కాపులకు సీఎం జగన్ శుభవార్త.. నేడే వారి ఖాతాల్లో నగదు జమ
కాపులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈరోజు వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల చేయనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు.. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ప్రతీ ఏటా రూ. 15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తోంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఈ రోజు అందిస్తున్న రూ. 536.77 కోట్లతో కలిపి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం చేసిన ఆర్థిక సాయం రూ. 2,029 కోట్లు.. ఒక్కో పేద కాపు అక్క చెల్లెమ్మకు నాలుగేళ్ళ కాలంలో అందించిన లబ్ధి అక్షరాలా రూ.60,000గా ఉంది.. గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో 5 ఏళ్లలో సగటున ఏడాదికి కనీసం రూ. 400 కోట్లు కూడా ఇవ్వని దుస్థితి ఉండగా.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 52 నెలల్లోనే వివిధ పథకాల ద్వారా 77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు అనేక రెట్లు అధికంగా మొత్తం రూ. 39,247 కోట్ల లబ్ధి చేకూర్చారు.
నేడే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్న కేసీఆర్
రాష్ట్ర ఇంజినీరింగ్ చరిత్రలో మరో అపూర్వ ఘట్టం ప్రారంభం కానుంది. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలు కంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కోరికను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చబోతున్నారు. ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కొల్హాపూర్ పట్టణం మొత్తం గులాబీమయమైంది. గత వారం రోజుల నుంచి ముఖ్యమంత్రి సభ కోసం ఉన్నతాధికారులు కొల్లాపూర్ లోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాలమూరు మహోజ్వల ఘట్టానికి నార్లాపూర్ వేదిక కానుంది. ప్రాజెక్టులో కీలకమైన మొదటి పంప్ హౌస్, అంజనగిరి రిజర్వాయర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మోటార్ల బిగింపు కొనసాగుతుండగా.. నీటిని ఎత్తిపోసేందుకు ఇప్పటికే రెండు మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. మొదటి పంప్ డ్రై రన్ ఇటీవల విజయవంతంగా నిర్వహించబడింది. అందులో భాగంగానే నేడు వాటర్ లిఫ్టింగ్ చేయనున్నారు. నార్లాపూర్ పంప్‌హౌస్‌లో 145 మెగావాట్ల సామర్థ్యం గల మోటర్లను సీఎం కేసీఆర్ స్విచ్ ఆన్ చేసి నీటి లిఫ్ట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం అంజనగిరి జలాశయంలోకి వచ్చిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జలహారతి చంపబడుతుంది. అనంతరం కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సీఎం వైఎస్ జగన్ స్పీచ్‌పై ఉత్కంఠ.. పొలిటికల్ హీట్ తప్పదా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు.. నిడదవోలులో నిర్వహించనున్న సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు.. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిడదవోలు చేరుకోనున్న ఆయన.. సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వైఎస్సార్ కాపునేస్తం ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.. అయితే.. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఈ రోజు సీఎం జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఉత్కంఠగా మారింది. లండన్ పర్యటన తర్వాత మొదటిసారి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు సీఎం జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. నిడదవోలు వేదికగా తాజా రాజకీయ పరిణామాలపై సీఎం వైఎస్ జగన్ స్పందించే అవకాశం ఉందంటున్నారు. సీఎం జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎన్నో కీలక పరిణామాలు జరిగాయి.. ఆయన రాష్ట్రానికి చేరుకున్న తర్వాత కూడా ఆ హీట్ కొనసాగుతూనే ఉంది.. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రచ్చగా మారింది.. కక్ష పూరితంగా అక్రమ కేసుల్లో ఇరికించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. వైసీపీ నేతలు వాటికి ఎప్పటికప్పుడూ కౌంటర్ ఇస్తూనే ఉన్నా.. సీఎం జగన్ ఇప్పటి వరకు ఆ వ్యవహారంపై స్పందించలేదు.. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జనసేన -టీడీపీ పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన మరింత పొలిటికల్ హీట్ పెంచింది.. అయితే, నిన్నటి విజయనగరం జిల్లా మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో రాజకీయ విమర్శలు లేకుండా సీఎం వైఎస్ జగన్ ప్రసంగం సాగింది.. కానీ, నేటి నిడదవోలు పర్యటనలో తాజా పరిణామాలపై సీఎం జగన్ స్పందిస్తారనే ప్రచారం సాగుతోంది.. దీంతో.. ఇవాళ్టి సీఎం జగన్ స్పీచ్ పై ఆసక్తి నెలకొంది.
ఏపీలో ట్రిపుల్ మర్డర్.. దంపతులను నరికేశాడు.. రాళ్లదాడిలో చనిపోయాడు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ మర్డర్ కలకలం సృష్టిస్తోంది.. అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరు గ్రామంలో ముగ్గురి హత్య సంచలనంగా మారింది.. మొదట ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలు బాలరాజు (53), సుంకులక్క (47 )లను కొడవలితో అతి దారుణంగా నరికి చంపాడు ప్రసాద్ అనే వ్యక్తి.. అయితే, హత్య విషయం తెలుసుకున్న బాలరాజు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు.. స్థానికులతో కలిసి ప్రసాద్‌పై దాడి చేశారు.. రాళ్లతో కొట్టి చంపారు. కాగా, గొర్రెల మందకు కాపాలాగా బాలరాజు దంపతులు ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణంగా హత్య చేశాడు ప్రసాద్.. ఆ తర్వాత బాలరాజు కుటుంబ సభ్యులు, స్థానికుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.. ఇక, ఘటనా స్థలానికి పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. మూడు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రసాద్ కు మతిస్థిమితం సరిగా లేదని సమాచారం తెలుస్తుండగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కేరళలో నిపా వైరస్ కలకలం.. వారం పాటు స్కూళ్లు, కాలేజీలు బంద్
కేరళలోని కోజికోడ్‌లో నిపా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి భయానక వాతావరణం నెలకొంది. నిపా వైరస్ దృష్ట్యా, కోజికోడ్‌లోని అన్ని విద్యాసంస్థలు వచ్చే ఆదివారం వరకు అంటే సెప్టెంబర్ 24 వరకు మూసివేయబడ్డాయి. ఇందులో పాఠశాలలు, ప్రొఫెషనల్ కళాశాలలు, ట్యూషన్ సెంటర్లు కూడా ఉన్నాయి. వారం రోజుల పాటు అన్ని విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించవచ్చని జిల్లా యంత్రాంగం చెబుతోంది. ప్రస్తుతం నిపా వైరస్ సోకిన వారితో పరిచయం ఉన్న వారి జాబితా 1080కి చేరుకుందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం తెలిపారు. వీరిలో శుక్రవారం ఒక్కరోజే 130 మంది జాబితాలో చేరారు. మొత్తం 1080 మందిలో 327 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇతర జిల్లాల్లో నిపా సోకిన వ్యక్తుల కాంటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 29 మంది ఉన్నారని ఆరోగ్య మంత్రి చెప్పారు. వీరిలో మలప్పురం నుండి 22 మంది, వాయనాడ్ నుండి ఒకరు, కన్నూర్, త్రిస్సూర్ నుండి ముగ్గురు చొప్పున ఉన్నారు.
అల్లంతో అందమైన చర్మం మీ సొంతం..
వంటల్లో ఘాటు పెంచే అల్లం గురించి అందరికి తెలుసు.. ఈ అల్లం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. అల్లంలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా మంది అల్లం టీని, అల్లం రసాన్ని తీసుకుంటూ ఉంటారు. ఏ రూపంలో తీసుకున్నా కూడా అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో అల్లం మనకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే కేవలం మన శరీర ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా అల్లం మనకు దోహదపడుతుంది. అల్లాన్ని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూద్దాం.. కొందరిలో కళ్ల చుట్టూ ఉబ్బినట్టుగా, ఎర్రగా ఉంటుంది. అలాంటి వారు అల్లం టీ బ్యాగ్ లను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. టీ తయారు చేసుకున్న తరువాత ఈ టీ బ్యాగ్ లను పడేయకుండా కళ్లపై ఉంచుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉంచడం వల్ల కళ్ల చుట్టూ ఉండే ఉబ్బుదనం తగ్గిపోతుంది. అలాగే మనలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు.. అలాంటి వాళ్లు అల్లం రసం లో తేనె కలిపి మొటిమల మీద రాస్తే చాలు అవి త్వరగా తగ్గిపోతాయి..
విదేశీ మారక నిల్వల్లో భారీ క్షీణత.. 593.90 బిలియన్ డాలర్లకు చేరిక
విదేశీ మారకద్రవ్య నిల్వలు మళ్లీ భారీగా తగ్గాయి. సెప్టెంబరు 8తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో 5 బిలియన్ డాలర్లు పడిపోయి 593.90 బిలియన్ డాలర్లకు తగ్గాయి. సెప్టెంబర్ 1తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 598.897 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆర్బీఐ ఫారెక్స్ నిల్వల డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబరు 8తో ముగిసిన వారం తర్వాత విదేశీ మారక నిల్వలు 4.99 బిలియన్ డాలర్లు తగ్గి 593.90 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు 4.26 బిలియన్ డాలర్లు తగ్గాయి. బంగారం నిల్వలు 554 మిలియన్ డాలర్లు తగ్గి 44.38 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఐఎంఎఫ్ నిల్వల్లో 39 మిలియన్ డాలర్లు తగ్గాయి.
సైమా బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్… ఏడేళ్ల తర్వాత అవార్డ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2016లో జనతా గ్యారేజ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని గెలుచుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఏడేళ్లకి ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రకి ప్రాణం పోసినందుకు… వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసినందుకుగాను ఎన్టీఆర్ ని ఈ అవార్డ్ లభించింది. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, అడవి శేష్, నిఖిల్ సిద్దార్థ్ కూడా బెస్ట్ యాక్టర్ అవార్డ్ రేస్ లో ఉన్నారు కానీ వారిని వెనక్కి నెట్టి మరీ ఎన్టీఆర్ ఈ అవార్డుని గెలుచుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. #ManofMasses #NTR #Devara టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్, డై హార్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరోసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ దేవర సినిమాని చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్టర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మీట్ అయితే చాలు కొరటాల శివ-ఎన్టీఆర్ లు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ. ఎన్టీఆర్-శివలకి అనిరుద్ కూడా కలుస్తున్నాడు కాబట్టి పాన్ ఇండియా సంభవం జరగడం పక్కా. మరి వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఎన్టీఆర్ దేవర సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.
బాలయ్య మూవీ వాయిదా పడనుందా..?
నందమూరి నట సింహం బాలయ్య సినిమా వస్తుంది అంటే భాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు ఉంటాయి. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’.. ఈ చిత్రంతో దసరా బరిలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్నారు బాలయ్య.ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తుంది.బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్ర విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబరు 19న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామన్నారు. ‘భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’ గన్స్ పట్టుకుని బాలకృష్ణ నడిచి వస్తున్న ఫొటోతో ఫ్యాన్స్ లో తెగ జోష్ నింపారు. అయితే నాలుగు రోజులు క్రితం వరకు అంతా అనుకున్నట్లే జరుగుతుందని దసరాకు బాలయ్య సినిమా రికార్డ్స్ సృష్టిస్తుంది అని అభిమానులు లెక్కలు వేసారు. అయితే అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురవబోతుంది.సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘భగవంత్ కేసరి’వాయిదా పడే అవకాసం ఉందని తెలుస్తోంది.
