టార్గెట్ 175.. వైసీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గేర్ మారుస్తున్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా పాలన, సంక్షేమ పథకాల అమలుపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన సీఎం, ఇక తన ఫోకస్ పార్టీ పైకి మారుస్తున్నారు. ప్రధానంగా మండల స్థాయి నేతలు, క్షేత్రస్థాయి శ్రేణులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తల నుంచి పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంఛార్జుల వరకు పాల్గొంటారు. మొత్తం మీద సుమారు 8 వేల మంది ఈ సభకు హాజరు కానున్నారు. నాలుగున్నర ఏళ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం ఉండనుంది. సీఎం జగన్ స్వయంగా సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారు. 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా పార్టీ ప్రతినిధుల సభలో దిశా నిర్దేశం చేయనున్నారు.. గత 53 నెలలుగా సుపరిపాలన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రతి ఇంటికీ, గ్రామానికీ, నియోజకవర్గానికీ, జిల్లాకు, రాష్ట్రానికీ చేసిన మంచిని మరింత ప్రభావవంతంగా వివరించడం.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న ఎక్కడికక్కడ తిప్పికొట్టడంపై ప్రతినిధులకు కీలక ఆదేశాలు ఇస్తారు. అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించి.. ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళ్లాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాలని సూచించనున్నారు.
నేడు చంద్రబాబు కేసుల్లో కీలక తీర్పులు.. బెయిల్ వస్తుందా? రాదా?
టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసుల విషయంలో ఈ రోజు కీలక తీర్పులు రానున్నాయి. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందా? లేదా అన్న ఉత్కంఠకు తెరపడనుంది. చంద్రబాబుపై కేసు కొట్టివెయ్యాలంటూ సుప్రీం కోర్టులో ఆయన తరపు లాయర్లు క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు కేసు సుప్రీంలో 59 వ ఐటెమ్ గా లిస్ట్ అయింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా.ఎమ్.త్రివేది లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోత్గి వాదనలు వినిపిస్తారు. గత వారం ద్విసభ్య ధర్మాసనం ముందు వాదనలు సందర్బంగా, హైకోర్టుకు సమర్పించిన పత్రాలను సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.. ఇక ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం అసంబద్ధమని చంద్రబాబు వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం తన అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనపై నమోదైన ఎఫ్ఏఆర్ ను కొట్టివేయాలని, జ్యుడీషియల్ రిమాండ్ ను రద్దు చేయాలని చంద్రబాబు కోరారు. దీనిపై సుప్రీం కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది.
దసరా కానుక..! ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
దసరాకు ముందే ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. నగదు రహిత, మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని మొదటి పీఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా జమ చేయాలని పేర్కొంది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో తెలిపారు. దీంతో మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి ప్రతిపాదనలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీని ప్రకారం.. ఈహెచ్‌ఎస్ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది. ఈహెచ్‌సీటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తరఫున.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ , ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో సభ్యులుగా ఉంటారు. ఈహెచ్‌ఎస్ సీఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల తరఫున ఆరుగురిని, పెన్షనర్ల తరఫున ఇద్దరిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.
నేడు ఎలక్షన్ కమిషన్ సమావేశం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు ఇక పై క్షణం తీరిక లేకుండా గడిపే సమయం వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయనుంది. మధ్యాహ్నం 12గంటలకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికలకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్, మిజోరంలో ఎంఎన్‌ఎఫ్ వంటి ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం ఉంది. 2018లో ఎన్నికల సంఘం అక్టోబర్ 6న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. 2018లో ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో 18 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న తొలి దశ పోలింగ్ జరగగా, 72 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న రెండో దశ పోలింగ్ జరిగింది. అదే విధంగా, మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 28 న ఒకే దశలో ఎన్నికలు జరగగా, రాజస్థాన్, తెలంగాణలో డిసెంబర్ 7 న ఓటింగ్ జరిగింది. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు 11 డిసెంబర్ 2018న ఏకకాలంలో జరిగింది.
10, 12వ తరగతుల్లో రెండుసార్లు పరీక్షలు తప్పనిసరేమీ కాదు..!
ఏటా రెండుసార్లు నిర్వహించతలపెట్టిన పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రెండింటికీ హాజరుకావడం తప్పనిసరి కాదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు ఒక్కసారి హాజరయ్యే అవకాశం ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. పది, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో హాజరయ్యేందుకు విద్యార్థులకు ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్ష జేఈఈ మాదిరిగా రెండుసార్లు అవకాశం ఉంటుంది. అందులో బెస్ట్ స్కోర్‌ను వాళ్లు ఎంచుకోవచ్చు. అయితే, ఇదంతా ఆప్షనలే. తప్పనిసరి కాదు. ఆశించిన స్థాయిలో రాయలేదనే భయం, అవకాశం కోల్పోయామనే ఆందోళన, ఇంకా బాగా రాయొచ్చనే ఆత్రుత.. ఇలాంటి విషయాలను ఆలోచిస్తూ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అందుకే కొత్తగా ఈ ఐచ్ఛిక విధానాన్ని ప్రారంభిస్తున్నామని కేంద్రం అంటోంది. ఒకవేళ తొలిదఫా పరీక్షల్లో మంచి స్కోరు వచ్చిందని భావిస్తే.. తర్వాత పరీక్షకు హాజరుకానవసరం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
పాలస్తీనాపై యుద్ధంలో ఇజ్రాయెల్ తో జతకట్టిన అమెరికా.. ఇక అంతే
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా దాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. పాలస్తీనా ప్రయోగించిన రాకెట్లకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా భారీ బాంబు దాడులకు పాల్పడుతోంది. ఇంతలో అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది. అమెరికా తన ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను సిద్ధంగా ఉండాలని, ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి తూర్పు మధ్యధరా సముద్రానికి వెళ్లాలని ఆదేశించింది. పాలస్తీనాపై యుద్ధంలో అప్రమత్తంగా ఉండాలని అమెరికన్ అధికారులు తమ యుద్ధనౌకలను కోరారు. యుఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ దాని సుమారు 5,000 మంది నేవీ సిబ్బంది, యుద్ధ విమానాలతో పాటు క్రూయిజర్‌లు, డిస్ట్రాయర్‌లను పంపనున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికా వైపు నుండి ఇజ్రాయెల్‌కు యుద్ధనౌకను పంపడం వెనుక ప్రధాన కారణం హమాస్‌కు అందుతున్న అదనపు ఆయుధాల సరుకులను ఆపివేయడం. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం మాట్లాడుతూ గాజా ప్రాంతంలో కొనసాగుతున్న భీకర యుద్ధంపైనే తన దృష్టి అంతా ఉందని, హమాస్ యోధులు స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని ఇజ్రాయెల్ తిరిగి పొందడంలో సహాయపడుతుందని అన్నారు. ఇజ్రాయెల్‌తో పాటు దానికి మద్దతిచ్చే వారందరికీ ఇది పెద్ద సవాల్ అని ఆయన అన్నారు. ఇకపై ఇలా జరగకుండా చూసుకోవాలి కూడా. ఆదివారం, ఇజ్రాయెల్ సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు. గాజాలోని అనేక భవనాలను ధ్వంసం చేశారు. హమాస్ దాడుల్లో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఇజ్రాయెల్‌లో మరణాల సంఖ్య 600 దాటింది. 2000 మందికి పైగా గాయపడినట్లు చెబుతున్నారు. గాజా స్ట్రిప్‌లో 300 మందికి పైగా మరణించినట్లు వార్తలు వచ్చాయి. హమాస్ ప్రజలు చాలా మంది ఇజ్రాయెల్‌లను కూడా బందీలుగా చేసుకున్నారు.
అదిరిపోయే ఆఫర్.. రూ. 14,899 కే.. కేవలం కొద్ది రోజులు మాత్రమే..
గూగుల్ కంపెనీ ఇటీవల కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. గూగుల్ పిక్సెల్ 8 ను కొద్ది రోజుల క్రితం మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దాంతో 7 సిరీస్ ఫోనలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను అందిస్తుంది.. ఈ ఫోన్లను కొనాలని అనుకొనేవారు.. ఇప్పుడే కొనిసెయ్యండి.. ఎందుకంటే ఇలాంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు.. పిక్సెల్ 7ని కేవలం రూ.14,899కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌లో మీరు తక్షణ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందుతారు. Pixel 7 ఫోన్‌లో టిక్ బ్లర్ వీడియో ఫీచర్ అందించబడింది. ఈ ఫీచర్ ద్వారా, వీడియోలోని బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుతుంది. సబ్జెక్ట్‌పై గరిష్ట ఫోకస్ ఉంచబడుతుంది. అలాగే , ఈ Google ఫోన్ Tensor G2 చిప్‌సెట్‌తో వస్తుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ ను చూస్తే.. ఇది 6.3-అంగుళాల పూర్తి-HD+ OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లోని ప్రాసెసర్ కోసం Google Tensor G2 చిప్‌సెట్ ఉపయోగించబడింది. Google Pixel 7లో 8GB RAM ఉంది.. కెమెరా ప్రియులకు ఇది బెస్ట్ అనే చెప్పాలి.. మొదటి కెమెరా 50MP, రెండవ కెమెరా 12MP. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 10.8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అంతే కాకుండా వీడియోల కోసం ఈ ఫోన్‌లలో టిక్ బ్లర్ వీడియో ఫీచర్ కూడా అందించబడింది. ఈ ఫీచర్ ద్వారా, వీడియోలోని బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుతుంది.. వీడియో క్వాలిటీ బాగుంటుంది..
ముగిసిన ఆసియా క్రీడలు.. స్వర్ణాల్లో ‘డబుల్ సెంచరీ’ కొట్టిన చైనా! నాలుగో స్థానంలో భారత్
16 రోజులుగా క్రీడాభిమానులను అలరించిన ఆసియా క్రీడలు 2023 ఆదివారంతో ముగిశాయి. సెప్టెంబర్ 23న చైనాలోని హాంగ్‌జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన 19వ ఆసియా క్రీడలు.. అక్టోబర్ 8న ఘనంగా ముగిశాయి. 80 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన బిగ్ లోటస్ స్టేడియంలో 75 నిమిషాల పాటు ముగింపు వేడుకలు జరిగాయి. 45 దేశాలకు చెందిన క్రీడాకారులు మైదానంలోకి రాగా.. చైనా సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీడలు, సంస్కృతి సంబరాలుగా ముగింపు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో భారత పతాకధారిగా పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ వ్యవహరించారు. ఆసియా క్రీడల్లో 45 దేశాల నుంచి 12,407 మంది అథ్లెట్లు 40 క్రీడల్లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఆసియా క్రీడలు ముగిసినట్లు ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ) తాత్కాలిక అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ అధికారికంగా ప్రకటించాడు. సంప్రదాయం ప్రకారం.. మొట్టమొదటి ఆసియా క్రీడల జ్యోతి, పతాకం, ఓసీఏ జెండాను నాగోయా ఐచి (జపాన్) నగర గవర్నర్ అందుకున్నారు. 2026 క్రీడలకు నాగోయా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి ఆసియా క్రీడల్లో చైనా ఏకంగా 383 పతకాలు సాధించింది. ఇందులో 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలు ఉన్నాయి. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి పసిడి పతకాల్లో 200 మైలురాయిని చైనా దాటింది. 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా అత్యధికంగా 199 స్వర్ణ పతకాలు నెగ్గింది. వరుసగా తొమ్మిదోసారి ఆసియా క్రీడల్లో చైనా 100 అంతకంటే ఎక్కువ స్వర్ణ పతకాలు గెలిచింది. 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో చైనా స్వర్ణాల్లో మొదటిసారి ‘సెంచరీ’ కొట్టింది. అంతేకాదు వరుసగా పదకొండోసారి ఆసియా క్రీడల పతకాల పట్టికలో చైనా ‘టాప్’ ర్యాంక్ కొట్టింది.
బిగ్‌బాస్‌లోకి కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
స్టార్ మా టాప్ రియాలిటి షో బిగ్ బాస్ ఇప్పుడు 7 వ సీజన్ ను జరుపుకుంటుంది.. అయిదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు అయిదుగురు లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం గమనార్హం.. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా లేడీస్ వెళ్లిపోవడం పై జనాల్లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.. ఎలిమినేషన్ తర్వాత ఐదోవారంలో మళ్ళీ ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించాడు నాగార్జున. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే శవాలి, యూట్యూబర్, నటి నయని పావని, సోషల్ మీడియా పర్సన్, ఇప్పుడిప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తున్న అశ్విని శ్రీ, సీరియల్ నటుడు అర్జున్ అంబటి, సీరియల్ నటి పూజా మూర్తిలను నాగార్జున వేదికపైకి పిలిచి బిగ్‌బాస్ హౌస్ లోకి పంపించాడు.. ఇందులో సీరియల్ యాక్టర్స్ గురించి అందరికీ తెలుసు.. కానీ ఇప్పుడు అందరి చూపు నయని పావని పై పడింది..
