NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు..!
ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి.. వడగాలులు వృద్ధుల ప్రాణాలు తీస్తున్నాయి.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి.. పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతుండగా.. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక, ఈ రోజు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉందని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనుండగా.. సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవవచ్చు అని పేర్కొంది. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశంఉన్నందున చెట్ల కింద ఉండరాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ హెచ్చరించారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాధ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. సినిమాను తలపించేలా..!
ప్రకాశం జిల్లాలో సంచలనం రేపిన సాప్ట్‌వేర్ ఉద్యోగి రాధ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ బయటపడింది. సినిమాను తలపించే ట్విస్ట్‌ వెలుగు చూసింది. కారుతో తొక్కించి.. బండరాళ్లతో కొట్టి.. సిగరేట్లతో కాల్చి దారుణంగా హత్య చేసిన ఈ కేసు మలుపు తిరిగింది. హత్య చేసి తప్పించుకోవాలని.. అనుమానం రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు.భర్తే ఆమెను అత్యంత దారుణంగా చంపినట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన రాధ అనే వివాహితను ఈనెల 17న గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. ఈమె భర్త మోహన్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. హైదరాబాద్‌లో కొన్నేళ్లుగా ఉంటున్నారు. అయితే డబ్బుల విషయంలో భార్య భర్తలకు గొడవలు జరుగుతున్నాయి. అది విడిపోయే వరకు వెళ్లింది. గతంలో రాధ సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌లోనే పనిచేసేది. తన స్నేహితుడైన కాశిరెడ్డిని నమ్మి దాదాపు 80 లక్షలు అప్పు ఇచ్చింది. కాశిరెడ్డి బెట్టింగుల్లో మొత్తం డబ్బులు పోగొట్టుకుని ఐపీ పెట్టేసి చెక్కేశాడు. దీంతో అప్పటి నుంచి భార్యా భర్తలకు గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఊళ్లో జాతరకు వచ్చిన ఆమె… కాశిరెడ్డి నుంచి డబ్బులు తెస్తానని వెళ్లింది. తర్వాత రెడ్‌ కలర్‌ కారులో ఆమె వెళ్లినట్టు గుర్తించారు. సీన్‌ కట్‌ చేస్తే జిల్లెళ్లపాడు సమీపంలో ఆమె డెడ్‌బాడీ దొరికింది. తర్వాత బాడీని భర్త స్వస్థలం కోదాడ తీసుకెళ్లి ఖననం చేయడం… తర్వాత కార్యక్రమాలు జరిగాయి. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. రాధను ఎవరు చంపారు..? డబ్బు ఇస్తానని నమ్మించి కాశిరెడ్డే ప్రాణం తీశాడా..? లేక భర్త ప్రమేయం ఉందా..? ఇంకా ఎవరైనా చంపేశారా అనే కోణాల్లోనూ పోలీసుల దర్యాప్తు సాగింది.. ఇటు కాశిరెడ్డి స్నేహితుల్ని ప్రశ్నిస్తూనే… అటు భర్త మోహన్‌రెడ్డిని కూడా ఎంక్వయిరీ చేశారు.

రెచ్చిపోతోన్న సైబర్ నేరగాళ్లు.. లక్షలు లాగేస్తున్నారు..!
సైబర్ నేరాగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరిత ప్రకటనలతో అమాయకుల నుంచి లక్షల రుపాయలు కాజేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చొని కొందరికి టోకరా వేస్తున్నారు. పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను నిలువునా దోచేస్తున్నారు. ఓ యువతి నుంచి ఏకంగా 20 లక్షలు, మరో యువకుడి నుంచి 40 లక్షల రుపాయలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు. బెజవాడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి ఈ నెల 5న వాట్సాప్ నెంబర్ ద్వారా మేసేజ్ వచ్చింది. తమ సంస్ధలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం ఉందన్నది ఆ మెసేజ్‌ సారాంశం. దీంతో ఆ మెసేజ్‌కు యువతి స్పందించింది. దీంతో రెండు యూ ట్యూబ్ లింక్‌లను ఆమెకు పంపారు. ఆ వీడియోలకు లైక్‌ కొడితే.. 150 రుపాయలు చెల్లిస్తామన్నారు. అయితే, ముందుగా వెయ్యి రూపాయలు చెల్లించాలని.. షరతు పెట్టారు. దీంతో ఆమె వెయ్యి రూపాయలు చెల్లించింది. తర్వాత యూ ట్యూబ్ లింకులకు లైకులు కొట్టింది. దీంతో ఆమె ఖాతాలో 13 వందల రుపాయలు డిపాజిట్ అయ్యాయి. తర్వాత ఆమెతో 5 వేల రుపాయలు పెట్టుబడి పెట్టించారు. ఈ సారి 7 వేల రుపాయలు వేశారు. ఇలా.. సైబర్‌ నేరగాళ్ల ట్రాప్‌లో చిక్కుకున్న యువతి. వాళ్లు చెప్పినంత డబ్బు డిపాజిట్‌ చేస్తూ వచ్చింది. దఫాదఫాలుగా సుమారు 20 లక్షల రుపాయలు ఆమె డిపాజిట్ చేసింది. కానీ.. అటు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించింది. విజయవాడ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.

రానున్న నాలుగు రోజులు వర్షాలు.. 50 కిలోమీటర్ల వేగంతో గాలులు
తెలంగాణలో గత రెండు రోజులుగా పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో నాలుగు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా వర్ష సూచనను జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం రాత్రి వాతావరణ బులెటిన్ విడుదల చేశారు. ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగా రెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నారాయణ, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. 22న జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, హైదరాబాద్, యాదాద్రి భువనపల్లి, హైదరాబాద్‌లోని మల్కాజిగిరి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక 23న నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాపలల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, నారాయణపేట్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖాయం కర్నూలు మల్కాజిగిరి, సిటీనల్ నల్గ్లాజ్‌గిరి, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 24న రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లొండ, హైదరాబాద్, హైదరాబాద్, మేడ్చల్ ఆర్ హైదరాబాద్, మేడ్చల్ ఆర్. రంగారెడ్డి, మేడ్చలరంగా జిల్లాలు. వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కొద్ది రోజులుగా ఎండలతో అల్లాడుతున్న జనం తాజా వర్షాలతో కాస్త ఊరట పొందుతున్నారు.

రూ.2000 నోట్ల లావాదేవీలను ట్రాక్ చేయండి.. కె. అన్నామలై
తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై మరోసారి అధికార డీఎంకేను టార్గెట్ చేశారు. తమిళనాడులో రూ.2000 నోట్ల లావాదేవీలను ట్రాక్ చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన రూ.2000 నోట్లను మార్చుకునేందుకు డీఎంకే యంత్రాంగాన్ని ఉపయోగించుకోవచ్చని.. ఈ సందర్భంలో ఆర్థిక మంత్రి లావాదేవీ మొత్తం ప్రక్రియను ట్రాక్ చేయాలని ఆయన ఆరోపించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కె. అన్నామలై లేఖ రాశారు. ఇందులో రూ.2000 నోట్ల వృద్ధిని ట్రాక్ చేయాలని కోరారు. ప్రత్యేకించి, సహకార బ్యాంకులు / సొసైటీలు మరియు TASMAC లావాదేవీలను ట్రాక్ చేయాలని కోరింది.తమిళనాడు బీజేపీ చీఫ్ ఈ లేఖను ట్విట్టర్‌లో షేర్ చేశారు. తమిళనాడు నుంచి వస్తున్న రూ.2000 నోట్లను పెంచేలా ఆర్థిక శాఖను ఆదేశించాలని తమిళనాట బీజేపీ తరపున, రాష్ట్ర ప్రజలు ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటామని ఆర్‌బిఐ ప్రకటించిన తరుణంలో ఈ వార్త తెరపైకి వచ్చింది. అయితే, ఈ నోటు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతుంది. రూ.2000 నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. గతంలో అన్నామలైపై డీఎంకే పరువునష్టం కేసు వేసింది. ఆయన డీఎంకే పరువు తీశారని ఆరోపించారు. వాస్తవానికి సీఎం ఎంకే స్టాలిన్, ఇతర డీఎంకే నేతలు అవినీతితో డీఎంకే 1.34 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.

సూడాన్ లో ఏడు రోజుల పాటు కాల్పుల విరమణ
యుద్ధ ప్రభావిత సూడాన్‌లో రేపటి నుంచి ఏడు రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. మే 22 నుంచి మే 29 వరకు కాల్పుల విరమణ కొనసాగనుంది. రాజధాని ఖార్టూమ్‌లో శనివారం భీకర వైమానిక దాడులు జరిగాయి. కాల్పులు జరిగాయి. ఖతార్ ఎంబసీని సూడాన్ సాయుధ బలగాలు దోచుకున్నాయి. సూడాన్‌లో గత కొన్ని రోజులుగా సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య యుద్ధం జరుగుతోంది. అధికారం కోసం ఇద్దరూ పాకులాడుతున్నారు. ఈ పోరాటంలో ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించారు, వేలాది మంది గాయపడ్డారు, లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీనికి ముందు కూడా సూడాన్‌లో ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ సందర్భంగా దేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల వారిని బయటకు తీసుకొచ్చారు. శనివారం కార్టూన్ దాడి తర్వాత, యుఎస్ మరియు సౌదీ అరేబియా జెడ్డాలో కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు జరిపాయి. మే 22 నుంచి 7 రోజుల కాల్పుల విరమణ.. దీని తర్వాత, ఇరు పక్షాల సమ్మతి తరువాత, మే 22 నుండి వచ్చే ఏడు రోజుల పాటు సూడాన్‌లో కాల్పుల విరమణ ఉంటుందని ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఏడు రోజుల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ఆ ప్రకటన పేర్కొంది. ఇందుకు సంబంధించి ఇరువర్గాలు ఒప్పందం చేసుకున్నాయి. ఐదు వారాల క్రితం హింస ప్రారంభమైనప్పటి నుండి ప్రకటించిన కాల్పుల విరమణను అనేకసార్లు ఉల్లంఘించారని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఒక్క రోజులోనే అన్ని రికార్డులని లేపేసారా?
100 రోజులు 150 సెంటర్స్ లో ఆడిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సింహాద్రి’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ, తెలుగు సినిమ ముందెన్నడూ చూడని హీరో వర్షిప్ ని చూపిస్తూ బయటకి వచ్చిన సినిమా ‘సింహాద్రి’. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ఉన్న ఈ మూవీకి ఇప్పుడు నాన్-సింహాద్రి రీరిలీజ్ రికార్డ్స్ అనే స్టేటస్ ఇస్తున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి సినిమా రీరిలీజ్ అయ్యింది. రీరిలీజ్ అంటే ఈ మధ్య రెగ్యులర్ గా జరుగుతున్నట్లు కాదు అది ఇంకో రకం అన్నట్లు ఇప్పటివరకూ ఏ రీరిలీజ్ మూవీకి జరగని విధంగా గ్రాండ్ సెలబ్రేషన్స్ తో సింహాద్రి రీరిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా సింహాద్రి సినిమా 1200కి పైగా సెంటర్స్ లో రిలీజ్ అయ్యింది అంటే ఫాన్స్ ఏ రేంజ్ హంగామా చేసారో అర్ధం చేసుకోవచ్చు. మే 19 సాయంత్రం నుంచే సింహాద్రి రీరిలీజ్ షోస్ అన్ని సెంటర్స్ లో పడ్డాయి. ఈ రీరిలీజ్ కి ఎన్టీఆర్ ఫాన్స్ చేసిన సెలబ్రేషన్స్ చూస్తే ఒక కొత్త సినిమా విడుదల సమయంలో కూడా ఈ రేంజ్ హంగామా చెయ్యరు కదా అనిపించకమానదు. రీరిలీజ్ ట్రెండ్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ ని బెంచ్ మార్క్ గా సెట్ చేసారు ఎన్టీఆర్ ఫాన్స్. సింహాద్రి సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 6 కోట్లకి పైగా రాబట్టిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న టయర్ 2 హీరోల కొత్త సినిమాల డే 1 కలెక్షన్స్ కన్నా ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఫాన్స్ సర్క్యులేట్ చేస్తున్న ఆరు కోట్లు అనేది నిజమైతే ఎన్టీఆర్ ఫాన్స్ కొత్త హిస్టరీ క్రియేట్ చేసినట్లే. ఎందుకంటే రీరిలీజ్ ట్రెండ్ లో టాప్ ప్లేస్ లో ఖుషి సినిమా ఉంది. ఈ మూవీ 4.15 కోట్లని రాబట్టింది, ఖుషి తర్వాతి స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమానే ఉంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన జల్సా సినిమా 3 కోట్లా 20 లక్షలతో సెకండ్ ప్లేస్ లో ఉంది.  తర్వాతి స్థానాల్లో మహేష్ ఒక్కడు, పోకిరి… రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సింహాద్రి హ్యూజ్ మార్జిన్ తో టాప్ ప్లేస్ లో నిలిచిందని ఫాన్స్ సందడి చేస్తున్నారు. అఫీషియల్ ఫిగర్స్ తెలియాల్సి ఉంది.

వంద కోట్ల సినిమా ఒటీటీలోకి వచ్చేసింది… స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘విరూపాక్ష’. సాలిడ్ హిట్ గా అయిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.  ఏప్రిల్ 21న థియేటర్లోకి వచ్చిన విరూపాక్ష సినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టి, తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యింది. ఏజెంట్, శాకుంతలం లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేయండంతో.. విరూపాక్షకి లాంగ్ థియేట్రికల్ రన్ దొరికింది. దీంతో విరూపాక్ష సమ్మర్‌ బిగ్గెస్ట్ హిట్‌ గా నిలవడమే కాకుండా 2023లో హయ్యెస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్స్ లో ఒకటిగా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టింది. తెలుగు లాభాలు తెచ్చిపెట్టిన విరుపాక్ష మూవీ, తమిళ్ మలయాళ హిందీ భాషల్లో మాత్రం అసలు ఇంపాక్ట్ చూపించలేక పోయింది. ఇతర భాషల్లో విరుపాక్ష సౌండ్ అసలు వినిపించలేదు. థియేట్రికల్ రన్ అన్ని భాషల్లో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్ అయితే నెల రోజులు, ఫట్ అయితే రెండు, మూడు వారాలే గ్యాప్ ఇస్తున్నాయి ఓటిటి సంస్థలు. అయితే విరూపాక్ష బ్లాక్ బస్టర్ బొమ్మ కాబట్టి.. సరిగ్గా నెల రోజులకు ఓటిటిలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ముందుగా తెలుగులో మే 21 నుంచి విరూపాక్ష డిజిటల్ స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. “అసలైన భయం సినిమాలో ఉంది” అంటూ నెట్ ఫ్లిక్స్ విరూపాక్ష స్ట్రీమింగ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. మరి ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన విరుపాక్ష మూవీ, ఓటిటిలో విరూపాక్ష ఎలా అలరిస్తుందో చూడాలి.