మహాలక్ష్మీదేవి అవతారంలో కనకదుర్గమ్మ దర్శనం.. విశిష్టత ఏంటి..?
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. నాలుగో రోజు శ్రీమహాలక్ష్మీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. దీంతో.. తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు.. క్యూలైన్లలో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు.. ఇక, మహాలక్ష్మీ దే అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే.. ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి.. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, పాలకమండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, బెజవాడ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం విశిష్టత గురించి ఆలయానికి చెందిన పూజారులు చెబుతున్న వివరాల ప్రకారం.. నవరాత్రులలో నాలుగో రోజు చాలా విశేషమైనది.. శ్రీమహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు.. ఇరువైపులా గజరాజులు ఉండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది అమ్మవారు.. భక్తులను గజలక్ష్మీ రూపేణ పాలిస్తుంది.. శ్రీ మహాలక్ష్మీ అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వత్రేష్టం అని పండితులు చెబుతున్నారు.
తల్లితో కలిసి 8 నెలల గర్భిణి ఆత్మహత్య.. భర్త మరణాన్ని తట్టుకోలేక..!
ఆంధ్రప్రదేశ్‌లో 8 నెలల గర్భిణి తన తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.. 8 నెలల గర్భిణి అయిన మహిళ.. తన భర్త మరణించడంతో.. తీవ్ర మనో వేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు.. నెల్లూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరులోని విక్రమ్ నగర్‌లో తల్లి.. కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. 8 నెలల గర్భిణిగా ఉన్న భాను లత తన తల్లి లక్ష్మితో కలిసి విక్రమ్ నగర్ లో నివాసం ఉంటున్నారు.. అయితే, ఇటీవలే భాను లత భర్త సుధాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో మరణించాడు.. అప్పటి నుంచి ఆమె తీవ్రస్థాయిలో మనస్థాపానికి గురయ్యారు.. భర్త లేని జీవితం వ్యర్థమని భావించి తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారనే సమాచారం తెలియడంతో వారి బంధువులు. మిత్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.. ఆమె ఆత్మహత్యకు బలమైన కారణం ఉంటుందని భావిస్తున్నారు. సుధాకర్‌రెడ్డి మరణించడాన్ని తట్టుకోలేకే.. తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారా..? వారు జీవితాన్ని చాలించడం వెనుక ఇంకా ఏవైనా బలమైన కారణాలు ఉన్నాయా? నేది తెలియాల్సి ఉంది. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఏపీలో మరో దారుణం.. టెన్త్ విద్యార్థినిపై వాలంటీర్ అత్యాచారం..
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి విపక్షాలు.. ఇదే సమయంలో అక్కడక్క వాలంటీర్ల ఆగడాలు కూడా వెలుగు చూస్తూ వస్తున్నాయి.. దోపిడీలు, దొంగతనాలు.. అత్యాచారాలు.. ఇలా పలు కేసుల్లో వాలంటీర్ల పాత్ర వెలుగు చూస్తూనే ఉంది.. తాజాగా, ఏలూరులో ఓ వాలంటీర్ దుర్మార్గం వెలుగు చూసింది.. జిల్లాలోని దెందులూరు మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారగానికి పాల్పడ్డాడు వాలంటీర్.. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆధార్ కార్డులు కావాలంటూ వెళ్లి.. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడట వాలంటీర్ నీలాపు శివకుమార్.. తరచూ తమ ఇంటికి వస్తుండడాన్ని గమనించి తల్లిదండ్రులు బాలికన నిలదీయడంతో.. అసలు విషయం వెలుగు చూసినట్టు తెలుస్తోంది.. ఆధార్ కార్డు కావాలంటూ వచ్చి తనను లోబర్చుకున్నట్టు.. ఆ తల్లిదండ్రుల దగ్గర వాయిపోయిందట విద్యార్థిని.. దీంతో.. వాలంటీర్ నీలాపు శివకుమార్ పై దెందులూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు.. ఇక, శివకుమార్‌పై కేసు నమోదు చేసిన దెందులూరు పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి విపక్షాలు.. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన కామెంట్లు తీవ్ర కలకలమే రేపాయి.. వాలంటీర్లలో కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.. ఇక, పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్లు న్యాయపోరాటానికి దిగిన విషయం విదితమే కాగా.. మరోవైపు ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి వారిపై వెంటనే చర్యలు కూడా తీసుకుంటూ వస్తోంది సర్కార్.
అరవింద్ పై కవిత ఫైర్.. నన్ను అనే మాటలు మీ ఇంట్లో ఆడవాళ్లను అంటే పడుతారా?
నన్ను అనే మాటలు మీ ఇంట్లో ఆడవాళ్లను అంటే మీరు పడుతారా? అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. అరవింద్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆవేదన చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్న ఆమెను అక్కడ వచ్చిన మహిళలు అరవింద్ గురించి చెప్పారని మండిపడ్డారు. నన్ను అనే మాటలు మీ ఇంట్లో ఆడవాళ్లను అంటే మీరు పడుతారా? అని ప్రశ్నించారు. ఈ మాటలు కరెక్ట్ కాదని ఆమె తెలిపారు. ఎంపీ ధర్మపురి అరవింద్ తన బాధ్యతలను విస్మరించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడరని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేస్తున్నా.. ఈరోజు నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. నేను ఆడబిడ్డను.. మీ అమ్మాయిల మాటకు మీరు ఏకీభవిస్తారా? నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి… సీఎం కేసీఆర్ బిడ్డను కాబట్టి.. నన్ను ఆదరిస్తారా అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు జడ్చర్ల, మేడ్చల్‌కు కేసీఆర్.. బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించనున్న సీఎం
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత న్యాయమూర్తుల అనంతరం మేడ్చల్ లో నిర్వహిస్తున్న బీఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. ఇటీవల బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, వైద్యశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలకు ప్రజల నుంచి వస్తున్న అత్యుత్సాహం, ఆదరణ దృష్ట్యా బుధవారం నిర్వహించనున్న సభల విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. బుధవారం మేడ్చల్‌లో జరిగే ప్రజా ఆశ్వీరద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి మల్లారెడ్డి సమావేశమై జన సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 15 ఎకరాల విస్తీర్ణంలో సీఎం కేసీఆర్ సభ జరగనుంది. ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం రద్దీగా మారింది. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కుర్చీలు ఏర్పాటు చేసి సౌకర్యం కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్చర్ల పట్టణంలోని గంగాపూర్ రోడ్డు శివాలయం సమీపంలో నిర్వహించనున్న సభకు బీఆర్ ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మంగళవారం సభ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు. పోలీసులు ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఆవరణలో సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి ఫ్లెక్సీలు వేశారు. సభకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు పరిశీలించారు.
అమిత్ షాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో షా మత హింసను ప్రేరేపించారని పార్టీ ఆరోపించింది. ఎన్నికల ప్రయోజనాల కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓటమి చవిచూస్తోంది. ఓటమితో విసుగు చెందిన అమిత్ షా ఇప్పుడు మతతత్వాన్ని ఆశ్రయించాలనుకుంటున్నారు. వాస్తవానికి సోమవారం రాజ్‌నంద్‌గావ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా బఘెల్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బెమెతరలోని బీరాన్‌పూర్ గ్రామంలో జరిగిన మత హింసలో భూపేష్ బఘేల్ హస్తం ఉందని ఆయన అన్నారు. ఈ హింస ఏప్రిల్‌లో జరిగింది. ఇందులో ఈశ్వర్ సాహు కుమారుడు భునేశ్వర్ సాహు మరణించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని 90 స్థానాలకు నవంబర్ 7 – 17 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరుగుతుందని మీకు తెలియజేద్దాం.
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే?
దేశంలో బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. ఈ మధ్య రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.. ఈరోజు కాస్త ఊరటను కలిగిస్తుంది.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది..తాజాగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 వరకు తగ్గుగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.500 వరకు తగ్గింది. ప్రస్తుతం దేశంలో కిలో సిల్వర్ ధర రూ.73,600 వద్ద కొనసాగుతోంది. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ధరతో కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు డౌటే!
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గత శనివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్.. మరో కీలక సమరానికి సిద్దమైంది. అక్టోబర్ 20న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బెంగళూరు చేరుకున్న పాకిస్తాన్ ప్లేయర్స్ సాధన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ జట్టును వైరల్ ఫీవర్ (విష జ్వరాలు) బాధిస్తున్నాయని పీసీబీ మీడియా మేనేజర్ అషాన్ ఇఫ్తికార్ చెప్పాడు. భారత్‌తో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు వైరల్ ఫీవర్ సోకింది. అయితే చాలా మంది ఆటగాళ్ల ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింది. ఇద్దరు ప్లేయర్స్ మాత్రం ఇంకా కోలుకోలేదని సమాచారం. ఇందులో ఒకరు ఇప్పటికీ ఫ్లూతో బాధపడుతున్నారట. కోలుకుంటున్న వారు టీమ్ మెడికల్ కమిటీ పర్యవేక్షణలో ఉన్నారని అషాన్ ఇఫ్తికార్ తెలిపారు. కెప్టెన్ బాబర్ అజామ్, స్టార్ పేసర్ షహీన్‌షా అఫ్రిది ఆరోగ్యంగానే ఉన్నారని సమాచారం. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లోపు పాకిస్తాన్ ఆటగాళ్లంతా కోలుకుని (Pakistan Players Viral Fever) ఫిట్‌గా ఉంటారని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఫ్లూతో బాధపడుతున్న ప్లేయర్ మాత్రం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు అనుమానంగానే ఉందని తెలుస్తోంది. ఆ ఆటగాడి వివరాలు ఇంకా తెలియరాలేదు. మంగళవారం పాక్ జట్టు సభ్యులు చిన్నస్వామి స్టేడియంలో సాధన చేశారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ప్రాక్టీస్ ఉండగా.. ఆటగాళ్ల అస్వస్థత కారణంగా ప్రాక్టీస్ సెషన్‌ను గంటకు కుదించారు.
‘నువ్వెప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావ్’.. తేజీస్వి పరువు తీసిన విశ్వక్ సేన్..
టాలివుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే.. అన్‌స్టాపబుల్ విత్ NBK’షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.. అదే విధంగా ఇప్పుడు కొత్త షో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. తాజాగా దసరా సందర్భంగా టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. యంగ్ హీరోయిన్లు చాందిని, సిమ్రాన్ చౌదరి, బిగ్‌బాస్ తేజస్వి, అనీషా, అనన్య సహా ఇంకొంతమంది సందడి చేశారు. అసలే ఓటీటీ కావడంతో షోలో డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయాడు విశ్వక్.. ఈ షో ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రోమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విశ్వక్ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. అనీషా నా మీద కోపంగా ఉంది రెండేళ్ల నుంచి.. తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు హోలీ రోజు సిగ్గులేకుండా వెళ్లి కలర్ కొట్టినా, వాటర్ కొట్టినా అని అలిగి వెళ్లిపోయింది.. సారీ అనీషా అంటూ విశ్వక్ అన్నాడు. ఆ ఆప్షన్స్ నాకూ ఉన్నాయా అంటూ తేజస్వి అడగడంతో విశ్వక్ కౌంటర్ వేశాడు.. దానికి తేజు నాకు ఆప్షన్స్ ఉన్నాయి అనడం తో షాక్ అయ్యాడు.. దానికి వెంటనే కౌంటర్ వేసాడు.. నువ్వు ఎప్పుడూ ప్రెగ్నంట్ అయ్యావు అన్నాడు..
