అమరావతే ఏపీ రాజధాని.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం..
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మరోసారి కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సిద్ధం అవుతోన్న సమయంలో.. కేంద్ర ప్రకటన ఆసక్తికరంగా మారింది.. అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు కేంద్రం వెల్లడించింది.. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను విడుదల చేసింది కేంద్రం.. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కలిపించింది.. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. దేశంలోని 39 శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా? కాదా? అని రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ ప్రశ్నించారు. అయితే, ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇస్తూ.. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తవం అన్నారు. ఏపీ రాజధాని అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని పేర్కొంది కేంద్రం.. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమాలు మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్ లను ఆమోదించినట్లు ఈ సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. కాగా, చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించినా.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత మూడు రాజధానుల విధానంతో ముందుకు సాగుతున్నారు.. అందులో భాగంగా.. త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు.. అమరావతి.. శాసన రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా నిర్ణయించిన విషయం విదితమే.
మిచౌంగ్ తుఫాన్ దెబ్బ.. గన్నవరం నుంచి విమానాలు రద్దు..
మిచౌంగ్ తుఫాన్ ముంచుకొస్తోంది. దక్షిణ కోస్తాను ముంచెత్తబోతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచౌంగ్ తీవ్ర తుఫాన్ వేగం తగ్గింది. ఇది చాలా ప్రమాదకరమని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తీవ్ర తుఫాన్.. ప్రస్తుతం గంటకు 10కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. నెల్లూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీవ్ర తుఫాన్ నెమ్మదిగా పయనిస్తే.. నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రెండు రోజులు చాలా కీలకమని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు, మీచౌంగ్ తుఫాన్ దెబ్బకి గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాలు రద్దు చేశారు.. ఇండిగో నుంచి నడిచే 14 విమానాలు రద్దు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.. విశాఖ, హైదరాబాద్, బెంగులూరు, షిర్డీలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ రద్దు చేసినట్టు పేర్కొంది ఇండిగో.. మరో 4 విమానాల రాకపోకలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ముంచుకొస్తున్న మిచౌంగ్… దక్షిణ కోస్తాను ముంచెత్తనున్న తీవ్ర తుఫాన్
మిచౌంగ్ తుఫాన్ ముంచుకొస్తోంది. దక్షిణ కోస్తాను ముంచెత్తబోతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచౌంగ్ తీవ్ర తుఫాన్ వేగం తగ్గింది. ఇది చాలా ప్రమాదకరమని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తీవ్ర తుఫాన్… ప్రస్తుతం గంటకు 10కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. నెల్లూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీవ్ర తుఫాన్ నెమ్మదిగా పయనిస్తే… నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రెండు రోజులు చాలా కీలకమని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రేపు ఉదయం బాపట్ల-దివిసీమ మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. తీరం దాటిన తర్వాత కూడా తీవ్ర తుఫాన్ ప్రభావం కొనసాగుతుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని చోట్ల కుంభవృష్టి వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ నంబర్ 10 జారీ చేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కచ్చా ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని… విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలలు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కొత్త ముఖ్యమంత్రి కోసం కాన్యాయ్ సిద్ధం..
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి కోసం కాన్యాయ్ ని సాధారణ పరిపాలన శాఖ సిద్ధం చేసింది. ప్రాథమికంగా వైట్ కలర్ కాన్యాయ్ ను అధికారులు రెడీ చేశారు. దిల్ కుషా గెస్ట్ హౌస్ కి 6 ఇన్నోవా కార్లు వచ్చి చేరుకున్నాయి. రెండు కొత్త కార్లు ఉండగా మిగతా 4 కార్లు ఇప్పటికే నెంబర్ ప్లేట్ అలాట్ అయినవి ఉన్నాయి. ఇక, ప్రమాణస్వీకారం తర్వాత కొత్త కాన్యాయ్ లో సీఎం ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, బాధ్యతలు చేపట్టిన కొత్త ముఖ్యమంత్రి.. తన అభీష్టం మేరకు కాన్యాయ్ ను మార్చుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇక, మరో వైపు తెలంగాణ రెండో శాసనసభను గవర్నర్ తమిళిసై రద్దు చేశారు. మంత్రి వర్గ సిఫార్స్ మేరకు సెకండ్ అసెంబ్లీని క్యాన్సిల్ చేశారు. కొత్త ప్రభుత్వానికి సంబంధించి సాంకేతికపరమైన ఏర్పాట్లు కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపే పార్టీ హైకమాండ్ మొగ్గుచూపుతుంది.. ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పార్టీలో తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎల్లా హోటల్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు మరో నలుగురు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కూడా ఉన్నారు. వీరితో చర్చించిన తర్వాత.. సీఎం అభ్యర్థి పేరును రేపు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది.
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9వ తారీఖు నుంచి రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు, బీఆర్ఎస్ 39 స్థానాలు, బీజేపీ 8 సీట్లు, మజ్లిస్ పార్టీ 7 సీట్లు, సీపీఐ 1 స్థానంలో గెలిచాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతుంది. ఇక, ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేపటికి వాయిదా వేసింది. ఇక, ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు నలుగురు పరిశీకులు అధిష్ఠానంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తెలంగాణలో ఎన్నికల కోడ్ ను ఎత్తివేసింది. ఇక, మరో వైపు తెలంగాణ రెండో శాసనసభను గవర్నర్ తమిళిసై రద్దు చేశారు. మంత్రి వర్గ సిఫార్స్ మేరకు సెకండ్ అసెంబ్లీని క్యాన్సిల్ చేశారు. కొత్త ప్రభుత్వానికి సంబంధించి సాంకేతికపరమైన ఏర్పాట్లు కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపుతుంది.
జనగామ బీఆర్ఎస్ జెడ్పీ ఛైర్మన్ గుండెపోటుతో మృతి
జనగామ జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో మరణించారు. హనుమకొండలోని రోహిణి అనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. పాగాల సంపత్‌రెడ్డి ప్రస్తుతం జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే, పాగాల సంపత్ రెడ్డికి హనుమకొండలోని చైతన్యపురిలో ఉండగా సాయంత్రం 5:30కి చాతిలో నొప్పి వస్తుందంటూ వ్యక్తిగత సిబ్బందికి చెప్పడంతో ఆసుపత్రికి సన్నిహితులు తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆయన మరణించారు. కాగా, సంపత్ రెడ్డి జనగామ నుంచి బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో అహర్నిశలు కృషి చేశారని స్థానిక పార్టీ నేతలు తెలిపారు. సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
చెన్నైలో భారీ వర్షాలు.. వరదల కారణంగా ముగ్గురు మృతి
డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను.. డిసెంబర్ 5 అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాన్ని తాకనుంది. దీంతో.. ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలలో తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా.. గాలులు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఇప్పటికే.. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొనగా.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం.. మిచౌంగ్ తుపాను నైరుతి బంగాళాఖాతంలో ఉందని ఐఎండీ తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదులుతోందని.. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే.. తుపాన్ ప్రభావంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో నీరు నిలిచిపోవడంతో సర్వీసులు నిలిచిపోయాయి. మంగళవారం ఉదయం 9 గంటల వరకు రన్‌వేను మూసివేశారు. బయటి నుంచి వచ్చే విమానాలను బెంగళూరుకు మళ్లిస్తున్నారు. అటు.. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌లపై నుంచి నీరు చేరింది. ఇప్పటి వరకు 204 రైళ్లు, 70 విమానాలు రద్దు అయ్యాయి. అంతేకాకుండా.. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. నివాస ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పదుల సంఖ్యలో కార్లు తేలుతూ కనిపించాయి. దీంతో.. రాష్ట్రంలో SDRF, NDRF బృందాలు మోహరించాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లపై 3 నుంచి 4 అడుగుల మేర నీరు నిలిచింది.
ఆవులు, గేదెలకు బదులు గాడిదల పెంపకం.. ప్రతినెలా రూ.3 లక్షల వరకు సంపాదన..!
ఆవులు, గేదెల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులను మీరు చూసి ఉంటారు. అయితే అంతకుమించి డబ్బులు సంపాదిస్తున్నాడు ఓ రైతు. కానీ అది ఆవులు, గేదెల పెంపకంతో కాదు.. గాడిదల పెంపకంతో. గాడిదలను వస్తువులను తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ వీటి పెంపకం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు. ఎందుకంటే గాడిద పాలకు ప్రపంచంలో అత్యంత ఖరీదు ఉంది. గుజరాత్‌లోని మనుంద్ అనే చిన్న గ్రామానికి చెందిన ధీరేన్ సోలంకి అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూశాడు. కానీ.. ఉద్యోగం రాకపోవడంతో గాడిదల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. సుమారు 8 నెలల క్రితం తన గ్రామంలో రూ.22 లక్షలతో కొద్దిపాటి భూమిని తీసుకుని 20 గాడిదలతో గాడిదల పెంపకం ప్రారంభించాడు. అయితే.. గుజరాత్‌లో గాడిద పాలకు ప్రాముఖ్యత లేకపోవడంతో ధీరేన్‌కు 5 నెలలు ఎలాంటి ఆదాయం రాలేదు. అయితే.. దక్షిణ భారతదేశంలో గాడిద పాలకు అత్యధిక డిమాండ్ ఉందని తెలుసుకుని.. ధీరేన్ దక్షిణ భారతదేశంలోని కొన్ని కంపెనీలను సంప్రదించాడు. ఆ తర్వాత క్రమంగా.. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలకు పాల సరఫరా చేయడం మొదలు పెట్టాడు.
షారుఖ్ ఖాన్ డంకీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది రెండు భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నారు.ఆయన నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు ఈ ఏడాది ఏకంగా రూ.1,000కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి భారీ విజయం అందుకున్నాయి.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ ‘డంకీ’.. ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‍కుమార్ హిరాని తెరకెక్కించారు. ఈ దర్శకుడు గతంలో 3 ఇడియట్స్, పీకే వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.దీనితో డంకీ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి.ఇదిలా ఉంటే డంకీ సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.డంకీ సినిమా ట్రైలర్ రేపు (డిసెంబర్ 5) రిలీజ్ కానుందని సమాచారం.ఈ విషయంపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.
షర్మిలక్కకు కాబోయే కోడలు.. హీరోయిన్ లెక్క ఉందే..?
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆమె ఎంత ఫేమసో.. ఆమె కొడుకు రాజారెడ్డి అంతే ఫేమస్. ఈ ఏడాది రాజారెడ్డి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. షర్మిల కొడుకు హీరోలా ఉన్నాడు అంటూ కొందరు చెప్పుకురాగా.. త్వరలోనే రాజారెడ్డి హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. ఇక రాజారెడ్డి అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటిలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేసి పట్టా అందుకొని ఇండియాకు తిరిగివచ్చాడు. ఈ కుర్రాడు నెక్స్ట్ ప్లాన్ ఏదై ఉంటుంది.. బిజినెస్ చేస్తాడా.. ? అమ్మలా రాజకీయాలు అంటాడా.. ? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా.. రాజారెడ్డి మాత్రం ప్రేమ, పెళ్లి అంటూ చెప్పుకురావడం షాకింగ్ గా మారింది. వైఎస్ రాజారెడ్డి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇక దీంతో షర్మిలక్క కు కాబోయే కోడలు ఎవరు.. ? ఎలా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ గూగుల్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఆమె పేరు ప్రియ అట్లూరి. ఇప్పటివరకు ఆమె చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ మనవరాలు అంటూ వార్తలు రాసుకొచ్చారు. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ప్రియా అట్లూరిది కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అని సమాచారం. వీరిద్దరూ డల్లాస్ యూనివర్సిటిలో ఫ్రెండ్స్ అంట. ఇక 4 ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని, వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పడంతో వచ్చే ఏడాది మే లో వీరి వివాహం ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ప్రియ కూడా చూడడానికి ఎంతో అందంగా ఉంది. రాజారెడ్డికి ఈడుజోడు బావుందని, అమ్మాయి కూడా హీరోయిన్ లెక్కనే ఉందని, షర్మిలక్కకు మంచి కోడలు దొరికిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి షర్మిల ఈ విషయమై ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
సమంత కు రూ. 6 కోట్ల బంగ్లా గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఆ పని చేసిందా.. ?
చిత్ర పరిశ్రమలో నటీనటులు.. ఒక సినిమా ఒప్పుకున్నారు అంటే.. అది కొన్నిసార్లు కథ నచ్చి ఒప్పుకుంటారు. ఇంకొన్నిసార్లు రెమ్యూనిరేషన్ నచ్చి ఒప్పుకుంటారు. ఇక ప్రస్తుతం రెమ్యూనిరేషన్స్ విషయంలో హీరోయిన్స్ చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు. మార్కెట్ లో తమకు ఉన్న పాపులారిటీని బట్టి అందుకుంటున్నారు. ఇక కొన్నిసార్లు స్టార్ హీరో సినిమాలో చేసేటప్పుడు అటుఇటు చూసుకున్నా.. కొత్త హీరోలతో చేసేటప్పుడు మాత్రం అస్సలు తగ్గేదేలే అని అందినంత తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత.. ఒకప్పుడు ఒక సినిమా కోసం దాదాపు రూ. 6 కోట్ల విలువ చేసే బంగ్లా తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా ఏదో కాదు అల్లుడు శ్రీను. నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతని కొడుకుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాత కొడుకు ఎంట్రీ అంటే.. ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఉంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. అప్పుడు హీరోయిన్ గా ఉన్న సామ్.. ఈ సినిమాలో శ్రీనివాస సరసన నటించింది. ఒక అప్ కమింగ్ హీరోతో సమంత నటిస్తుంది అనేసరికి అందరూ షాక్ కూడా అయ్యారు. అయితే ఈ సినిమా కోసం సామ్.. భారీగా రెమ్యూనిరేషన్ తీసుకోవడం వలనే ఒప్పుకుందని తెలుస్తోంది. మొదట్లో సామ్.. ఈ సినిమాను ఒప్పుకోలేదని, ఆ తరువాత బెల్లంకొండ సురేష్.. సామ్ ను ఒప్పించడానికి రూ. 6 కోట్ల బంగ్లా గిఫ్ట్ ఇచ్చాడని, అందుకే ఆమె హీరోయిన్ గా చేసిందని టాక్. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంది. ఆ తరువాత నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నిలబడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇక ఈ వార్తపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. తప్పేముంది.. అది కూడా రెమ్యూనిరేషన్ యేగా అని కొందరు.. కొత్త హీరోతో చేయడానికి ఆ మాత్రం తీసుకోవడంలో తప్పు లేదు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. అయితే అసలు ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
