NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. షరతులు ఇవే..
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.. సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర పడింది.. ఆ తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదులు తెలిపారు జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్‌ జర్నలిస్టులు.. ఇక, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. అయితే, దీనికి సంబంధించిన కొన్ని షరతులు విధించింది.. ఏపీ ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ విధించిన ఈ కింది షరతులకు లోబడి ప్రతిపాదనను సిఫార్సు చేయనున్నారు..

అద్దె చెల్లించలేదు.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన యజమాని..
చిత్తూరు జిల్లా వీ.కోట మండలంలో అద్దె చెల్లించలేదని పడగలకుప్పం గ్రామా సచివాలయానికి తాళం వేశాడు ఇంటి యజమాని.. పంచాయతీ భవనానికి అద్దె చెల్లించలేదని తాళం వేశారు. అయితే, ప్రభుత్వ కార్యాలయానికి తాళం వేయడంతో పనుల కోసం వచ్చిన స్దానికులు నిరాశగా వెనుతిరగాల్సి వస్తుంది.. ప్రజలకు సమాచారం కోసం తాళం వేసిన డోర్‌కు ఓ నోటీసు బోర్డు అంటించారు సచివాలయ సిబ్బంది.. “గ్రామ సచివాలయం అద్దె ఇవ్వని కారణంగా ఇంటి యజమాని తాళాలు వేయడం జరిగింది.. అందువల్ల కార్యాలయం మూసివేయడం జరిగింది” ఇట్లు గ్రామ సచివాలయ సిబ్బంది పడిగలకుప్పం.. అంటూ నోటీసు అంటించారు. అయితే, సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

నేడు హైదరాబాద్ కు మోడీ.. మాదిగ విశ్వరూప సభలో ప్రధాని ప్రసంగం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలను ఆహ్వానిస్తూ ప్రచార హోరును పెంచింది. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాదిగ విశ్వరూప బహిరంగ సభ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని మోడీ సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పరేడ్‌ గ్రౌండ్‌కు బయలుదేరుతారు. ప్రధాని ప్రసంగం 5:00 నుండి 5:45 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 5.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం అనంతరం 6 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, మాదిగ ఉప కులాల (మాదిగ విశ్వరూప బహిరంగ సభ) బహిరంగ సభలో ఎస్సీ కులాల వర్గీకరణపై మోడీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీలోని పలు వర్గాలు తెలిపాయి.

నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
నేడు హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తుండటంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మాదిగల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక, ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని మోడీ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం రోడ్ మార్గాన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. అయితే, మోడీ ఈ సభలో దాదాపు 45 నిమిషాల పాటు సభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 6గంటల ఆయన బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోతారు. అయితే, ప్రధాని మోడీ టూర్ పర్యటన దృష్ట్యా శాంతిభద్రతలకు ఆటకాం కలగకుండా ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పలు ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ప్రయాణికులు, వాహనదారులు తాము సూచించిన మార్గంలో వెళ్లాలి అని హైదరాబాద్ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఢిల్లీలో భారీగా మద్యం అమ్మకాలు.. 15 రోజుల్లో 2.58 కోట్ల సీసాలు
దీపావళి రోజున ఢిల్లీ ప్రజలు సందడి చేయనున్నారు. గతేడాదితో పోలిస్తే దీపావళికి ముందు మద్యం బాటిళ్ల విక్రయాలు భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తి విభాగం ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఆ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం గతేడాది దీపావళికి ముందు మూడు రోజుల వ్యవధిలో వరుసగా 13.46 లక్షలు, 15 లక్షలు, 19.39 లక్షల బాటిళ్లు అమ్ముడయ్యాయి. దీపావళికి ముందు రెండు వారాల్లో సగటున 12.56 లక్షల బాటిళ్ల విక్రయాలు జరిగాయి. ఈసారి ఆ సంఖ్య 37 శాతం ఎక్కువ. ఈ సందర్భంగా శుక్రవారం ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పండుగకు ముందు పక్షం రోజులలో విక్రయించిన సగటు బాటిళ్ల సంఖ్య గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఢిల్లీలో దీపావళికి ముందు మద్యం అమ్మకాలలో 37 శాతం పెరిగింది. మరింత పెరుగుదల నమోదైంది. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం.. దీపావళికి రెండు వారాల ముందు గతేడాది 2.26 కోట్ల మద్యం సీసాలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది గత పక్షం రోజుల్లో అంటే 15 రోజుల్లో 2.58 కోట్ల బాటిళ్లు అమ్ముడుపోయాయి. సోమవారం 14.25 లక్షల బాటిళ్లు అమ్ముడుపోయాయి. ఈ సంఖ్య మంగళవారం నాటికి 17.27 లక్షల బాటిళ్లకు, బుధవారం 17.33 లక్షల బాటిళ్లకు పెరిగింది.

ఛత్తీస్ గఢ్ రెండోదశ ఎన్నికలు.. 253మంది అభ్యర్థులు కోటీశ్వరులే
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నవంబర్ 7న జరిగింది. రెండో దశ పోలింగ్ నవంబర్ 17న జరగనుంది. ఈ చివరి దశలో మొత్తం 253 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో అత్యధికంగా రూ.447 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తమ తాజా నివేదికలో నవంబర్ 17న జరిగే ఓటింగ్‌లో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం అభ్యర్థుల సగటు ఆస్తి రూ.2 కోట్లు. 70 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 60 మంది అంటే 86 శాతం మంది కోటీశ్వరులేనని నివేదికలో పేర్కొంది. కాగా, బీజేపీకి చెందిన 70 మంది అభ్యర్థుల్లో 57 మంది అంటే 81 శాతం మంది, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) 62 మంది అభ్యర్థుల్లో 26 మంది అంటే 42 శాతం మంది, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు 44 మందిలో 19 మంది అంటే 43 శాతం మంది కోటీశ్వరులే.

గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి 22 మంది మృతి..
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య గాజా స్ట్రిప్‌లోని ఓ ఆసుపత్రిపై దాడి జరిగింది. ఈ దాడిలో 22 మంది మరణించినట్లు సమాచారం. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని పాలస్తీనా ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పూర్తిగా తోసిపుచ్చింది. గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే అనుమానంతో ఇజ్రాయెల్ సైన్యం రెండు రోజలు పాటు చుట్టముట్టించి అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. ఇక, గాజా నగరం మధ్యలో ఉన్న షిఫా ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్న వేలాది మంది ప్రజలు రాత్రిపూట పేలుళ్ల తర్వాత పారిపోయారని, గాజా ఉత్తర యుద్ధ ప్రాంతం నుంచి పారిపోతున్నారని పాలస్తీనియన్లు తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 80,000 మంది ప్రజలు ఈ ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, శుక్రవారం ఆసుపత్రి నుంచి పారిపోయిన వారిలో కొందరు తీవ్రంగా గాయపడిన రోగులు, వైద్యులు వందలాది మంది మాత్రమే భవనంలో ఉన్నారని చెప్పారు.

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
దీపావళి పండగ ముందు బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత 4-5 రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం (నవంబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,000 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 61,090లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,150లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,240గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,450లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,580గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,090గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా నేడు పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర శనివారం రూ. 74,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 800 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,000లు ఉండగా.. చెన్నైలో రూ. 77,000గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,750గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 77,000లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,000గా కొనసాగుతోంది.

మంచి బ్యాటర్‌ కావడంపై దృష్టి పెట్టడం కంటే.. కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిది: కోహ్లీ
పరిపూర్ణమైన బ్యాటర్‌ కావడంపై దృష్టి పెట్టడం కంటే.. కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిదని టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ అన్నాడు. బ్యాటింగ్‌కు ఇంకా ఏం చేరిస్తే విజయానికి కృషి చేయచ్చో ఆలోచిస్తే ఆట మెరుగవుతుందన్నాడు. ప్రస్తుతం విరాట్ ప్రపంచకప్ 2023లో బాగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడి 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఆదివారం నెదర్లాండ్స్ జట్టుతో భారత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. నెదర్లాండ్స్ మ్యాచ్ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ… ‘క్రికెట్ ఆటలో టెక్నిక్‌, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి నేర్చుకున్న టెక్నిక్‌ మ్యాచ్‌లు గెలవడానికి ఉపయోగపడడం, లేదా బ్యాటింగ్‌ మెరుగుపడడం. బ్యాటింగ్‌లో మెరుగుపడడం అనే విషయం గురించి చాలా మందికి అవగాహన ఉండదు. మన బ్యాటింగ్‌కు ఇంకా ఏం చేరిస్తే విజయానికి కృషి చేయచ్చో ఆలోచిస్తే ఆట అదే మెరుగవుతుంది. పరిపూర్ణమైన బ్యాటర్‌ కావడంపై దృష్టి పెట్టడం కంటే.. కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిది. కొత్త షాట్ల వల్ల పరుగులు రావడమే కాకుండా టీమ్ కూడా గెలుస్తుంది’ అని అన్నాడు.