టీడీపీ – జనసేన తొలి జాబితా.. సామాజిక సమీకరణాలు ఇలా
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.. ఇప్పటికే అధికార వైసీపీ వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ.. ప్రచారాన్ని కూడా ప్రారంభించగా.. ఇప్పుడు టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు. 24 ఎమ్మెల్యే స్థానాల్లో, మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని.. మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. ఇక, తొలి జాబితాలో భాగంగా టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు.. ఇక, జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.. మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు.. టీడీపీ – జనసేన విడుదల చేసిన తొలి జాబితాలో.. బీసీ: 19, ఎస్సీ: 20, ఎస్టీ: 03, కాపు: 10, కమ్మ: 22, రెడ్డి: 17, వైశ్య: 02, క్షత్రియ: 04, వెలమ: 01, మైనార్టీ: 01 ఉన్నారు.
టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్.. పవన్‌పై మంత్రి కొట్టు సెటైర్లు
టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఆ రెండు పార్టీల పొత్తులపై స్పందించిన ఆయన.. సమరానికి సిద్ధమో లేదో టీడీపీ, జనసేన నిర్ణయించాలన్నారు. అభ్యర్ధులను ప్రకటిస్తే ఎన్నికలకు సిద్ధం అయినట్లేనా..? ఉమ్మడి మీటింగ్ లో సభలపై రెండు పార్టీల నేతలు ఉండాలిగా..? వేరు వేరుగా సభలు పెట్టుకుంటూ కలిసి ఉన్నామంటే ఎలా? కింద కేడర్ లో వున్న అభద్రతా భావాన్ని ఎవరు తొలగిస్తారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, పవన్ కల్యాణ్.. తణుకు పర్యటనలో జనసేన నాయకుడికి సీటు ప్రకటించాడు… ఇవాళ్టి లిస్ట్ లో టీడీపీ నేతను ప్రకటించారు.. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ మాటకు ఎంత విలువుందో చంద్రబాబు మాటకు ఎంత విలువ ఉందో అర్ధమవుతుందన్నారు. ఇక, చంద్రబాబు 2014లో మేం కలిసి పోటీచేయడం చారిత్రక అవసరం అన్నాడు.. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయాలన్న చంద్రబాబు.. తర్వాత కాంగ్రెస్ తో కలిశాడు అని దుయ్యబట్టారు మంత్రి కొట్టు.. బీజేపీని.. కాంగ్రెస్ తో కలిపేసుకోవడం చారిత్రక అవసరమా? అంటూ సెటైర్లు వేసిన ఆయన.. దేశంలోని పార్టీలన్నింటితో చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నాడు అని విమర్శించారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ తనకు 24 సీట్లు సరిపోయాయనుకుంటున్నాడేమో.. చంద్రబాబు తనకు ఎక్కువే ఇచ్చారనుకుంటున్నాడేమో..? అంటూ దుయ్యబట్టారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
టీడీపీ – జనసేన తొలి జాబితా.. ఆ 9 నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు..!
ఎన్నికలకు సన్నద్ధం అవుతోన్న టీడీపీ – జనసేన.. ఉమ్మండిగా తొలి జాబితాను ప్రకటించాయి.. అయితే, అభ్యర్థుల ప్రకటన తర్వాత వివిధ జిల్లాల్లో.. నియోజకవర్గాల్లో ఆయా పార్టీల శ్రేణులు రోడ్డెక్కారు. మొత్తం 99 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ-జనసేన. కానీ.. తొమ్మిది నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి.. ఎనిమిది సెగ్మెంట్లల్లో టీడీపీ.. ఒక నియోజకవర్గంలో జనసేనలో అసంతృప్తుల ఆందోళనకు దిగారు.. గజపతినగరం, కళ్యాణదుర్గం, పెనుకొండ, అనకాపల్లి, పి.గన్నవరం, రాయచోటి, తెనాలి సెగ్మెంట్లల్లో టీడీపీ నేతల ఆందోళన చేస్తుండగా.. పెడనలో బూరగడ్డ వేదవ్యాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఇక, గజపతినగరంలో కేఏ నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తల ఆందోళనకు చేస్తుండగా.. కళ్యాణదుర్గంలో చంద్రబాబు ఫ్లెక్సీలు తగుల బెట్టారు ఉన్నం హనుమంతరాయ చౌదరి అనుచరులు. తీవ్ర నిరాశలోకి వెళ్లారు పెడన సీటును ఆశించిన బూరగడ్డ వేదవ్యాస్. పెనుకొండ భగ్గుమంది.. పెనుకొండ టికెట్ ఆశించిన బీకే పార్ధసారథిని హిందూపురం ఎంపీగా పంపే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. అనకాపల్లిలో పీలా గోవింద్ వర్గీయులు ఆందోళన చేశారు.. సాయంత్రానికి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న పీలా గోవింద్ ప్రకటించారు. పి.గన్నవరం తమ పదవులకు.. పార్టీకి రాజీనామా చేశారు తోలేటి సత్తిబాబు.. రాయచోటిలో రమేష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.. ఆలపాటి రాజా అలకమాన్పు ఎక్కారు.. రేపు కార్యకర్తల సమావేశం పెట్టేందుకు ఆలపాటి రాజా సిద్ధం అయ్యారు.. ఇక, జగ్గంపేటలో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు.. గుంభనంగా ఉన్నారు కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న.. గంటా శ్రీనివాసరావు, మండలి బుద్దాప్రసాద్, యరపతినేని, చింతమనేని, బండారు సత్యనారాయణ మూర్తి.. దీంతో.. ఆయా నియోజకవర్గాల్లో కూడా వారి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
3న మేదరమెట్లలో సిద్ధం సభ.. 15 లక్షల మందికి పైగా వస్తారు..!
ఎన్నికలకు ప్రచారంలో భాగంగా సిద్ధం పేరుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తుంది.. ఈ మధ్యే రాప్తాడులో జరిగిన సభ పెద్ద చర్చకు దారి తీసింది.. అయితే, నెల్లూరు జిల్లాలో మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. సిద్ధం సభ వచ్చే నెల 3వ తేదీన మేదరమెట్లలో నిర్వహిస్తాం అన్నారు.. నాలుగున్నారేళ్లలో ప్రభుత్వం అందించిన పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు వివరిస్తారని తెలిపారు. నెల్లూరు.. తిరుపతి.. ఒంగోలు లోకసభ పరిధిలోని అసెంబ్లీ నేతలతో నెల్లూరు సమావేశంలో చర్చించాం.. మూడు సిద్ధం సభలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.. భీమిలి.. దెందులూరు.. రాప్తాడు సభలు విజయవంతం అయ్యాయి.. సభలకు లక్షలాది మంది తరలి వచ్చారని తెలిపారు. ఇక, మెదరమెట్ల సభకు 15 లక్షల మందికి పైగా వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్ధం సభలో 2024 నుంచి 2029లో ఏమి చేయబోతున్నారో సీఎం వైఎస్ జగన్ వివరిస్తారని తెలిపారు విజయసాయిరెడ్డి.. ఎన్నికల సమయంలో కొందరు నేతలు వెళ్తారు.. కొందరు వస్తారు.. ఇది సర్వ సాధారణమే అన్నారు.. అయితే, వేమిరెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పడంపై స్పందించిన ఆయన.. వేమిరెడ్డి సౌమ్యుడే.. పార్టీ నేతలు ఎవరూ ఆయనను దూషించరని స్పష్టం చేశారు. నెల్లూరు లోక్ సభకు శరత్ చంద్రా రెడ్డి పోటీ చేయరు అని తెలిపారు. సోషల్ మీడియాలలో కొందరు ప్రచారం చేస్తున్నారు.. కానీ, వచ్చే వారంలో నెల్లూరు లోక్ సభ అభ్యర్థిని నిర్ణయిస్తాం.. రెండు.. మూడు రోజుల్లో జిల్లా అధ్యక్షుడిని నియమిస్తామని వెల్లడించారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి..
పవన్‌కు లెక్క ఉందా..? ఇదా తిక్క లెక్క..!
వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ స్థానాలకు ఒప్పుకోవడంపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ కల్యాణ్ ఈసారైనా సీఎం అవుతారని కాపులు భావించారు.. కానీ, 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లతో పవన్ సరిపెట్టుకున్నారు.. పవన్‌కు లెక్క ఉందా..? ఇదా తిక్క లెక్క..! అంటూ ఎద్దేవా చేశారు.. సీఎం సీఎం అని గొంతు చించుకున్న కాపులకు పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారన్న ఆయన.. టీడీపీతో పొత్తు పెట్టుకొని సీట్లు ప్రకటించుకున్నాడు.. 24 అసెంబ్లీ సీట్లు 3 పార్లమెంట్ స్థానాలకు పవన్ కక్కుర్తి పడ్డారని విమర్శించారు. ఇక, 175 టార్గెట్ తో వైసీపీ ఎన్నికలకు వెళ్తుందని ప్రకటించారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడానికే ఓటు ట్రాన్ఫర్ చేయాలి అంటున్నాడు పవన్ కల్యాణ్.. కాపు సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు మంత్రి అంబటి.. ఒకరి పల్లకి మోయడం కంటే.. విలీనం చేసి సినిమాలు తీసుకోవాలని సూచించారు. వంగవీటి రంగా హత్య తర్వాత కమ్మ, కాపుకి మధ్య ఉన్న ఆగాదాన్ని పూడ్చడానికే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు అని వ్యాఖ్యానించారు. ఇక, ముద్రగడను బతికుండగానే వేధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. మరోవైపు.. అన్న చిరంజీవిని చూసి పవన్ కల్యాణ్ నేర్చుకోవాలి అని హితవుపలికారు. చిరంజీవి పార్టీని నడపలేని పరిస్థితిలో విలీనం చేసి సినిమాలు తీసుకుంటున్నాడు.. పవన్ కూడా పార్టీ విలీనం చేసి సినిమాలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాపు సోదరులు , పవన్ కల్యాణ్ ప్యాకేజీ రాజకీయాలకు బలి కావద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఇక, పొత్తుపై టీడీపీ-జనసేనకు క్లారిటీ లేదని.. చంద్రబాబు, పవన్ కన్ఫ్యూజన్‌తో ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆశీస్సులున్నాయని పవన్ అన్నారు.. కానీ, బీజేపీ సింబల్ లేకుండానే పొత్తు ప్రకటన చేశారని దుయ్యబట్టారు.. ఇంకా మీడియా సమావేశంలో మంత్రి అంబటి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్.. 14 మంది మహిళలకు టికెట్లు
టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా ప్రకటించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ తొలి జాబితాను విడుదల చేశారు. 24 ఎమ్మెల్యే స్థానాల్లో, మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది.. మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. ఇక, తొలి జాబితాలో భాగంగా టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు.. ఇక, జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.. టీడీపీ – జనసేన అభ్యర్థుల్లో సామాజిక సమీకరణాలు పరిశీలిస్తే బీసీ అభ్యర్థులు 19, ఎస్సీ అభ్యర్థులు 20, ఎస్టీ అభ్యర్థులు 03, కాపు అభ్యర్థులు 10, కమ్మ అభ్యర్థులు 22, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు 17, వైశ్య 2, క్షత్రియ 4, వెలమ 1, మైనార్టీల నుంచి ఒక అభ్యర్థి ఉన్నారు.. మరోవైపు.. టీడీపీ-జనసేన కూటమి తొలిజాబితాలో 14మంది మహిళలకు అవకాశం వచ్చింది.. పెనుకొండ- సవిత, రాప్తాడు- పరిటాల సునీత, సింగనమల- బండారు శ్రావణి, పాణ్యం- గౌరు చరితారెడ్డి, ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ, కడప- మాధవిరెడ్డి, సూళ్లూరుపేట- విజయశ్రీ, నందిగామ- తంగిరాల సౌమ్య, తుని- యనమల దివ్య, పాయకరావుపేట- వంగలపూడి అనిత, సాలూరు – గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం-అదితి గజపతిరాజు, అరకు-జగదీశ్వరీ, నెల్లిమర్ల-లోకం మాధవి(జనసేన)లకు టికెట్లు కేటాయించాయి రెండు పార్టీలు.. మొత్తంగా తొలి జాబితాలో 14 మంది మహిళా అభ్యర్థులకు చోటు దక్కగా.. మిగతా స్థానాల్లో మరికొందరు మహిళలను బరిలోకి దించే అవకాశం ఉంది.
పవన్ కనీసం 15 శాతం సీట్లు తీసుకోలేకపోయారు.. 4 స్థానాల్లో కూడా గెలవడు..!
టీడీపీ-జనసేన విడుదల చేసిన తొలి ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సెటైర్లు వేస్తున్నారు.. రానున్న ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలకు పైగా గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇక, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో 8 కోట్ల రూపాయల నిధులతో నిర్మితమవుతున్న 30 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసి, సీతానగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్‌పై హాట్ కామెంట్లు చేశారు. పవన్ కల్యాణ్ కనీసం 15 శాతం సీట్లు తీసుకోలేకపోయారని ఎద్దేవా చేసిన ఆయన.. 24 సీట్లలో జనసేన కనీసం నాలుగు కూడా గెలవదు అని జోస్యం చెప్పారు. ఇక, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఒక పక్క ఉంటే మరో పక్క టీడీపీ, జనసేన, బీజేపీ, షర్మిల ఉన్నారు అంటూ విమర్శలు గుప్పించారు అనిల్ కుమార్.. జనసైనికులను చంద్రబాబు కాళ్ల దగ్గర పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టాడు అంటూ మండిపడ్డారు. బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్.. ఎనలేని కృషి చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి చెందగానే.. ఈ ఓటమికి పొత్తు, పవన్ కల్యాణే కారణమని చంద్రబాబు తప్పుకుంటాడు అంటూ సెటైర్లు వేశారు. రాజనగరంలో జనసేన అభ్యర్థి ప్రకటనతో జక్కంపూడి రాజా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
బీజేపీ సొంతగా 370 సీట్లు సాధించలేదు..
లోక్‌సభ ఎన్నికలు ముంచుకువస్తున్నాయి. వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈసారి బీజేపీనే స్వతహాగా 370 సీట్లను సాధిస్తుందని, ఎన్డీయే కూటమి 400కి మించి సీట్లను గెలుస్తుందని ప్రధాని మోడీతో పాటు కేంద్ర నాయకత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 370 సీట్ల సంఖ్య కేవలం పార్టీ కార్యకర్తలకు బీజేపీ నిర్దేశించిన లక్ష్యం మాత్రమే అని అన్నారు. అయితే, ఇది బీజేపీకి ప్రతిష్టాత్మక లక్ష్యమని చెప్పారు. బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలువలేదని అన్నారు. కాగా.. బీజేపీ 370 సీట్ల గెలుపుపై అమిత్ షా ఇటీవల వారి వ్యూహాన్ని ప్రకటించారు. ఆర్టికల్ 370ని తొలగించామని అందుకే తాము 370 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన ఆర్టికల్ 370ని 2019లో కేంద్రం తొలగించింది. భారత రాజ్యాంగం, చట్టాలు నేరుగా ఆ ప్రాంతానికి వర్తించేలా బీజేపీ మార్గం సుగమం చేసింది.
హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారతీయుల ప్రాధాన్యం.. ఆటోమొబైల్ సర్వేలో కీలక విషయాలు..
ఆటోమొబైల్ రంగంలోని ఇటీవల కాలంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంప్రదాయ పెట్రోల్/డిజిల్ ఆధారిత ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్(ICE) సాంకేతిక నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు(EV), హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు (HEV) వరకు వాహన రంగం అభివృద్ధి చెందింది. డెలాయిట్ యొక్క ఇటీవలి గ్లోబల్ ఆటోమోటివ్ కన్స్యూమర్ స్టడీ (GACS) ప్రకారం.. 50 శాతం మంది భారతీయ వినియోగదారులు పెట్రోల్/డిజిల్ ఇంజన్ల నుంచి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు (HEV)లకు ప్రాధన్యత ఇస్తున్నట్లుగా తేలింది. 2023 అక్టోబర్ 5 నుండి 12వ తేదీ వరకు నిర్వహించబడిన డెలాయిట్ అధ్యయనం 1,000 మంది భారతీయ వినియోగదారులను సర్వే చేసింది. 80 శాతం మంది రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య కారును కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. రూ.10 లక్షలు- రూ. 25 లక్షల లోపు వాహనాల్లో 59 శాతం పెట్రోల్/డిజిల్ ఇంజన్ వాహనాలకు మొగ్గు చూపగా.. 58 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రూ. 10 లక్షలు అంతకంటే తక్కువ ధరల వాహనాల్లో 23 శాతం ICE వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వగా.. 22 శాతం మంది EVలను ఇష్టపడుతున్నారు. ఈ స్టడీలో పాల్గొన్న 68 శాతం మంది పర్యావరణాన్ని ప్రస్తావించారు. చార్జింగ్ మౌలిక సదుపాయల గురించి విషయాల్లో, 66 శాతం మంది డ్రైవర్లు తమ వాహనాలను ఇంటి వద్దే ఛార్జ్ చేస్తామని, 22 శాతం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జ్ చేస్తామని చెప్పారు. ఫాస్ట్ ఛార్జింగ్ అవసరమని, ఎక్కువ మంది కస్టమర్లు క్రెడిట్/డెబిట్ కార్డ్ చెల్లింపులకు ఇష్టపడుతున్నట్లు తెలిపారు.
అయోధ్య రాముడికి ఒక నెలలోనే ఎన్ని కోట్ల విరాళాలు వచ్చాయో తెలుసా..?
హిందువుల శతాబ్ధాల కల అయోధ్యలో రామమందిర నిర్మాణం. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అయోధ్యలో ప్రాణప్రతిష్ట వేడులకు అట్టహాసంగా జరిగాయి. దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ముఖ్య అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోట్లాది మంది భారతీయలు ఈ కార్యక్రమాన్ని టీవీల్లో చూశారు. అయితే, రామ మందిరం ప్రారంభం అయినప్పటి నుంచి భక్తులు లక్షల్లో అయోధ్యకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే నెల రోజుల వ్యవధిలోనే భక్తుల నుంచి ఏకంగా 25 కిలోల బంగారం, వెండి ఆభరణాలు కలిపి రూ. 25 కోట్ల విరాళాలు చెక్కులు, డ్రాఫ్ట్‌లు, ఆలయ కార్యాలయంలో జమ చేసిన నగదుతో పాటు హుండీల్లో జమ అయినట్లు ట్రస్ట్ అధికారులు శనివారం తెలిపారు. రామాలయం ట్రస్ట్ కార్యాలయం ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ.. రూ. 25 కోట్ల అందినట్లు వెల్లడించారు. అయితే ట్రస్ట్ బ్యాంకు ఖాతాలలో నేరుగా ఆన్‌లైన్ ద్వారా జరిగిన లావాదేవీల గురించి తెలియదని చెప్పారు. జనవరి 23 నుంచి ఇప్పటి వరకు 60 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని ఆయన వెల్లడించారు.
ఆ రికార్డు సాధించి నేటికి 14 ఏళ్లు.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి
సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారుండరు. అతనికి చరిత్ర పుటల్లో ప్రత్యేక పేరుంది. తన ఆటతో అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. సచిన్ ను ఇండియాలో క్రికెట్ దేవుడిగా పిలుస్తారు. కాగా.. క్రికెట్ కు సచిన్ చేసిన సేవలకు భారత ప్రభుత్వం భారతరత్నతో గౌరవించింది. ఇదిలా ఉంటే.. తన బ్యాట్ తో మొదటిసారి చరిత్ర సృష్టించిన రోజు ఈరోజు.. సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2010 ఫిబ్రవరి 24న క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా డబుల్ సెంచరీ చేశాడు. అప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ ఈ రికార్డును సాధించి మొనగాడిగా నిలిచాడు. సచిన్ వన్డే డబుల్ సెంచరీ సాధించినప్పుడు ఆయన వయసు 36 సంవత్సరాలు. ఈ మేరకు బీసీసీఐ సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీకి సంబంధించిన వీడియోను తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న క్రమంలో.. ఈ ఫీట్ సాధించాడు సచిన్ టెండూల్కర్. సిరీస్‌లోని రెండవ మ్యాచ్ 24 ఫిబ్రవరి 2010న గ్వాలియర్‌లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో.. ఓపెనర్లు సచిన్‌తో కలిసి సెహ్వాగ్ క్రీజులోకి వచ్చారు. కేవలం 25 పరుగుల స్కోరు వద్ద సెహ్వాగ్ తొలి వికెట్ పడింది. ఆ తర్వాత.. సచిన్ దినేష్ కార్తీక్‌తో, ఆ తరువాత యూసుఫ్ పఠాన్‌తో కలిసి స్కోర్‌ను 300కి తీసుకెళ్లాడు.
‘చారి 111’కి సీక్వెల్… రుద్రనేత్ర యూనివర్స్‌లోకి స్టార్ హీరోలు!
‘మళ్ళీ మొదలైంది’తో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్ ‘చారి 111’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటించారు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ‘చారి 111’ ఎలా మొదలైంది? అని ప్రశ్నించగా.. నేను దర్శకత్వం వహించిన ‘మళ్ళీ మొదలైంది’లో ‘వెన్నెల’ కిషోర్ కమెడియన్ రోల్ చేశారు. ఆ సినిమా చేసేటప్పుడు ‘చారి 111’ ఐడియా చెప్పాను. ఆయనతో చాలా రోజుల నుంచి ఇటువంటి సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఆయన స్క్రిప్ట్ సెండ్ చేయమని అడిగారు, నేరేషన్ ఇవ్వమనలేదు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఓకే చెప్పారు. ‘చారి 111’కు ఇన్స్పిరేషన్ ‘పింక్ పాంథర్’, ‘జానీ ఇంగ్లీష్’ వంటి హాలీవుడ్ ఫిలిమ్స్. నాకు అటువంటి సినిమాలు ఇష్టం. నేను వెన్నెల కిశోర్ పాన్. ‘జానీ ఇంగ్లీష్’ ఫిల్మ్ చూసినప్పుడు నేను ఇండస్ట్రీలోకి ఎంటరైతే ఆయనతో అటువంటి సినిమా తప్పకుండా చేయాలని అనుకున్నాను. నా ఫస్ట్ సినిమాలో ఆయన కమెడియన్ రోల్ చేశారు. తర్వాత ఆయనతో సినిమా చేశా. ఇటువంటి సినిమాలకు కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన సినిమాలు చూస్తే లీడ్ యాక్టర్లను మైండ్ లో పెట్టుకుని సినిమాలు చేసినట్లు ఉంటాయి. కిశోర్, మురళీ శర్మని మనసులో పెట్టుకుని ఈ సినిమా స్క్రిప్ట్ రాశా. తర్వాత విలన్, కాన్‌ఫ్లిక్ట్ ఇష్యూ వచ్చాయి.
ఖరీదైన కారు కొన్న ప్రియమణి..ధర ఎంతో తెలుసా?
టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంది. థియేటర్లలో, ఓటీటీలలో వరుస లు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. గతేడాది జవాన్ తో భారీ హిట్ అందుకుంది. ఇక ఇటీవల భామా కలాపం 2 వెబ్ సిరీస్‌తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పుడు ఈ భామ కీలకపాత్ర పోషించిన ఆర్టికల్ 370 మూవీ విజయవంతంగా దూసుకుపోతుంది.. మరోవైపు బుల్లితెరపై కనిపిస్తుంది.. పలు షోలకు జడ్జిగా వ్యవహారిస్తుంది.. ఒకవైపు సినిమాలు, మరొకవైపు యాడ్స్ లలో కనిపిస్తుంది.. తాజాగా ఈ అమ్మడు ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది.. ఆ కారు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ కారు ధర విని నెటిజన్లు షాక్ అవుతున్నారు.. జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ కొనుగోలు చేసింది ప్రియమణి. మార్కెట్లో ఈ కారు ధర దాదాపు రూ. 74 లక్షల వరకు ఉంటుంది.ఆమె దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి.. ఇప్పుడు మరో కారు ఆమె షెడ్ లోకి చేరింది.. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత తెలుగులో భామా కలాపం సిరీస్ భారీ సక్సెస్ ను అందుకుంది.. దాంతో ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి..
