NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

జనసేనలోకి ఆమంచి సోదరుడు.. నేడు పవన్‌ సమక్షంలో చేరిక
వారాహి యాత్రతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హీట్‌ పెంచారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. మరోవైపు.. వివిధ పార్టీలకు చెందిన నేతలు జనసేన గూటికి చేరుతున్నారు.. వారాహి 1, వారాహి 2 యాత్రల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పలువురు నేతలు.. జనసేన కండువా కప్పుకున్న సంగతి తెలిపిందే కాగా.. ఇప్పుడు జనసేనలో చేరేందుకు సిద్ధం అయ్యారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహషన్‌ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్‌ స్వాములు.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు ఆమంచి శ్రీనివాసరావు.. ఇక, ఆయనకు సంఘీభావంగా పలు నియోజకవర్గాలకు చెందిన కాపు సామాజిక వర్గ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ముగుస్తున్న టీటీడీ పాలక మండలి గడువు.. ఆ రెండు ఆప్షన్లపై ఉత్కంఠ..
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు పాలకమండలిని నియమిస్తుంది ప్రభుత్వం. గతంలో 18 మందితో కూడిన పాలకమండలి నియామకం జరగగా.. ప్రస్తుత పాలకమండలి సభ్యుల సంఖ్య 35కి చేరుకుంది. వీరికి తోడు పలు రాష్ర్టాలకు సంబంధించిన టీటీడీ లోకల్ బాడీ చైర్మన్లు కూడా పాలకమండలి సభ్యుల తరహాలో వ్యవహరిస్తున్నారు. మరోవైపు గతంలో తెలుగు రాష్ర్టాలతో పాటు తమిళనాడు, కర్నాటక నుంచి ఒక్కొక్కరికి పాలకమండలిలో చోటు దక్కుతుండగా.. ఇప్పుడు తెలుగు రాష్ర్టాల వారికంటే.. ఇతర రాష్ర్టాల సభ్యులే ఎక్కువగా వుంటున్నారు. ఇలా కాలక్రమేణా మారుతూ వస్తున్న ప్రస్తుత టీటీడీ పాలకమండలి గడువు ఆగస్టు 12తో ముగియనుంది. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి 2021 ఆగస్ట్ 12న నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యగా.. సభ్యులను సెప్టెంబర్‌ చివర్లో నియమించింది. అయినప్పటికీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే పాలకమండలి గడువు అమలులోకి వస్తుంది. అలా ప్రస్తుత పాలకమండలి గడువు ఆగస్టు 12వ తేదీతో ముగియనుండటం.. ఇప్పటికే రాజకీయంగా బిజీ షెడ్యూల్ తో వుంటున్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరోసారి కొనసాగనని స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్లు వున్నాయి. ఒకటి నూతనంగా పాలకమండలిని ఏర్పాటు చెయ్యడం.. లేదా ఎన్నికల సంవత్సరం కాబట్టి.. తాత్కాలికంగా స్పెసిఫైడ్ అథారిటీని నియమించడం.. ఈ రెండు ఆప్షన్లను పరిశీలిస్తోంది ప్రభుత్వం.

ఏపీలో ఓ రేంజ్‌లో వాలంటీర్‌ వార్.. ఇరకాటంలో టీడీపీ..?
వారాహి యాత్ర రెండో విడత ఆరంభం నుంచే.. వాలంటీర్లపై హాట్‌ కామెంట్స్‌తో ఏపీ రాజకీయాన్ని తనవైపునకు తిప్పుకోగలిగారు పవన్‌ కల్యాణ్‌.. దాని మీద చివరికి అధికార పార్టీనే రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సి వచ్చింది. అత్యంత సున్నితమైన అంశాన్ని టచ్ చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డేటా చోరీ అవుతోందనే అంశాన్ని చర్చకు పెట్టే ప్రయత్నం చేశారాయన. ఈ క్రమంలో గత నాలుగైదు రోజుల నుంచి ఏపీలో వాలంటీర్ల వార్ నడుస్తూనే ఉంది. దీనిపై మొదటి రోజు ఏం చేయాలో.. ఎలా స్పందించాలో తేల్చుకోలేక మౌనాన్ని ఆశ్రయించిందట టీడీపీ. అయితే.. ఆ తర్వాత టీడీపీ నేతలు కానీ.. చంద్రబాబు కానీ నెమ్మదిగా పవన్ బాటే పట్టారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు వాలంటీర్లే కారణమని నేరుగా పవన్ స్థాయిలో కామెంట్స్‌ చేయకున్నా.. దాదాపు అదే రేంజ్‌లో పార్టీ నుంచి రియాక్షన్‌ వస్తోంది. ప్రజల వ్యక్తిగత సమాచారంతో వాలంటీర్లకు ఏం అవసరమన్న యాంగిల్‌లో ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది తెలుగుదేశం. వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా తన రాజకీయాల కోసం వినియోగించుకుంటున్న మాట వాస్తవమే అయినా.. దాన్ని పవన్ టచ్ చేశారు కాబట్టి.. ఈ వార్‌లోకి వెళ్లకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తే చివరికి అది మనకు కలిసొచ్చే అంశమే కదా అంటున్నారట ఆ వర్గం టీడీపీ నేతలు.

సీఐ స్వర్ణలత విచారణలో ఆసక్తికర అంశాలు.. సినిమా స్టోరీలు చెబుతుందా..?
రూ.2 వేల నోట్ల కేసు విచారణలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత చెబుతున్న విషయాలను చూసి నోరు వెల్లబెడుతున్నారు అధికారులు.. సీఐ స్వర్ణలత విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు విచిత్రంగా ప్రవర్తించారు స్వర్ణలత.. మోసం చేయాలన్న కుట్రలో భాగంగానే కరెన్సీ ఎక్చేంజ్ డ్రామా ఆడగా.. స్వర్ణలత ముఠా ఆలోచనలు ముందే పసిగట్టిన రిటైర్డ్ నేవీ ఉద్యోగులు.. రూ.12 లక్షలు ఒక బ్యాగ్ లోను.. మిగిలిన నగదు డిక్కీలో స్టెఫీన్ టైర్ కింద ఉంచారని తేల్చారు.. అయితే, విచారణ సమయంలో సినిమా స్టోరీలు చెప్పి అధికారులను మభ్య పెట్టే ప్రయత్నం స్వర్ణలత చేస్తున్నారట.. కానీ, డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు కనుక మర్యాదగా అడుగుతున్నాం.. నిజాలు చెప్పండని సీనియర్ ఆఫీసర్ క్లాస్‌ తీసుకున్నాడట. అయితే, స్వర్ణలత అండ్ గ్యాంగ్ వెల్లడించిన సమాచారంతో షాక్ అయ్యారు విచారణ అధికారులు.. పెద్ద ఎత్తున నోట్లు మార్పిడికి సిద్ధంగా ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేసిన గ్యాంగ్.. నేవీ ఉద్యోగులు 90 లక్షలు తెచ్చిన మాట నిజమే.. కానీ, కోటి రూపాయలు తాము తీసుకుని వెళ్ళలేదని వెల్లడించింది.. కాల్ డేటా ఆధారంగా నిందితులు ఇచ్చిన సమాచారం నిర్ధారించుకుంది విచారణ బృందం.. ఇక, రెండు వేల నోట్ల మార్పిడి పేరుతో దందాను విచారణ అధికారులు ఎదుట అంగీకరించింది ముఠా.. ఓ రాజకీయ నాయకుడు ప్రమేయంపై అనుమానం తలెత్తడంతో నివృత్తి చేసుకున్నారు పోలీసులు.. అయితే, సినిమాల మోజే కొంప ముంచిందని విచారణ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారట సీఐ స్వర్ణలత.. షూటింగ్ లోనే ఏ-1 సూరి పరిచయం అయినట్టు చెప్పిన రిజర్వ్డ్ ఇన్‌స్పెక్టర్.. ఏ1 సూరి, కానిస్టేబుల్, హోంగార్డు ఒత్తిడితోనే నేరానికి సిద్ధపడినట్టు తెలిపారట.. అంతా సూరిబాబే చేశాడు.. నా పాత్ర నామమాత్రమే అని చెప్పారట.. అసలు విషయం దాటవేస్తూ.. తన కెరీర్‌ పాడైపోయిందంటూ కన్నీరు పెట్టుకున్నారట స్వర్ణలత.. అయితే, సీజ్ చేసిన ఫోన్‌లోని డేటాతో తన వ్యక్తిగత జీవితం ముడిపడి ఉందని ఆమె ప్రాధేయపడ్డారట.. ఇక, డీసీపీ పర్యవేక్షణలో 24 గంటలు దర్యాప్తు కొనసాగింది.. స్వర్ణలత అభ్యర్ధనలు అధికారులు పట్టించుకోలేదు.. జాలిపడితే మా జీవితాలు కాలిపోతాయని కఠినంగా చెప్పారట ఉన్నతాధికారులు.

కొత్త ఐటీ చట్టాలపై బాంబే హైకోర్టు సీరియస్‌.. విపరీతంగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలపై బాంబే హైకోర్టు సీరియస్‌ అయింది. చట్టాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవని వ్యాఖ్యానించింది. కొత్త చట్టాలు అతిగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో నకిలీ, తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించిన ఐటీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) నిబంధనలపై బాంబే హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త నియమాలు మరీ విపరీతంగా ఉన్నాయంటూ.. ఒక చీమను చంపేందుకు సుత్తిని వాడలేం కదా? అని వ్యాఖ్యానించింది. కేంద్రం ఐటీ నిబంధనలకు చేసిన సవరణలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

విద్యార్థుల రుణాలను మాఫీ చేయనున్న ప్రభుత్వం..
804,000 మంది రుణగ్రహీతలకు మొత్తం విద్యార్థుల రుణ ఉపశమనంలో $39 బిలియన్లను అందజేస్తామని బిడెన్ పరిపాలన ప్రకటించింది, అధ్యక్షుడు బిడెన్ విద్యార్థి రుణ మాఫీ ప్రణాళికను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటి నుండి దాని తాజా దశ. 20 లేదా 25 సంవత్సరాల పాటు రుణగ్రహీత చెల్లింపులు చేసిన తర్వాత వారికి మిగిలిన బ్యాలెన్స్‌లను ఫెడరల్ ప్రభుత్వం రద్దు చేసే ఆదాయ ఆధారిత రీపేమెంట్ ప్లాన్‌లపై ఉపశమనం అందించబడుతుందని విద్యా శాఖ శుక్రవారం తెలిపింది.. పరిష్కారాలు..ప్లాన్‌ల క్రింద అర్హత పొందే నెలవారీ చెల్లింపులను మరింత ఖచ్చితంగా లెక్కిస్తాయని,అలాగే రాబోయే రోజుల్లో ఉపశమనం కోసం అర్హులైన రుణగ్రహీతలకు తెలియజేస్తుందని డిపార్ట్‌మెంట్ తెలిపింది. గత నెలలో 6-3 నిర్ణయంలో తక్కువ మరియు మధ్య-ఆదాయ రుణగ్రహీతలకు $10,000 విద్యార్థి రుణ ఉపశమనం పొందవచ్చు.. పెల్ గ్రాంట్ గ్రహీతలకు $20,000 వరకు ఇవ్వాలని బిడెన్ యొక్క ప్రణాళికను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వందల బిలియన్ డాలర్ల విలువైన రుణాలను క్షమించడానికి కాంగ్రెస్ నేరుగా అధ్యక్షుడికి అధికారం ఇవ్వలేదని మెజారిటీ గుర్తించింది. కోర్టు తీర్పు ఉన్నప్పటికీ విద్యార్థుల రుణ ఉపశమనాన్ని అందించడానికి తన పరిపాలన కొనసాగుతుందని నిర్ణయం తర్వాత బిడెన్ ప్రకటించారు. అతను తన రుణ ఉపశమన ప్రణాళికను వేరొక చట్టంపై ఆధారపడతానని చెప్పాడు, ఉన్నత విద్యా చట్టం, విద్యా కార్యదర్శి విద్యార్థుల రుణ రుణాన్ని..రాజీ చేయడానికి, మాఫీ చేయడానికి లేదా విడుదల చేయడానికి అనుమతిస్తుంది అని ప్రతిపాదకులు వాదించారు..

సురేశ్‌ రైనా రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డు!
ఐపీఎల్ స్టార్ యశస్వి జైస్వాల్ అరంగేట్ర టెస్టులోనే భారీ సెంచరీతో చెలరేగాడు. 387 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 171 రన్స్ చేశాడు. ఇప్పటికే అరంగేట్రంలోనే సెంచరీ చేసిన రికార్డు నెలకొల్పిన యశస్వి.. మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే విదేశీ గడ్డపై 150 కంటే ఎక్కువ రన్స్ చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్‌ రైనా రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు సురేశ్‌ రైనా విదేశాల్లో అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. 2010లో కొలొంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో రైనా 120 రన్స్ చేశాడు. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ శతకం బాది రైనా రికార్డును బద్దలు కొట్టాడు. అయితే భారత్‌ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మాత్రం శిఖర్ ధావన్‌ (187) ఉన్నాడు. వెస్టిండీస్‌పై 171 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాపై శిఖర్ ధావన్‌ 187 రన్స్ చేయగా.. వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ 177 రన్స్ చేశాడు. ధావన్‌, రోహిత్ మాత్రమే యశస్వి కంటే ముందున్నారు. అయితే వీరిద్దరూ భారత పిచ్‌లపైనే సాధించడం విశేషం.

భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరూ ఊహించరు! టీ20 టీమ్ ఇదే
చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడలు 2023 (ఏషియన్ గేమ్స్ 2023) కోసం భారత పురుషుల టీ20 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ద్వితీయ శ్రేణి జట్టును శుక్రవారం బీసీసీఐ ప్రకటించింది. ఆసియా క్రీడల కోసం వెళ్లే భారత జట్టుకు యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్‌లో సత్తాచాటిన అందరికీ జట్టులో చోటు దక్కింది. ఇక సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. ఏషియన్ గేమ్స్ 2023 కోసం ఎంపిక చేసే జట్టుకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ కెప్టెన్సీ చేయనున్నాడని ముందునుంచి వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం అతడికి షాక్ ఇస్తూ.. పూర్తిగా యువ ఆటగాళ్లనే ఎంచుకుంది. ఎవరూ ఊహించని విధంగా రుతురాజ్‌ గైక్వాడ్‌ను కెప్టెన్ చేశారు. తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మకు జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్‌ స్టార్‌ రింకు సింగ్‌ తొలిసారిగా జట్టులో చోటు సంపాదించాడు. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు. భారత టీ20 జట్టు (India T20 squad for Asian Games 2023): రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్‌, రవి బిష్ణోయ్‌, అవేష్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌, శివమ్‌ మావి, శివమ్‌ దూబె, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌… స్టాండ్‌బైలు: యశ్‌ ఠాకూర్‌, సాయికిశోర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, సాయిసుదర్శన్‌.

అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్‌ ఉంటే అంతే సంగతులు.. ఓటీటీకు ప్రభుత్వం వార్నింగ్‌..
ఆన్‌లైన్‌లో సినిమాలను ప్రేక్షకులకు చూపించే ముందు అశ్లీలత మరియు హింసకు సంబంధించిన కంటెంట్‌ను తరవుగా చెక్ చేసిన తర్వాతే ప్లాట్ ఫాంలలో వదలలాలని భారతదేశం ప్రముఖ OTT స్ట్రీమర్‌లకు (నెట్‌ఫ్లిక్స్ NFLX.O, Disney DIS.N) చెప్పింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, జూన్ 20న సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు అందించబడింది. జూన్ 20న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు అందించబడింది.OTT ప్లాట్‌ఫారమ్‌లుగా కూడా సూచించబడే స్ట్రీమింగ్ కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.. మంత్రిత్వ శాఖ సమావేశంలో ‘OTT ప్లాట్‌ఫారమ్‌లపై అశ్లీల మరియు అసభ్యకరమైన కంటెంట్‌కు సంబంధించిన ఆందోళనలను పార్లమెంటు సభ్యులు, పౌర సమూహాలు,సాధారణ ప్రజలు వ్యక్తం చేశారు’.. అయితే, స్ట్రీమింగ్ కంపెనీలు అభివృద్ధిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి మరియు సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నివేదికల ప్రకారం, ఈ సమావేశానికి అమెజాన్, డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, రిలయన్స్ ప్రసార యూనిట్, వయాకామ్ 18 మరియు ఆపిల్ టీవీలు హాజరయ్యాయి. భారతదేశంలోని OTT ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 (IT రూల్స్) క్రింద ఉన్నాయి. వారు మూడు-స్థాయి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని అందించారు, ఇందులో మూడవ స్థాయిలో ప్రభుత్వ సంస్థ ఉంది.