ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోన్న పవన్ కల్యాణ్.. రోడ్డెక్కనున్న వారాహి..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల కావడంతో.. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెడుతున్నాయి.. అధికార, ప్రతిపక్షాలు.. ఎన్నికల ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.. ఇక, టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో కీలక భూమిక పోషించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి జనసేనాని శ్రీకారం చుడతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. అంటే గతంలో వారాహి ఎక్కి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన పవన్.. ప్రభుత్వ విధనాలు, వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. ఎన్నికల తరుణంలో ఇప్పుడు మరోసారి ఆంద్రప్రదేశ్‌లో వారాహి రోడ్డెక్కనుంది.. ఈ నెల 27 నుంచి వారాహిపై ఉత్తరాంధ్ర నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారట.. తొలి విడతలో పది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా పవన్ కల్యాణ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఓవైపు.. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి సభలు, సమావేశాల్లో పాల్గొంటూనే.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారట.. ముఖ్యంగా జనసేన పోటీ చేసే స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తారని చెబుతున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ బరిలోకి దిగనున్న విషయం విదితమే.
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ టీచర్ల నియమకంపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు..
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ టీచర్ల నియామకాల్లో ప్రామాణికాలు పాటించటం లేదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పే స్కూల్స్ లో విద్య చెప్పే టీచర్లకు ఇంగ్లీష్ వచ్చో రాదో చూడటం లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. ఇంగ్లీష్ రాని వారితో బోధిస్తే విద్యా ప్రమాణాలు తగ్గుతాయని వాదనలు వినిపించారు.. అయితే ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. గురుకులాల్లో ఇంగ్లీష్ ప్రోఫిషియెన్ టెస్ట్ చేసిన తర్వాత నియామకాలు చేస్తారని కోర్టుకు తెలిపిన పిటిషనర్.. కానీ, ఇక్కడ అలాంటిది లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అంతేకాదు.. డీఎస్సీ నియామకాలను ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.. అయితే, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని అభిప్రాయపడిన హైకోర్టు.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. నేడు మూడు జిల్లాల ఎస్పీల వివరణ..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది.. తమ ముందు హాజరై ఆ హింసాత్మక ఘటనలకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు.. దీంతో.. ఇవాళ ఎన్నికల సంఘం ముందు హాజరుకానున్నారు మూడు జిల్లాల ఎస్పీలు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు చెందిన ఎస్పీలను తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా సీఈవో ఎంకే మీనా ఆదేశించారు.. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఎదుట హాజరుకానున్నారు ఆ మూడు జిల్లాల ఎస్పీలు రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి. చాగలమర్రి, గిద్దలూరుల్లోని హత్యలు, మాచర్లలో టీడీపీ నేత కారు తగలబెట్టిన ఘటనలపై వివరణతో కోరింది ఎన్నికల కమిషన్.. ఆయా ఘటనకు గల కారణాలు, హింసాకాండకు గల వ్యక్తులకు సంబంధించి పూర్తి వివరాలతో రావాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు.. హింసని నివారించేందుకు ఎలాంటి చర్టలు తీసుకున్నారోననే అంశాన్ని కూడా వివరించాలని పేర్కొంది ఎన్నికల కమిషన్.. ఇక, ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు చెందిన ఎస్పీలు ఇచ్చే వివరణను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు సీఈవో ఎంకే మీనా..
ప్రతి రైతుకు రూ. 10, 000 ఇస్తాం..
బీఆర్ఎస్ నాయకులు మాటలు నేతీ బీరకాయలో నేతీ చెందంలాగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత పది సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన అనేక సందర్భాలలో కేవలం ఎన్నికల సంవత్సరంలో ఎకరానికి 10 వేల పరిహారం ప్రకటించి హడావిడి చేసి కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసారు అని విమర్శించారు. ఆ తర్వాత 350 కోట్లకి ఉతర్వూలు జారీ చేసి పరిహారం అందించిన పాపాన పోలేదన్నారు. అదే విధంగా అదే నెలలో మరోసారి1,25,000 ఎకరాల పంట నష్టం సంబవించిన పట్టించుకున్న దాఖలాలు లేవు అని ఆయన ఆరోపించారు. గోదావరి వరదలు వచ్చిన సందర్భంగా 100కు 100 శాతం పంటలు నష్టపోయి ఇసుక మేటలు వేసిన సందర్భంలో అప్పటి ప్రభుత్వంలోని నాయకులు ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.. రుణమాఫీ అమలు చేస్తామని గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్ నాయకులు మొదటి విడత మాఫీని నాలుగు విడతలుగా ఇవ్వడంతో ఆ మొత్తం అసలుకు బదులు వడ్డీ జమైన సందర్భం ప్రతి ఒక్క రైతుకి అనుభవమే అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
ఢిల్లీలో దారుణం.. కుప్పకూలిన రెండంతస్తుల బిల్డింగ్
ఢిల్లీలోని కబీర్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలోని ఒక భాగం ఇవాళ (గురువారం) తెల్లవారు జామున 2. 30 గంటల సమయంలో కుప్పకూలి పోయింది. భవనం కూలిన టైంలో అందులో కార్మికులు పనులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహాయంతో సహాయక చర్యలు కొనసాగించారు. గాయపడిన వారిని స్థానిక జీటీబీ ఆస్పత్రికి తరలించగా.. అయితే, అర్షద్, తౌహీద్ లు చికిత్స పొందుతూ మరణించారు. రెహాన్, అరుణ్, నిర్మల్, జలధర్ లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇక, భవనం కూలిన టైంలో అందులో 13 మంది కార్మికులు పని చేస్తున్నారని డీసీపీ రాజేష్ డియో చెప్పారు. భవన నిర్మాణంకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, భవనం కూలిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి అనుప్ మాట్లాడుతూ.. సమాచారం వచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వచ్చినట్లు పేర్కొన్నారు. వారు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.. భవనం శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను బయటకు తీసినట్లు పేర్కొన్నారు. గాయపడిన వారికి చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించామన్నారు.
ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్..
లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తర ప్రదేశ్‌లోని ఆరు స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. సంభాల్ నుంచి జియావుర్ రెహమాన్ బుర్క్, బాగ్‌పత్ నుంచి మనోజ్ చౌదరి, గౌతమ్ బుద్ధ నగర్ నుంచి రాహుల్ అవానా, పిలిభిత్ నుంచి భగవత్ సరణ్ గంగ్వార్, ఘోసీ నుంచి రాజీవ్ రాయ్ పోటీ చేయనున్నారు. ఇక, అలాగే, మీర్జాపూర్ నుంచి రాజేంద్ర ఎస్ బింద్ ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తారని అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. అయితే, మొత్తం ఏడు దశలలో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా 80 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో అన్ని దశల్లోనూ పోలింగ్ జరగబోతుంది. దీంతో అభ్యర్థులకు సంబంధించి సమాజ్ వాదీ పార్టీ ఇప్పటి వరకూ ఐదు జాబితాలను ప్రకటించగా ఇది ఆరో జాబితా అన్నమాట. దీంతో ఎస్పీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య ఇప్పటి వరకు 47కు చేరుకుంది. భాదోహి సీటును తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి సమాజ్ వాదీ పార్టీ ఇచ్చింది. ఇక, ‘ఇండియా’ కూటమి మిత్ర పక్షమైన సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్‌కు ఇచ్చింది. అలాగే, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనున్న ఈ 17 స్థానాల్లో ఒకప్పుడు ఆ పార్టీ కంచు కోటలుగా భావించే రాయ్‌బరేలీ, అమేథీతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసి కూడా ఉన్నాయి.
ఐపీఎల్ 2024కు మహ్మద్ షమీ దూరం.. గుజరాత్ జట్టులోకి కేరళ స్పీడ్‌స్టర్!
ఐపీఎల్ 2024కు టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ దూరమయ్యాడు. ఇటీవలే కాలి మడమ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ.. ఐపీఎల్ 17వ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో గుజరాత్ టైటాన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వన్డే ప్రపంచకప్ 2023 సందర్భంగా గాయపడ్డ షమీ.. పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ఐపీఎల్ సమయంలో అతడు పునరావాసం పొందనున్నాడు. మహ్మద్ షమీ స్థానంలో కేరళ స్పీడ్‌స్టర్ సందీప్ వారియర్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తీసుకుంది. కనీస ధర రూ.50 లక్షలకు అతడిని గుజరాత్ తీసుకుంది. 32 ఏళ్ల వారియర్ 2019 నుంచి 5 ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 7.88 ఎకానమీ రేట్‌తో రెండు వికెట్లు పడగొట్టాడు. వారియర్ గతంలో కోల్‌కతా, బెంగళూరు, ముంబై జట్ల తరఫున ఆడాడు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. లక్నో స్టార్ పేసర్ డేవిడ్ విల్లే.. లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు భారత్‌కు రాకుండా ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. గత రెండు నెలలుగా ఇంటర్నేషనల్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉన్న విల్లే.. పీఎస్‌ఎల్ ఫైనల్ అనంతరం వ్యక్తిగత కారణాలను సాకుగా చూపుతూ స్వదేశానికి వెళ్లిపోయాడు.
ముంబై ఇండియన్స్ లోకి 17 ఏళ్ల యువ సంచలన పేసర్..!
రేపు మొదలు కానున్న ఐపీఎల్ 2024 సీజన్ తరుణంలో ముంబై ఇండియన్స్ జట్టులో ఓ పెను మార్పు చేసింది. 17ఏళ్ల పేసర్ క్వెనా మఫకాను ముంబై ఇండియన్స్ టీమ్‍లోకి తీసికుంది. అండర్ 19 ప్రపంచకప్ లో అద్భుతంగా బౌలింగ్ వేసిన ఈ 17 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ను ఎంపిక చేసుకుంది ముంబై. ఇకపోతే శ్రీలంక స్టార్ పేస్ బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఈ సీజన్ కు ముంబై ఇండియన్స్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడికి రిప్లేస్‍మెంట్ గా మఫకాను ముంబై తీసుకోనుంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ లో సౌత్ ఆఫ్రిక తరుపున క్వెనా మఫకా అద్భుతంగా బౌలింగ్ చేసి ఏకంగా 21 వికెట్లను పడగొట్టాడు. ఒక్క అండర్ 19 ప్రపంచకప్ ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ గా అతను రికార్డు సృష్టించాడు. ముఖ్యంగా ప్రపంచకప్ లో డెత్ ఓవర్లలో క్వెనా మఫకా బౌలింగ్ అదరగొట్టాడు. తన యార్కర్లతో ఎదుటి బ్యాటర్లని భయపెట్టాడు. దీంతో ఈ దక్షిణాఫ్రికా అన్‍క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ ను జట్టులోకి తీసుకోబోతుంది ముంబై ఫ్రాంచైజీ. ముంబై ఇండియన్స్ క్వెనా మఫకాను రూ.50లక్షల బేస్ ప్రైజ్‍తో తీసుకుంది. ఐపీఎల్ 17 వ సీజన్ మార్చి 22, 2024 టోర్నీ మొదలుకానుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ జట్టు మార్చి 23వ తేదీన గుజరాత్ టైటాన్స్ జట్టుతో ఆడనుంది. ఇక ఈ సీజన్ కోసం అనేక చర్చల తర్వాత రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించింది ముంబై ఫ్రాంచైజీ.
రామ్ పోతినేని న్యూ లుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అభిమానులను పోగెసుకున్నాడు.. మాస్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన రామ్ కు ఈ మధ్య హిట్ సినిమాలు పలకరించలేదు.. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు.. ప్రస్తుతం రామ్ ఇష్మార్ట్ 2 సినిమాలో చెయ్యనున్నాడు.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.. ఇక హీరోల న్యూ లుక్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. తాజాగా రామ్ న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో రామ్ స్మార్ట్ గా లవర్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు.. కాస్త స్లిమ్ గా చాక్లేట్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు.. ఆ లుక్ అందరిని తెగ ఆకట్టుకుంది… ప్రస్తుతం రామ్ కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా రామ్ పోతినేని బీహెచ్ఈఎల్ లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హాజరయ్యారు.. రామ్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. రామ్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు.. ఫుల్లీ లోడెడ్ గన్ లాగా రామ్ క్రేజీగా కనిపించాడు. ఫ్యాన్స్ అంతా డబుల్ ఇస్మార్ట్ అంటూ కేకలు పెట్టారు.. ప్రస్తుతం రామ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ సినిమా నుంచి అధికార ప్రకటన రాబోతుంది..
అయోధ్య రాముడిని దర్శించుకున్న గ్లోబల్ బ్యూటీ.. ఫోటోలు వైరల్..
బాలీవుడ్ క్వీన్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది..ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు.. హాలీవుడ్ పాప్ సింగర్ ‘నిక్ జోనాస్’ని పెళ్లి చేసుకొనే అక్కడే సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫిషనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది.. బాలీవుడ్ ప్రేక్షకులను సోషల్ మీడియాలో పలకరిస్తుంది.. తాజాగా ప్రియాంక చోప్రా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఫోటోలు ఒకటి సోషల్ లో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రియాంక చోప్రా తన ఫ్యామిలీతో కలిసి ఇండియాకు వచ్చారు. కొన్ని రోజుల క్రితమే వచ్చిన వాళ్లు పార్టీలకు, ఈవెంట్స్ కు హాజరువుతూ వస్తోంది.. ఇటీవల ముంబైలో ఓ ఈవెంట్ కు వెళ్లిన ప్రియాంక తన లుక్ తో అందరిని ఆకట్టుకోవడం మాత్రమే కాదు.. తన ఖరీదైన నగలతో అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇషా అంబానీ ఏర్పాటు చేసిన హోలీ పార్టీలో కూడా ప్రియాంక ఫ్యామిలీ సందడి చేసారు. తాజాగా ప్రియాంక ఫ్యామిలీ తో కలిసి అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తల్లి కాబోతున్న అమలా పాల్.. ‘టూ హ్యాపీ కిడ్స్’ అంటూ..!
‘ప్రేమ ఖైదీ’ సినిమాతో పరిచయం అయ్యి.. ఆతర్వాత లవ్ ఫెయిల్యూర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది అమలాపాల్. తెలుగు, తమిళ్ భాషల్లో పలు అగ్ర హీరోల సరసన నటించింది. ఈవిడ కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి సినీ విమర్శకులను సైతం మెప్పించింది. అంతేకాదు తను నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలో నగ్నంగా నటించి వార్తలలో నిలిచింది. ఈవిడ నిజ జీవితంలో కూడా జరిగిన కొన్ని సంఘటనల వల్ల వార్తలలో నిలిచింది. మొదటగా ఈవిడ తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వారిద్దరూ విడిపోయారు. ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారు అన్న విషయం ఎవరికీ తెలియదు. ఈ బ్రేకప్ తర్వాత అమలాపాల్ మళ్లీ పెళ్లి చేసుకుంది. జగత్ దేశాయ్ రెండో భర్తగా అంగీకరించింది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆవిడ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే తాజా ఈ అమ్మడు ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ఇందుకు సంబంధించి అమలాపాల్ సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్ట్ కూడా చేసింది. అదేంటంటే.. ఆవిడ త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. ఈ విషయం సంబంధించి ఒక చిన్న పాపని ఎత్తుకొని ‘ టూ హ్యాపీ కిడ్స్’ అంటూ క్యాప్షన్ పోస్ట్ చేసింది. దీంతో అమలాపాల్ అతి త్వరలో ట్విన్స్ కు జన్మ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది. ఇకపోతే ఈ విషయంపై నిజంగా కవలలు జన్మిస్తారా.. లేక మరి ఏమైనా అన్న విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది.
