సరస్వతీ దేవిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి.. శరన్నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ.. సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే విద్యార్ధులకు విద్యాబుద్ధులు అబ్బుతాయని, మంచి నడవడిక వస్తుందని నమ్ముతారు.. రాత్రి నుంచి క్యూలైన్లలో ఇంద్రకీలాద్రి దిగువన వినాయక ఆలయం దగ్గర నుంచి భక్తులను వదులుతున్నారు అధికారులు.. మరోవైపు.. శుక్రవారం కూడా కావడంతో భారీగా తరలి వస్తున్నారు భక్తులు.. హోల్డింగ్ ఏరియా, క్యూలైన్లలో భారీసంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.. ఇక, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారిని దర్శించుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దసరా ఆరవరోజు సరస్వతీదేవి అలంకారంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం ఇస్తుండగా.. మూల నక్షత్రం కావడంతో అర్ధరాత్రి నుంచీ క్యూలైన్లలోనే భక్తులు వేచిఉన్నారు.. మూల నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.. వినాయక ఆలయం వద్ద నుంచి విడతల వారీగా క్యూలైన్లలో భక్తులను వదులుతున్నారు ఆలయ అధికారులు, పోలీసులు.. ఈ రోజు లక్షలాదిగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. మూడు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫైబర్ నెట్ కేసు.. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించిన విషయం విదితమే.. మరోవైపు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు.. ఇలా చంద్రబాబుపై రకరకాల అభియోగాలు నమోదు అయ్యాయి.. అయితే, ఈ రోజు సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసుపై విచారణ జరగనుంది.. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా. ఎమ్. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు.. 9వ నెంబర్ గా చంద్రబాబు బెయిల్ పిటిషన్ లిస్ట్ అయ్యింది.. అయితే, ఫైబర్ నెట్ కేసులో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నిరాకరించడంతో.. దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు నాయుడు.
దసరా కానుక.. అర్చకులకు సీఎం జగన్ శుభవార్త
వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వివిధ వర్గాలకు లబ్ధి చేకూర్చేలా బటన్ నొక్కుతూ.. వారి ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తూ వస్తున్నారు.. ఇక, విజయదశమి సందర్భంగా రాష్ట్రంలోని అర్చకులకు శుభవార్త వినిపించారు సీఎం జగన్.. అర్చకులకు ఇచ్చిన ఎన్నికల హామీని నెవరేర్చుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అర్చకుల కనీస వేతనం రూ.15,625లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ కమిషనర్. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1,177 మంది అర్చకులకు లబ్ధి చేకూరనుంది.. మరోవైపు.. ఈ రోజు బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఏపీ సీఎం.. పట్టు వస్త్రాలతోపాటు పసుపు, కుంకుమలను ప్రభుత్వం తరపున అందించనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతోన్న విషయం విదితమే.
35 రోజులు కష్టపడండి.. ఆ తరువాత ఐదేళ్లు ఏసీలో పడుకోబెడతా!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత అన్నిపార్టీలు, అభ్యర్థులు ప్రజల్లోకి వుంటున్నారు. ఇలా ఇప్పటికయితే మాటలు, హామీలతోనే ఓటర్లకు దగ్గరయ్యేందుకు చూస్తున్నారు అన్నిపార్టీల అభ్యర్థులు. ఓటింగ్ సమయానికి ఈ ప్రచారం మరింతగా చేస్తూ వాడవాడలా తిరుగుతూ ప్రజలకు పార్టీ గురించి ప్రచారం చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ప్రచారానికి వెళ్లిన కొందరు పార్టీ నేతలను గ్రామస్తులు అడ్డుకుంటున్న అయినా పార్టీలు గెలిపించాలనే ధీమాతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈనేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ కామెంట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌన్స్ లర్లు, సర్పంచులు ఎంపిటిసీలతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 35 రోజులు కష్టపడండి…ఆ తరువాత 5 సంవత్సరాలు మిమ్మల్ని ఏసీలో పడుకోబెట్టి చూసుకునే బాధ్యత నాది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బయట ఉళ్లో ఉన్న వారికి నేను అన్ని చూసుకుంటా అని చెప్పి ఊళ్లోకి తీసుకొచ్చి ఓటు వేయించండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ లిస్టు ప్రతి ఒక్కరికి జేబులో పెట్టుకొని ఇంటి ఇంటికి తిరగాలని సూచించారు. మనం తిరిగే తిరుగుడుకు విసుగొచ్చి బిఆర్ఎస్ కే ఓటు వేస్తా అనాలి జనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే తిరిగి, తిరిగి వచ్చి మన క్యాంప్ ఆఫీస్ లో భోజనం చేసి వెళ్ళాలని అన్నారు.
ఇజ్రాయిల్-పాలస్తీనా వార్.. పుతిన్ పై మండిపడ్డ జో బైడెన్
ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్న సంగతి అందరికి సుపరిచితమే. ఈ మారణహోమంలో అమాయక ప్రజలు ఆహుతైపోతున్నారు. ఇజ్రాయిల్ పైన హమాస్ చేసిన దాడుల్లో 1,400 మందికి పైగా మరణించగా.. ఇజ్రాయిల్ గాజా పైన చేసిన ప్రతిస్పందన దాడిలో దాదాపుగా 3,500 మంది మరణించారు. ప్రస్తుతం గాజా పరిస్థితి దయానియ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఈజిప్టు మానవతా సహాయానికి ముందుకు వచ్చింది. అయితే జరుగుతున్న ఈ యుద్ధఖాండ పైన స్పందించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్, హమాస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వివరాలలోకి వెళ్తే.. వైట్ హౌస్ ఓవల్ కార్యాలయం నుండి ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలస్తీనా గ్రూప్ హమాస్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లపై విమర్శల జల్లు కురిపించారు. ఇరుగు పొరుగు రాజ్యాలు రెండూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గొప్ప దేశంగా ఉన్న మేము బాధ్యతారాహిత్యంగా చిన్నపాటి ఆవేశపూరిత రాజకీయాలను చేయలేము. అలాంటి వాటిని అసలు అనుమతించము. హమాస్ వంటి ఉగ్రవాదులను, వాళ్ళకి సహకరించే పుతిన్ వంటి నియంతలను ఎప్పటికి గెలవనివ్వము. కాగా ఉక్రెయిన్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ నుండి భారీ నిధులను అభ్యర్థిస్తానని అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. అయితే గ్లోబల్ లీడర్‌గా అమెరికా భవిష్యత్తుకు ఇది పెట్టుబడిగా మారుతుందనేది దీని వెనుక వాదన. ఇది తరతరాలుగా అమెరికా భద్రతకు డివిడెండ్ చెల్లించే స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని ఆయన పేర్కొన్నారు.
నన్ను క్షమించేసేయ్ జడేజా.. అది అలా జరిగిపోయింది: విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాడు. జడేజాకు దక్కాల్సిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును తాను లాగేసుకున్నందుకు సారీ చెప్పాడు. ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం పూణేలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్స్ తీసి 38 రన్స్ ఇచ్చాడు. అంతేకాదు కళ్లు చెదిరే క్యాచ్‌తో బంగ్లా కీలక బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జడ్డూకే అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఛేదనలో కింగ్ కోహ్లీ ఊహించని శతకం చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘జడేజా.. నీ నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను లాక్కున్నందుకు నన్ను క్షమించు. భారత విజయంలో కీలక పాత్ర పోషించాలనుకున్నాను కానీ.. సెంచరీ చేస్తాననుకోలేదు. అది అలా జరిగిపోయింది. ప్రపంచకప్‌లలో హాఫ్ సెంచరీలు చేస్తున్నా.. వాటిని సెంచరీలుగా మార్చలేకపోతున్నా. ఈ మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో ఉండి భారత జట్టుకు విజయాన్ని అందించాలనుకున్నా. ఇది నేను జట్టు కోసం సంవత్సరాలుగా చేస్తున్నా. ఈ మ్యాచ్‌లో మంచి స్టార్ట్ లభించింది. రెండు నోబాల్స్ లను ఫోర్, సిక్స్‌గా మలచడం గొప్పగా ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. దాంతో నా సహజ గేమ్ ఆడాను. గ్యాప్‌లలో బౌండరీలు బాదడం, సింగిల్స్ తీయడంతో పరుగులు వచ్చాయి’ అని తెలిపాడు.
మూడు నెలల్లో 2700 కోట్లు సంపాదించిన.. సర్ఫ్, సబ్బు, షాంపూల సంస్థ
సబ్బు, సర్ఫ్, షాంపూ సహా 50కి పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎంసిజి కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ రెండో త్రైమాసికంలో రూ.2700 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ లాభం 4 శాతం పెరిగింది. అయితే త్రైమాసిక ఫలితాల విడుదలకు ముందే కంపెనీ షేర్లు ఈరోజు ఫ్లాట్‌గా ముగిశాయి. కంపెనీ లాభం ఎంత, ఎంత ఆదాయాన్ని ఆర్జించిందో చూద్దాం.. దేశంలోని అతిపెద్ద కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) రెండో త్రైమాసికంలో స్టాండ్‌లోన్ నికర లాభం 4 శాతం పెరిగి రూ.2,717 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.2,616 కోట్లు. రెండో త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 4 శాతం పెరిగి రూ.15,027 కోట్లకు చేరుకున్నాయి. 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేర్‌కు రూ.18 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది. డివిడెండ్ రికార్డు తేదీ నవంబర్ 2గా నిర్ణయించబడింది. రెండో త్రైమాసికంలో కంపెనీ EBITDA రూ.3,694 కోట్లుగా ఉంది. మార్జిన్ 24.18 శాతంగా ఉంది.
ఊర్వశికి షాక్.. ఫోన్ కొట్టేసిన వ్యక్తి కండీషన్ ఏంటో తెలుసా..?
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ మధ్య భారత్ – పాక్ మ్యాచ్ ను చూడటానికి స్టేడియంకు వెళ్లింది.. అక్కడే తన విలువైన ఐఫోన్ ను పోగొట్టుకుంది.. గత కొన్ని రోజులుగా తన ఫోన్ కోసం తెగ వెతుకుతుంది.. అంతేకాదు ఇటీల తన ఫోన్ ను తిరిగి ఇచ్చేసిన వారికి అదిరిపోయే గిఫ్ట్ ను కూడా ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా తాజాగా ఓ వ్యక్తి అమ్మడుకు ఈ మెయిల్ చేశాడు.. ‘నీ ఫోన్ నా దగ్గర ఉంది. నీకు అది కావాలంటే నా సోదరుడు క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి నువ్వు నాకు సాయం చేయాలి’ అని ఈ-మెయిల్‌లో ఆ వ్యక్తి పేర్కొన్నాడు.. ఈ విషయాన్ని చెబుతూ ఊర్వశి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. ఆ వ్యక్తి చేసిన ఈ-మెయిల్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా ఆమె అందులో చూపింది.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. తన 24 క్యారెట్స్ రియల్ గోల్డ్ ఐ ఫోన్ ను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇటీవల భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక ఊర్వశి రౌతేలా ఓ ట్వీట్ చేసింది. తాను మ్యాచ్ చూడడానికి వెళ్లానని, ఆ సమయంలో తన ఐ ఫోన్ పోయిందని చెప్పింది. ఫోన్ తిరిగి తన వచ్చేలా సాయం చేయండని ఫ్యాన్స్ ను కోరింది..
శర్వా సినిమాలో విజయ్ సేతుపతి.. ఏ క్యారెక్టరంటే?
టాలివుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.. ఫ్యామిలీ కథా చిత్రాలకు పెట్టింది పేరు శర్వానంద్.. ఇప్పటికే శర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తూ ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకుంటున్నారు.. ఇప్పపోతే ప్రస్తుతం ఈయన శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.. ఈ సినిమా మొత్తం ఫ్యామిలి డ్రామాగా ఉండబోతుందని టాక్.. కాగా, ఈ సినిమాలో శర్వానంద్ కు ఫాదర్ క్యారక్టర్ కీలకం అని చెబుతున్నారు.. ఆ పాత్రలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన విజయ్ సేతుపతి నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలుగులో ఉప్పెన లాంటి సినిమాలో కృతి శెట్టికి ఫాదర్ గా నటించాడు.. ఆ సినిమాలో తన పాత్రకు ప్రాణం పోసాడు.. దాంతో ఈ సినిమాలో ఫాదర్ క్యారక్టర్ హైలెట్ కానుంది.. శర్వాకు ఫాధర్ గా విజయ్ సేతుపతి నటించనున్నారు.. విజయ్ విలక్షణ నటుడుగా మంచి పేరు రావడం తో దాన్ని కాపాడుకుంటూ తెలుగులో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాడు.
చాంగురే బంగారు రాజా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.ఈ సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. టైగర్ నాగేశ్వరావు పాత్రలో రవితేజ జీవించాడని చెప్పొచ్చు.పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది. వరుస సక్సెస్ లతో రవితేజ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే రవితేజ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రానించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రవితేజ నిర్మించిన చిన్న సినిమా ఛాంగురే బంగారు రాజా ఈ వారమే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 27 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ కార్తిక్ రత్నం హీరోగా నటించాడు. గోల్డి నిస్సీ, సత్య మరియు రవిబాబు కీలక పాత్రలు పోషించారు. సతీష్ వర్మ దర్శకత్వం వహించాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన చిన్న సినిమాల్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో. ఆర్‌టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్‌ను రవితేజ ఈ సినిమాను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై శ్వేత కర్లపూడితో కలిసి రవితేజ ఛాంగురే బంగారు రాజా సినిమాను నిర్మించాడు. సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది.రంగురాళ్ల బ్యాక్‌డ్రాప్‌లో మర్డర్ మిస్టరీ కథాంశంతో దర్శకుడు సతీష్ వర్మ ఛాంగురే బంగారు రాజా సినిమాను తెరకెక్కించాడు.. ఇందులో బంగార్రాజు అనే బైక్ మెకానిక్ పాత్రలో కార్తిక్ రత్నం నటించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే అనుకోకుండా బంగార్రాజు ఓ హత్యా నేరంలో చిక్కుకుంటాడు. కానిస్టేబుల్ మంగరత్నం(గోల్డి నిస్సీ) సహాయంతో బంగార్రాజు ఆ హత్యా నేరం నుంచి ఎలా బయటపడ్డాడు.. అస్సలు ఈ హత్య అతడే చేశాడా..లేదా..అనేదే ఈ సినిమా కథ.రవితేజ ఈ సినిమాతో పాటు వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించిన సుందరం మాస్టారు సినిమాను కూడా నిర్మించారు…
