NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు టీడీపీ – జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి తెలుగుదేశం-జనసేన పార్టీలు.. ఇక.. సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నారు.. ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేందుకు రెండు పార్టీలు సిద్ధం అవుతున్నాయి.. ఇప్పటికే ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు సభ్యులతో ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్‌ బాబు, పార్టీ నేత పట్టాభి సభ్యులుగా ఉండగా.. జనసేన నుంచి వరప్రసాద్‌, ముత్తా శశిధర్‌, శరత్‌ కుమార్‌.. సభ్యులుగా ఉన్నారు.. అయితే, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ఏర్పాటు చేసిన ఆ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది.. ఈ రోజు మధ్యాహ్నం ఎన్టీఆర్‌ భవన్‌ వేదికగా ఈ సమావేశం జరగనుంది..

రేపటి నుంచే ‘కోటిదీపోత్సవం’.. ముస్తాబైన ఎన్టీఆర్‌ స్టేడియం
కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రంగా భావిస్తారు.. కార్తీక స్నానాలకు, ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రధమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.. ఇక, కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది.. ఈ ఏడాది కూడా ఘనంగా కోటిదీపోత్సవ యజ్ఞాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమైంది భక్తి టీవీ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా మంగళవారం నుంచి అంటే రేపటి నుంచి.. కోటిదీపోత్సవ మహాయజ్ఞం ప్రారంభం కానుంది.. లక్ష దీపాలతో ప్రారంభించిన ఈ దీప యజ్ఞాన్ని ఆ తర్వాత కోటి దీపోత్సవంగా విస్తరించింది ఎన్టీవీ-భక్తి టీవీ యాజమాన్యం.. దేదీప్యమానంగా వెలిగే దీపపు కాంతులు, ప్రచానామృతాలు, కల్యాణ కమనీయాలతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తే కోటి దీపోత్సవం ఈ నెల 14వ తేదీన ప్రారంభం కానుంది.. ప్రతీ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాగే ఈ దీపయజ్ఞం నవంబర్‌ 27వ తేదీ వరకు కొనసాగనుంది.. శివకేశవులని ఒకేవేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను ఒక్క వేదిక మీదకు తెచ్చేందుకు ఈ పవిత్ర దీపోత్సవం సాగుతోంది.. ఇక, ప్రతి రోజు వేలాది మంది భక్తులతో కోటిదీపోత్సవ ప్రాంగణం వెలిగిపోతుంది.. ప్రవచనాలతో మొదలై, ప్రత్యేక అర్చనలు, దేవదేవుల కళ్యాణాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతోన్న ఈ దీపయజ్ఞంలో వివిధ పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు తమ సందేశాలు ఇస్తారు.. కోటిదీపోత్సవ వేదిక ఒక ఆధ్యాత్మిక దివ్యఅనుభూతికి నిలయంగా వెలుగుతోంది.. రేపటి నుంచి ఆరంభంకాబోతోన్న దీప యజ్ఞంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది ఎన్టీవీ – భక్తి టీవీ.

నేటి నుంచి కేసీఆర్ రెండో విడత జన ఆశీర్వాద సభ.. ఈరోజు ఎక్కడంటే..
రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత జన ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ కేసీఅర్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ కానుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవంబర్ 9న నామినేషన్లు వేసి కామారెడ్డిలో సభతో ఆ విడత షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా మళ్లీ నేటి నుంచి ప్రచారానికి రెడీ కానున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కొద్దిగా స్పీడ్ పెంచనున్నారు. ప్రతి రోజూ 3 నుంచి 4 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ చేసుకున్నారు. 16 రోజులు 54 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 28న వరంగల్ తూర్పు, పశ్చిమ, గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 28 వరకు 54 సభల్లో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే తొలి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇవాళ బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. భద్రాచలం, పినపాక కలిపి ఒకే సభ ఉండనుంది. 14న పాలకుర్తి, నాగార్జునసాగర్(హాలియా), ఇబ్రహీంపట్నం, 15న బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్, 16న ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్, 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల, 18న జనగాంలో రోడ్డుషో, 19న ఆలంపూర్, కల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, 20న మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్లగొండ, 21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట, 22న తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి, 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరువు, 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, 25న హైదరాబాద్‌లో పబ్లిక్ మీటింగ్, 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, 27న షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి, 28న వరంగల్ (ఈస్ట్+వెస్ట్), గజ్వేల్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

శ్మశానంలో బండిసంజయ్ దీపావళి సంబరాలు.. టపాసులు కాల్చి వేడుకలు
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో ఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. ఈ సమయంలో బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్ల దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు పనికిరాని పాట్లు పడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తున్నారు. తెల్లారి…చాలా మంది ఓటర్లు తమ కళ్లను చూపుతున్నారు. వారితో పరిచయం పెంచుకుంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్‌ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సమయంలో ఖైదీ సంజయ్‌కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. స్మశాన వాటికలో దీపావళి జరుపుకున్నాడు. సమాధుల ముందు దీపాలు వెలిగించి వారి ఆత్మలు శాంతించాలని స్మరించుకున్నారు. కాస్త వింతగా అనిపించినా ఇది నిజం. నిజానికి కరీంనగర్‌లో ప్రతి సంవత్సరం దళిత కుటుంబాలన్నీ వ్యవసాయ మార్కెట్‌ సమీపంలోని శ్మశాన వాటికలో దీపావళి పండుగను జరుపుకుంటాయి. ఇక్కడి దళిత కుటుంబాలు తమ పెద్దలు, పూర్వీకుల సమాధులను అలంకరించి వారిని స్మరించుకుని సమాధుల దగ్గర పూజలు చేస్తుంటారు. వారి ఆత్మల జ్ఞాపకార్థం సమాధుల ముందు దీపాలు వెలిగిస్తారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకోండి. ఇక్కడి సమాధుల వద్ద స్వర్గానికి వెళ్లిన మన పెద్దలను, పూర్వీకులను స్మరించుకోవడం ఆనవాయితీ.

నిషేధమని తెలిసినా పేల్చిన పటాకులు.. మళ్లీ యథాతథ స్థితికి ఢిల్లీలో వాయుకాలుష్యం
ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంతో ఆదివారం కూడా బాణసంచాపై నిషేధం అమల్లోకి వచ్చింది. దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో AQI గణనీయంగా పడిపోయింది. ఒకవైపు ఢిల్లీలో ఏక్యూఐ 267 వద్దే ఉన్నట్లు సోమవారం ఉదయం గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలోని తాల్చేర్‌లో ఈ సంఖ్య ‘వెరీ బ్యాడ్’ కేటగిరీకి చేరుకుంది. AQI 352 ఇక్కడ నమోదు చేయబడింది. ఉదయం 5.57 గంటల డేటా ప్రకారం… ఒడిశాలోని అంగుల్‌లో 306, బాలాసోర్‌లో 334, తాల్చేర్‌లో 352, భువనేశ్వర్‌లో 340, కటక్‌లో 317, బీహార్‌లోని బెగుసరాయ్‌లో 381, భాగల్‌పూర్‌లో 336, గయాలో 313, గయాలో 331, పూర్నియాలో 338, రాజ్‌గిర్‌లో 352, సహర్సాలో 328, కతిహార్‌లో 315, రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో 320, కోటాలో 304, మహారాష్ట్రలోని ధులేలో 316కి చేరుకుంది. దీపావళి రాత్రి తర్వాత రాజధాని ఢిల్లీ – ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలో కూడా పొగమంచు కమ్ముకుంది. ముంబైలోని ఏక్యూఐ సోమవారం ఉదయం 188 వద్ద కొనసాగింది. విశేషమేమిటంటే, కాలుష్య నగరాల సంఖ్య 100 కంటే ఎక్కువ. వీటిలో గాలి నాణ్యత ‘పేలవమైన’ కేటగిరీలో ఉంది.

సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురు సైనికులు మృతి!
అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌ మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని యుఎస్ మిలిటరీ ఆదివారం ధ్రువీకరించింది. శనివారం ఉదయం సముద్రంలో హెలికాప్టర్ కూలిపోయిందని యూఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ప్రాంతీయ వివాదంగా మారకుండా నిరోధించే ప్రయత్నాలలో భాగంగా మధ్యధార సముద్రంలో మోహరించిన యునైటెడ్ స్టేట్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లోని ఓ హెలికాప్టర్ ఈ ప్రమాదానికి గురైంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండా ఉండేందుకు.. మధ్యధార ప్రాంతంలో ఒక ఆర్మీ బృందాన్ని అమెరికా మోహరించింది. సైనిక శిక్షణలో భాగంగా నవంబర్‌ 10న ఓ హెలికాప్టర్‌ గాల్లోకి ఎగిరింది. ఐదుగురు సర్వీస్ సభ్యులను తీసుకువెళుతున్న ఆ హెలికాప్టర్‌ సాంకేతిక సమస్య తలెత్తడంతో మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు సైనికులు మృతి చెందారు.

ఏంటి అనుష్క.. కనీసం చప్పట్లు కూడా కొట్టావా! కోహ్లీ వీడియో వైరల్
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంటర్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. బ్యాట్‌తో మాత్రమే కాదు బంతితోనూ మాయ చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ (51) చేసిన విరాట్.. ఆపై మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. అయితే విరాట్ బౌలింగ్ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నెదర్లాండ్స్ బ్యాటింగ్ సమయంలో విరాట్ కోహ్లీకి బంతిని ఇవ్వాలని స్టాండ్స్‌లో ఉన్న ఫాన్స్ గట్టిగా అరిచారు. ఫాన్స్ అరుపులతో స్టేడియం మొత్తం మోత మోగింది. దీంతో ఫ్యాన్స్ కోరిక తీర్చేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ.. కోహ్లీ చేతికి బంతిని ఇచ్చాడు. 23వ ఓవర్ వేసిన విరాట్ 7 పరుగులు ఇచ్చాడు. ఓవర్ ముగిసిన అనంతరం కోహ్లీ స్టాండ్స్‌లో అతడి భార్య అనుష్క శర్మను చూస్తూ.. ‘నేను బౌలింగ్ చేశా, కనీసం చప్పట్లు కూడా కొట్టావా?. ఏంటి అనుష్క ఇది’ అని సైగలు చేశాడు. అందుకు అనుష్క ఓ చిరునవ్వు చిందించారు. ఇక 25వ ఓవర్ మూడో బంతికి నెదర్లాండ్స్ కెప్టెన్‌ స్టాట్‌ ఎడ్వర్డ్స్‌ (17) వికెట్ తీశాడు. వికెట్‌ తీసిన అనంతరం విరాట్‌ సంబరాలు ఆకాశాన్ని అంటాయి. సెంచరీ చేసినప్పుడు కూడా ఇంతలా సంతోషపడి ఉండడు. మరోవైపు విరాట్‌ తీయగానే స్టాండ్స్‌లో ఉన్న అతని భార్య అనుష్క శర్మ కూడా ఉబ్బితబ్బి బైపోయారు. అనుష్క సంతోషానికి కూడా అవథుల్లేకుండా పోయాయి. స్టాండ్స్‌లో లేచి నిలబడి చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వికెట్ తీసిన విరాట్‌ కోహ్లీ.. అనుష్క శర్మ రియాక్షన్ చూశారా!
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున 9 మంది బౌలర్లు బౌలింగ్ చేశారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆర్ జడేజాతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేశారు. అయితే కింగ్ కోహ్లీ బౌలింగ్ చేయడమే కాదు.. వికెట్ కూడా పడగొట్టాడు. 9 ఏళ్ల తర్వాత కోహ్లీ ఖాతాలో వికెట్ పడింది. అంతకుముందు 2014లో వన్డేల్లో విరాట్ వికెట్ తీశాడు. బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ 3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తాను వేసిన 2వ ఓవర్‌లో డచ్‌ సారథి స్కాట్ ఎడ్వర్డ్స్‌ వికెట్‌ పడగొట్టాడు. 30 బంతులు ఎదుర్కొన్న ఎడ్వర్డ్స్ 17 పరుగులు మాత్రమే చేసి.. కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కోహ్లీ వికెట్‌ తీయగానే స్టాండ్స్‌లో మ్యాచ్‌ చూస్తున్న విరాట్‌ భార్య అనుష్క శర్మ పట్టరాని ఆనందంతో మురిసిపోయారు. లేచి నిలబడి నవ్వుతూ సంబరాలు చేసుకున్నారు.

నేడు పంజాగుట్ట శ్మశాన వాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు
సీనియర్ నటుడు, హీరో చంద్రమోహన్ హృద్రోగ సమ్యసలతో శనివారం కన్నుమూశారు. 82 ఏళ్ల వయసు కల్గిన ఆయన కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 నిమిషాలకు ప్రాణాలు కోల్పోయారు. చంద్రమోహన్ మృతితో టాలీవుడ్ మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనను చివరసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు, సినీ ప్రముఖులు వెళ్తున్నారు. నేడు చంద్రమోహన్ అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటిలో నిర్వహించబోతున్నారు. శనివారం చనిపోయిన ఆయనకు సోమవారం అంటే మూడ్రోజులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇలా రెండు రోజుల పాటు ఆయన అంత్యక్రియలు ఆలస్యంగా ఎందుకు నిర్వహిస్తున్నారని చాలా మందికి డౌట్ వస్తోంది. అయితే ఇలా ఆలస్యంగా చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.