NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

మోకిల భూములకు రెక్కలు.. గజం రేట్ ఎంతంటే.. ..?
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా అన్నింటికీ మంచి డిమాండ్ వచ్చింది. రెండో దశలో 300 ప్లాట్లను హెచ్ఎండిఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ద్వారా నేటి( బుధవారం ) నుంచి ఐదు రోజుల పాటు ఆన్ లైన్ లో వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నాది. ఇవాళ (బుధవారం) మొదటి రోజు ఉదయం 30 ప్లాట్లకు, మధ్యాహ్నం మరో 30 ప్లాట్లకు వేలం ప్రక్రియ జరిగింది. వాటిలో అత్యధికంగా గజం లక్ష రూపాయల చొప్పున మోకిల భూముల రేటు పలకడం విశేషం. మోకిలా లేఅవుట్లో తొలి రోజు గజం రేటు సరాసరిగా రూ.63,513లుగా నమోదు కావడం గమనార్హం. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ ప్రభుత్వానికి చేకూరింది. మోకిలలో హెచ్ఎండిఏ లేఅవుట్.. కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల మంచి డిమాండ్ నెలకొంది.

సింహాద్రి అప్పన్నకు రూ.100 కోట్ల చెక్‌.. అసలు విషయం తెలిస్తే షాకే..!
విశాఖ సమీపంలోని సింహాచల క్షేత్రంలో ప్రసిద్ధమైన వరాహ నరసింహ స్వామి దేవాలయం ఉంది. దీనినే సింహాద్రి అప్పన్న కొండ అని కూడా పిలుస్తారు.. భక్తులు సింహాద్రి అప్పన్నగా కొలుస్తుంటారు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి సహా ఒడిషా ప్రజలకూ ఆరాధ్య పుణ్యక్షేత్రంగా ఉంది సింహాచలం.. అయితే, సింహాద్రి అప్పన్నకు రూ.100 కోట్ల చెక్‌ వచ్చింది.. హుండీలో 100 కోట్ల రూపాయల చెక్ డిపాజిట్ చేశారు బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే భక్తుడు.. ఎంవీపీ డబుల్ రోడ్డు, విశాఖలోని కోటాక్ బ్యాంకుకు చెందిన చెక్ నంబర్ 530485009ను హుండీలో వేశాడు.. అయితే, ఆలయ చరిత్రలో ఈ స్థాయిలో హుండీలో లభించడం ఇదే తొలిసారి కాడంతో.. ఓవైపు సంతోషం.. మరోవైపు షాక్‌ తిన్నారు. అయితే, అది నకిలీది అని తెలిసి నోరువెల్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 100 కోట్ల రూపాయల చెక్ చూసి మొదట షాక్ అయిన హుండీ లెక్కింపు సిబ్బంది.. భారీ విరాళం చెక్ చెల్లుతుందా..? లేదా..? అని అనుమానం వ్యక్తం చేశారు.. ఆ తర్వాత వెరిఫికేషన్‌ కోసం ఆలయ ఈవోకు చూపించారు.. ఇక, ఆ చెక్‌ను బ్యాంకుకు పంపించి ఆరా తీశారు ఈవో.. దాంతో, సింహాద్రి అప్పన్నకు వందకోట్లు చెక్ వచ్చిన మాట వాస్తవమే అయినా.. అది ఫేక్‌ అని తేలిపోయింది.. సదరు రూ.100 కోట్ల చెక్‌ను విరాళంగా సమర్పించిన భక్తుడి అకౌంట్లో కేవలం 17 రూపాయలు ఉన్నట్టు గుర్తించారు. అయితే, భక్తుడు రాధాకృష్ణ అడ్రస్ వివరాలు కోరుతూ బ్యాంకుకు లేఖ రాయాలని దేవస్థానం వర్గాల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. దురుద్దేశ పూర్వకంగా చెక్ వేసినట్టు గుర్తిస్తే.. చెక్ బౌన్స్ కేసు పెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా సమాచారం.

ల్యాండింగ్ తర్వాత చంద్రుడి తొలి చిత్రాన్ని పంపిన చంద్రయాన్‌-3
చంద్రుడి మీద విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత చంద్రయాన్‌-3 తొలి చిత్రాన్ని విడుదల చేసింది. ల్యాండ్‌ అయిన తర్వాత విక్రమ్‌ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్‌ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్‌ సెంటర్‌తో ల్యాండర్‌ కమ్యూనికేషన్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ట్విటర్‌లో ఇస్రో ఇలా రాసుకొచ్చింది.” చంద్రయాన్‌-3 ల్యాండర్, బెంగళూరు రీసెర్చ్‌ సెంటర్‌ మధ్య లింక్ ఏర్పాటు చేయబడింది. ల్యాండింగ్‌ సమయంలో ల్యాండర్‌ తీసిన ఫొటోలు ఇక్కడ ఉన్నాయి.” అని ఇస్రో తెలిపింది. ఇస్రో చరిత్ర సృష్టించింది… జాబిలమ్మపై అడుగుపెట్టి సత్తా చాటింది.. భారత్‌ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఇస్రోపై ప్రశంసలు కురిపిస్తోంది.. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టింది చంద్రయాన్‌-3.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన తొలి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది.. ఇక, చంద్రుడిపై కాలుమోసిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది.. దీంతో.. ఇస్రోతో పాటు భారత్‌ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దృక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. చంద్రయాన్‌-3 నుంచి ఇస్రోకు చేరిన తొలి మెసేజ్‌ ఏంటి అంటే.. ”నేను నా గమ్యాన్ని చేరుకున్నా.. మీరు (భారత్‌, ఇస్రో) కూడా”.. అంటూ మెసేజ్‌ను పంపింది. ఇక, దీనిని ఇస్రో ధృవీకరించింది. చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని ప్రకటించింది.. భారతదేశానికి అభినందనలు అంటూ ట్వీట్‌ చేసింది.

చందమామపై దిగిన చంద్రయాన్-3.. ఇస్రోకు పంపిన తొలి మెసేజ్‌ ఇదే..
ఇస్రో చరిత్ర సృష్టించింది… జాబిలమ్మపై అడుగుపెట్టి సత్తా చాటింది.. భారత్‌ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఇస్రోపై ప్రశంసలు కురిపిస్తోంది.. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టింది చంద్రయాన్‌-3.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన తొలి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది.. ఇక, చంద్రుడిపై కాలుమోసిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది.. దీంతో.. ఇస్రోతో పాటు భారత్‌ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దృక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఆ తర్వాత ఇస్రోకు తొలి మెసేజ్‌ను పంపింది. జాబిలమ్మపై అడుగుపెట్టిన తర్వాత చంద్రయాన్‌-3 నుంచి ఇస్రోకు చేరిన తొలి మెసేజ్‌ ఏంటి అంటే.. ”నేను నా గమ్యాన్ని చేరుకున్నా.. మీరు (భారత్‌, ఇస్రో) కూడా”.. అంటూ మెసేజ్‌ను పంపింది. ఇక, దీనిని ఇస్రో ధృవీకరించింది. చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని ప్రకటించింది.. భారతదేశానికి అభినందనలు అంటూ ట్వీట్‌ చేసింది.. మరోవైపు.. చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్రమోడీ.. ఈ విజయంతో నా జీవితం ధన్యమైంది అన్నారు. భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు.. ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలు.. చంద్రయాన్‌-3 విజయం నవభారత జయధ్వానం.. బ్రిక్స్‌ సమావేశాల్లో ఉన్నా నా మనసంతా చంద్రయాన్‌-3 పైనే ఉందన్నారు.. చంద్రయాన్‌-3 బృందం, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఆయన.. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా.. అద్భుత విజయం కోసం 140 కోట్ల ప్రజలు ఎదురుచూశారని పేర్కొన్నారు. కాగా, చందమామ దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింగా.. ఇప్పటి వరకు చంద్రుడిపై అడుగుపెట్టిన అమెరికా, రష్యా, చైనా సరసన ఇప్పుడు భారత్‌ చేరింది.

ఇస్రోలో కొత్త జోష్‌.. కొత్త ప్రయోగాలు ఇవే..
చంద్రయాన్‌ 3 విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఇస్రో చైర్మన్‌ సోమనాథ్.. పనిలోపనిగా కొత్త ప్రయోగాలను కూడా ప్రకటించారు.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు ఉంటాయన్నారు.. ఆదిత్య ఎల్ 1 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగిస్తామన్న ఆయన.. ఆదిత్య.. సూర్యుడి గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.. గగన్‌ యాన్‌ అబర్ట్‌ మిషన్‌ కూడా అక్టోబర్‌ మొదటి వారంలోపు చేస్తాం అని ప్రకటించారు.. మరోవైపు.. విజ్ఞాన్‌ రోవర్‌ వచ్చే 24గంటల్లోపు చంద్రుడిపై దిగనుంది. చంద్రయాన్‌-2లో పనిచేసిన అనేక మంది చంద్రయాన్‌-3కి పనిచేశారు. చంద్రయాన్‌-2కి పనిచేసిన వారు గత కొన్నేళ్లుగా సరిగా నిద్రకూడా పోయి ఉండరన్నారు.. ఇస్రో చాలా బలంగా ఉంది అని పేర్కొన్నారు సోమనాథ్‌.

గొప్ప క్షణం.. చంద్రయాన్‌-3 సక్సెస్‌పై పాక్‌ మాజీ మంత్రి ప్రశంసలు
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కూడా చంద్రుని ల్యాండింగ్‌ను ప్రశంసించారు. ట్విటర్‌లో ఆయన ఇలా రాసుకొచ్చాడు. “చంద్రయాన్ 3 చంద్రునిపైకి అడుగుపెట్టినప్పుడు ఇస్రోకు ఇది ఎంతో గొప్ప క్షణం. ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్ ఛైర్మన్‌తో యువశాస్త్రవేత్తలు ఈ క్షణాన్ని ఆస్వాదించడం చూడగలిగాను. కలలు ఉన్న యువతరం మాత్రమే ప్రపంచాన్ని మార్చగలదు.” అని పాక్‌ మాజీ మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్తాన్ మీడియా ప్రసారం చేయాలని కూడా ఆయన సూచించారు. ఈ మిషన్‌ను “మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం” అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలు, అంతరిక్ష సంఘాన్ని కూడా ఆయన అభినందించారు. గతంలో ట్విటర్‌ వేదికగా చేసిన పోస్ట్‌లో.. పాక్‌ మీడియా రేపు సాయంత్రం 6.15 గంటలకు చంద్రయాన్‌ చంద్రుని ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా చూపించాలని కోరారు. మానవజాతికి ముఖ్యంగా ప్రజలకు, శాస్త్రవేత్తలకు, భారత అంతరిక్ష సంఘానికి చారిత్రాత్మక క్షణమని పేర్కొన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుని మీద ల్యాండింగ్ అయిన తర్వాత, రోవర్ ప్రజ్ఞాన్ మూడు గంటల తర్వాత ల్యాండర్ క్రాఫ్ట్ నుంచి బయటకు వస్తుంది.

ఐఫోన్‌ యూజర్లకు యాపిల్‌ వార్నింగ్‌.. ఇలా చేయొద్దు..
ఐఫోన్‌ యూజర్లకు వార్నింగ్‌ ఇచ్చింది యాపిల్‌ సంస్థ.. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ప్రమాదం జరిగిందని మీరు చాలాసార్లు వినే ఉంటారు. దీనికి సంబంధించి అనేక అధ్యయనాలు కూడా బయటకు వచ్చాయి. ఛార్జింగ్ పెట్టి ఫోన్ దగ్గర పడుకోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.. ఇది ప్రమాదానికి కారణమవుతుంది, అలాగే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దీనికి సంబంధించి యాపిల్ కూడా ఇప్పుడు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. యాపిల్‌ సంస్థ తాజాగా కొన్ని సూచనలు చేసింది. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో వినియోగదారుడు.. దానికి దగ్గర పడుకోకూడదని హెచ్చరిక జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ఫోన్‌ని ఛార్జింగ్‌లో వాడే అలవాటు ఉన్నవారికి లేదా అలాంటి స్థితిలో దాని దగ్గర పడుకునే వారికి వార్నింగ్ ఇవ్వబడింది. ఈ హెచ్చరిక Apple యొక్క ఆన్‌లైన్ యూజర్ గైడ్‌లో ఇవ్వబడింది. టేబుల్ వంటి ఫ్లాట్ ఉపరితలంపై ఫోన్‌తో బాగా వెంటిలేషన్ వాతావరణంలో మాత్రమే ఐఫోన్‌ను ఛార్జ్ చేయాలని పేర్కొంది. అంటే, ఫోన్‌ను దుప్పటి, షీట్ లేదా మరేదైనా శరీరంపై ఉంచి ఛార్జ్ చేయకూడదని స్పష్టం చేసింది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. అక్టోబర్ నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం!
అత్యల్ప వర్షపాతం కారణంగా చెరకు దిగుబడి తగ్గిన కారణంగా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే తదుపరి సీజన్‌లో చక్కెర ఎగుమతులను భారతదేశం నిషేధించవచ్చని తెలుస్తోంది. వర్షపాతం తగినంత లేకపోవడంతో ఈ సారి చెరకు దిగుబడి తగ్గనుండడంతో చెరకు ధరలకు రెక్కలు వస్తాయని సర్కారు అంచనా వేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో రుతుపవనాల వర్షాలు సగటు కంటే 50 శాతం వరకు తక్కువగా ఉండటంతో, అత్యధికంగా చెరకు ఉత్పత్తి చేసే ప్రాంతాలపై ప్రభావం చూపుతున్న వర్షాభావ పరిస్థితులను అనుసరించి ఈ ఊహించిన చర్య జరగనున్నట్లు సమాచారం. ఏడేళ్ల త‌ర్వాత భార‌త్ చ‌క్కెర ఎగుమ‌తుల‌పై నిషేధం విధిస్తోంది. ఆహార ద్రవ్యోల్బణంపై భారతదేశం ఆందోళనలను ఎదుర్కొంటోంది. జులైలో రీటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గ‌రిష్ట స్థాయిలో 7.4 శాతానికి ఎగ‌బాక‌డం, ఆహార ద్రవ్యోల్బణం 11.5 శాతానికి చేర‌డంతో భార‌త్ చెర‌కు ఎగుమ‌తుల‌పై బ్యాన్ విధించే ప్రతిపాద‌న‌ను పరిశీలిస్తోంద‌ని చెబుతున్నారు.మూడేళ్ల గ‌రిష్టస్ధాయిలో ద్రవ్యోల్బణం పెర‌గ‌డంతో ఆహారోత్పత్తుల ధ‌ర‌ల‌కు చెక్ పెట్టేందుకు ఎగుమ‌తుల‌పై నిషేధం అనివార్యమ‌ని సర్కారు ఆలోచిస్తోంది.

చంద్రయాన్ 3 సక్సెస్.. ఈయనకు ఎక్కడో మండుతున్నట్లు ఉంది
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా ఆయన దిగనంత వరకే.. ఒక్కసారి అందులోకి దిగితే ప్రకాష్ రాజ్ కనిపించడు.. ఆ పాత్రనే కనిపిస్తుంది. అలాంటి విలక్షణ నటుడును ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు.. విమర్శిస్తున్నారు.. అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. అందులో ఈరోజు చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యాకా ఈ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. అసలు ప్రకాష్ రాజ్ ను ఎందుకు అరెస్ట్ చేయమంటున్నారు. ఆయన చేసిన తప్పు ఏంటి.. ? ప్రకాష్ రాజ్ కు.. చంద్రయాన్ 3 కు ఉన్న సంబంధం ఏంటి.. ? అని అంటే.. ప్రకాష్ రాజ్.. సినిమాల వరకు విలక్షణ నటుడే కానీ, ఆయన రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం అందరికి తెల్సిందే. ముఖ్యంగా బీజేపీ కి ఆయన వ్యతిరేకి. నిత్యం మోడీపై విమర్శలు చేస్తూనే ఉంటాడు.ఇక చంద్రయాన్ 3ను పంపేటప్పుడు ప్రకాష్ రాజ్ ఒక ఫోటోను షేర్ చేస్తూ మోడీని, ఇస్రో శాస్త్రవేత్తలను అవమానించాడు. విక్రమ్ ల్యాండర్‌ దిగిన వెంటనే తీసిన ఫోటో అంటూ.. ఇస్రో శాస్త్రవేత్తలు ఛాయ్ కలుపుతున్నట్లు ఉన్న కామిక్ ను షేర్ చేశాడు. అదుగో అప్పుడు మొదలయ్యింది ప్రకాష్ రాజ్ ను అరెస్ట్ చేయాలని.. ఇక ఈ నేపథ్యంలోనే చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో..ఇస్రో శాస్త్రవేత్తలకు శుబాకాంకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. “భారతదేశానికి మరియు మానవాళికి గర్వకారణమైన క్షణం.. ఇస్రో శాస్త్రవేత్తలకు శుబాకాంకాంక్షలు. ఇది జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది మన విశ్వం యొక్క రహస్యాన్ని అన్వేషించడానికి మాకు మార్గనిర్దేశం చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీంతో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా అని నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెడుతున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యేసరికి ఈయనకు ఎక్కడో మండుతున్నట్లు ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

అవకాశాలు లేకపోయినా.. అన్ని కోట్లు పెట్టి కారు కొన్నదా.. ?
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రకుల్.. వరుస అవకాశాలను కూడా అందుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి .. స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపునే అందుకుంది. ఇక బాలీవుడ్ లో అవకాశాల కోసం చక్కనమ్మ కొద్దిగా చిక్కి.. జీరో సైజ్ కు వచ్చింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు అయితే వచ్చాయి.. కానీ, ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే.. బాలీవుడ్ వలన రకుల్ కు ఒక బాయ్ ఫ్రెండ్ అయితే దొరికాడు. జాకీ భగ్నానీతో ఈ భామ ప్రేమలో పడడం, అది వారు అధికారికంగా ప్రకటించడం.. త్వరలోనే తమ పెళ్లి కూడా ఉంటుందని చెప్పడంతో రకుల్ అభిమానులు సంతోషించారు. ఇక గత ఏడాది నుంచి రకుల్ కు తెలుగులో ఆఫర్స్ లేవు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే.. రకుల్ బక్కచిక్కి పోవడం తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. ముద్దుగా, బొద్దుగా కనిపించే రకుల్.. ఇలా మారిపోవడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా రకుల్ ఒక కొత్త కారును కొనుగోలు చేసింది. మెర్సిడెజ్‌ లో లేటెస్ట్ మోడల్ ను రకుల్ సొంతం చేసుకుంది. దీని విలువ సుమారు.. రూ. 3.50 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ లగ్జరీ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఔరా అంటున్నారు. అంత కాస్ట్లీ కారు కొనేంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది.. ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు కూడా చేయడం లేదుగా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం .. ఆమెకు సినిమాలతో ఏం పని.. వ్యాపారాలు బాగానే ఉన్నాయి కదా.. అందులో బాగా సంపాదిస్తోంది కావొచ్చు అంటూ సమర్థిస్తున్నారు. మెట్రో నగరాల్లో రకుల్.. జిమ్ లు నడుపుతున్న విషయం తెల్సిందే. ఏదిఏమైనా కాస్ట్లీ కారు సొంతం చేసుకున్నందుకు ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

హీరోయిన్ గా వనిత కూతురు..ఎంత అందంగా ఉందో చూశారా?
సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె, నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. “దేవి” సినిమా ద్వారా తెలుగు వాళ్లకు ఆమె సుపరిచతమే. ఆ తరువాత కూడా ఆమె పలు తెలుగు, తమిళ సినిమాలో నటించింది. ముందుగా ఆమె టెలివిజన్ యాక్టర్ ఆకాష్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి విజయ్ శ్రీ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే వనిత విజయ్ కుమార్ కుమార్తె జోవిక ఇప్పుడు హీరోయిన్ గా లాంచ్ కానునట్టు తెలుస్తోంది. వనితా విజయకుమార్ ఇటీవల తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ విషయాన్ని షేర్ చేశారు. ఇటీవలే తన 18వ పుట్టినరోజు జరుపుకున్న వనిత కుమార్తె జోవిక, తమిళ సినీ ప్రపంచంలో కథానాయికగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. ఈ మేరకు తమిళ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వనితా విజయ్‌ కుమార్‌ కూడా తన కూతురు జోవిక కచ్చితంగా సినిమాల్లో నటిస్తుందని, ఇప్పటికే మేము కొన్ని కథలు వింటున్నామని చెప్పుకొచ్చింది. నిజానికి జోవిక ముంబైలోని అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాదిపాటు శిక్షణ తీసుకుందట. కానీ జోవికను హీరోయిన్‌గా నటింప చేయాలా? లేక ముఖ్యమైన పాత్రలో నటింప చేయాలా? అనేది ఇంకా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో కాంబినేషన్స్ పక్కనపెట్టి కథ బాగుందా? లేదా? అన్నదానిపైనే ఫోకస్‌ చేస్తున్నామని తన కుమార్తె ఎంట్రీకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది’ అని వనిత చెబుతున్నారు. వనితా విజయ్‌ కుమార్‌ తెలుగులో చివరగా నరేష్-పవిత్రా లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.