Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌.. వైజాగ్‌ బాటపట్టిన ఏపీ మంత్రులు..
విశాఖ రాజధాని కళను సంతరించుకుంటోంది. డిసెంబర్ నాటికి మకాం మారుస్తున్నట్టు సీఎం వైఎస్‌ జగన్ ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్‌లో ఏరోజున అడుగుపెడతారనేది క్లారిటీ లేదు. ఐతే.. ఈసారి రావడం మాత్రం పక్కా అంటోంది వైసీపీ. ప్రభుత్వ వర్గాలు సైతం ఇదే నిర్ధారిస్తున్నాయి. ఇందుకు అనుకూలమైన పరిస్థితులు సాగరతీరంలో కనిపిస్తున్నాయి. క్యాంపు కార్యాలయంగా ప్రచారంలో ఉన్న ఋషికొండలో నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. సీఎంవోతో పాటు తరలి వచ్చే కార్యాలయాలు, అధికారుల వసతి భవనాలపై ప్రభుత్వం నియమించిన త్రీమెన్ కమిటీ నగరంలో రెండు రోజులు పర్యటించింది. వివిధ శాఖల దగ్గర నుంచి పూర్తిస్థాయి సమాచారం సేకరించింది. కమిటీ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కార్యకలాపాల నిర్వహణ, సమీక్షలు, సీఎం బస కోసం అందుబాటులో ఉన్న వనరులు…వసతుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ సూచనలు చేయనుంది. అయితే, అంతకంటే ముందే మంత్రులు విశాఖకు మకాం మార్చే పనిలో పడిపోయారు. కొందరు అనుకూలమైన భవనాలను వెతుక్కుంటున్నారు. మరికొంతమంది మంత్రులు ఇప్పటికే మకాం మార్చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు సహా మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలకు ఇక్కడ నివాసాలు ఉన్నాయి. రాజకీయ, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు నగరంతోనే ముడిపడి ఉండటంతో ఇక్కడ గెస్ట్‌హౌస్‌లు, ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, నేతలకు ఇక్కడ స్థిరాస్తులు ఉన్నాయి. వ్యాపార అవసరాల కోసం కొందరు దక్షిణ కోస్తా ప్రాంత నేతలకు విశాఖతో మంచి అనుబంధం ఉంది. రాయలసీమకు చెందిన నేతలు ఇక్కడ విల్లాలు, ఇళ్లు కోనుగోలు చేసినప్పటికీ.. ఆ సంఖ్య స్వల్పమే.

జనసేన నేతపై కట్టెలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి..!
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జనసేన పార్టీ నాయకుడిపై దాడి జరిగింది.. ఆ పార్టీ నేత కోటిరెడ్డి రాజారెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు.. జనసేన పార్టీ వ్యక్తిగత కార్యాలయం వద్ద పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న రాజారెడ్డి దగ్గరకు వచ్చిన కొందరు యువకులు.. ఆయనతో మొదట ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు.. ఆ తర్వాత చుట్టుముట్టి దాడిక పాల్పడ్డారు.. కట్టెలతో.. రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో కోటిరెడ్డి రాజారెడ్డి తీవ్ర గాయాలపాలైనట్టుగా తెలుస్తోంది.. ఇక, ఆ తర్వాత స్థానికులు రాజారెడ్డిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజారెడ్డిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పరామర్శించారు.. అయితే, తనపై దాడి చేసింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారేనని.. కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో దాదాపు 10 మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి తనపై దాడి చేశారని చెబుతున్నారు రాజారెడ్డి. మరోవైపు.. వైసీపీ కార్యకర్తల దాడిపై తీవ్రంగా మండిపడ్డారు జనసేన పీఏసీ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. ఎమ్మెల్యే అండతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జాగ్రత్త అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. ఇక, రాజారెడ్డిపై దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.. ఆ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు.

వాహనదారులు అలర్ట్‌.. రేపు ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు..
తెలంగాణ పూల పండుగతో శోభాయమానంగా ఉంది. ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలే. పూలతో అలంకరించిన బతుకమ్మ సంబురాలతో రాష్ట్రం హోరెత్తింది. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగ ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత. చివరి రోజు సద్దుల బతుకమ్మ.. ఆ రోజు సందడి అంతా కనపడుతుంది. దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ వేడుకల్లో ప్రతి రోజూ.. ప్రత్యేకమే. అయితే రేపు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లుంబినీ పార్కు, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపును అమలు చేస్తున్నామని నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు.

కోరికలను అదుపులో పెట్టుకోండి.. మైనర్లకు కలకత్తా కోర్టు వార్నింగ్‌..
అత్యాచారం కేసులో శిక్షకు వ్యతిరేకంగా యువకుడు చేసిన పిటిషన్‌ను విచారించింది కలకత్తా హైకోర్టు. టీనేజ్ లో ఉన్న అబ్బాయిలు, బాలికలు తమ లైంగిక కోరికలను నియంత్రించాలని, ఎదుటి జెండర్ గౌరవం, శారీరక స్వయంప్రతిపత్తిని గౌరవించాలని కోరుతూ మార్గదర్శకాల జాబితాను జారీ చేసింది. మైనర్ భాగస్వామితో లైంగిక సంబంధం పెట్టుకున్న యువకుడికి సెషన్స్ కోర్టు గతేడాది 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే.. విచారణలో బాలిక తన ఇష్టప్రకారమే అతడితో శృంగారంలో పాల్గొన్నానని, ఆ తర్వాత అతనినే పెళ్లి చేసుకున్నానని బాలిక కోర్టుకు తెలిపింది. అయితే, భారత్‌లో సెక్స్‌కు సమ్మతించే వయస్సు 18 ఏళ్లని, అంత కంటే తక్కువ వయస్సు ఉన్న వారితో సంబంధాలు పెట్టుకోవడం నేరమని కోర్టు పేర్కొంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి శృంగారానికి సమ్మతిస్తే, ఆమె సమ్మతి చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడదు.. ఆమె వారితో లైంగిక సంబంధం కలిగి ఉంటే, అది లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, POCSO చట్టం, అత్యాచారం కిందకు వస్తుంది. న్యాయమూర్తులు చిత్త రంజన్ దాష్, పార్థ సారథి సేన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సెషన్స్ కోర్టు తీర్పును పక్కన పెట్టింది. చిన్న వయస్సులో లైంగిక సంబంధాల వల్ల తలెత్తే చట్టపరమైన సమస్యలను నివారించడానికి పాఠశాలల్లో సమగ్ర లైంగిక విద్యను కూడా ఇది కోరింది. యుక్తవయసులో సెక్స్ కోరికలు సాధారణం. అయితే, ఆ వయస్సులో అలాంటి కోరికలు ఎంత వరకు ఇవ్వవచ్చనేది పురుషులు మరియు స్త్రీల చర్యలపై ఆధారపడి ఉంటుందని బెంచ్ పేర్కొంది. బాలికలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని, రెండు నిమిషాల ఆనందంలో మునిగిపోవద్దని కోర్టు సూచించింది. “అమ్మాయిలు తమ లైంగిక కోరికలు, ప్రేరేపణలపై నియంత్రణ కలిగి ఉండాలి. అలా కాకుండా కేవలం రెండు నిమిషాల పాటు లైంగిక ఆనందాన్ని ఆస్వాదించడానికి లొంగిపోతే.. సమాజం దృష్టిలో వారు ఓడిపోయిన వారవుతారు” అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. తమ శరీరాలను గౌరవించడం, విలువలను కాపాడుకోవడం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం యువతుల కర్తవ్యం’ అని ధర్మాసనం పేర్కొంది. అబ్బాయిలు కూడా అమ్మాయిల గౌరవాన్ని స్వీకరించాలి… స్త్రీలను గౌరవించేలా ప్రవర్తించాలి. మహిళ, ఆమె గౌరవం, గోప్యత.. ఆమె శరీరం యొక్క స్వయంప్రతిపత్తిని గౌరవించేలా అతను తన మనస్సుకు శిక్షణ ఇవ్వాలి’ అని కోర్టు పేర్కొంది.

ట్రంప్ కు పెరుగుతున్న తిప్పలు.. మరోసారి భారీ జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమస్యలు నిరంతరం పెరుగుతున్నాయి. ఆయనపై ఇప్పటికే చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, న్యాయమూర్తి ప్రిన్సిపల్ క్లర్క్ అల్లిసన్ గ్రీన్‌ఫీల్డ్ గురించి ప్రచార వెబ్‌సైట్‌లో అవమానకరమైన పోస్ట్ చేసినందుకు ట్రంప్‌కు అమెరికన్ న్యాయమూర్తి 5000 యుఎస్ డాలర్లు (సుమారు రూ. 4 లక్షలు) జరిమానా విధించారు. పోస్ట్‌లో, ట్రంప్ సెనేట్ నాయకుడు చక్ షుమెర్‌తో గ్రీన్‌ఫీల్డ్ ఫోటోను పంచుకున్నారు. ఆ తర్వాత ట్రంప్‌పై కోర్టులో కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడికి కోర్టు 5000 డాలర్ల జరిమానా విధించింది. వచ్చే 10 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు సిబ్బందిపై వ్యక్తిగత దాడులు ఆమోదయోగ్యం కాదని, వాటిని సహించబోనని న్యాయమూర్తి అన్నారు. ఈ కేసులో న్యాయమూర్తి ఆర్థర్ అంగోరోన్ ట్రంప్‌ను కోర్టు ధిక్కారానికి పాల్పడలేదు. కానీ అతను ట్రంప్‌ను గ్యాగ్ ఆర్డర్‌ను ఉల్లంఘించాడని హెచ్చరించాడు. ఇందులో శిక్షకు కూడా నిబంధన ఉంది. గాగ్ ఆర్డర్‌ను ఉల్లంఘించడం వల్ల కలిగే పరిణామాల గురించి డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టు నుండి తగిన హెచ్చరిక వచ్చిందని అంగోరాన్ చెప్పారు. అందుకు అంగీకరించి.. తాను అర్థం చేసుకున్నానని అనుసరిస్తానని ట్రంప్ చెప్పారు. కానీ అతను అలా చేయలేదు. ఆ పోస్ట్‌ను తొలగించడంలో జాప్యం జరుగుతోందని జరిమానా విధించాలని నిర్ణయించుకున్నట్లు అంగోరాన్ తెలిపారు. ఇలాంటి పొరపాటు తొలిసారి జరిగింది. అక్టోబర్ 3న ఇచ్చిన ఆర్డర్‌ను పూర్తిగా ఉల్లంఘించిందని అంగోరాన్ అన్నారు. ట్రంప్ అభ్యంతరకర పోస్ట్‌ను తొలగించి ఉండాల్సింది. కానీ ట్రంప్ ఉత్తర్వును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని న్యాయవాదులు తెలిపారు.

వాహనదారులకు ఊరట… మూడేళ్ల నాటి అన్ని చలాన్లు మాఫీ
నోయిడాలోని వాహనదారులకు గుడ్ న్యూస్. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన 17 లక్షలకు పైగా చలాన్లు కూడా మాఫీ చేయబడతాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాహనాల చలాన్‌ను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ చేసిన చలాన్‌లపై ఈ ఆర్డర్ వర్తించబడుతుంది, అయితే ఇప్పుడు ఇది ట్రాఫిక్ పోలీసులకు కూడా వర్తిస్తుంది. ఏప్రిల్ 1, 2018 నుండి డిసెంబర్ 31, 2021 వరకు జారీ చేయబడిన మొత్తం చలాన్‌లలో, 17 లక్షల 89 వేల 463 వాహనాల చలాన్ మొత్తాన్ని మాఫీ చేసినట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ వ్యవధిలో వాహనాలకు చలాన్ చేయబడిన వ్యక్తులు వాటిని డిపాజిట్ చేయకూడదు. సున్నా చలాన్ మొత్తం రికార్డు వారి ఇ-చలాన్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయబడుతుంది. నోయిడా-గ్రేటర్ నోయిడాలో ఈ-చలాన్ ప్రక్రియ ఏప్రిల్ 1, 2018 నుండి ప్రారంభమైందని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఇంతకుముందు స్లిప్పులను మాన్యువల్‌గా కత్తిరించి చలాన్లు చేసేవారు. 2018 సంవత్సరం నుండి 2021 చివరి వరకు 17 లక్షల 89 వేల 463 వాహనాల చలాన్లు రద్దు చేయబడతాయి. ఎన్‌ఐసీ రూపొందించిన వెబ్‌సైట్‌లో చలాన్‌కు సంబంధించిన పూర్తి రికార్డును అప్‌డేట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సంబంధిత వ్యవధిలో చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాల యజమానులు చలాన్ మొత్తాన్ని డిపాజిట్ వద్దని డీసీపీ ట్రాఫిక్ డీసీపీ అనిల్ కుమార్ యాదవ్ సూచించారు.

ఈ వారం కూడా అమ్మాయినే ఎలిమినేట్.. ఎవరో తెలిసిపోయింది..?
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఏడో వారం చివరకు వచ్చేసింది.. వీకెండ్ అంటే నాగ్ ఎంట్రీతో పాటుగా ఎలిమినేషన్ కూడా ఉండటంతో ఈ ఎపిసోడ్ పై జనాలు ఆసక్తి చూపిస్తుంటారు.. అయితే గత ఆరు వారాల్లో ఆరుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్‌, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో నయని పావని లు ఎలిమినేట్ అయ్యారు.. అయితే ఈవారం కూడా అమ్మాయినే అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. ఇక ఈ వారం నామినేషన్లలో భోలే షావలి, టేస్టీ తేజ, అశ్విని శ్రీ, పూజా మూర్తి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ లు ఉన్నారు.. ఆరు వారాల్లో ఆరుగురు అమ్మాయిలు ఎలిమినేట్ చేయడంతో ఈ సారి ఖచ్చితంగా అబ్బాయే ఎలిమినేట్ కానున్నారని కొందరు అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్‌ను బట్టి చూస్తే ప్రశాంత్, అమర్ దీప్‌, బోలే షావళి లు సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. డేంజర్ జోన్‌లో అశ్విని శ్రీ, పూజా మూర్తి ఉన్నారు. ఓటింగ్‌లో ఎటువంటి మార్పు లేకపోతే ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే వార్త చక్కర్లు కొడుతుంది..

Exit mobile version