జనసేన వైపు వైసీపీ ఎమ్మెల్యే చూపు..! పవన్‌తో భేటీ..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పుడు జనసేన పార్టీకి టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన సమావేశం అయినట్టు సమాచారం.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ కష్టమని పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం ఉందట.. దీంతో.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. కానీ, జ్యోతుల నెహ్రూ నుంచి వ్యతిరేకత రావడంతో.. టీడీపీ అధిష్టానం జ్యోతుల చంటిబాబు చేరికను హోల్డ్‌లో పెట్టిందట.. అయితే, ఆ తర్వాత వెంటనే జనసేన పార్టీలోకి టచ్‌లోకి వెళ్లారట.. మరోసారి జగ్గంపేట నుంచి బరిలోకి దిగాలనే పట్టుదలతో ఉన్న ఆయన.. జనసేనలో చేరైనా పోటీ చేయాలని భావనతో.. పవన్ కల్యాణ్‌తో రహస్యంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో గంటకు పైగా చర్చలు జరిపినట్టు సమాచారం.
వైరల్‌గా మారిన కానిస్టేబుల్ చేసిన పని.. సస్పెండ్ చేసిన ఎస్పీ
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని ఘటనలు వైరల్‌గా మారిపోతున్నాయి.. మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం సృష్టించిన ఘటన అనంతపురంలో వైరల్ అయ్యింది.. జిల్లాలోని శింగనమల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారిపట్ట దురుసగా ప్రవర్తించాడు కానిస్టేబుల్ షబ్బీర్.. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.. స్టేషన్‌కు వచ్చినవారిపై దూషణలకు దిగాడు.. అయితే, ఈ వ్యవహారం మొత్తం తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అదికాస్తా వైరల్ అయ్యింది.. ఇక, ఈ ఘటన జిల్లా ఎస్పీ దృష్టి వరకు వెళ్లింది.. దీంతో.. శింగనమల కానిస్టేబుల్ షబ్బీర్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎస్పీ.. షబ్బీర్ ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు.. ప్రాథమిక విచారణ ఆధారంగా సస్పెన్సన్ ఉత్తర్వులు జారీ చేవారు.. ఈ ఘటనపై డీఎస్పీ స్థాయి అధికారిచే సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ.. మహిళలు, చిన్నారులు, వృద్ధులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ అన్బురాజన్ వార్నింగ్ ఇచ్చారు.
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్?
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలనలో 5 గ్యారంటీలయిన (మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత) కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక ఫారమ్ ను అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు జత చేయాలి కొత్త రేషన్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కొత్త కార్డులతో పాటు పిల్లల పేర్లను నమోదు చేసుకోవడానికి వీలుగా వివరాలు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటి వరకు పిల్లల పేర్లను నమోదు చేయలేని తల్లిదండ్రులు వారి పేర్లను సైతం జత పరిచేందుకు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ అందుబాటులోకి తీసుకు వచ్చింది సర్కార్. అయితే ఈ దరఖాస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త దరఖాస్తు ఫారమ్ లో దరఖాస్తు దారు ఇంటి యజమాని పేరు, కుటుంబం మొత్తం కలిపి దిగిన ఫోటో, కులము, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు కిందనే బాక్స్ రూపంలో ఇచ్చారు. అందులో తల్లిదండ్రుల పేర్లతో సహా పిల్లలు ఎంతమంది ఉన్నారనే వారి పేర్లతో సహా ఆధార్ కార్డు నెంబర్ తో సహా వివరించాల్సి వుంటుంది. వచ్చే ఏడాది జనవరి 2024లో కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ.. గ్రామసభల నుంచి నేరుగా రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. తొలుత అర్హులైన వారికే కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ముందుగా ఫిజికల్ వెరిఫికేషన్ చేసి అర్హతను నిర్ధారించి జనవరి నెలలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ తెలిపింది. అర్హులను పరిశీలించి కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన కలెక్టర్ సమావేశంలో సంబంధిత శాఖ 5 పేజీల పత్రాన్ని అందజేసింది. దీంతోపాటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేలా అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని పౌరసరఫరాల శాఖ ఆ పత్రాల్లో పేర్కొంది. దీంతోపాటు మండల అధికారిగా ఉన్న తహసీల్దార్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గ్రామాలకు తిరిగి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుపై ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.
రాజస్థాన్‌లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. నేడు 3:15గంటలకు మంత్రుల ప్రమాణం
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజస్థాన్ మంత్రివర్గ విస్తరణ తేదీ ఖరారైంది. నేటి మధ్యాహ్నం 3:15 గంటలకు భజన్ లాల్ ప్రభుత్వం మంత్రివర్గం ఏర్పాటు చేయబడుతుంది. దాదాపు 18 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. భజన్‌లాల్ ప్రభుత్వంలో 12 మంది క్యాబినెట్, ఆరుగురు రాష్ట్ర మంత్రులు ఉండవచ్చు. ఇన్ని రోజులు గడిచినా మంత్రివర్గం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని, అందులో సమస్య ఏంటని చర్చ జరిగింది. కేబినెట్ ఏర్పాటులో జాప్యానికి కారణం పార్టీలో వర్గపోరు అని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఇద్దరు పెద్ద నాయకులు రాజేంద్ర రాథోడ్, సతీష్ పూనియా. సీనియర్ నాయకులు కావడంతో వారికి పార్టీలో లేదా క్యాబినెట్‌లో స్థానం కల్పించే అవకాశాలున్నాయి, దీని కోసం జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, హోం మంత్రి అమిత్ షా, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఢిల్లీలో నిరంతరం మేధోమథనం చేస్తూనే ఉన్నారు. వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నేటి మంత్రివర్గంలో రాజేంద్ర రాథోడ్, సతీష్ పూనియాలకు కూడా చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే ఇద్దరు నేతలను మంత్రులను చేయడానికి ప్రధాన కారణం వారి సీనియారిటీ, వసుంధర రాజే నుండి గట్టి పోటీ ఉండడమే. రాజస్థాన్‌లో వసుంధర రాజే స్థాయిని దెబ్బ తీసే పనిని సతీష్ పూనియా, రాజేంద్ర రాథోడ్ చేశారు. ఈ కారణంగానే ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్ నేతలను మంత్రివర్గంలో సర్దుబాటు చేయాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. వారిద్దరినీ మంత్రులను చేసిన తర్వాత, రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ఏదైనా సురక్షితమైన స్థానం నుండి పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
శీతాకాలం సూపర్ ఫుడ్.. మొక్కజోన్నతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో
వర్షాకాలంలో బజ్జీలు ఎంత ఫేమస్సో.. శీతాకాలంలో మొక్కజోన్న అంత ఫేమస్. ఈ మొక్కజోన్నను ఇష్టపడని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. టేస్ట్ కోసమో, సరదాగా కోసమో కానీ చాలామంది మొక్క జొన్నను తినడానికి ఇష్టపడతారు. అది చాలా మంచి పద్దతి అంటున్నారు. ఎలా తిన్న, ఎప్పుడు తిన్న ఈ మొక్కజోన్న ఆరోగ్యానికి మిన్న అంటున్నారు నిపుణులు. పీచు ఎక్కువగా ఉండే ఈ మొక్కజొన్న జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అందుకే ఉడికించిన, కాల్చినా.. ఏవిధంగా తీసుకున్న ఇది ఆరోగ్యానికే మేలే అంటున్నారు నిపుణులు. ఉడికించిన, కాల్చిన, మొక్కజొన్న ఏ రూపంలో తీసుకున్న ఆరోగ్యానికి మేలే అంటున్నారు నిపుణులు. అలాగే ఈ మొక్క జొన్న ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మొక్కజొన్న లేదా స్వీట్ కార్న్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మొక్కజొన్న తింటే తక్షణ శక్తి వస్తుంది. నిత్యం వ్యాయామం చేసేవారు, జిమ్‌లకు వెళ్లేవారు, క్రీడాకారులు తమ ఆహారంలో మొక్కజొన్నను చేర్చుకుంటారు. మొక్కజొన్నను అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి మొక్కజొన్న తినవచ్చు. మొక్కజొన్నలోని ఫైబర్ మిమ్మల్ని ఎక్కువ సమయం కడుపుని నిండుగా ఉంచుతుంది. ఫలితంగా అదనపు కేలరీలను తీసుకోకుండా నివారించవచ్చు. అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే మొక్కజొన్నలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొక్కజొన్న లేదా స్వీట్ కార్న్‌లో లుటిన్, జియాక్సంతిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇండియన్ నేవీ 910 ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
నిరుద్యోగులకు ఇండియన్ నేవి అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేవిలో ఖాళీ ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. నేవీకి సంబంధించిన కార్యాలయాల సిబ్బందితోపాటు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే పోస్ట్‌లను కూడా భర్తీ చేస్తారు. తాజా నోటిఫికేషన్‌లో పోస్ట్‌లను నాన్-మినిస్టీరియల్, ఇండస్ట్రియల్ అనే పేరుతో రెండు కేటగిరీలుగా పేర్కొన్నారు.. ఈ పోస్టులకు అర్హతలను, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. నాన్ మినిస్టీరియల్, ఇండస్ట్రియల్ కేటగిరీలలో మొత్తం 910 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గ్రూప్ బీలో చార్జ్‌మెన్ వర్క్‌షాప్ 22 పోస్టులు, చార్జ్‌మెన్ 20 పోస్టులు, సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ 258 పోస్టులు; అదేవిధంగా గ్రూప్ ట్రేడ్స్‌మెన్ మెట్ 610 పోస్టులు ఉన్నాయి.. పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.. ఈ పోస్టులకు సంబందించి ఒక్కో పోస్టుకు ఒక్కో వయస్సు ఉంటుంది.. 18-25 ఏళ్లు, 18-27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున సడలింపు కూడా ఉంటుంది..
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే?
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పసిడి ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది… నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.380 తగ్గాయి..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,870 ఉంది.. బంగారం తగ్గితే.. వెండి ధరలు కూడా తగ్గాయి.. వెండి ధరపై రూ.1200 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,300 వద్ద ఉంది… వెండి ధర విషయానికొస్తే.. బంగారం బాటలోనే నడుస్తున్నాయి.. ఈరోజు కిలోపై రూ.1200 తగ్గింది.. రూ. 78,200 వద్ద కొనసాగుతుంది.. హైదరాబాద్ లో రూ.79,200, కోల్ కతా లో రూ.75,800 గా కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.
దీపికా పదుకొనే ఖాతాలో మరో బ్రాండ్..
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పద్దుకొనే పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం.. తెలుగులో కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఈ మధ్య దీపికా చేసిన సినిమాలన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు.. కలెక్షన్ల పరంగా కూడా బాగానే వసూల్ చేశాయి.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రముఖ బ్రాండ్స్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా వ్యవహారిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్ తన ఖాతాలో ఉన్నాయి.. ఇప్పుడు తన ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరింది.. కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. షారుక్ ఖాన్ తర్వాత దీపికా పదుకొనెను రెండో బ్రాండ్ అంబాసిడర్‌గా హ్యుందాయ్ ఇండియా నియమించుకున్నట్లు తెలిపింది.. ఇక షారుఖ్ స్థానంలో దీపికా కొనసాగుతుందా అనేది తెలియలేదు.. గ్లోబల్ ఇండియన్ ఐకాన్ దీపికా పడుకొనెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు. ఆమె క్రేజ్ కంపెనీ అభివృద్ధికి ఉపయోగ పడుతుందని ఆ కంపెనీ అధినేత హార్షం వ్యక్తం చేస్తున్నారు.. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. హ్యుందాయ్ మోటార్ ఇండియా జనవరి 2021 నాటికి భారతదేశంలో 17% మార్కెట్ వాటాను కలిగి ఉంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని అనుబంధ సంస్థ కియాతో కలిసి 2022లో భారతదేశంలో 10 లక్షల కార్లను తయారుచేసింది.. ఈ రెండు కంపెనీలు దాదాపు ఇండియాలో టాప్ పొజిషన్ లో ఉన్నాయి..
