక్కువ కావడంతో ఐదువేలకు పనిచేస్తున్నారు.. శ్రమదోపిడి జరుగుతోంది.. రాష్ట్రంలో ఇన్నివేల మంది మిస్సవుతున్నారనేది చెబితే ఎందుకు పట్టించుకోవడంలేదు అని మండిపడ్డారు పవన్.. కేంద్ర నిఘావర్గాలు దీనిపై చాలా లోతైన విచారణ చేస్తున్నారు.. ఐదువేల రూపాయలు ఇచ్చి ఇంట్లో దూరే అవకాశం ఇచ్చారు.. మీ వివరాలు మొత్తం వారిచేతుల్లో పెట్టాల్సి వస్తోందన్నారు. అందరి వాలంటీర్స్ గురించి నేను మాట్లాడటం లేదు.. కానీ, కొన్ని చోట్ల వాలంటీర్స్ వద్ద ఉన్న డేటా బయటికి వెళ్తోంది.. రెవిన్యూవ్యవస్థ బలంగా ఉన్నా సమాంతర వ్యవస్థ ఎందుకు అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేకి కంట్రోల్ ఉన్నా బాగుండేది.. ఐదువేల రూపాయాలు తీసుకునేవారిలో కొద్దిమంది తప్పు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి.. ప్రభుత్వ ఉద్యోగులు కానివారికి ఎందుకు మన సమాచారం ఇవ్వాలి..? అని ప్రశ్నించారు. వాలంటీర్స్ కు సంబంధించిన ప్రతి విషయం ఎస్పీలు, కలెక్టర్ల వద్ద ఉండాలి.. వాలంటీర్లు తప్పు చేస్తే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థను చాలా జగర్తగా చూడాలి.. వారితో అప్రమత్తంగా ఉండాలి.. వాళ్ళపని వారు చేస్తే పర్లేదు.. వైసీపీ పార్టీకి మాత్రమే పనిచేస్తామంటే గట్టిగా అడగండి అని సూచించారు. ఉచిత బియ్యం వ్యాన్లు బియ్యం పంపిణి తర్వాత ఎక్కడకు వెళుతున్నాయి ? అని ప్రశ్నించారు పవన్.. ఒంటరి మహిళలు, వితంతువులు జాగ్రత్తగా ఉన్నారా లేదా అనేది ప్రతిఒక్కరు చూడాలి.. ఇంతమంది మహిళలు కనిపించపోతే ఒక్క సమీక్ష జరపలేదు.. ప్రతిపార్టీ వారు వాలంటీర్ వ్యవస్థపై ఒక కన్నువేసి ఉంచాలన్నారు.
రాహుల్ గాంధీ ఓ పిల్లగాడు ఆయనకు ఏం తెలవదు…
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఇవాళ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఓ పిల్లగాడు ఆయనకు ఏం తెలవదంటూ వ్యాఖ్యానించారు. వరంగల్ సభలో 4వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటన చేశాడని, నాలుగు వేల పెన్షన్ ఇస్తే సంతోషమే కానీ వారు నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు… అక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం 600 పెన్షన్ ఇస్తూ.. ఇక్కడ 4000 పెన్షన్ ఇస్తామని బద్మాష్ మాటలు ఎందుకు అంటూ ఆయన విమర్శించారు. ఇలా మాట్లాడడం ఓట్ల కోసం అధికారం కోసం ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనంతరం గోపులాపూర్‌లో రూ.70 లక్షలతో పద్మశాలీ సంఘ భవనం, మాల సంఘ భవన నిర్మాణాలకు ప్రొసీడింగ్స్ అందజేశారు. యశ్వంతరావ్‌పేటలో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు, రూ.5 లక్షలతో మైనార్టీ కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. రూ.10 లక్షలతో మాదిగ, కురుమ సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన యాదవ సంఘం కులస్థులు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాడు గ్రామాలకు వెళ్లాలంటే ముండ్ల పొదలు, చెట్ల కుప్పలు, మురుగునీటిని దాటుకొని పోయేవాళ్లమని, మురుగునీరంతా ఇండ్ల ముందు పారుతుండేదని గుర్తుచేశారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదన్నారు.
వెరైటీ కండీషన్ తో బంధువులకు షాక్ ఇచ్చిన పెళ్లి కూతురు.. ఎక్కడంటే?
సోషల్ మీడియాలో ఈ మధ్య పెళ్లికి సంబందించిన కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి.. నిత్యం ఏదొక వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. కొన్ని వీడియోలు చూసేందుకు ఆశ్చర్యంగానూ, మరికొన్ని ఫన్నీగానూ ఉంటుంటాయి.కానీ ఇలాంటి వధువు గురించి ఎప్పుడూ విని ఉండరు..ఎక్కడైనా పెళ్లికి వచ్చే బంధువులు వారికి నచ్చినవి… వారి స్థోమతకు తగ్గట్లు తీసుకొని వస్తారు..అయితే పెళ్లికి వస్తే చిన్నచిన్న బహుమతులు తీసుకురావద్దంటూ అతిథులకు కండిషన్ పెట్టింది ఇక్కడో వధువు. అంతేకాదు..వారు తెచ్చిన గిఫ్ట్ కనీసం రూ.4000ల కంటే తక్కువ కాకుండా ఉండాలంటూ రేటు కూడా ఫిక్స్ చేసి చెప్పింది. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియలో చక్కర్లు కొడుతుంది.. వధువు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియా రెడ్డిట్‌లో రీట్విట్ చేయటంతో మరింత వైరల్ అవుతోంది. ఇంతకీ వధువు పెట్టిన పోస్ట్‌లో కండీషన్ ఏంటంటే..పెళ్లికి వచ్చే వారికోసం చాలా డబ్బు ఖర్చుపెట్టి ఏర్పాట్లు చేశామని చెప్పింది. అతిథులు, బంధుమిత్రుల కోసం ఓపెన్ బార్‌లో భోజనం ఏర్పాటు చేశామని, అందుకే ఎవరైనా తన పెళ్లికి ఉట్టి చేతుల్తో వస్తే తనకు చాలా బాధగా ఉంటుందని అందులో రాసింది. అందుకే రూ. 4200లకు తగ్గకుండా బహుమతి ఇవ్వాలని ఆహ్వాన పత్రికతో పాటు రాయించింది..
ఏఐ మరో సంచలనం.. వార్తలు చదువుతోన్న కృత్రిమ మహిళా
కృత్రిమ మేధస్సు రోజురోజుకూ చాలా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో దాన్ని అభివద్ధి చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ చీరకట్టుతో టీవీ స్క్రీన్ మీద కనిపిస్తూ చక్కగా వార్తలు చదువుతున్న యాంకర్ నిజంగా మనిషి కాదు.. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో తయారు చేసిన బొమ్మ అని తెలిసి జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహిళా యాంకర్ ను తలపించేలా స్పీడ్ గా న్యూస్ చదివిన లీసా తీరు ఒడిశా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒడిశాలో పేరొందిన న్యూస్ ఛానల్ ఓ టీవీ ఈ సరికొత్త యాంకర్ ను నిన్న (ఆదివారం) తన వీక్షకులకు పరిచయం చేసింది. ఒడిశాలో తొలి ఏఐ యాంకర్ లిసాతో వార్తలు చదివించింది. ఒడియాతో పాటు ఇంగ్లిష్ లోనూ లీసా వార్తలు చదివేలా ప్రోగ్రామ్ చేసినట్లు ఓ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జాగి మంగత్ పాండా వెల్లడించారు. రాష్ట్రానికి మొట్ట మొదటి ఏఐ యాంకర్ ను పరిచయం చేసిన ఘనత తమకే దక్కుతుందని ఆమె తెలిపారు. లీసాకు బహు భాషలు మాట్లాడగల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒరియా, ఇంగ్లిష్ వార్తలపైనే తాము దృష్టి పెట్టామని ఆ ఛానెల్ ఎండీ చెప్పారు. టీవీ బ్రాడ్ కాస్టింగ్ రంగంలో ఏఐ వాడకం ఇప్పుడిప్పుడే మొదలైందని, భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను చేరుకుంటుందని పాండా పేర్కొన్నారు.
భారీ యాక్షన్ సీన్స్ తో మొదలు కానున్న బాలయ్య తరువాత సినిమా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న భగవంత్ కేసరి సినిమా తో బిజీ గా వున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య కి జోడి గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా షూటింగ్ దశలో ఉండగానే బాలయ్య తన 109వ సినిమాను తన బర్త్డే సందర్బం గా అఫిషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీ గా పెరిగి పోయాయి.దర్శకుడు బాబీ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తో వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సారి ఈ యంగ్ డైరెక్టర్ బాలయ్యతో కూడా ఒక పవర్ ఫుల్ సినిమా తీసి హిట్ అందుకోవాలని ఎంతో ఆసక్తి గా ఉన్నాడు. ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ సంబంధించి మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ లో ముందుగా భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారని తెలుస్తుంది.. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం పూర్తి సెట్ ను రెడీ చేస్తున్నట్లు సమాచారం.ఈ సెటప్ మొత్తం రెండు వారాల్లో పూర్తి కానుందని ఆ తర్వాత ఆ సెట్ లో షూట్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.తండ్రి కొడుకులుగా బాలయ్య నటించబోతున్నట్లు సమాచారం. బాలయ్య అలాంటి పాత్రలు చాలానే చేసారు. మరీ బాబీ తన సినిమాలో బాలయ్యను ఎలా చూపిస్తాడో వేచి చూడాలి..ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం అందించబోతున్నారు.
బ్రేకింగ్.. బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. హోస్ట్ ఎవరంటే.. ?
వచ్చేసింది.. వచ్చేసింది.. అందరు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మళ్లీ అందరి ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ .. ఇప్పుడు ఏడవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు ఎప్పుడో బిగ్ బాస్ మొదలుకావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవలన ఆలస్యమయింది. ఇక దీంతో అసలు ఈ ఏడాది బిగ్ బాస్ ఉంటుందా.. ? లేదా.. ? అని ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇక తాజాగా ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అభిమానులకు మేకర్స్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. చిన్న అప్డేట్ కూడా లేకుండా బిగ్ బాస్ ప్రోమోను రిలీజ్ చేశారు.”BB7 తెలుగు – వినోదం యొక్క పూర్తి ప్యాకేజీ.. BB7 తెలుగు మిమ్మల్ని ఎమోషన్స్, సర్ప్రైజ్‌లు మరియు థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో కూడిన రోలర్‌కోస్టర్ రైడ్‌లో తీసుకెళ్తుంది. కాబట్టి మీరు మరింతగా విండోమ్ ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. శారద గొడవల నుండి హృదయాన్ని కదిలించే కథల వరకు, మిమ్మల్ని అడుగడుగునా అలరిస్తామని మేము హామీ ఇస్తున్నాము” అంటూ స్టార్ మా తెలుపుతూ.. ఒక చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేసింది.
జీ 5లో దూసుకెళ్తోన్న ‘విమానం’.. ఏకంగా 50 మిలియన్ మినిట్స్!
ఓటీటీ మాధ్యమం జీ 5లో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘విమానం’ మూవీ స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ‘విమానం’ సినిమాను సంయక్తంగా నిర్మించారు. థియేటర్లో రిలీజ్ అయి మంచి స్పందన తెచ్చుకున్న ఈ ‘విమానం’ సినిమా జూన్ 22 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం, ప్రేమానురాగాలు ప్రధానంగా తెరకెక్కిన ఈ విమానం మూవీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాకుండా ఈ మధ్య కాలంలో ఇంతలా హార్ట్ టచింగ్ మూవీ రాలేదని అనిపించుకుంది. ఇక అలా ఓటీటీలో అందరినీ అలరిస్తూ 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో సినిమా దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హైదరాబాద్ బస్తీలో వీరయ్య (సముద్రఖని) అనే వ్యక్తికి కాలు ఉండదు. భార్య చనిపోవటంతో ఒక్కాగానొక్క కొడుకు (మాస్టర్ ధ్రువన్)ని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు, అయితే ఆ చిన్న పిల్లాడికి విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. కొడుకుని విమానం ఎక్కించాలని వీరయ్య ఎంతో తపన పడుతుంటాడు చివరికి ఎలా విమానం ఎక్కించాడు అనేది సినిమా కథ. డైరెక్టర్ శివ ప్రసాద్ యానాల టేకింగ్, చరణ్ అర్జున్ సంగీతం, వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయని ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
