శ్రీకాళహస్తి ఆలయంలో డ్రోన్ కలకలం…
శివరాత్రి సమీపిస్తోన్న వేళ.. శ్రీకాళహస్తీశ్వరాలయంపై ఓ డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపుతోంది.. ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగరవేసి వీడియోలు చిత్రీకరించారు.. ఈ ఘటనను గుర్తించిన సెక్యూరిటీ.. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఆలయంపై డ్రోన్ ఎగరవేసినవారు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. చెన్నైకి చెందిన విఘ్నేష్, అజిత్ కన్నన్, శంకర్ శర్మ, అరవింద్, పోర్చే జీఎన్.. మొదట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఆ తర్వాత శనివారం రాత్రి శ్రీకాళహస్తికి చేరుకున్నారు.. ముక్కంటి ఆలయానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో దిగిపోయిన భక్తులు.. ఆ తర్వాత డ్రోన్ ఎగరవేశారు. అయితే, శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. ఆలయ పరిసరాలకు విద్యుత్ దీపాలతో అలంకరించారు.. ఇక, వీటిన్నింటినీ చిత్రీకరించాలని ఆ యువకులు భావించినట్టుగా తెలుస్తుండగా.. తాము దిగిన గెస్ట్‌హౌస్ పైనుంచి డ్రోన్ కెమెరాతో అర్ధరాత్రి సమయంలో.. ప్రధాన ఆలయంపైకి డ్రోన్ ఎగరవేశారు.. అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు.. ఆ తర్వాత డ్రోన్‌ను వెంబడించి యువకులను పట్టుకున్నారు. కాగా, ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో డ్రోన్ కెమెరాల వినియోగంపై ఆంక్షలు ఉన్నా.. పలు సార్లు డ్రోన్‌లు ఎగరవేస్తూ పోలీసులకు చిక్కిన సందర్భాలు లేకపోలేదు.. కొన్నిసార్లు సెక్యూరిటీ వైఫల్యంపై కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరిలో ఇంటిపోరు..! మంత్రి రోజా వ్యతిరేకవర్గానికి సెల్వమణి కౌంటర్..
మంత్రి ఆర్కే రోజా ప్రతినిథ్యం వహిస్తోన్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గపోరు పలు సందర్భాల్లో బహిర్గతం అయ్యింది.. దీనిపై మంత్రి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అయితే, మంత్రి రోజా వ్యతిరేక వర్గానికి ఆమె ఆర్కే సెల్వమణి కౌంటర్ ఇచ్చారు.. నమ్మిన వారికి ఏ రోజు మేం ద్రోహం చేయలేదన్న ఆయన.. నిండ్ర చక్రపాణి రెడ్డికి శ్రీశైలం బోర్డు చైర్మన్ ఇవ్వాలని రోజా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కోరారు.. మావల్లే ఆయనకు పదవి వచ్చిందన్నారు. ఇక, జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డికి స్థానికులు వద్దు అని చెప్పినా పదవి ఇచ్చామని గుర్తుచేసుకున్నారు.. కేజీ కూమార్ కుటుంబానికి ఎంతో సహాయం చేశామన్నారు. అయితే, ఇప్పుడు వారు మామీదే తప్పుగా మాట్లాడుతూన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సెల్వమణి.. అది అతని తప్పు కాదు.. అతని వెనకాల ఉన్నవారు అలా మాట్లాడిస్తున్నారని దుయ్యబట్టారు. మనల్ని విమర్శించారని వారిని మనం విమర్శించాల్సిన అవసరం లేదు.. దేవుడనే వాడు ఒకడు ఉంటాడు.. ప్రతి ఒక్కటి చూస్తుంటాడని పేర్కొన్నారు. రోజా.. ఎమ్మెల్యేగా గెలవదు అన్నారు, మంత్రి పదవి రాదన్నారు.. కానీ, అవి జరిగాయన్నారు.. అంతేకాదు.. ఈ సారి 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.. అందులో ఫస్ట్ గెలుచేది నగరి నియోజకవర్గమేనని స్పష్టం చేశారు.. గెలిచిన తర్వాత మమ్మల్ని వ్యతిరేకించేవారితో మాట్లాడుతాం అంటున్న ఆర్కే సెల్వమణి..
రాత్రివేళ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మంత్రి సీతక్క.. విద్యార్థులతో ముచ్చట్లు!
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివారం రాత్రి ఆశ్రమ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అంతేకాదు ప్రతి గదికి వెళ్లి అక్కడి సదుపాయాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి.. అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ, తదితరులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థులు గొప్ప లక్ష్యాలను పెట్టుకొని ఆ దిశగా ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. ఈ పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు సైతం అన్ని రంగాలు రాణించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా.. చదువును మధ్యలో ఆపేయకుండా అన్ని అవరోధాలను దాటుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.
నేడు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి పనుల ప్రారంభం!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో ఎక్కువగా విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పర్యటన సందర్భంగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. తెలంగాణని 17 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సభలు ఆ పార్టీ అభ్యర్థులకు ఉపయోగపడనుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారు. రోడ్డు మార్గంలో ప్రధాని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకి చేరుకుంటారు. అక్కడ మొదటి వేదిక నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేస్తారు. ఇందులో రామగుండం నేషల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు, హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకూ రూ.2,136 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే 163ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పాల్గొంటారు.
బీఏపీఎస్ ఆలయంలో భక్త జనసందోహం.. 65 వేల మందికి పైగా దర్శనం
అబుదాబిలోని BAPS హిందూ దేవాలయాన్ని 65,000 మందికి పైగా యాత్రికులు సందర్శించారు. ఎందుకంటే ఇది తెరచిన తర్వాత మొదటి ఆదివారం కావడంతో భక్తులు పెద్దమొత్తంలో తరలి వచ్చారు. ఆలయం తెరిచిన వెంటనే.. దాదాపు 40 వేల మందికి పైగా పర్యాటకులు బస్సులు, వాహనాల్లో ఉదయాన్నే వచ్చి ప్రార్థనలు చేశారు. సాయంత్రం 25 వేల మందికి పైగా ఇక్కడ పూజలు చేశారు. వాస్తవానికి మొదటి రోజు ప్రార్థనలు చేసేందుకు ఉదయం 40 వేల మందికి పైగా, సాయంత్రం 25 వేల మందికి పైగా బస్సులు, వాహనాల్లో వచ్చినట్లు సమాచారం. భారీ రద్దీ ఉన్నప్పటికీ ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓపికగా క్యూలో నిలబడ్డారు. రోజు చివరిలో 65,000 మందికి పైగా ప్రజలు ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. దీంతో ఆలయాన్ని సందర్శించిన భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ బాప్స్ వాలంటీర్లను, ఆలయ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా అబుదాబికి చెందిన సుమంత్‌రాయ్ మాట్లాడుతూ.. వేలాది మంది ప్రజల మధ్య ఇంతటి అద్భుతమైన ఆర్డర్‌ను ఎప్పుడూ చూడలేదు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని, ప్రశాంతంగా దర్శనం చేసుకోలేక పోతున్నామని ఆందోళన చెందాను, కానీ అద్భుతమైన దర్శనం చేసుకుని పరమ సంతృప్తి చెందాం. BAPS వాలంటీర్లు, ఆలయ సిబ్బంది అందరికీ వందనాలు.
కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా యూపీఐ చెల్లింపులు..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. ప్రతి పండుగకు కస్టమర్స్ కు అదిరిపోయే ఆఫర్స్ ను ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు మరో కొత్త సర్వీసును అందించబోతుంది.. తాజాగా ఫ్లిప్‌కార్ట్ యుపీఐ సర్వీసుని ప్రారంభించింది. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో ఈ-కామర్స్ సంస్థ ఈ సేవను ప్రారంభించింది.. అయితే ఈ సేవలు ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.. సూపర్ కాయిన్స్ , క్యాష్ బ్యాక్ , మిలిస్టోన్ బెనిఫిట్స్ , బ్రాండ్ వోచర్‌లు వంటి ప్రయోజనాలు ఫ్లిప్కార్ట్ యూపీఐ లో అందుబాటులో ఉంటాయి. కంపెనీ గత సంవత్సరం నుండి తన యూపీఐ సర్వీసును పరీక్షిస్తోంది. ఇప్పుడు సామాన్యుల కోసం దీన్ని ప్రారంభించింది.. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తుంది.. ఈ ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు వారు చెల్లింపు చేయడానికి ఇతర అప్లికేషన్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ కంపెనీ తన వినియోగదారులకు దాని స్వంత యూపీఐ సేవను అందించడానికి సులువుగా ఉంటుంది.. ఈ కొత్త సేవల వల్ల మిగిలిన యాప్ లకు పెద్ద సమస్యలు రావచ్చునని తెలుస్తుంది.. కాగా,యూపీఐ సేవలను అభివృద్ధి చేసేందుకే NPCI కొన్ని కంపెనీల పై యూపీఐ ఆధారపడటాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తోంది. యూపీఐ చెల్లింపు ద్వారా వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారి లావాదేవీల ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులు మాత్రమే ఫ్లిప్‌కార్ట్ యూపీఐని ఉపయోగించవచ్చు.. అయితే ఐఫోన్ వినియోగదారులకు ఈ సర్వీసు అందుబాటులో లేదని తెలుస్తుంది..
గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
మార్కెట్ లో పసిడి ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి.. సోమవారం ధరలు 10 గ్రాముల ధరపై 10 రూపాయలు, కిలో వెండిపై రూ.100 మేర ధర తగ్గింది. మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,740 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,080 గా ఉంది. వెండి కిలో రూ.73,500 లుగా ఉంది.. దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.58,740, 24 క్యారెట్ల ధర రూ.64,080, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.59,390, 24 క్యారెట్ల ధర రూ.64,790, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.58,740, 24 క్యారెట్ల ధర రూ.64,080 గా ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,890 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.64,230 గా ఉంది.. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.58,740, 24 క్యారెట్ల ధర రూ.64,080 ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,740 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.64,080 గా ఉంది..
భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఇలియానా?
గోవా బ్యూటీ ఇలియానా పేరుకు పరిచయం అక్కర్లేదు.. వరుస సినిమాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.. స్టార్ హీరోల తో జత కట్టింది.. ఈ మధ్య కాలంలో తాను ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది…పెళ్లి కాకుండానే తల్లవడంతో చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోయారు.అంతేకాదు కొడుకు పుట్టే వరకు కూడా తన భర్త ఎవరూ అనే విషయాన్నీ ఇలియానా బయట పెట్టలేదు. ఇక ఇలియానా భర్త విషయంలో ఎన్నో ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ అందులో ఏది నిజం కాలేదు. చివరికి ఇలియానానే తన భర్త గురించి చెప్పింది.. ఇక ఇలియానా కూడా ఒక అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.కొడుకు పుట్టాకే తనకి ఇలాంటి వ్యాధి వచ్చింది అని చెప్పింది.మరి ఇంతకీ ఇలియానా ఏ వ్యాధితో బాధ పడుతుందో చూద్దాం.. ఈ మధ్య సెలెబ్రేటీలు ఒక్కొక్కరు వారికున్న వ్యాధుల గురించి బయట పెడుతున్నారు.. ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ తమ వ్యాధుల గురించి బయట పెడుతున్నారు.. సమంతతో పాటు కల్పికా గణేష్, దగ్గుబాటి రానా, పూనమ్ కౌర్ వంటి కొంతమంది నటినటులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఇలియానా కూడా తన కొడుకు పుట్టాక ఆ సమస్యతో బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చింది..