నేడు సీఐడీ ఆఫీస్‌కి చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈ రోజు సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక కేసుల్లో ఇప్పటికే చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. ఇదే సమయంలో కొన్ని షరతులు విధించింది.. వారం రోజుల్లోగా దర్యాప్తు అధికారి ఎదుట హాజరై పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.. ఇక, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. నేడు సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్న చంద్రబాబు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), లిక్కర్ స్కామ్, ఇసుక కుంభ కోణం కేసుల్లో పూచీకత్తు సమర్పించనున్నారు. కాగా.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే.. ఈ కేసులో 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన డిమాండ్‌లో ఉన్నారు. ఇదే సమయంలో.. చంద్రబాబుపై పలు అభియోగాలు మోపింది సీఐడీ.. వరుసగా ఐఆర్ఆర్, లిక్కర్, ఇసుక, ఫైబర్ నెట్.. ఇలా కేసులు నమోదు చేస్తూ వచ్చింది.. ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మొదట మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. ఆ తర్వాత ఈ కేసులో హైకోర్టులో పూర్తిస్థాయి బెయిల్ పొందారు.. ఆ తర్వాత.. ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక కేసులో ముందస్తు బెయిల్ వచ్చింది.. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.
సై అంటున్న కోడి పుంజులు.. సిద్ధమైన బరులు
అధికారులు, పోలీసులు నిర్వహించొద్దని హెచ్చరిస్తున్నా.. రాజకీయ అండదండలతో ప్రతీ ఏడాది సంక్రాంతి సాంప్రదాయం పేరిట కోడి పందాల నిర్వహణ జరుగుతూనే ఉంది.. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.. కోడి పందాలు చూసేందుకు, పందాలు కాసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. పక్క రాష్ట్రాల వాళ్లు.. అంతెందుకు విదేశాల నుంచి కూడా తరలివస్తున్నారు అంటే.. కోడి పందాలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తు్న్నారు.. కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు చేశారు.. బరుల వద్ద పందెరాయుళ్ల కోసం అత్యాధునిక సౌకర్యాలను సైతం ఏర్పాటు చేశారు. పందేలు కాసేవాళ్లను కవ్వించి.. వందల కోట్ల రూపాయల జూదానికి తెర తీసేందుకు పందేంరాయుళ్లకు సమయం వచ్చేసింది.. ఇక, ఎన్నికల ఏడాది కావడంతో.. రాజకీయ నాయకుల తోడ్పాటు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఏపీలో మరీ ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఊరూరా కోడిపందేల బరులను ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలతో పాటు గుండాట, కోతముక్క లాంటి జూదాల కోసం కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి.. సంక్రాంతి సాంప్రదాయం పేరిట కోడి పందాల నిర్వహణకు సర్వత్రా రంగం సిద్ధం అయ్యింది.. రేపటి నుండి పండుగ మూడు రోజులు.. ఇదే సమయంలో పెద్ద ఎత్తున కోడిపందాలు కొనసాగనున్నాయి.. కోడి పందాలు నిర్వహణకు బరులు సిద్ధం అయ్యాయి.. బరిలో దిగి పోట్లాడేందుకు కోడి పుంజులు సైతం సై అంటున్నాయి.. కోడి పందాలు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.. ఎన్నికల ఏడాది కావడంతో కోడి పందాలు జోరుగా సాగుతాయని అంచనా వేస్తున్నారు.. రాజకీయాలకు అతీతంగా ఉమ్మడిగా పలుచోట్ల పెద్ద బరులు ఏర్పాటు చేశారు.. రాత్రులు కూడా కోడి పందాలు నిర్వహణకు శిబిరాల్లో ఫ్లేడ్ లైట్లు ఏర్పాటు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ అధికారులు సమన్లు పంపించారు. జనవరి 18న విచారణలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చింది. అరవింద్ కేజ్రీవాల్‌కు ఇది నాలుగోరి సమన్లు జారీ చేసింది. ఇంతకు ముందు, అరవింద్ కేజ్రీవాల్‌కు మూడు సమన్లు జారీ చేయబడ్డాయి.. కానీ అతను ఒక్కసారి కూడా ఈడీ ముందు హాజరు కాలేదు. ఇక, జనవరి 3న అరవింద్ కేజ్రీవాల్‌కు మూడోసారి సమన్లు పంపగా.. ఆ నోటీసులను కేజ్రీవాల్ పట్టించుకోలేదు. దీంతో ఆప్ చీప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.. ఇప్పటి వరకు మూడు సార్లు సమన్లను పంపించిన పట్టించుకోలేదు ఇది చట్టవిరుద్ధమని ఆరోపించారు. అయితే, ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు జారీ చేసిన సమన్లపై ఈడీ ముందు హాజరు కావడానికి నిరాకరించారు.
హౌతీ రెబల్స్ నియంత్రణలో ఉన్న మరో స్థావరంపై యూఎస్ సైన్యం దాడి
ఎర్ర సముద్రంలో యుద్ధం జరిగే అవకాశం ఉంది. హౌతీలపై అమెరికా దాడి కొనసాగుతుంది. యెమెన్‌లో హౌతీ బలగాలపై అమెరికా బలగాలు అదనపు దాడిని జరుపుతున్నాయని అమెరికా అధికారులు తెలిపారు. అంతకు ముందు, ఎర్ర సముద్రం షిప్పింగ్‌పై దాడి చేసే హౌతీ సైన్యం సామర్థ్యాన్ని తగ్గించడానికి అమెరికా దేశంలోని 30 ప్రదేశాలలో ఈ దాడులు చేసింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు. హౌతీ సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు వాయు, సముద్ర మార్గాల ద్వారా ఉధృతంగా దాడులు చేస్తున్నాయి. ఇక, నిన్న తొలి రోజు 28 చోట్ల దాడులు చేయగా.. 60కి పైగా హౌతీ రెబల్స్ కు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇక, శనివారం ఉదయం హౌతీలకు చెందిన మరో ప్రదేశాన్ని గుర్తించింది. రాడార్ సైట్.. ఇది ఇప్పటికీ సముద్ర ట్రాఫిక్‌కు ముప్పుగా ఉంది అని ఓ అధికారి తెలిపారు. అంతకుముందు శుక్రవారం నాడు హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని యూఎస్ తో పాటు బ్రిటన్ సైనికులు వైమానిక దాడులు నిర్వహించాయి. యెమెన్ చుట్టూ ఉన్న ఎర్ర సముద్రంతో పాటు ఏడెన్ గల్ఫ్‌లోని ప్రాంతాలను రాబోయే 72 గంటల పాటు తప్పించుకోవాలని యూఎస్ జెండాతో కూడిన నౌకలను అమెరికా నేవీ హెచ్చరించింది. హౌతీలు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తారని తాము భావిస్తున్నామని యూఎస్ మిలిటరీతో పాటు వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు.
20వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్న.. సిటీ గ్రూప్
అమెరికాకు చెందిన ప్రముఖ బ్యాంక్ సిటీ గ్రూప్ ఇంక్ రాబోయే రెండేళ్లలో 20,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. 14 ఏళ్లలో అత్యంత దారుణమైన త్రైమాసిక ఫలితాలు రావడంతో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అమెరికన్ బ్యాంక్ మొత్తం 2,39,000 మంది ఉద్యోగులను 20,000 మంది తగ్గించాలని ప్రణాళిక వేసింది. 2026 నాటికి బ్యాంకులో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 8 శాతం తగ్గవచ్చు. ఈ రిట్రెంచ్‌మెంట్ ప్లాన్‌కు సిటీ గ్రూప్ కు 1 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. తొలగించబడిన ఉద్యోగులకు అదనపు జీతం, సౌకర్యాల కోసం ఈ డబ్బు ఖర్చు చేయబడుతుంది. అయితే, బ్యాంకు మొత్తం ఖర్చులు తక్కువగా ఉంటాయి. కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేన్ ఫ్రైసెన్ బ్యాంక్‌లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సిటీ గ్రూప్ తన వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించడంలో బిజీగా ఉంది. బ్యాంక్ తన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా దాని లాభాలను పెంచుకోవచ్చు.
షాకింగ్ న్యూస్..స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
బంగారం కొనాలని అనుకొనేవారికి షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.. అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.. 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర ఈరోజు తులంపై రూ.120 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 62,950 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ ధర ఈరోజు తులంపై రూ.100 పెరిగి రూ.57,700 కి చేరింది. ఇక వెండి ధర స్థిరంగా కొనసాగుతున్నాయి.. కిలో వెండి ధర రూ.77,500 గా కొనసాగుతుంది.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,500గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,950గాను ఉంది.. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి.. ఇక వెండి విషయానికొస్తే.. దేశంలో వెండి ధరలు శనివారం కూడా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. వెండి ధర రూ. 7,600గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 76,000కి చేరింది. గురువారం కూడా ఇదే ధర పలికింది.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 77,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 76,000.. బెంగళూరులో రూ. 73,500గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
అక్కడ గుంటూరు కారం సినిమాని బీట్ చేసిన ఇండియన్ సూపర్ హీరో
సంక్రాంతి సీజన్ లో సినిమా సందడి మొదలైపోయింది. ఫస్ట్ వార్ ని స్టార్ట్ చేస్తూ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చేసాయి. ఈ సినిమాల్లో రిలీజ్ కి ముందు గుంటూరు కారంపై అంచనాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆ అంచనాలని తారుమారు చేస్తూ డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. పాజిటివ్ మౌత్ టాక్ తో హనుమాన్ మూవీ దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ నుంచే ఇండియన్ సూపర్ హీరో వస్తున్నాడు అనే మాటని ప్రమోట్ చేసిన మేకర్స్… లో బడ్జట్ తో కూడా సూపర్బ్ క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చూపించి పాన్ ఇండియా హిట్ కొట్టాడు. యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమా థియేటర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత క్లీన్ హిట్ టాక్ ఏ సినిమాకి రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు హిందీ బెల్ట్ లో కూడా హనుమాన్ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ లో ఈ సినిమా మైటీ గుంటూరు కారం ముందు కూడా రాక్ సాలిడ్ గా నిలబడింది. నార్త్ అమెరికాలో గుంటూరు కారం సినిమాని డే 1 కలెక్షన్స్ విషయంలో హనుమాన్ బ్రేక్ చేసింది. గుంటూరు కారం డే 1 నార్త్ అమెరికాలో 400K వరకు కలెక్ట్ చేస్తే హనుమాన్ హాఫ్ మిలియన్ డాలర్స్ ని దాటేసింది. హనుమాన్ సినిమా మహేష్ అడ్డా అయిన నార్త్ అమెరికాలో గుంటూరు కారం సినిమాని డామినేట్ చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఈరోజుతో హనుమాన్ మూవీ 1 మిలియన్ రీచ్ అయ్యి… బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోనుంది. హనుమాన్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునే మొదటి సెంటర్ నార్త్ అమెరికానే అయ్యే అవకాశం ఉంది.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ డే 1… ఆర్ ఆర్ ఆర్ రికార్డ్స్ కూడా లేచాయ్
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. అన్ని సెంటర్స్ లో టాక్ ఇలానే ఉండడంతో గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ దగ్గర తేడా కొడుతుంది అనుకుంటున్నారు కానీ ఫాన్స్ లో మాత్రం మహేష్ తన మ్యాజిక్ చూపిస్తూ గుంటూరు కారం సినిమాని సేఫ్ సైడ్ తీసుకోని వస్తాడేమో అనే హోప్ ఉంది. అయితే ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఊహించాట్లుగానే, ముందు నుంచి చెప్తున్నట్లుగానే గుంటూరు కారం సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. రాజమౌళి సినిమా కలెక్షన్ల స్థాయిలో కలెక్ట్ చేస్తాం అని మేకర్స్ చెప్పిన మాటని నిజం చేస్తూ గుంటూరు కారం సినిమా ఓపెనింగ్ డే సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గుంటూరు కారం సినిమా పాన్ ఇండియా సినిమాల రికార్డులని కూడా బ్రేక్ చేసింది. గుంటూరు కారం సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో డే 1 దాదాపు 82 లక్షలకి రాబట్టింది. ఇది తెలుగు సినిమాకి ఆల్ టైమ్ రికార్డ్. ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదటి రోజు 75 లక్షలు రాబట్టి టాప్ ప్లేస్ లో ఉండేది. గుంటూరు కారం ఇప్పుడు టాప్ ప్లేస్ చేరుకోవడంతో ఆర్ ఆర్ ఆర్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. మూడో స్థానంలో 57 లక్షలు రాబట్టి ఆదిపురుష్ సినిమా ఉంది. ఈ లిస్టులో ఆర్ ఆర్ ఆర్, ఆదిపురుష్ సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రిలీజ్ అయ్యాయి కానీ గుంటూరు కారం మాత్రం కంప్లీట్ గా రీజనల్ సినిమా. రీజనల్ సినిమాతోనే మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాల కన్నా ఎక్కువ కలెక్ట్ చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో జెండా ఎగరేసాడు.
వెంకీ మామ యాక్షన్ అదుర్స్..సినిమాకు అదే హైలెట్..!
టాలివుడ్ స్టార్ హీరో విక్టరి వెంకటేష్ నటించిన లేటెస్ట్ చిత్రం సైంధవ్. హిట్ మూవీ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకీ 75 వ చిత్రంగా తెరకేక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇకపోతే అమెరికాలో సైంధవ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి సైంధవ్ ఎలా ఉందో రిపోర్ట్ ఇస్తున్నారు ఎన్నారై సినీ అభిమానులు. సైంధవ్ మూవీకి సంబంధించిన పోస్టులతో ట్విటర్‌లో రివ్యూలు ఇస్తున్నారు.. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ అని కొందరు,సైంధవ్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్. వెంకీ మామ అదరగొట్టాడు. సెకండాఫ్‌లో ఫైట్స్ అయితే మాములుగా లేవు. ఎమోషనల్ సీన్స్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారని మరికొందరు రివ్యూ ఇస్తున్నారు..
