రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ.. మీ అందరికీ ఇదే మా ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు రేవంత్‌రెడ్డి.. ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలికారు.. తెలంగాణ ప్రజలకు అభినందనలు.. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు, బడుగు, బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ సేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది.. మీ అందరికీ ఇదే ఆహ్వానం అంటూ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు రేవంత్‌రెడ్డి.
రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రేపు మధ్యాహ్నం 1. 04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నుంచి ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు. పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ఎస్బీఐ గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి వైపు, ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ఈ క్రమంలో నగరవాసులు, వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇబ్బందులుంటే 9102033626 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు చెప్పారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారి, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ తదితరులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం డీజీపీ రవిగుప్తా మాట్లాడుతూ… సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా.. సీఎం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం నేపథ్యంలో రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్షమంది హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతోండగా.. ఎల్బీ స్టేడియంలో కేవలం ముప్పై వేలమందికి మాత్రమే కూర్చోవడానికి అవకాశం ఉంది. మిగిలిన వారి కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
వైఎస్ లానే రేవంత్ పాలన ఉంటుంది.. నేను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నా..
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న విషయం విదితమే కాగా.. ఇప్పటికే అధికార యంత్రాంగంతో పాటు.. పార్టీ నేతలు కూడా ఏర్పాట్లలో మునిగిపోయారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తు్న్నారు.. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణతో పాటు.. మరికొందరు నేతలు ఎల్బీ స్టేడియానికి వచ్చారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వంశీ కృష్ణ. నేను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నానని తెలిపారు.. జిల్లాలో నేనే సీనియర్‌ను అని.. అంతే కాదు పార్టీకి విధేయుడిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి లానే రేవంత్ రెడ్డి పాలన ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రేపటి ప్రమాణస్వీకారోత్సవానికి లక్ష మంది వస్తారని అంచనా వేశారు. మేం పని చేయకపోతే ప్రజలు మమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. కాగా, రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే రేపటి కార్యక్రమం కోసం ఉత్సుకతతో కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.. ఇప్పటికే హైదరాబాద్ కు భారీగా చేరుకుంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు, అభిమానులు.. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారురేవంత్‌రెడ్డి.. ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలికారు.. తెలంగాణ ప్రజలకు అభినందనలు.. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు, బడుగు, బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ సేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది.. మీ అందరికీ ఇదే ఆహ్వానం అంటూ ఆ లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం విదితమే.
ఏపీలో తగ్గని వర్షాలు.. రేపు కూడా అక్కడ సెలవే
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్‌పై కొనసాగుతూనే ఉంది.. తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ నెల 5వ తేదీన బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్.. వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతుండగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా కురిశాయి.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి.. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం.. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు అధికారులు.. ప్రస్తుతం తుఫాన్ బలహీనపడుతున్నప్పటికీ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఇక, అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో.. రేపు అనగా గురువారం రోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ సుమిత్ కుమార్. భారీ వర్షాలు కురుస్తుండటంతో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు సెలవు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్.
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా ఉంది.. నన్ను ఓ పార్టీ ఏజెంట్ అనడం తప్పు..
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా ఉంది.. నన్ను ఓ పార్టీ ఏజెంట్ అనడం తప్పు అన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాజీ ఎన్నికల కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశాం.. కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాం.. మా ఫిర్యాదును గవర్నర్ శ్రద్ధగా విన్నారు, సానుకూలంగా స్పందించారని తెలిపారు.. ఇక, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా వుంది.. కానీ, నన్ను ఓ పార్టీ ఏజెంట్ అనడం తగదు అన్నారు.. సీఎఫ్‌డీ వేసుకునే కండువా ఓ పార్టీ కి చెందింది కాదన్న ఆయన.. ఒక్కరికీ ఒకే ఓటు వుండాలి అనే డిమాండ్‌ను మేం స్వాగతిస్తున్నాం అన్నారు. చాలా మందికి రెండు చోట్ల ఓట్లు అంశంలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, గత ఎన్నికల ప్రక్రియలో తప్పులు జరగవు అనే నమ్మకం ఉండేది.. కానీ, ఇప్పుడు వార్డు, విలేజ్ సెక్రటేరియట్‌ల వారికి అనుభవం లేకపోవడం వల్ల తప్పు లు జరుగుతున్నాయన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఓటర్లకు సామాజిక స్పృహ ఉండాలన్న ఆయన.. తాజాగా జరిగి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో కేవలం 40 శాతం మాత్రమే ఓటింగ్ జరగడం దారుణం అన్నారు.. మరోవైపు, వేరే చోట ఉద్యోగం చేస్తుంటే సొంత ఊర్లలో ఓట్లు తొలగిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఓటు తీసేటప్పుడు నోటీస్ ఇవ్వాలి… సంజయిషి తీసుకోవాలి అని సూచించారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్.
కేటుగాళ్లకు చెక్..! వందకు పైగా వెబ్‌సైట్లపై నిషేధం
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్లు కొందరు. ఉన్న ఉద్యోగంతో వస్తున్న ఆదాయం చాలక పార్ట్‌టైమ్ పని కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు ఇంకొందరు. రోజూ ఆఫీసుకు వెళ్లే పరిస్థితిలోని చంటి పిల్లల తల్లులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు.. ఇలా ఇంటి వద్దే ఉండి విధులు నిర్వహించే ఉద్యోగాల కోసం చూస్తున్నారు మరికొందరు. మేం కష్టపడతాం.. తగిన ప్రతిఫలితం ఇవ్వండి చాలు అని చాలా న్యాయంగా అడిగే వాళ్లే వీళ్లంతా. కానీ, వీళ్ల అవసరాలను ఆసరాగా చేసుకుని నిలువునా దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. రిజిస్ట్రేషన్, డిపాజిట్ అంటూ రకరకాల కారణాలు చెబుతూ కోట్ల రూపాయలు దోచేస్తున్నారు సైబర్ దుండగులు. ముఖ్యంగా చైనాకు చెందిన వెబ్‌సైట్‌లు, పేమెంట్ గేట్‌వేలను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న వందకు పైగా వెబ్‌సైట్లను కేంద్ర ప్రభుత్వ నిషేధించింది. ఈ వెబ్‌సైట్‌లు డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్లు, మ్యూల్, అద్దె ఖాతాలను ఉపయోగిస్తూ మోసాలకు చేస్తున్నట్టు గుర్తించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వెబ్‌సైట్లపై కేంద్ర ఐటీ శాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్‌కు కాల్ చేయడం, SMSలు పంపడం, ఈ-మెయిల్‌కు నకిలీ ఆఫర్ లెటర్లు పంపడం ద్వారా యువకుల్ని ముగ్గులోకి లాగడంలో ఆరితేరిపోయారు పైబర్ కేటుగాళ్లు. వర్క్‌ఫ్రం హోం, పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇప్పిస్తామని అమాయకుల్ని నమ్మిస్తున్నారు. తర్వాత వాళ్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న ముఠా ఏకంగా 712 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు గుర్తించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా రేట్ అండ్ రెవ్యూ పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో మోసాలు చేసింది ఆ ముఠా. ఇక కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఓ బాధితుడి నుంచి ఏకంగా కోటి 20 లక్షల రూపాయలు వసూలు చేశారు సైబర్ దొంగలు.
సూర్యుడిపై అతిపెద్ద రంధ్రం.. 60 భూ గ్రహాలకు సమానం..
సూర్యుడు ఎప్పుడూ లేనంతగా క్రియాశీలకంగా మారాడు. ఇటీవల కాలంలో సూర్యుడి ఉపరితలం గందరగోళంగా మారింది. సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌర తుఫానుల తీవ్రత పెరిగింది. సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్నాడు. ఈ సమయంలో సూర్యుడి ఉపరితలం మరింత క్రియాశీలకంగా మారుతుంది. ప్రతీ సోలార్ సైకిల్‌కి తన అయస్కాంత క్షేత్రాన్ని మార్చుకుంటాడు. అంటే నార్త్ పోల్ సౌత్‌గా, సౌత్ పోల్ నార్త్‌గా మారుతుంది. ఈ సమయంలో సన్ స్పాట్స్ ఎక్కువగా ఏర్పడటంతో పాటు అయస్కాంత క్షేత్రం మరింత శక్తివంతంగా మారుతుంది. సూర్యుడిపై పేలుళ్లు ఏర్పడి పదార్థం అంతరిక్షంలోకి వెలువడుతుంది. ఇదిలా ఉంటే కరోనల్ హోల్ సూర్యుడి ఉపరితలంపై గరిష్ట పరిమాణానికి చేరుకుంది. నిజానికి ఇది రంధ్రం కాదు, ప్రకాశవంతమైన సూర్యుడి వెలుగులో నల్లగా ఉండే ప్రాంతం రంధ్రంగా కనిపించడంతో ఈ పేరుతో పిలుస్తుంటారు. ప్రస్తుత ఏర్పడిన కరోనల్ హోల్ ఏకంగా 4,97,000 మైళ్ల అసాధారణ వెడల్పుకు విస్తరించింది. ఖగోళ పరిశోధకులు దీనిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇది మన సూర్యుడికి అభిముఖంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మన గ్రహం దిశగా అధిక వేగంతో సౌరగాలులు ప్రసారమవుతున్నాయి.
సెకండ్ సింగిల్ వస్తుంది.. రెడీనా
సంక్రాంతికి ఇంకా ఎన్నో రోజులు లేవు.. ఈ సంక్రాంతికి సినిమాల జాతర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఇప్పటినుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోతే అప్పటికి కష్టమే. ఇక సంక్రాంతి రేసులో అందరి కళ్ళు.. గుంటూరు కారం మీదనే ఉన్నాయి. మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి సాంగ్ వచ్చి కూడా దాదాపు నెల దాటింది. మిగతావారందరూ.. సంక్రాంతికి సినిమా అయినా కూడా వరుస ప్రమోషన్స్ చేస్తూ హైప్ పెంచేస్తున్నారు. కానీ, గుంటూరు కారం టీమ్ మాత్రం నెలకు ఒకటి.. రెండు నెలలకు ఒకటి అప్డేట్స్ ఇస్తున్నారు. ఎప్పటినుంచో సెకండ్ సింగిల్ అప్డేట్ అడిగితే .. ఎట్టకేలకు ఈరోజు మేకర్స్ అధికారికంగా సెకండ్ సింగిల్ అప్డేట్ ను ఇచ్చారు. వచ్చే సోమవారం.. గుంటూరు కారం సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పుకొచ్చాడు. ఇక ధం మసాలా బిర్యానీ అంటూ.. మొదటి సాంగ్ లో ఊర మాస్ ను చూపించిన మహేష్.. ఈసారి.. మంచి రొమాంటిక్ సాంగ్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. థమన్ మ్యూజిక్.. మహేష్ రొమాంటిక్ సాంగ్స్ పర్ఫెక్ట్ కాంబో అని చెప్పొచ్చు. దీంతో ఈ సాంగ్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో, అందులో ఏ హీరోయిన్ తో మహేష్ స్టెప్స్ వేయనున్నాడో చూడాలంటే ప్రోమో రిలీజ్ వరకు ఆగాల్సిందే.
ఏంటి మామ.. ఈ షాక్.. జోయా పాప.. విరాట్ కోహ్లీ చెల్లెలా..?
యానిమల్ సినిమా… సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్ రష్మిక కన్నా.. సెకండ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి గురించే టాక్ నడుస్తోంది. జోయాగా ఆమె క్యారెక్టర్ కు, రొమాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నేషనల్ క్రష్ గా ఉన్న రష్మికను కూడా పక్కన పెట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి ఆమెను నేషనల్ క్రష్ గా మార్చేశారు. ఇక అమ్మడు వరుస అవకాశాలను అందుకొని ఇండస్ట్రీ మొత్తానికి టాక్ ఆఫ్ ది టౌన్ గానిలిచింది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ లో ఈ చిన్నది ఛాన్స్ పట్టేసిందని టాక్. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ భామ.. క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెల్లెలు అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏంటి ఇది నిజమా.. ? అని ఆశ్చర్యపోకండి. అసలు ఈ ముద్దుగుమ్మ విరాట్ కు చెల్లెలు ఎలా అయ్యింది అనేది చూద్దాం. త్రిప్తి హిందీలో బుల్ బుల్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాకు నిర్మాత కర్నేష్ శర్మ. స్వయానా.. హీరోయిన్, విరాట్ భార్య అనుష్క శర్మకు అన్నయ్య. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక్క వీరిద్దరూ కలిసి పార్టీలు, పబ్ లు అంటూ తిరిగారంట కూడా. త్వరలోనే ఈ జంట వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. విరాట్ కు కర్నేష్ బావ అంటే.. త్రిప్తి చెల్లి వరుసనే కదా అయ్యేది. అందుకే విరాట్ చెల్లి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే ఈ జంట విడిపోయిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరు ఒకరిని ఒకరు ఇన్స్టాగ్రామ్ నుంచి అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా తాము కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు. దీంతో ఈ జంట బ్రేకప్ చేసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా.. విరాట్ కు ఈ భామ చెల్లి అంటే షాకింగ్ గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
