ఎన్నికల కోడ్.. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా..
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.. ఇక, ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్నాయి.. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్.. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందన్న ఆయన.. ఈ నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.. ట్రోలింగ్, ఆన్‌లైన్ వేధింపులు, తప్పుడు వార్తల ప్రచారాలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే ఆయా వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూప్స్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్. మరోవైపు.. ప్రతీ ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. మాధవీలత.. అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఆ పరిధిలోనే ఉంటారని తెలిపారు.. ఎవరైనా సరే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి, ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. మాధవీలత.
విశాఖ ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ కేసు.. దూకుడు పెంచిన సీబీఐ
విశాఖ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్ కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. విశాఖ పోర్టులో పట్టుబడ్డ 25 వేల కేజీల కొకైన్, మాదకద్రవ్యాలపై ఆరా తీయనున్నారు. వేల కోట్ల రూపాయల డ్రగ్ రాకెట్ ను ఇంటర్‌పోల్ గుర్తించడంతో.. ఆపరేషన్ ‘గరుడ’లో భాగంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దాంతో సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే దేశంలోని వివిధ పోర్టులకు డ్రై ఈస్ట్ దిగుమతి అవుతోంది. విశాఖకు పెద్ద ఎత్తున యురోపియన్ దేశాల నుంచి ప్రతీ నెలా ఐదారు కంటైనర్లలో డ్రై ఈస్ట్ దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ వివరణ ఇచ్చింది. ఎగ్జిక్యూటవ్ డైరెక్టర్ హరి పేరుతో ఆర్డర్లు పెట్టినట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్‌లో ఐసీసీబీ అనే కంపెనీ నుంచి రొయ్యల మేతలో వినియోగించే ఈస్ట్ కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఓషన్ నెట్వర్స్ ఎక్స్‌ప్రెక్స్ ఎల్‌బీ 224348 సీల్‌లో ఉన్న కంటెయినర్ జర్మనీ మీదుగా మార్చ్ 16న విశాఖ పోర్టుకు వచ్చింది. మార్చి 19న సంధ్యా ఆక్వా ప్రతినిధుల సమక్షంలో సీబీఐ బృందం కంటైనర్‌ను పరిశీలించింది. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. కానీ అవి డ్రగ్స్ కాదని బ్రెజిల్ కంపెనీ నిర్ధారిస్తామంటుందని సంధ్యా ఆక్వా యాజమాన్యం చెబుతోంది. అదే సమయంలో సీబీఐ విచారణకు సహకరిస్తామంటుంది.
చుక్కేసి.. ముక్కకోసం గొడవ.. పెళ్లిలో ఇరువర్గాలు ఘర్షణ..!
వివాహ వేడుకలో వింత ఘటన చోటుచేసుకుంది. ముక్క కోసం ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఈవార్త చేరడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేశారు. పెళ్లి విందు వివాదాస్పదంగా మారిన ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరులో చోటుచేసుకుంది. వేములవాడకు చెందిన అబ్బాయితో ఆత్మకూరుకు చెందిన ఓ యువతికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లికూతురు ఇంట్లోనే అంగరంగ వైభవంగా వివాహం కూడా జరిగింది. పెళ్లికి హాజరైన వధువు బంధువులు, స్నేహితులందరికీ వధువు కుటుంబ సభ్యులు విందు ఏర్పాటు చేశారు. మటన్ కర్రీ, బగరా రైస్ అతిథులకు వడ్డించడం వల్ల మర్యాదకు లోటు రాకుండా చేశారు. అయితే మద్యం మత్తులో కొందరు చేసిన గొడవ ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో భోజనానికి వచ్చిన పెళ్లికొడుకు బంధువులకు భోజనానికి సరిపడా మటన్ కూర అయిపోయిందని వధువు బంధువులు చెప్పడంతో మద్యం మత్తులో వరుడి బంధువులు గొడవకు దిగారు. వంట సామాగ్రి, టేబుళ్లను ఎత్తుకెళ్లి వడ్డిస్తున్న వారిపై దాడి చేశారు.
లాకప్ లో ఉన్న కేజ్రీవాల్ ఏమి తిన్నారో తెలుసా ?
మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం గురువారం సాయంత్రం ఆయన అధికారిక నివాసంలో విచారించి, సోదాలు చేసి, ఏపీజేలోని అబ్దుల్ కలాం రోడ్డులోని తమ కార్యాలయానికి తీసుకువచ్చింది. రాత్రి 11 గంటలకు సీఎంను ఆయన నివాసం నుంచి ఆర్థిక దర్యాప్తు సంస్థ కార్యాలయానికి తీసుకొచ్చిన ఈడీ బృందం.. ఏజెన్సీ కార్యాలయం చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతమంతా నిషేధాజ్ఞలు కూడా విధించారు. కేజ్రీవాల్ గురువారం రాత్రి ఈడీ లాకప్‌లోనే ఉంటారని ఈడీ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు అధికారులు అతనిని (కేజ్రీవాల్) మరింతగా విచారించవచ్చు. వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్‌ను ఏదైనా తినాలనుకుంటున్నారా లేదా వేడినీరు తీసుకోవాలనుకుంటున్నారా అని అడిగారు. అయితే అతను ఏమీ తీసుకోవడానికి నిరాకరించాడు. వైద్య బృందం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా మీరు ఏదైనా తినాలనుకుంటున్నారా అని అడిగారని, అయితే ఆ సమయంలో కూడా అతను ఏమీ తీసుకోవడానికి నిరాకరించాడట. అయితే అరవింద్ కేజ్రీవాల్ మెడికల్ రిపోర్ట్ నార్మల్‌గా వచ్చిందని చెబుతున్నారు.
భూటాన్ పర్యటనకు ప్రధాని మోడీ.. ఆ అంశాలపై కీలక చర్చ..
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్‌కు వెళ్లారు. ఇవాళ (శుక్రవారం) ఉదయాన్నే ప్రధాని మోడీ భూటాన్ పర్యటన కోసం ప్రత్యేక విమానంలో బయలు దేరారు. వాస్తవానికి మోదీ భూటాన్ లో నిన్ననే వెళ్లాల్సి ఉండగా.. అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది. ఈ క్రమంలోనే నేడు వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో భూటాన్ కు మోడీ బయలుదేరి వెళ్లారు. కాగా.. ప్రధాని ఇవాళ, రేపు భూటాన్ లో పర్యటించి.. ద్వైపాక్షిక అంశాలు, ఇరు దేశాల పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక, భారతదేశం – భూటాన్‌ల మధ్య సాధారణ ఉన్నత స్థాయి సంబంధాలు మెరుగుపర్చేందుకు, ‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ’ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై భూటాన్ రాజుతో చర్చించనున్నారు. తన పర్యటన సందర్భంగా భూటాన్ రాజు హిస్ మెజెస్టి జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, భూటాన్ నాల్గవ రాజు హిస్ మెజెస్టి జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌లతో నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. అంతేకాకుండా.. భూటాన్ కౌంటర్ షెరింగ్ టోబ్‌గేతో కూడా ఆయన చర్చలు జరపనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇక, భూటాన్‌లో పర్యటన సందర్భంగా గ్యాల్ట్‌సున్ జెట్సన్ పెమా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను కూడా మోడీ ప్రారంభించనున్నారు.
వాటే క్రియేటివిటీ.. పానీ పూరిపై ఆర్టిస్ట్ కళాకృతి సూపర్..!
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోస్ ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆలోచించేలా ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో కొందరు ఫుడ్ వ్లోగ్స్ అంటూ రెస్టారెంట్స్, హోటల్స్, రోడ్లపై దొరికే వాటిని ఎప్పటికప్పుడు కొత్త రుచులను చూపించడం ఈమధ్య పరిపాటిగా మారింది. అయితే ఇలా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఇలాంటివి కూడా తింటారా అని కూడా ఒక్కోసారి ఆలోచన కూడా వస్తుంది. ఇక తాజాగా ఓ పానీపూరి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఆర్టిస్ట్ తన కళాకృతిని ప్రదర్శించడం గమనించవచ్చు. ఇకపోతే లాట్ ఆర్ట్ అంటే ఎంతో నేర్పు, సృజనాత్మకత, సహనం లాంటివి చాలా అవసరం. ఇక ఈ ఆర్ట్ సంబంధించి ఎప్పటికప్పుడు అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనిస్తూనే ఉంటాం. ఈ తరహాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో ఓ యూనిక్ లాట్ ఆర్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. మామూలుగా ఈ ఆర్ట్ కేవలం కప్పు లేదా మాత్రమే చేయడానికి ఇష్టపడతారు.
నేటి నుంచి ధనాధన్ ఐపీఎల్ స్టార్ట్..
ఐపీఎల్–2024కు రంగం సిద్ధమైంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతుంది. గత రెండు సీజన్ల తరహాలోనే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడనుంది. ఇక, లీగ్ దశలో 70 మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఉంటాయి. అయితే, తుది షెడ్యూల్ ప్రకటించకపోయినా.. మే 26వ తేదీన ఫైనల్ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై ఐదేసిసార్లు కప్ గెలవగా కోల్‌కతా 2 సార్లు టైటిల్ సాధించగా.. దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల తలో ఒక్కసారి ట్రోఫీ దక్కించుకున్నాయి. కాగా, చెపాక్ స్టేడియంలో మొదటి మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు ఎఆర్ రెహమాన్, సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు పాల్గొంటారు. ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీకి సంబంధించిన విశేషాలు చూసేద్దాం.. తాజా సీజన్‌లో పలు టీమ్స్ కు కొత్త కెప్టెన్లు రాగా.. ముంబైకి హర్థిక్ పాండ్యా, హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్, చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్‌కు శుబ్‌మన్ గిల్ బాధ్యతలు తీసుకున్నారు. గాయం నుంచి కోలుకొని వచ్చిన రిషభ్ పంత్ ఢిల్లీ, శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా జట్ల పగ్గాలను మళ్లీ చేపట్టారు. కాగా, మిగతా నలుగురు కేఎల్ రాహుల్ (లక్నో), సంజు శాంసన్ (రాజస్తాన్), పాఫ్ డుప్లెసిస్ (బెంగళూరు), శిఖర్ ధావన్ (పంజాబ్)లు గత సీజన్‌లాగే ఈసారి కెప్టెన్లుగా కొనసాగుతున్నారు.
దేవర నుంచి వీడియో లీక్.. మాస్ లుక్ లో ఎన్టీఆర్ మామూలుగలేడు..
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నా సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమా పై హైఫ్ ను పెంచేశాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. సినిమాను అక్టోబర్ లో విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నారు..ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ వీడియో లీక్ అయ్యింది.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల సెట్స్ నుంచి పోస్టర్ లేదా వీడియోలు లీక్ అవ్వడం కామన్ అయిపొయింది.. సినిమా మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదొకటి లీక్ అవుతుంది.. మొన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా నుంచి లీక్ అవ్వగా.. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సెట్స్ నుంచి కూడా ఓ వీడియో లీక్ అయ్యింది.. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతుంది. ఈ షూట్ లో జాన్వీతో ఓ సాంగ్, కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కినుంచనున్నారు.. గోవా సముద్రం దగ్గర షూటింగ్ జరుగుతుంటే ఎవరో దూరంగా ఉండి, వీడియో తీశారు.. ఆ వీడియోలో ఎన్టీఆర్ మాస్ లుక్ లో నల్ల పంచె, చొక్కా, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు.. సముద్రం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తుంది.. ఈ వీడియో పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.. దేవర టీమ్ కు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.. టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. ఇక ఈ సినిమా రెండు పార్టులు రాబోతుంది.. మొదటి పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సర్ ప్రైజ్ గా సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం..
ఓం బీమ్ బుష్ – 2 కూడా రాబోతోందా..?
పూర్తి కామిడి ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఓం బీమ్ బుష్ రివ్యూ అన్ని వైపులా ఫుల్ పాజిటివ్ టాక్ వినపడుతోంది. ఫన్నీ ఎలిమెంట్స్ తో పట్టాలెక్కికిన ఈ సినిమా కామెడీ ట్రాక్ తో పరుగులు పెట్టింది. సినిమా దర్శకుడు హర్ష రాసుకొన్న సన్నివేశాలు వేటికి అవే బ్రహ్మండంగా వర్కవుట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు. కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకులను సీట్లపై లేచి నవ్వేలా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హీరోలు విష్ణు, రాహుల్, ప్రియదర్శి కలిసి పండించిన వినోదం ఓ లెవెల్ లో ఉంది. అర్ధం పర్థం లేని డైలాగ్స్, లాజిక్ లేని డైలాగ్స్ కడుపుబ్బ మనల్ని నవ్విస్తాయి. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా.. ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని, ఆయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటించగా శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం, వీ సెల్యులాయిడ్ బ్యానర్ పై, యువి క్రియేషన్స్ సమర్పణలో సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ డీవోపీ మ్యూజిక్ ను చేపట్టగా.. రాజ్ తోట సినిమాటోగ్రఫి బాధ్యతలు చూసుకున్నారు. దింతో సినిమాకి ప్రీమియర్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా ఎండింగ్ లో సెకండ్ పార్ట్ కి సంబంధించిన లీడ్ వదిలారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు ఇలా సెకండ్ పార్ట్ కి లీడ్ వదులుతున్నారు. కానీ., ఈ సినిమాకి లీడ్ వదలడం కాస్త లాజికల్ గా ఓకే అనిపిస్తుంది. దీన్నిబట్టి ఓం బీమ్ బుష్ 2 త్వరలోనే అన్నట్టుగా లాస్ట్ లో లీడ్ వదిలారు.
‘ఓం భీం బుష్’ కామెడీ అదిరిపోయిందిగా.. సినిమా ఎలా ఉందంటే?
ఈరోజుల్లో జనాలు కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు.. చూసిన కథలను కాకుండా కొత్తగా వచ్చే కథలకు బ్రహ్మరథం పడుతున్నారు… అలాంటి సినిమాలే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.. తాజాగా శ్రీవిష్ణు నటించిన ‘ఓం భీం బుష్ ‘ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది.. మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోతుంది.. విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్, టీజర్స్ కామెడీతో కడుపుబ్బా నవ్వించ్చాయి.. భైరవపురంలోకి బ్యాంగ్ బ్రోస్ ఎంట్రీ ఇచ్చాక ఏం జరిగింది? ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అక్కడ పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? ఆ గ్రామంలో ఉన్న సంపంగి దెయ్యం ఎవరు? ఇక ఆ దెయ్యంను తరిమెందుకు ఈ ముగ్గురు ఏం చేశారు అనేది సినిమా కథ.. ఇక సినిమా ఎలా ఉంటుందో.. జనాల స్పందన ఏంటో ట్విట్టర్ రివ్యూ లను ఒక్కసారి చూసేద్దాం..శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ అదిరిపోయింది.. గతంలో వచ్చిన సామజవరగమన సినిమాను మించి ఉంది.. సినిమా సూపర్ హిట్.. కామెడీతో కడుపుబ్బా నవ్వించాడని ఓ యూజర్ రాసుకొచ్చాడు.. లాజిక్‌లు లేని క్రేజీ & హానిచేయని ఎంటర్‌టైనర్. కథ, స్క్రీన్‌ప్లే, క్యారెక్టర్ ఆర్క్‌లు లేవు – ఇది కేవలం పంచ్‌లు, నాన్‌స్టాప్ కామెడీ.. ఇది కొందరిని ఆకట్టుకోవచ్చు మరియు ఇతరులను నిరాశపరచవచ్చు కానీ పెద్ద స్క్రీన్‌లలో చూడటం వలన నష్టమేమీ లేదు! సినిమా సూచనలు, ఆసక్తికరమైన కొత్త కాన్సెప్ట్.. సినిమా మొత్తం నవ్విస్తుంది.. ఈ సినిమా ఫుల్ కామెడీ మూవీ.. ఫ్రెండ్స్ తో సినిమాకు వెళ్తే ఇక నవ్వులే నవ్వులు.. కడుపు చెక్కలవుతుంది.. సమ్మర్ బ్లాక్ బాస్టర్ సినిమా.. తప్పకుండ చూడాల్సిన సినిమా అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు…