NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

గే డేటింగ్ యాప్.. యువకుడి ప్రాణం తీసింది..
గే డేటింగ్‌ యాప్‌ ఓ యువకుడి ప్రాణం తీసింది.. బెజవాడకు చెందిన ప్రసాద్, అవనిగడ్డకు చెందిన సాయికి గ్రిండర్ యాప్ లో పరిచయం ఏర్పడింది.. ఇక గత నెల 18న విజయవాడలో సాయి, ప్రసాద్ కలుసుకున్నారు.. మద్యం తాగి కృష్ణా నదిలోకి ఏకాంతంగా గడపటానికి వెళ్లారు.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.. దీంతో.. ప్రసాద్ పై కర్రతో తీవ్రంగా దాడి చేశాడు సాయి.. కొద్దిసేపటి తర్వాత ఇంటికి ఆటోలో బయల్దేరి వెళ్లిన ప్రసాద్ మృతిచెందాడు.. అయితే, తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టు మార్టం రిపోర్టులో తీవ్రంగా కొట్టడం వల్ల ప్రసాద్ చనిపోయాడని గుర్తించారు.. విచారణలో గే యాప్, సాయి దాడి చేసి హత్య చేశాడని నిర్ధారణకు వచ్చారు.. సాయిని అదుపులోకి తీసుకుని.. మతదైన శైలిలో విచారణ జరపడంలో.. వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది.

నిన్న దీపిక.. నేడు లిఖిత.. బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి మృతి..
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని మృతి చెందిన ఘటన మరవకముందే మరో విద్యార్థిని లిఖిత మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. బూర లిఖిత ఆర్జీయూకేటీ బాసరలో పియుసి ప్రథమ సంవత్సరం చదువుకుంటుంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో లిఖిత వసతి గృహం 4 వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందికి జారి పడింది. దీంతో లిఖిత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే వున్న వారు కొందరు సంస్థ యాజమాన్యానికి తెలుపగా హుటా హుటిన వచ్చిన అధికారులు లిఖితను క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రధమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించగా.. అనంతరం అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతి చెందిన విద్యార్థిని స్వస్థలం సిద్ది పేట జిల్లా గజ్వెల్ గా తెలిపారు. అయితే లిఖిత ప్రమాదవశాత్తు జారి పడిందా? లేక ఆత్మహత్యా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లిఖిత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

తీరం దాటనున్న బిపర్ జోయ్ తుఫాన్.. ఐఎండి హెచ్చరికలు
బిపర్‌జోయ్‌ తుఫాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడనుంది. తీరం దాటక ముందే తుఫాన్ ధాటికి గుజరాత్‌ రాష్ట్రంలోని సౌరాష్ట్ర–కచ్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తీరప్రాంతలు, తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 74వేల మందికిపైగా స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కచ్, ద్వారక, జామ్‌నగర్‌లో కుంబవృష్టి వర్షం ఖాయమని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, పోరుబందర్, రాజ్‌కోట్‌ జిల్లాల్లో బుధవారం 50 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఒకటి రెండు చోట్ల ఏకంగా 121 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అరేబియా సముద్రంలో తుఫాన్ కేంద్రబిందువు కాస్తంత దిశ మార్చుకుని ఈశాన్యం వైపుగా కదులుతూ కచ్, సౌరాష్ట్రల మధ్య జఖౌ పోర్ట్‌ సమీపంలో ఇవాళ (గురువారం) సాయంత్రం తీరం దాటనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తీరం వెంట ఉన్న 8 రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది.

అమెరికా పర్యటనలో భారత్ కీలక ఒప్పందం..
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం సాయుధ డ్రోన్ల సరఫరా ఆఫర్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు డజను సాయుధ డ్రోన్లు విక్రయించేలా ఈ డీల్‌ ఉండనుందని వారు వెల్లడించారు. భారత్‌ కూడా చాలా కాలంగా అమెరికా నుంచి సాయుధ డ్రోన్లను కొనేందుకు ఆసక్తి చూపుతోంది. కానీ, బ్యూరోక్రటిక్‌ ఇబ్బందులతో ఈ డీల్‌ ముందుకు సాగడం లేదు.. జూన్‌ 22న మోడీ అమెరికా పర్యటనలో ఈ డీల్‌ను ఓ కొలిక్కి తెస్తుందని అంచనా. అమెరికాలో మోడీ పర్యటన ఖరారు కాగానే డ్రోన్‌ డీల్‌ విషయంలో పురోగతి చూపించాలని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌, పెంటగాన్‌ అధికారులు భారత్‌ను సంప్రదించారు. కోరారు. దాదాపు 30 ఎంక్యూ ఖబి సీ గార్డియన్‌ డ్రోన్లను అమ్మివేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మధ్య పలు ఆయుధాల తయారీ, నిర్వహణపై ప్రధానంగా చర్చలు జరుగనున్నాయి.

వీటిని రోజూ తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది..!
మనుషులు అందంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అంతేకాదు వేలకు వేలు ఖర్చు చేస్తారు.. కానీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశ పడతారు.. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విషయాలను పాటించడం వల్ల చర్మ సౌందర్యాన్ని చాలా సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. చర్మం అందంగా కాంతివంతంగా తయారవ్వాలంటే మనం రోజుకు 5 లీటర్ల నీటిని తాగాలి. కాలంతో సంబంధం లేకుండా రోజు తప్పకుండా నీటిని తాగాలి.. ఇలా నీళ్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. చర్మం పొడి భారకుండా ఉంటుంది.. ఇక చర్మ సౌందర్యం కోసం కొన్ని రకాల జ్యూస్ లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జ్యూస్ కు కావలసిన పదార్థాలు : 2 క్యారెట్స్ , 2 టమాటాలు, ఒక కీరదోస, బీట్ రూట్

‘ఆదిపురుష్’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. క్రేజ్ మాములుగా లేదుగా!
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్ హీరోయిన్‌ కృతీ సనన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని.. ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టి సిరీస్ బ్యాన‌ర్‌పై భూష‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్‌ రాఘవుడిగా, కృతీ సనన్‌ జానకిగా నటించగా.. సైఫ్‌ అలీ ఖాన్‌ లంకేశ్వరుడిగా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 16) రిలీజ్‌ (Adipurush Release Date) కానుంది. మరికొద్ది గంటల్లో ఆదిపురుష్‌ విడుదల కానున్న నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫాన్స్ నానా హంగామా చేస్తున్నారు. దాంతో సోషల్‌ మీడియాలో ఆదిపురుష్‌ హ్యాష్‌ ట్యాగ్‌ (#AdipurushBookings, #Prabhas𓃵, #AdipurushOnJune16) ట్రెండింగ్‌లో ఉంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో ఆదిపురుష్‌ సినిమా రిలీజ్ కానుంది. దాంతో సినీ ప్రేక్ష‌కులు, ట్రేడ్ వ‌ర్గాలు ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇప్పుడు బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. బాహుబ‌లి అనంతరం వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాల‌కు మొదటి రోజు కలెక్ష‌న్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు ఆదిపురుష్ అంతకు మించి రాబట్టేలా ఉంది. రామాయణం ఆధారంగా వస్తున్న సినిమా కావడంతో సినిమాకు అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. దీంతో మొదటి రోజు క‌లెక్ష‌న్స్ బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌నుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. విశ్లేష‌కుల అంచ‌నాల ప్రకారం… ఆదిపురుష్ సినిమా తొలి రోజున హిందీలో దాదాపు రూ. 30-32 కోట్ల మేర‌ క‌లెక్షన్స్‌ను రాబట్టే అవకాశం ఉంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో మొదటి రోజు రూ. 60 నుంచి 70 కోట్ల వ‌సూళ్లు అవుతాయని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమాకు రూ. 120-140 కోట్ల మేర‌కు నెట్ క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నాలు వేస్తున్నాయి. మొదటి షో పడ్డాక ఈ అంచనాలు నిజం అవుతాయో లేదో తెలియరానుంది. ఏదేమైనా ఆదిపురుష్ సినిమాపై క్రేజ్ మాములుగా లేదు.